Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-7-month-old-babies/Telugu
|
|
00:00 | 7 నెలల వయస్సు గల పిల్లల కొరకు శాఖాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో, మనం 7 నెలల వయస్సున్నపిల్లలకు పరిపూరకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా |
00:16 | ఇటు వంటి శాఖాహార వంటకాలను ఎలా తయారు చేయాలి అనేవి నేర్చుకుంటాము.పనసగింజలతో (గంజి లేదా) జావ. |
00:23 | ఉలవలు తోటకూర ఆకులతో (గంజి లేదా) జావ |
00:26 | తోటకూర అలసందల (గంజి లేదా) జావ |
00:28 | మెంతి ఆకులు మరియు బీన్స్ (చిక్కుడు కాయలు) తో (గంజి లేదా) జావ ఇంకా అరికెలు కొమ్ముశనగల తో (గంజి లేదా) జావ. |
00:35 | మనం ప్రారంభిద్దాం, 1 వ సంవత్సరంలో, బిడ్డ పాకడం మరియు కదలడం ప్రారంభించినప్పుడు, తన పెరుగుదల వేగంగా ఉంటుంది. |
00:43 | బిడ్డ యొక్క శక్తి అవసరాలు కూడా పెరుగుతాయి. |
00:48 | 6-8 నెలల వయస్సు ఉన్నపిల్లలకు పూరక ఆహరం నుండి 200 కేలరీలు అవసరం. |
00:55 | ఇచ్చిన ఆహరం యొక్క పరిమాణాన్ని క్రమంగా పెంచాలి. |
00:59 | ఇది కూడా గుర్తుంచుకోండి - తగినంత పరిపూరకరమైన ఆహారంతో పాటు తల్లి పాలివ్వడం చాలా ముఖ్యం. |
01:07 | అందువల్ల, బిడ్డకు ఏడు నెలలు నిండినతరువాత, రోజుకు మూడుసార్లు సగం కప్పు పరిపూరకరమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి. |
01:16 | సగం కప్పు అంటే 125 మిల్లీలీటర్లు లేదా 8 టేబుల్ స్పూన్ల ఆహారం అని అర్ధం. |
01:22 | ఇప్పటికి శిశువు వివిధ ఆహార పదార్థాలతో సౌకర్యంగా ఉంది. |
01:28 | బిడ్డకు 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు పరిపూరకరమైన ఆహారాన్ని ప్రారంభించాం కనుక. |
01:33 | ఇప్పుడు బిడ్డకు ఆహారాల కలయికను పరిచయం చేయడం ప్రారంభించండి. |
01:38 | గమనించండి- గుజ్జుగా చేసినవి మరియు మెత్తగా చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. |
01:44 | బిడ్డకు ఇచ్చే ఆహరం అనేది అస్సలు పల్చగా ఉండకూడదు తగినంత చిక్కగా ఉందని నిర్దారించుకోండి. |
01:52 | బిడ్డ యొక్క ఆహారాన్ని తయారుచేసేటప్పుడు - ఎల్లప్పుడూ ఆ ప్రాంతంలో దొరికేవి ఇంకా కాలానుగుణంగా లభించే పదార్థాలను వాడండి. |
01:59 | ఇటువంటి వివిధ పోషకమైన పొడులను కూడా కలపాలని గుర్తుంచుకోండి- (కాయలు)గింజలు మరియు విత్తనాల పొడి
మొలకెత్తిన బీన్స్ పొడి |
02:08 | కరివేపాకు పొడి
మునగాకుల పొడి |
02:11 | ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఇది వివరించబడింది. |
02:17 | బిడ్డకు ఒక సంవత్సరం నిండేవరకు బిడ్డ యొక్క ఆహారంలో ఉప్పు వేయవద్దు. |
02:21 | బిడ్డకు రెండు సంవత్సరాలు అయ్యేవరకు బిడ్డ యొక్క ఆహారంలో చక్కెర, బెల్లం లను జోడించవద్దు. |
02:27 | ఇప్పుడు, మనం - శిశువుకు పరిపూరకరమైన ఆహారంగా ఉపయోగపడే కొన్ని శాఖాహార వంటకాలను చూస్తాము. |
02:35 | మన మొదటి వంటకం పనసగింజలతో (గంజి లేదా) జావ. |
02:39 | కావాల్సిన పదార్థాలు:15-20 పనసగింజలు
ఒక చిన్న అరటిపండు లేదా సగం అరటిపండు |
02:48 | కొబ్బరి పాలు లేదా తల్లి పాలు |
02:50 | ఒక టీస్పూన్ గింజలు మరియు విత్తనాల పొడి |
02:53 | పనసగింజల జావ తయారు చేయడానికి- పనసగింజలను బాగా కడగాలి. |
02:59 | ఒక స్టీల్ గిన్నెలో ఈ గింజలను తీసుకోండి.
