PERL/C2/Blocks-in-Perl/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:14, 1 November 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Blocks in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో ఉన్న వివిధ blocks గురించి నేర్చుకుంటాము.
00:13 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:21 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:26 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:31 ముందుగా మీకుఅవసరమైనవి, Perl లో variables, commentsల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి.
00:38 PERL లో data structures గురించి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:44 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి.
00:50 Perl, ఐదు ప్రత్యేక blocksను అందిస్తుంది.
00:53 ఈ blocks Perl ప్రోగ్రాం యొక్క వివిధ దశలలో అమలు చేయబడతాయి.
00:59 ఈ బ్లాక్లు:
01:01 BEGIN, END
01:03 UNITCHECK, CHECK
01:05 INIT. ముందుగా BEGIN బ్లాకును అర్థం చేసుకోవడముతో మొదలుపెడదాము.
01:10 BEGIN బ్లాక్ కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది.
01:15 కాబట్టి, ఈ బ్లాక్ లో రాసిన ఏ కోడ్ అయిన కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది.
01:22 మనము Perl స్క్రిప్ట్ లోపల అనేక BEGIN బ్లాక్స్ కలిగి ఉండవచ్చు.
01:26 ఈ బ్లాక్లు డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి.
01:31 అంటే First define First executeపద్దతి లో .
01:35 BEGINబ్లాక్ సంబంధించిన సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
01:40 కాపిటల్ లెటర్స్లో BEGIN స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
01:45 Enter నొక్కండి.
01:47 కంపైలేషన్ సమయంలో అమలు చేయవలసిన కోడ్ యొక్క భాగం,
01:51 Enter నొకండి. close కర్లీ బ్రాకెట్.
01:55 ఇప్పుడు, మనం BEGIN బ్లాక్ కు ఉదాహరణను చూద్దాము.
01:59 టెర్మినల్ ను తెరచి,
02:02 gedit begin Block dot pl space ampersand అని టైప్ చేసి,
02:08 Enter నొక్కండి.
02:10 ఇది gedit లో beginBlock dot pl ను తెరుస్తుంది.
02:15 స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధం గా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
02:20 స్క్రిప్ట్ లోపల నేను ఎం వ్రాసానో మనం ఇప్పుడు చూద్దాం.
02:24 ఇక్కడ, మనం BEGIN బ్లాక్స్ ముందు మరియు తరువాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము.
02:31 అదేవిధంగా, నేను ప్రతీ BEGIN బ్లాక్లోపల print స్టేట్ మెంట్ ను వ్రాశాను.
02:37 BEGIN బ్లాక్స్ తరువాత నేను సెమికోలన్ ను ఇవ్వలేదు అని గమనించండి.
02:42 సెమికోలన్ ను ఉంచడం వలన ప్రోగ్రాం అమలులో సింటాక్స్ ఎర్రర్ ను చూపును.
02:49 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
02:53 టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను
02:58 perl beginBlock dot plఅని టైపింగ్ చేసి,
03:01 Enter నొక్కడం ద్వారా అమలు చేయండి.
03:04 టెర్మినల్ పై ప్రదర్శించబడిన విధంగా మీరు అవుట్పుట్ ను పొందుతారు.
03:09 మొదటగా BEGIN బ్లాక్ లోపల వ్రాసిన లైన్ మొదట ప్రింట్ చేయబడిందని మరియు
03:16 స్క్రిప్ట్ లో మొదటి print స్టేట్ మెంట్ వాస్తవానికి BEGINబ్లాక్స్ స్టేట్ మెంట్ తరువాత ముద్రించబడుతుంది అని గమనించండి.
03:25 BEGIN బ్లాక్స్ వాటి డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి.
03:31 ఈ ఉదాహరణ నుండి,
03:34 BEGIN బ్లాక్ లోపల వ్రాసిన కోడ్ మొదట అమలు అవుతుంది అని స్పష్టంఅయినది.
03:40 ఇది PERL స్క్రిప్టు లోపల BEGIN బ్లాక్ స్థానంతో సంబంధం లేకుండా జరుగుతుంది.
03:46 BEGIN బ్లాక్స్ ఎల్లప్పుడు First In First Outపద్ధతిలో అమలు చేయబడతాయి.
03:52 కాబట్టి, ఈ block యొక్క ఉపయోగం ఏమిటంటే న వాస్తవ అమలు ప్రారంభానికి ముందు పెర్ల్ స్క్రిప్ట్ లోపల ఫైళ్లు include చేయుటకు.
04:01 ఇప్పుడు, మనం END బ్లాక్ ను అర్థం చేసుకుందాం.
04:04 END బ్లాక్ పెర్ల్ ప్రోగ్రాం చివరిలో అమలు అవుతుంది.
04:09 ఈ బ్లాక్ లోపల వ్రాయబడిన కోడ్, PERL ప్రోగ్రాం అమలును పూర్తి అయిన తర్వాత అమలు అవుతుంది.
04:17 మనకు Perl script లో అనేక END బ్లాక్స్ కలిగి ఉండవచ్చు.
04:21 ఈ బ్లాక్లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి.
04:26 అంటే, Last define First execute నమూనా.
04:30 END బ్లాక్ యొక్క సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది.
04:35 కాపిటల్ లెటర్స్ లో END ఓపెన్ కర్లీ బ్రాకెట్స్,
04:39 Enter నొక్కి, PERLస్క్రిప్ట్ చివరిలో అమలు కావలసిన కోడ్ భాగం.
04:45 Enterనొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్
04:49 ఇప్పుడు, మనం END బ్లాక్ కు ఉదాహరణను చూద్దాము.
