PERL/C3/Sample-PERL-program/Telugu
From Script | Spoken-Tutorial
00:01 | Sample PERL program. పై Spoken Tutorial కు స్వాగతం | |
00:06 | ఈ ట్యుటోరియల్లో, మనం ఇప్పటి వరకు కవర్ చేసిన అన్ని ప్రధాన అంశాలని ఒక నమూనా పెర్ల్ ప్రోగ్రాం లో నేర్చుకుంటాము. | |
00:14 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నను. | |
00:25 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించుకోవచ్చు. | |
00:29 | ముందుగా మీకు Perl ప్రొగ్రమింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. | |
00:34 | లేకపోతే, అప్పుడు ఈ వెబ్సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. | |
00:39 | నమూనా Perl యొక్క ఒక ప్రాంతం యొక్క వివిధ వాతావరణ సూచనల నివేదికల యొక్క output ను ఇస్తుంది. | |
00:46 | weather dot pm, అనేది ఈ ప్రోగ్రాం కోసం అవసరమైన డేటాని నిర్వహించడానికి కావలసిన ఒక క్లిష్టమైన data-structure ను కలిగి ఉన్న module. | |
00:54 | ఇది నివేదికను రూపొందించడానికి కావలసిన వివిధ functions ను కలిగి ఉంటుంది. | |
00:59 | weather underscore report dot pl అనేది ఒక Perl ప్రోగ్రాం. ఇది అవసరమైన అవుట్పుట్ ఇవ్వడానికి ఈ module ఫైల్ ను ఉపయోగించుకుంటుంది. | |
01:08 | అదే కోడ్ గల ఫైల్స్ మా వెబ్ సైట్ లో ఈ వీడియో క్రిందన అందుబాటులో ఉన్నాయి. | |
01:13 | Code file link లో ఇవ్వబడిన ఫైళ్ళను డౌన్ లోడ్ చేసి, unzip చేయండి. | |
01:18 | ఇప్పుడు మన నమూనా Perl ప్రోగ్రాం Weather dot pm ను చూద్దాం. | |
01:24 | ఈ ప్రోగ్రాం లో కోడ్ యొక్క బ్లాక్, namespace Weather క్రిందన ఉంది. | |
01:29 | Perl నందు namespace ను package కీ వర్డ్ ను ఉపయోగించి, implement చేస్తాము. | |
01:34 | BEGIN బ్లాక్ main ప్రోగ్రాం కంటే ముందు compile చేయబడి, అమలు చేయబడుతుంది. | |
01:40 | Export, మాడ్యూల్స్ నందు గల functions మరియు వేరియబుల్స్ ను యూజర్ namespace కు ఎగుమతి చేస్తుంది. | |
01:48 | At the rate EXPORT మరియు at the rate EXPORT underscore OK రెండు వేరియబుల్స్ export ఆపరేషన్ జరుగుటకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. | |
01:57 | At the rate EXPORT అనేది subroutines యొక్క జాబితాను module యొక్క వేరియబుల్స్ ను కలిగి ఉంటుంది. | |
02:03 | ఇవి కాలర్ namespace లోనికి ఎగుమతి చేయబడతాయి. | |
02:07 | At the rate EXPORT underscore OK డిమాండ్ ఆధారంగా గుర్తులను ఎగుమతి చేస్తుంది. | |
02:14 | ఇక్కడ, వాతావరణ-నివేదిక కోసం అవసరమైన డేటాను నిర్వహించడానికి, క్లిష్టమైన డేటా-స్ట్రక్చర్స్ లను సృష్టించడానికి నేను references ను ఉపయోగిస్తున్నాను. | |
02:24 | $weather_report అనేది ఒక hash reference. place మరియు nstate లు స్కాలర్ విలువలను కలిగి ఉన్నాయి. | |
02:32 | weekly అనేది hash యొక్క hash references. | |
02:37 | వరం లో ప్రతి రోజు నాలుగు keysను కలిగి ఉంటుంది. max underscore temp, min underscore temp, sunrise మరియు sunset. | |
02:48 | record underscore time అనేది రెండు index విలువలు గల array reference. | |