గింజలు మునిగేంత వరకు నీరు పోయండి. |
03:06 | వీటిని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. |
03:09 | ఈ గింజలను ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇంకా
కొంత సమయం వరకు వాటిని చల్లారనివ్వండి. |
03:16 | తరువాత వాటిని ఒలిచి పైన ఉన్న తొక్కను తీయండి. |
03:20 | తరువాత, మిక్సర్ లేదా రుబ్బురోలు ఉపయోగించి మెత్తని ముద్ద తయారు చేయండి. |
03:25 | దీనితో పాటుగా, ఒక పండిన అరటిపండు తోక తీసి ఒక చెంచాను ఉపయోగించి దానిని మాష్ చేయండి. |
03:32 | ఇప్పుడు మాష్ చేసిన అరటిపండును ఇంకా పనసగింజల ముద్ద రెండిటిని కలపాలి. |
03:37 | అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు లేదా తల్లి పాలు కలపండి. |
03:42 | అందులో గింజలు, విత్తనాల యొక్క పొడిని వేయండి. |
03:45 | దాన్ని బాగా కలపండి. |
03:47 | ఈ మిశ్రమాన్ని 3-4 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. |
03:52 | పనసగింజల జావ సిద్ధంగా ఉంది. |
03:56 | ఈ పనసగింజల జావలో-.ప్రోటీన్ |
03:59 | ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్ |
04:02 | పొటాషియం మరియు ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. |
04:06 | రెండవ వంటకం ఉలవలు తోటకూర ఆకులతో (గంజి లేదా) జావ. |
04:11 | దీన్న తయారుచేయడానికి, మనకు అవసరమైనవి: 2 టేబుల్ స్పూన్ల ఉలవపొడి
2 కప్పులు కడిగిన తోటకూర ఆకులు |
04:19 | ¼ టీస్పూన్ కరివేపాకు పొడి
½ టీస్పూన్ నెయ్యి |
04:24 | తయారీవిధానం: ముందుగా, ఉలవలను 7 నుండి 8 గంటలు నీటిలోనానబెట్టండి. |
04:31 | తరువాత వాటిని ఒక స్ట్రైనర్లో ఉంచండి ఇంకా వాటిని నీటితో బాగా కడగండి, |
04:37 | మొత్తం నీటిని బయటకు వంపేయండి.ఇప్పుడు వాటిని శుభ్రమైన కాటన్ వస్త్రంలో కట్టి, మొలకలువచ్చే వరకు పక్కన ఉంచండి. |
04:47 | ఈ మొలకెత్తిన ఉలవలను ఒకటి లేదా రెండు రోజులు ఎండలో ఆరబెట్టండి. |
04:52 | తక్కువ మంట మీద వాటిని 8-10 నిమిషాలు వేయించుకోవాలి.
వాటిని చల్లారనివ్వండి. |
04:58 | తరువాత వాటిని గ్రైండ్ చేసి పొడి తయారుచేయండి.
