LaTeX-Old-Version/C2/Mathematical-Typesetting/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:01, 16 October 2019 by Nancyvarkey (Talk | contribs)
Time | Narration |
00:01 | LaTeX లో Mathematical Typesetting పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:06 | నా పేరు కన్నన్ మౌడ్గల్య(Kannan Moudgalya) |
00:08 | గుర్తుంచుకోండి: మన ము దీనిని లేటెక్ అని పిలుస్తాము, లేటెక్స్ అని కాదు. |
00:15 | ఈ ట్యుటోరియల్లో, LaTeX లో గణిత సంకేతాలను ఎలా సృష్టించడం |
00:20 | మరి ముఖ్యంగా, mathematical మోడ్ కు వెళ్ళటం మరియు బయటకు రావటం. స్పేస్ యొక్క పాత్ర మరియు దానిని సృష్టించడం, |
00:29 | గణిత చిహ్నాలు, |
00:31 | చివరగా, A M S math ప్యాకేజీ మరియు matrices సృష్టించడంలో దాని ఉపయోగం ను నేర్చుకుందాము. |
00:37 | నేను ఈ ట్యుటోరియల్ను 10,000 రూపాయిలు కంటే తక్కువ విలువ ఉన్న మా ల్యాప్ టాప్ లో సృష్టిస్తున్నాను. |
00:43 | నేను Ubuntu, TeXworks మరియు LaTeX ను ఉపయోగిస్తున్నాను |
00:47 | LaTeX గురించి స్పోకెన్ ట్యుటోరియల్లో బేసిక్ పాయింట్స్ క్రిందన ఇవ్వబడ్డాయి |
00:53 | side-by-side ట్యుటోరియల్స్ గురించి నేర్చుకొనండి. |
00:56 | అవి అన్నీ మా వెబ్సైట్ నుండి అందుబాటులో ఉంటాయి |
01:00 | నేను maths.tex ఫైల్ ను వాడతాను. |
01:04 | ఇది మీకు ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీలో కోడ్ ఫైల్ గా అందుబాటులో ఉంది |
01:11 | అదే చోట, మీరు "TeX user group, India" నుండి pdf file ను కనుగొంటారు. |
01:17 | మనము అసైన్మెంట్స్ ను చేస్తున్నప్పుడు దానిని వాడతాము |
01:20 | ఇప్పుడు TeXworks విండోస్ కి వెళ్దాం. |
01:24 | నేను ఇప్పటికే maths.tex ఫైల్ ను తెరిచాను. |
01:27 | దయచేసి ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేసి, నాతో పాటు సాధన చేయండి. |
01:32 | మనము ఇప్పటికే ఈ ఫైలు మొదట్లో ఉన్న కమాండ్స్ చూసాము. |
01:36 | ఈ కమాండ్ paragraph indent ను తొలగిస్తుంది. |
01:42 | మనం ఈ అసైన్మెంట్ ద్వారా ఈ స్టేట్మెంట్ యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తాము. |
01:47 | మనం గణిత శాస్త్రంలో ఉపయోగించబడుతున్న గ్రీకు చిహ్నాలతో ప్రారంభిద్దాం. |
01:52 | LaTeX ను గణిత మోడ్ లోకి మార్చడానికి మనం డాలర్ గుర్తును ఉపయోగిస్తాము. |
01:57 | మనం ఆల్ఫాతో ప్రారంభిద్దాం, dollar back slash alpha dollar అని వ్రాద్దాం. |
02:06 | ఇప్పుడు కంపైల్ చేద్దాము, PDF ఫైల్ లో గ్రీకు అక్షరం alpha , కనబడింది చూడండి. |
02:15 | మొదటి డాలర్ గుర్తు మనం గణితశాస్త్ర నమూనాలోకి ప్రవేశిస్తున్నామని చెబుతుంది. |
02:20 | రెండవ డాలర్ మనం ఈ మోడ్ ను వదిలేస్తున్నామని చెబుతుంది. |
02:24 | ఇప్పటి నుండి, నేను స్పష్టంగా డాలర్ లేదా బ్యాక్ స్లాష్ గురించి ప్రస్తావించను. |