02:54 | వివిధ ఎంపికల వాతావరణ నివేదికను ప్రదర్శించడానికి నా దెగ్గర కొన్ని subroutines ఉన్నాయి. మనం వాటిని ఒక్కటి గా చూద్దాము. | |
03:01 | ఈ function శీర్షిక, నివేదిక, స్థలం, స్థితి మరియు ప్రస్తుత తేదీ వంటి header సమాచారాన్ని ముద్రిస్తుంది. | |
03:10 | ఇప్పుడు, మనం తదుపరి ఫంక్షన్ display underscore daily underscore report ను చూద్దాము. | |
03:16 | ఈ function ఇచ్చిన రోజు ఆధారంగా స్క్రీన్ పై రోజువారీ నివేదికను ముద్రిస్తుంది. | |
03:22 | shift ఫంక్షన్ ను ఉపయోగించి subroutine కు పంపిన పారామితి లను పొందుతాము. | |
03:27 | నేను parameter విలువ కు రెండు వైపుల గల స్పేస్ లను తొలగించడానికి నేను trim () ఫంక్షన్ ను ఉపయోగించాను. | |
03:34 | trim () ఫంక్షన్ కు కోడ్ ఇక్కడ ఉంది. | |
03:37 | lc () ఫంక్షన్ ఇచ్చిన ఇన్పుట్ యొక్క lowercase ను అందిస్తుంది. | |
03:42 | ఇది కేస్ సెన్సిటివిటీని నివారించడానికి ఉపయోగించబడుతుంది. | |
03:45 | main ప్రోగ్రాం నుంచి పారామీటర్ గా పంపిన week-day స్థానిక వేరియబుల్ dollar week underscore day కు కేటాయించబడినది. | |
03:55 | ఈ క్రింది print statement లు పేర్కొన్న week-day కు సంబంధించిన డేటాను ముద్రిస్తాయి. | |
04:01 | మనము $weather underscore report లో విలువ ను dereference చేయడానికి arrow operator ను ఉపయోగిస్తున్నాము. | |
04:09 | references తో పని చేస్తున్నప్పుడు, మనం dereferencing చేస్తున్న data type ను అర్థం చేసుకోవాలి. | |
04:15 | అది hash అయితే, మనము కర్లీ బ్రాకెట్స్ లో key ను పంపించవలిసి ఉంటుంది. | |
04:20 | ఇది array అయితే, మనం index value ను చదరపు బ్రాకెట్లలలో పంపించవలిసి ఉంటుంది. | |
04:26 | Perl లో return ఫంక్షన్ ఒక విలువను తిరిగి ఇస్తుంది. | |
04:29 | main ప్రోగ్రాంలో function యొక్క స్థితిని తనిఖీ చేయడానికి ఇది ఉపయోగబడుతుంది. | |
04:36 | write underscore daily underscore report అనేది తరువాతి function. | |
04:40 | ఈ function ఫైల్ కు report output ను ముద్రిస్తుంది. | |
04:45 | గ్రేటర్ దెన్ గుర్తు తో ఉన్న open ఫంక్షన్ WRITE మోడ్ ను నిర్వచిస్తుంది. | |
04:50 | weekday పేరు మరియు dot txt పొడిగింపుతో ఫైల్ పేరు సృష్టించబడింది. | |
04:56 | ప్రింట్ స్టేట్మెంట్ పేర్కొన్న రోజుకు సంభందించిన డేటాను ఫైల్ నందు ముద్రిస్తుంది. | |
05:02 | ఇది వారాంతపు నివేదికను ముద్రిస్తుంది. | |
05:05 | నేను hash reference యొక్క ప్రతి రోజు ద్వారా లూప్ కు foreach loop ను డిక్లేర్ చేస్తాను. | |
05:11 | నేను hash reference సూచించుటకు కర్లీ బ్రాకెట్లను మరియు డిరెఫరెన్స్ సూచించడానికి arrow ఆపరేటర్ ను ఉపయోగించాను. | |
05:18 | నేను hash లోని keys ద్వారా లూప్ చేయడానికి in-built function లోని “keys” ను ఉపయోగించాను. | |
05:23 | display underscore daily underscore report function, hash యొక్క ప్రతి అంశాన్ని ముద్రిస్తుంది. | |
05:30 | ఇప్పుడు మనము Weather dot pm module ఫైల్ ను ఉపయోగించిన weather underscore report dot pl అనే Perl ప్రోగ్రాం ను చూద్దాం. | |