ఈ మొత్తం ప్రక్రియను మాల్టింగ్(మొలకెత్తించడం) అంటారు. |
05:05 | అదే సమయంలో, ఒక పాన్లో నెయ్యి వేడి చేయండి. |
05:10 | కడిగిన తోటకూర ఆకులను అందులో వేయండి. |
05:13 | దీన్ని 4-5 నిమిషాలు ఉడికించి చల్లారనివ్వండి |
05:17 | మిక్సర్ లేదా రుబ్బురోలు ఉపయోగించి మెత్తని ముద్ద తయారు చేయండి. |
05:23 | తరువాత, ఉలవపిండిలో 2 టేబుల్ స్పూన్ల నీరు కలపండి. |
05:28 | తరువాత దాన్ని ముద్దలుకట్టకుండా బాగా కలపండి. |
05:32 | ఈ పల్చని ముద్దను తక్కువ మంట మీద 6-7 నిమిషాలు ఉడికించాలి. |
05:37 | ఇప్పుడు, ఈ ఉలవల పేస్ట్‌లో తోటకూర ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. |
05:43 | తరువాత దాన్ని తక్కువ మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి. |
05:48 | అందులో కరివేపాకు పొడి వేసి మళ్ళీ కలపండి. |
05:52 | మంట మీదనుండి దీనిని తీసేస్తే మన ఉలవలు తోటకూర ఆకుల జావ సిద్ధంగా ఉంది. |
05:59 | ఈ జావ లో -ప్రోటీన్
ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్ కాల్షియం |
06:06 | ఫాస్పరస్ ఐరన్ ఇంకా పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. |
06:10 | అటువంటి జావలను తయారు చేయడానికి స్థానికంగా లభించే ఏవైనా బీన్స్ మరియు ఆకు కూరలను ఎవరైనా ఉపయోగించవచ్చని దయచేసి గమనించండి. |
06:20 | బీన్స్‌ను ఎల్లప్పుడూ వేర్వేరు చిరుభన్యాలు మరియు జొన్న, రాగి, అరికెలు మొదలైనటువంటి ధాన్యాలతో కలపడానికి ప్రయత్నించండి. |
06:31 | ఈ కలయిక బిడ్డకు పూర్తి ప్రోటీన్ ను అందిస్తుంది. |
06:35 | మీరు ఈ ధాన్యాలు మరియు చిరుధాన్యాల యొక్క మొలకల పొడులను బిడ్డ యొక్క ఆహారంలో చేర్చవచ్చు లేదా |
06:42 | మీరు ఉడికించిన చిరుధాన్యాల మొలకలను మెత్తని ముద్దలా చేసి ఇటువంటి జావల్లో కలపవచ్చు |
06:48 | మూడవ వంటకం తోటకూర గింజలు అలసందల (గంజి లేదా) జావ |
06:53 | కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్లు తోటకూరగింజల మొలకల పొడి |
06:59 | 2 టేబుల్ స్పూన్లు మొలకెత్తిన అలసందల ముద్ద మరియు
¼ టీస్పూన్ మునగాకుల పొడి |
07:06 | తయారీ విధానం: మాల్టెడ్ తోటకూరగింజల పొడిని తయారుచేయడానికి-
ఇదే ట్యుటోరియల్ యొక్క మునుపటి రెసిపీలో వివరించిన సూచనలను అనుసరించండి. |
07:17 | తరువాత, మొలకెత్తిన అలసందలను ఒక స్టీల్ గిన్నెలో తీసుకుని 4 నుండి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. |
07:26 | ఇప్పుడు ఈ ఉడికించిన అలసందల యొక్క ముద్దని తయారు చేయండి. |
07:30 | తరువాత, ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల తోటకూరగింజల మొలకల పొడిని తీసుకోండి.
అందులో తగినన్ని నీళ్లు పోయండి. |
07:38 | ఉండలు కట్టకుండా ఉండటానికి దీన్ని బాగా కలపండి. |
07:42 | ఈ పల్చని తోటకూరగింజల యొక్కపేస్ట్ ను తక్కువ మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.
అందులో అలసందల ముద్దని వేయండి |
07:52 | దాన్ని బాగా కలిపి 4-5 నిమిషాలు ఉడికించండి. మంట మీదనుండి దాన్ని దించేయండి. |
07:58 | చివర్లో, ఈ వండిన జావలో ¼ టీస్పూన్ మునగఆకుల పొడిని వేయండి.