02:30 | కానీ మీరు తెరపై ఏమిటి చూస్తున్నారో సరిగ్గా అదే చేయవలసి ఉంటుంది. |
02:34 | అదేవిధంగా మనం బీటా, గామా మరియు డెల్టా అని వ్రాద్దాం, ఇప్పడు కంపైల్ చేద్దాం. |
02:50 | tex ఫైల్ నేను సేవ్ చేయలేదు, ఎందుకంటే, TeXworks దానిని స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది. |
02:56 | వీటిని తొలగించుదాం. |
03:00 | మనం తరువాత వివరించేది, గణితశాస్త్ర వ్యక్తీకరణలో space s ను తీసుకురావటం. |
03:05 | alpha a , అనగా , alpha మరియు a ల యొక్క లబ్దం ను ఎలా సృష్టిస్తాం |
03:12 | మనం alpha a ను ప్రయత్నిద్దాం . |
03:17 | నన్ను కంపైల్ చేయనివ్వండి. |
03:21 | alfa నిర్వచించబడని ఒక నియంత్రణ శ్రేణి అని LaTeX చెబుతుంది. |
03:27 | ఇది ఈ కమాండ్ ని అర్థం చేసుకోలేదని చెప్పింది. దీనిని మూసి చేయనివ్వండి. |
03:34 | LaTeX ప్రతి కమాండ్ తరువాత ఒక space చే దీనిని నిర్వహిస్తుంది. |
03:39 | మనం alfa తర్వాత ఒక space ను వదిలివేద్దాం. |
03:44 | కంపైలేషన్ ను రద్దు చేద్దాం. మళ్ళీ కంపైల్ చేద్దాం. ఇది సమస్యను పరిష్కరించింది. |
03:52 | ఇది కమాండ్ ని రద్దు చేయడానికి ఉపయోగించబడుతుంది, space PDFలో కనిపించదు. |
03:57 | output లో spaces ను ప్రవేశపెట్టాలంటే మనం ఏమి చేద్దాము? |
04:03 | ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా LaTeX కు స్పష్టంగా తెలియజేయాలి. |
04:07 | కొత్త లైన్ ను ప్రారంభించడానికి LaTeX ను అడుగుదాం. |
04:11 | alpha backslash space a ను వ్రాద్దాము. |
04:17 | దీనిని కంపైల్ చేయండి. |
04:20 | ఇది space ను సృష్టించింది. |
04:23 | మీకు మరింత space కావాలనుకుంటే, ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా quad ను ఉపయోగించండి. |
04:31 | దీనిని కంపైల్ చేయండి. |
04:34 | క్వాడ్, ఎక్కువ స్పేస్ ను వదిలి వేసినట్లు మీరు చూడగలరు. |
04:40 | మనం ఇప్పుడు మరొక అంశానికి వెళదాం. |
04:43 | చివరి రెండు లైన్లను తొలగించండి. దీనిని కంపైల్ చేయండి. |
04:50 | మనం టెక్స్ట్ నుండి గణిత నమూనాకు వెళ్ళినప్పుడు ఫాంట్ ఏమౌతుంది? |
04:56 | దీనిని అర్థం చేసుకోవటానికి,“Product of $\alpha and a is” అని వ్రాద్దాం. |
05:04 | దీనిని కంపైల్ చేయండి. |
05:07 | ఈ రెండు a ల యొక్క ఫాంట్ భిన్నమైనదని మీరు చూడవచ్చు. |
05:14 | ఇది a లోపల డాలర్ సంకేతాలు వ్రాయడం ద్వారా పరిష్కరించబడుతుంది. |
05:25 | దీనిని కంపైల్ చేద్దాం. |
05:27 | ఇప్పుడు ఈ రెండు a ల యొక్క ఫాంట్లు ఒకేలా ఉన్నాయి. |
05:32 | భిన్నమైన ఫాంట్స్ ఉంచడం అనేది ఒక సాధారణ తప్పు. |
05:37 | దీనిని తొలగిద్దాం. |
05:40 | దీనిని కంపైల్ చేద్దాం. |
05:43 | ఇప్పుడు మైనస్ సంకేతాలను రూపొందించడం గురుంచి ఒక నియమాన్ని చర్చిద్దాం. |