05:40 | ఇక్కడ, use strict మరియు use warnings అనేవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి సహాయపడే కంపైలర్ ఫ్లాగ్ లు. | |
05:48 | use Weather సెమీకోలన్. ఇక్కడ, Weather, ఈ ప్రోగ్రాం లో నేను ఉపయోగించిన module పేరు. | |
05:56 | ఈ ప్రోగ్రామ్ కోసం అవసరమైన ఫంక్షన్ లను ఈ module లో నిల్వ చేయడాన్ని మనం ఇప్పటికే చూశాము. | |
06:03 | ఇక్కడ dot pm ఫైల్ పొడిగింపు ను ఇవ్వవలసిన అవసరం లేదు. | |
06:08 | ఈ ప్రోగ్రామ్లో, నేను ఇచ్చిన ఎంపికల ఆధారంగా వివిధ నివేదికలను ముద్రిస్తాను. | |
06:14 | యూజర్ రిపోర్ట్ ముద్రించడానికి ఒక ఎంపికను ఎంటర్ చెయ్యాలి:
ఒక ప్రత్యేకమైన రోజు యొక్క రోజువారీ వాతావరణ నివేదిక, అవుట్పుట్ ఫైల్ కు ఒక ప్రత్యేకమైన రోజు యొక్క రోజువారీ వాతావరణ నివేదిక, వారపు వాతావరణ నివేదిక. | |
06:27 | ఒకవేళ ఎంపిక 1 ను టైప్ చేస్తే, అది యూజర్ ను రోజును ఎంటర్ చేయమని అడుగుతుంది. | |
06:32 | diamond ఆపరేటర్ STDIN అనగా కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది. | |
06:38 | ఉదాహరణకు, యూజర్ Monday ఎంటర్ చేసినట్లయితే, అది local variable అయిన వేరియబుల్ dollar dayoption కు కేటాయించబడుతుంది. | |
06:47 | తరువాత, మనం రెండు ఫంక్షన్లు Display_header () మరియు Display_daily_report () లను పిలవడం చూడవచ్చు. | |
06:56 | మనం ఈ ఫైల్ లో use Weather స్టేట్మెంట్ తో Weather dot pm లోని అన్ని ఫంక్షన్ లను ఎగుమతి చేశాము. | |
07:03 | కాబట్టి, colon colon (::)package qualifier ఉపయోగించి ప్యాకేజీ లో ఫంక్షన్ లను సూచించాల్సిన అవసరం లేదు. | |
07:10 | ఇప్పుడు తదుపరి ఎంపికను చూద్దాము. | |
07:13 | ఒకవేళ ఎంపికను 2 టైప్ చేస్తే, అది యూజర్ ను వారపు రోజును ప్రాంప్ట్ చేయమని అడుగుతుంది. | |
07:19 | $dayoption అనేది function write underscore daily underscore report కు ఇన్పుట్ పారామితిగా పంపబడుతుంది. | |
07:27 | ఫంక్షన్ నుండి వచ్చిన return విలువ dollar result వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది. | |
07:33 | Print statement అవుట్పుట్ కోసం టెక్స్ట్ ఫైల్ ను తనిఖీ చేయడానికి యూజర్ ను అడుగుతుంది. | |
07:38 | వారపు రోజు dot txt తో ఫైల్ పేరు అవుట్ పుట్ గా సృష్టించబడుతుంది. | |
07:46 | ఒకవేళ ఎంపిక 3 ను టైప్ చేస్తే, అది మొత్తం వారం యొక్క వాతావరణ నివేదికను ముద్రిస్తుంది. | |
07:51 | display underscore weekly underscore report అనేది వారపు నివేదిక అందించే function యొక్క పేరు. | |
07:57 | ఈ print స్టేట్మెంట్ తెలిపిన వరస సంఖ్యలకు ఒక సమాంతర రేఖను చిత్రిస్తుంది. | |
08:02 | ఇది కేవలం నివేదికకు మంచి రూపాన్ని ఇస్తుంది. | |
08:06 | చివరగా, ఎంపిక 4 అయితే, ఇది ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించబడుతుంది. | |
08:11 | పేర్కొన్న వాటి కంటే ఇతర ఎంపికలు ఇవ్వబడినట్లయితే, ప్రింట్ స్టేట్మెంట్ Incorrect option అని చెప్తుంది. | |
08:19 | ఇక్కడ, నిష్క్రమణ విలువ 0, ప్రోగ్రామ్ విజయవంతంగా అమలవడాన్ని సూచిస్తుంది. | |
08:25 | నిష్క్రమణ విలువ 0 కాకుండా ఉంటే ఒక రకమైన ఎర్రర్ సంభవించిందని అర్ధం. | |