తోటకూర గింజలు అలసందల (గంజి లేదా) జావ సిద్ధంగా ఉంది |
08:09 | ఈ తోటకూర గింజలు అలసందల (గంజి లేదా) జావలో -
ప్రోటీన్ ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్ |
08:17 | ఫాస్పరస్
మెగ్నీషియం |
08:20 | ఐరన్
పొటాషియం మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. |
08:24 | ఇటువంటి జావలను తయారు చేయడానికి ఈ క్రింది మొలకెత్తిన పదార్ధాల కలయికను ఎవరైనా ఉపయోగించవచ్చు-
రాగులు జొన్నలు |
08:32 | పెద్ద పెసలు
కొమ్ముశనగలు మొదలైనవి. |
08:37 | నాల్గవ వంటకం - మెంతి ఆకులు మరియు బీన్స్ జావ. |
08:41 | కావాల్సిన పదార్థాలు: కడిగి తరిగిపెట్టిన మెంతి ఆకులు 2 కప్పులు
1 టీస్పూన్ నెయ్యి |
08:49 | తాజా కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు |
08:52 | మొలకెత్తిన బీన్స్ పొడి 2 టేబుల్ స్పూన్లు |
08:56 | బీన్స్ పొడి తయారుచేయడానికి- ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో చర్చించిన సూచనలను అనుసరించండి. |
09:04 | తయారీవిధానం: పాన్ లో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. |
09:09 | మెంతి ఆకులను వేసి 2-3 నిమిషాలు వేయించాలి. |
09:13 | దానిని శుభ్రమైన ప్లేట్ లోకి మార్చండి, కొంచంసేపు దాన్నిచల్లారనివ్వండి. |
09:18 | తరువాత, గ్రైండర్ లేదా మిక్సర్ ఉపయోగించి దాన్ని మెత్తని ముద్ద చేయండి. |
09:23 | ఈ ముద్దని తక్కువ మంట మీద ఒక నిమిషం ఉడికించండి.
అందులో 2 టేబుల్ స్పూన్ల బీన్స్ పొడిని వేయండి |
09:31 | ఉండలు కట్టకుండా ఉండటానికి దీన్ని బాగా కలపండి. |
09:35 | ఒకవేళ అవసరమైతే, అందులో కొంచం కాచి చలార్చిన నీటిని జోడించండి. |
09:40 | ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ వేయండి. |
09:44 | కొబ్బరి పేస్ట్ ని తయారుచేయడానికి- తాజాగా తురిమిన కొబ్బరికాయ తీసుకొని దాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. |
09:51 | తరువాత ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 7-8 నిమిషాల సేపు ఆపకుండా కలుపుతూ ఉడికించాలి. |
09:58 | మెంతి ఆకులు మరియు బీన్స్ జావ సిద్ధంగా ఉంది. |
10:03 | మెంతి ఆకులు మరియు బీన్స్ జావలో -
ప్రోటీన్ ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్ |
10:10 | ఫోలేట్
ఐరన్ |
10:12 | కాల్షియం
ఫాస్పరస్ |
10:14 | జింక్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. |
10:16 | ఈ రెసిపీని తయారుచేసేటప్పుడు ముందు వివరించిన విధంగా ధాన్యాలు కలపడం లేదా దానిని వేర్వేరు ధాన్యాలు మరియు చిరుధాన్యాలతో కలపడం మర్చిపోవద్దు. |
10:27 | అయిదవ వంటకం అరికెలు కొమ్ముశనగలతో (గంజి లేదా) జావ. |
10:32 | కావలసినవి: 2 టేబుల్ స్పూన్లు అరికెలు |
10:35 | 2 టేబుల్ స్పూన్ల మొలకెత్తిన కొమ్ముశనగలు |
10:38 | 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు
1 టీస్పూన్ నెయ్యి |
10:43 | తయారీవిధానం: ఒక స్టీల్ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల అరికెలు తీసుకోండి. |
10:48 | వాటిని బాగా కడగండి.
తరువాత, అందులో 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేయండి. |
10:55 | వాటిని 3-4 విజిల్ లు వచ్చే వరకు ఉడికించాలి. |
10:58 | ఇంతలోపల,మొలకెత్తిన కొమ్ముశనగలను 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.. |
11:04 | తరువాత దానిని మెత్తనిముద్ద చేయండి |
11:07 | ఒక స్టీల్ గిన్నెలో 1 టీస్పూన్ నెయ్యిని వేసి వేడి చేయండి. |
11:11 | ఉడికించిన అరికెలను, కొమ్ముశనగల ముద్దను ఇంకా కొబ్బరిపాలు అందులో వేయండి. |
11:18 | తరువాత దానిని 4-5 నిమిషాలు ఉడికించి, చల్లారపెట్టండి
ఇప్పుడు అరికెలు కొమ్ముశనగలతో (గంజి లేదా) జావ సిద్ధంగా ఉంది. |
11:27 | ఈ జావలో- ప్రోటీన్, ఐరన్ |
11:30 | ఫాస్పరస్
మెగ్నీషియం |
11:33 | కాల్షియం ఇంకా పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. |
11:36 | ఇది 7 నెలల వయస్సున్న పిల్లల కోసం శాఖాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి మనలను తీసుకువస్తుంది.
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |