PERL/C2/Functions-in-Perl/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:39, 1 December 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Functions in PERL పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 PERL functions, argumentsతో functions ను,
00:13 return valuesతో functions గురించి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ కోసం, నేను
00:18 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:22 Perl 5.14.2 మరియు
00:24 gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:27 మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:31 PERL లో variables, comments, loops, conditional statements మరియు data Structures గురించి మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి.
00:41 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:47 మనము మొదట కొన్ని సాధారణ PERL functions ను చూద్దాము.
00:51 PERL లో, functions ను Subroutines అని అని కూడా అంటారు, functions, sub కీవర్డ్తో డిక్లేర్ చేస్తారు.
00:57 డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము.
01:03 ఈ ఫంక్షన్ ఏ విధమైన arguments ను తీసుకోదు మరియు
01:07 ఇది దేనిని తిరిగి ఇవ్వదు.
01:10 గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో లేదా మరొక module లో ఎక్కడైనా వ్రాయవచ్చు.
01:17 ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ moduleను తరువాత స్క్రిప్ట్ లో చేర్చాలి.
01:24 module ఫైల్ను స్క్రిప్ట్ లో చేర్చడానికి, ఈ క్రింది సింటాక్స్ ను ఉపయోగించాలి:
01:31 use ModuleFileName సెమికోలన్
01:35 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
01:39 మీ టెక్స్ట్ ఎడిటర్ లో ఫైల్ ను తెరచి, దానికి simpleFunction dot pl అని పేరు పెట్టండి.
01:46 gedit లో నా ఫైల్ simpleFunction dot pl తెరచి ఉంది.
01:51 స్క్రీన్ పై ప్రదర్శించబడే కోడ్ ను టైప్ చేయండి.
01:55 ఇక్కడ, మనం కేవలం నిర్వచించిన ఫంక్షన్ ను పిలుస్తున్నాం.
02:00 తరువాత అమలు నియంత్రణ ఆ ఫంక్షన్ కు పంపబడుతుంది.
02:06 ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ మరియు డెఫినిషన్.
02:10 ఈ ఫంక్షన్, ఇచ్చిన టెక్స్ట్ ను ముద్రిస్తుంది.
02:14 మీ ఫైల్ ను సేవ్ చేయండి.
02:17 టెర్మినల్ కు మారి, perl simpleFunction dot pl అని
02:24 టైపింగ్ చేసి, Enter నొక్కడం ద్వారా
02:28 PERL scriptను అమలు చేయండి.
02:30 అవుట్పుట్ టెర్మినల్ లో చూపిన విధంగా ఉంటుంది.
02:38 ఇప్పుడు, మనం function తో argumentsను చూద్దాము.
02:44 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి ఈ ఫంక్షన్ ను మనం అర్థం చేసుకుందాం.
02:48 మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ నుతెరచి, దానికి functionWithArgs dot pl అని పేరు పెట్టండి.
02:57 gedit లో ఇది నా functionWithArgs స్క్రిప్ట్ ఫైల్.
03:02 స్క్రీన్ పై క్రింద చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
03:07 ఇక్కడ, మనం function ను 10 మరియు 20 ఆర్గుమెంట్స్ గా కాల్ చేస్తున్నాము.
03:13 పంపిన ఆర్గుమెంట్స్ $var1 మరియు $var2 లో ఉంచబడును.
03:20 @_ ఒక ప్రత్యేకమైన Perl వేరియబుల్. దాని వివరాలను మనం భవిష్యత్ ట్యుటోరియల్లో నేర్చుకుంటాము.
03:29 ఈ ఫంక్షన్ 2 వేరియబుల్ ల కుడికను నిర్వహించి సమాధానాన్ని ముద్రిస్తుంది.
03:37 మీ ఫైల్ ను సేవ్ చేయండి.
03:42 @_ అనేది ఒక ప్రత్యేకమైన Perl అర్రే.
03:46 ఇది పంపిన అర్రే ఆర్గుమెంట్స్ ను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది.
03:51 అదేవిధంగా, మనం పంపిన అర్గుమెంట్స్ ను ఈ క్రింది వేరియబుల్స్ లో పొందగలం.
03:56 $Var1 స్పేస్ = space shift @_ సెమికోలన్
04:04 $Var2 స్పేస్ = space shift @_ సెమికోలన్
04:12 Shift @_ , @_ array యొక్క మొదటి స్థానం నుండి ఎలిమెంట్ ను తొలగిస్తుంది.
04:21 దానిని వేరియబుల్ కు అప్పగిస్తుంది.
04:24 మరొక మార్గం: $var1 space = space dollar underscore open square bracket zero close square bracket సెమికోలన్
04:38 $Var2 space = space dollar underscore open square bracket 1 close square bracket సెమికోలన్.
04:49 పైన పేర్కొన్న మార్గం indexను ఉపయోగించి @_ array యొక్క elements ను పొందిన మాదిరిగానే ఉంటుంది.
04:59 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, perl functionWithArgs dot pl అని టైప్ చేసి,
05:06 Enter నొక్కడం ద్వారా scriptను అమలు చేయండి.