08:31 | ఇప్పుడు, మనం ప్రోగ్రాం ను అమలు చేద్దాము. | |
08:34 | terminal కు మారి, perl weather underscore report dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
08:41 | మనం స్క్రీన్ పై నాలుగు ఎంపికలను చూడవచ్చు. | |
08:45 | 1 టైప్ చేసి, Enter నొక్కండి. | |
08:48 | మనము వారపు రోజుకు ప్రవేశించడానికి ప్రాంప్ట్ పొందుతాము. నేను monday అని టైప్ చేసి Enter చేస్తాను. | |
08:56 | ఇది function display underscore header() నుండి సృష్టించబడిన header output. | |
09:02 | ఇప్పుడు, మనం సోమవారం వాతావరణ నివేదికను చూడవచ్చు. | |
09:06 | ఇప్పుడు, నేను ఇతర ఎంపికలను ప్రదర్శించేందుకు మరోసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను. | |
09:13 | 2 టైప్ చేసి, Enter నొక్కండి | |
09:17 | ప్రాంప్ట్ వద్ద, మనము ఏ వారపు రోజు నైనా టైప్ చేయవచ్చు . నేను wednesday అని టైప్ చేసి, Enter నొక్కుతాను. | |
09:25 | మనము "Please check the file wednesday dot txt for report output" సందేశాన్ని చూడవచ్చు. | |
09:32 | అవుట్పుట్ ఈ టెక్స్ట్ ఫైల్ కు వ్రాయబడింది. మనము ఫైల్ ను తెరుద్దాం మరియు కంటెంట్స్ ను తనిఖీ చేద్దాం. | |
09:38 | gedit wednesday dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
09:44 | ఎంటర్ చేసిన వారపు రోజు పేరుతో txt పొడిగింపుతో అవుట్ పుట్ ఫైల్ సృష్టించబడింది. | |
09:51 | ఇప్పుడు, మనం తదుపరి ఎంపికను తనిఖీ చేద్దాం. | |
09:54 | terminal కు మారి, perl weather underscore report dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
10:00 | 3 టైప్ చేసి, Enter నొక్కండి. | |
10:04 | ఈ సారి మనం వారాంతపు వాతావరణ నివేదికను చూడవచ్చు. | |
10:08 | hash keys మరియు hash values యాదృచ్ఛిక క్రమంలో నిల్వ చేయబడతాయి. | |
10:13 | కాబట్టి, ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించినబడిన క్రమానికి సంబంధించినది కాదు. | |
10:19 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చుద్దాం. | |
10:24 | ఈ ట్యుటోరియల్లో, మన మునుపటి ట్యుటోరియల్ యొక్క ప్రధాన విషయాల ద్వారా కవర్ చేయబడిన ఒక నమూనా Perl ప్రోగ్రాం ను చూస్తాం. | |
10:32 | ఒక అసైన్మెంట్ గా employee salary, designation, department, leave_balance వివరాలను ప్రదర్శించడానికి ఇలాంటి పెర్ల్ ప్రోగ్రాం employee underscore report.pl ను వ్రాయండి. | |
10:45 | Employee ID లేదా Employee name లను ఇన్పుట్ గా పంపించండి. | |
10:50 | అవసరమైన ఫంక్షన్లను Employee dot pm మాడ్యూల్ ఫైలులో వ్రాయండి. | |
10:56 | క్రింది లింకులోని వీడియో, స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | |
11:03 | మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము మరియు మా ఆన్లైన్ పరీక్షలను పాస్ అయితే, వారికి సర్టిఫికేట్లను ఇస్తాము. మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి. | |
11:12 | ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ link లో అందుబాటులో ఉంది. | |
11:25 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |