PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:56, 28 February 2020 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా ఉండాలి.
00:37 లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి.
00:43 Modules: ఇవి వివిధ రచయితలు చేరచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే ఉపయోగించబడవచ్చు.
00:55 CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు.
01:03 CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి.
01:09 CPAN కు official వెబ్ సైట్ www.cpan.org.
01:17 మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
01:24 ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు యాక్సెస్ ను ఇస్తుంది.
01:30 terminal కు మారండి.
01:32 perldoc List colon colon Util అని టైప్ చేయండి.
01:38 మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు.
01:46 ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది.
01:50 Synaptic Package Managerను ఉపయోగించి చేయండి.
01:55 spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి.
02:01 ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్.
02:08 ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఉపయోగించడం, మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి.
02:20 perldoc viewer నుండి నిష్క్రమించడానికి Q కీ ను నొక్కండి.
02:25 తరువాత, మనము Perl ప్రోగాం లో List colon colon Util మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
02:33 నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను నన్ను తెరవనివ్వండి.
02:40 మీ exist underscore modules dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి.
02:47 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
02:50 use List colon colon Util, Perlకు List colon colon Util మాడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది.
03:00 Qw() ఫంక్షన్ ఒక delimiterని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీసి, పదాలను list గా తిరిగి పంపుతుంది.
03:09 ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం.
03:13 module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది.
03:21 ఇది సాధారణ-వినియోగ subroutines జాబితాను కలిగి ఉంది.
03:26 మాడ్యూల్, మన ప్రోగ్రాం లోనికి దాని subroutines మరియు variables లను ఎగుమతి చేస్తుంది.
03:32 List colon colon Util లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి element ను రిటర్న్ చేస్తుంది.
03:42 max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది.
03:47 maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది.
03:52 min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది.
03:57 minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది.
04:02 shuffle ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది.
04:08 sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది.
04:14 ప్రతి function కు వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు.
04:18 మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న ఈ subroutinesను ఉపయోగించవచ్చు.
04:23 వీటిని, max, min, sum మరియు shuffle ఫంక్షన్ లకు నేను input గా పంపుతున్నాను.
04:30 ఇవి print స్టేట్మెంట్స్.
04:33 ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి.
04:37 ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:40 టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:49 output ను గమనించండి.
04:51 Random number లో, మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు.
04:58 తరువాత మనం Perl module ను సృష్టించడం, CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము.
05:04 మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు.
05:08 మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి.
05:11 మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి.
05:14 మోడ్యూల్ ని Document చెయ్యండి.
05:16 Perl code ను వ్రాయండి.
05:18 పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి.
05:20 CPAN లో moduleను పంపిణీ చెయ్యండి.
05:24 Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
05:32 Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది.
05:37 ఇది, దానిలోని మాడ్యూల్ ను స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
05:43 సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload మరియు autogenerate లను వదిలివేసే ఎంపికలు.
05:54 Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ ను సృష్టిద్దాం.
05:59 ఇది add, subtract, multiply మరియు divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది.
06:06 టెర్మినల్ కు వెళ్ళి, h2xs కమాండ్ ను అమలు చేయండి.
06:12 h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి.
06:20 H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది.
06:27 డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం.
06:33 మీ సిస్టంలో directory path ను గమనించండి. అది Math forward slash Simple గా ఉండవచ్చు.
06:41 డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు.
06:49 Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపిస్తుంది.
06:58 lib subdirectory మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
07:02 MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ జాబితా ను కలిగి ఉంటుంది.
07:07 Makefile అనేది Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం.
07:12 Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము.
07:18 Test scriptలు t అనే subdirectory లో ఉంటాయి.
07:22 tests అనేవి dot t extension తో, unit testing కొరకు ఉపయోగించే, సాధారణ Perl scripts.
07:30 Simple.pm అనేది మన మోడ్యూల్.
07:34 మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి.
07:41 మనం simple.pm ను తెరుద్దాం.
07:45 డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి.
07:51 ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple.pm ఫైల్ ను తెరుద్దాం.
07:57 gedit Simple.pm అని టైప్ చేయండి.
08:02 ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు.
08:09 మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది.
08:16 Preloaded methods go here అనే టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి.
08:22 ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము.
08:29 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
08:33 ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం.
08:41 మనం సబ్ డైరెక్టరీ t క్రిందన Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం.
08:49 gedit Math-Simple.t అని టైప్ చేయండి.
08:55 ఇప్పటికే ఉన్న “Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి.
09:02 Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది.
09:06 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
09:10 test script ను run చేద్దాం.
09:13 perl Math-simple.t అని టైప్ చేసి, Enter నొక్కండి.
09:19 Perl script దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం.
09:27 ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి. ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు?
09:33 మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం.
09:37 At the rate INC అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్.
09:43 పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు.
09:48 ఈ లైన్ లో ఉన్న కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించమని, Perl ప్రోగ్రాం కు చెప్తుంది.
09:57 ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు.
10:06 ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం.
10:10 నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను.
10:16 కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను.
10:24 ఇక్కడ మనం భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది.
10:27 మనము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది.
10:31 చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం.
10:34 మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం.
10:40 ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory లోనికి ఫైళ్లను కాపీ చేయడం.
10:45 ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండదు.
10:49 Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు.
10:57 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.
11:02 ఈ ట్యుటోరియల్ లో మనము ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం.
11:11 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్.
11:13 Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి.
11:17 ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి.
11:24 Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి.
11:31 ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి.
11:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
11:42 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
11:51 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:55 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
12:02 ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
12:06 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india