05:14 అవుట్పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
05:23 ఇప్పుడు, మనము ఒక విలువను తిరిగి ఇచ్చే ఫంక్షన్ ను చూద్దాం.
05:32 మనం దీనినే నమూనా ప్రోగ్రాం ఉపయోగించి అర్ధం చేసుకుందాం
05:35 Gedit లో funcWithSingleRtrnVal dot pl స్క్రిప్ట్ కు నన్ను మారనివ్వండి.
05:46 మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ను తెరవండి మరియు క్రింద చూపబడిన కోడ్ ను టైప్ చెయ్యండి.
05:52 ఇక్కడ, మనం parameters 10 మరియు 20 తో addVariables అనే ఫంక్షన్ ను పిలుస్తాము.
06:01 ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువను $ addition వేరియబుల్లో పొందుతాము.
06:09 ఈ ఫంక్షన్ పంపిన parametersపై కూడిక జరిపి జవాబును తిరిగి అందిస్తుంది.
06:15 ఫైల్ ను Save చెయ్యండి.
06:17 ఇప్పుడు, script ను execute చేద్దాము.
06:20 కాబట్టి, terminal మారి,
06:24 perl funcWithSingleRtrnVal dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:35 టెర్మినల్ పై output ప్రదర్శించబడుతుంది.
06:43 ఇప్పుడు, మనం ఒక బహుళ విలువలను అందించే ఫంక్షన్ ను చూద్దాం.
06:48 మనం దీనిని నమూనా ప్రోగ్రాం ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
06:53 Gedit లో, నేను ఒక ఫైల్ ను తెరిచి, దీనికి funcWithMultipleRtrnVals dot pl గా పేరు ఇచ్చాను.
07:04 దయచేసి మీ text editor లో ఇలా చేయండి.
07:08 ఇప్పుడు, చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:13 ఇక్కడ, మనం పారామితులు 10 మరియు 20 తో addVariables ఫంక్షన్ ని పిలుస్తున్నాము.
07:21 ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువలు వేరియబుల్స్ $var1, $var2 మరియు $addition లలో పొందుతాము.
07:31 ఈ ఫంక్షన్ కూడిక చేసి, పంపిన పారామితులను మరియు ఫలితాత్మక జవాబును తిరిగి అందచేస్తుంది.
07:42 ఈ దృష్టాంతం మనం ఒక ఫంక్షన్ నుండి అర్రేని ఎలా తిరిగి పొందవచ్చో ప్రదర్శిస్తుంది.
07:53 అదేవిధంగా, ఇది ఒక ఫంక్షన్ నుండి hash ఎలా తిరిగి ఇవ్వబడుతుందో తెలియజేస్తుంది.
08:00 మీ ఫైల్ ను Save చెయ్యండి.
08:03 ఇప్పుడు మనము టెర్మినల్ నందు Perl స్క్రిప్ట్ ను
08:10 Perl funcWithMultipleRtrnVals dot pl టైప్ చేసి,
08:18 Enter నొక్కడం ద్వారా అమలు చేద్దాం.
08:20 టెర్మినల్ లో అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
08:32 Perl అనేక అంర్నిర్మిత ఫంక్షన్స్ ను అందిస్తుంది.
08:36 వాటిలో కొన్నింటిని మనం మునుపటి ట్యుటోరియల్లో తెలుసుకున్నాము. ఉదాహరణకు - arrays, Hash, sort, scalar, each, keys మొదలైనవి.
08:49 అంర్నిర్మిత ఫంక్షన్స్ ను మనము నిర్వచించే ఏ ఇతర ఫంక్షన్స్ కాల్ చేసిన మాదిరిగానే కాల్ చేస్తాము.
08:57 ఉదాహరణ కు sort open bracket @arrayName close bracket సెమికోలన్.
09:04 మనం ఉపయోగించిన నమూనా ప్రోగ్రామ్లలో కొన్ని అంర్నిర్మిత ఫంక్షన్స్ ను చేర్చడానికి ప్రయత్నించి,
09:10 వాటి ఔట్పుట్స్ ను గమనించండి.
09:13 సారాంశం చూద్దాం.
09:15 ఈ ట్యుటోరియల్ లో మనము:
09:17 Perl లో functions
09:19 arguments తో functions మరియు
09:22 నమూనా ప్రోగ్రామ్లను ఉపయోగించి functions విలువలను ఎలా తిరిగి ఇస్తుందో నేర్చుకున్నాము.
09:27 ఇక్కడ మీకోసం ఒక్క assignment
09:29 మూడు ఆర్గుమెంట్స్ తీసుకొనే ఒక్క functionను వ్రాయండి.
09:33 ఈ ఆర్గుమెంట్స్ పై కొన్ని చర్యలను జరపండి.
09:37 arguments పై చేసిన చర్య యొక్క ఫలితం Return చేసి, ముద్రించండి.
09:43 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
09:47 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.
09:51 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:02 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను అందిస్తుంది.
10:07 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:14 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:19 ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:28. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:40 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:43 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:46 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india