04:53 టెర్మినల్ ను తెరచి,
04:56 gedit endBlock dot pl space ampersandఅని టైప్ చేసి,
05:00 Enter నొక్కండి.
05:03 ఇది gedit లో endBlock dot pl ఫైల్ ను తెరుస్తుంది.
05:08 స్క్రీన్పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
05:13 ఈ స్క్రిప్ట్ లో నేను వ్రాసిన దాన్ని చూద్దాం.
05:17 ఇక్కడ మనం, END బ్లాక్స్ ముందు మరియు తర్వాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము.
05:23 అదేవిధంగా, మనం ప్రతి END బ్లాక్ లో ఒక print స్టేట్మెంట్ ను వ్రాసాము.
05:29 నేను END బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి.
05:34 మనం సెమికోలన్ ఇచ్చినట్లయితే, కంపైలేషన్లో సింటాక్స్ దోషం చూపును.
05:41 ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+s నొక్కండి.
05:45 తరువాత టెర్మినల్ కు మారి,
05:50 perl endBlock dot plఅని టైపింగ్ చేసి,
05:53 Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి.
05:55 టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా మీరు అవుట్ పుట్ ను పొందుతారు
06:00 END బ్లాకులో వ్రాసిన లైన్ చివరిగా ముద్రించబడుతుంది అని గమనించండి.
06:06 వాస్తవానికి స్క్రిప్ట్ లో చివరి print స్టేట్మెంట్ END బ్లాక్ స్టేట్మెంట్స్ కంటే ముందు ముద్రించబడుతుంది మరియు
06:13 END బ్లాక్లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి అని గమనించండి.
06:20 ఈ ఉదాహరణ నుండి, తెలిసినది
06:23 END బ్లాక్స్ లోపల రాసిన కోడ్ చివరికి అమలు అవుతుంది అని స్పష్టం అయినది.
06:29 ఇది PERL స్క్రిప్ట్ లోపల END బ్లాక్ యొక్క స్థానంతో సంబంధం లేకుండా ఉంటుంది మరియు
06:36 END బ్లాక్స్ Last In First Out పద్ధతిలో అమలు చేయబడతాయి.
06:41 కాబట్టి, END బ్లాక్ యొక్క ఉపయోగం, నిష్క్రమించే ముందు ప్రోగ్రామ్ లో సృష్టించబడిన object లను నాశనం చేయడం.
06:49 అదేవిధంగా, PERL నందు, UNITCHECK, CHECK మరియు INIT బ్లాక్స్ ను కలిగి ఉంటుంది.
06:55 ఈ బ్లాక్లను డెవలపర్లు చాలా అరుదుగా ఉపయోగిస్తారు మరియు అర్థం చేసుకోవడం కొంచం కష్టం.
07:02 కాబట్టి, నేను మీకు ఈ బ్లాక్స్ గురించి క్లుప్తంగా వివరిస్తాను.
07:06 UNITCHECK, CHECK మరియు INIT బ్లాక్స్:
07:10 ప్రధాన ప్రోగ్రాం యొక్క కంపైలేషన్ మరియు అమలు దశల మధ్య మార్పును పట్టుకోవడానికి
07:18 కంపైలేషన్ తరువాత మరియు అమలు కు ముందు, కొన్ని తనిఖీలు లేదా initialization వంటివి చేయడానికి ఉపయోగపడతాయి.
07:24 UNITCHECK మరియు CHECK బ్లాక్స్ Last in First outపద్దతిలో అమలవుతాయి.
07:31 అదేవిధంగా INIT బ్లాక్స్ First In First Outపద్దతిలో అమలవుతుంది.
07:37 UNITCHECK బ్లాక్ కు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది:
07:41 కాపిటల్ లెటర్స్ లో UNITCHECK స్పేస్ ఓపెన్ బ్రాకెట్
07:46 Enter నొక్కండి.
07:48 అమలు చేయవలిసిన కోడ్ భాగం
07:50 Enter నొక్కండి.
07:52 క్లోజ్ కర్లీ బ్రాకెట్.
07:54 CHECK బ్లాక్ కు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది.
07:58 కాపిటల్ లెటర్స్ లోCHECKస్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
08:03 Enter నొక్కండి. అమలు చేయబడు కోడ్ భాగం
08:07 Enter నొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్.
08:11 INIT బ్లాక్ యొక్క సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది.
08:15 కాపిటల్ లెటర్స్ లో INITస్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
08:20 Enter నొక్కండిఇనిష్యలైజ్ చేయబడు కోడ్ భాగం
08:24 Enter నొక్కండి.
08:26 క్లోజ్ కర్లీ బ్రాకెట్.
08:28 మంచి అవగాహన కోసం, మీరు మీ Perlస్క్రిప్ట్ లోని ఈ బ్లాక్స్తో ప్రయోగించాలని నేను సిఫార్సు చేస్తున్నాను.
08:36 సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ లో మనం
08:40 BEGIN మరియు END బ్లాక్స్ ను క్లుప్తంగా మరియు
08:44 UNITCHECK, CHECK మరియు INIT యొక్క పరిచయాన్ని
08:48 నమునా ప్రోగ్రాం ల ను ఉపయోగించి నేర్చుకున్నాము.
08:52 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:
08:54 క్రింది కోడ్ ను PERL script లో టైప్ చేయండి.
08:58 స్క్రిప్ట్ ను execute చేసి, అవుట్ పుట్ ను గమనించండి
09:02 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
09:06 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:09 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
09:24 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:32 "Spoken Tutorial" ప్రాజెక్ట్ ", Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:37 ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:45 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:57 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:00 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:02 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india