05:48 | మనం minus alpha ను సృష్టించి క్రియేట చేసి, కంపైల్ చేయాలి అని అనుకుందాం. |
05:58 | దీనిని కంపైల్ చేద్దాం. |
06:01 | మైనస్ గుర్తు ఇక్కడ ఒక చిన్న డాష్ వలే కనిపించటం గమనించండి. |
06:07 | డాలర్ సంకేతం లోపల మైనస్ గుర్తుతో కాపీ చేద్దాం. |
06:15 | దీనిని మళ్ళీ కంపైల్ చేద్దాం. |
06:18 | ఇప్పుడు మైనస్ గుర్తులో వ్యత్యాసాన్ని చూడండి. రెండోది మనకు కావలసినది. డాష్ వలన ఉపయోగం లేదు |
06:27 | డాలర్ల లోపల మైనస్ గుర్తును పెట్టడం ప్రారంభ దశలో వున్న వారు చేసే సాధారణ తప్పు. |
06:33 | వీటన్నింటినీ తొలగించండి. |
06:36 | తదుపరి మనము భిన్నాలను రూపొందించడానికి ఉపయోగించే frac కమాండ్ గురించి వివరించాలనుకుంటున్నాము. |
06:43 | frac a b కంపైల్ చేయండి. |
06:50 | ఇది a by b ను క్రియేట్ చేస్తుంది. frac కమాండ్ స్పేస్ ద్వారా రద్దు చేయబడుతుంది. ఇది రెండు ఆర్గ్యుమెంట్ల కోసం చూస్తుంది. |
07:00 | మొదటి అక్షరం aను మొదటి ఆర్గుమెంట్ గా తీసుకుటుంది. ఇది లవము అవుతుంది. |
07:07 | రెండవ అక్షరం b ను, రెండవ ఆర్గుమెంట్ గా తీసుకుటుంది. అది హారం అవుతుంది. |
07:13 | a మరియు b ల పరిమాణాలు స్వయంచాలకంగా తగ్గాయని గమనించండి. |
07:20 | ఎక్కువ అక్షరాలు కలిగి ఉంటే మనం ఏమి చేయాలి? |
07:24 | cd by ab ను సృష్టించాలనుకుంటే, మీరు దీనిని ప్రయత్నించండి. |
07:31 | LaTeX లో ఒకటి కంటే ఎక్కువ అక్షరాలను గల arguments braces లలో ఉంచుతారు. |
07:37 | ఉదాహరణకు, ఇక్కడ braces లను ఉంచుదాం. |
07:41 | మనం దీనిని కంపైల్ చేసినప్పుడు, మనకు కావలసిన output ను పొందుతాము. |
07:47 | బ్రెసెస్ లోని అన్ని ఎంట్రీలు ఒకే ఆర్గ్యుమెంట్ గా పరిగణించబడతాయి. |
07:52 | దీని ఫలితంగా ఒక బ్రెసెస్ లోపల ఎంత క్లిష్టమైన వ్యక్తీకరణను అయినా నమోదు చేయవచ్చు. ఇప్పడు వీటన్నింటిని తొలగించండి. |
08:01 | ఇప్పుడు మనం సబ్ స్క్రిప్ట్స్ మరియు సూపర్ స్క్రిప్ట్స్ లను పరిశీలిద్దాం. |
08:05 | x underscore a , x sub a ను సృష్టింస్తుంది. |
08:14 | a యొక్క పరిమాణం స్వయంచాలకంగా సరైన స్థాయికి తగ్గించబడింది. |
08:19 | మనం ab ను సబ్ స్క్రిప్ట్ గా ఉంచాలనుకుంటే, మీరు బ్రెసెస్ లను ఉపయోగించాలి. అది మీరే ప్రయత్నించండి. |
08:28 | సూపర్ స్క్రిప్ట్లు caret లేదా up arrow తో సృష్టించబడతాయి. |
08:33 | ఉదాహరణకు, మీరు ఎక్స్ పవర్ త్రి ను సృష్టించాలని అనుకుంటే, మీరు x up arrow 3 అని వ్రాయాలి. |
08:43 | మనం సబ్ స్క్రిప్ట్ లను మరియు సూపర్ స్క్రిప్ట్ లను కూడా ఒకే సారి ఉంచవచ్చు. |
08:48 | ఇప్పుడు x sub a superscript b అని వ్రాద్దాం. దీనిని కంపైల్ చేద్దాం. |
08:58 | మరలా బ్రెసెస్ లను ఉపయోగించడం ద్వారా, మనం సంక్లిష్టమైన సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ లను తయారు చేయవచ్చు. ఇప్పుడు దీనిని తొలగిద్దాం. |
09:08 | తరువాత మనం Matrices (మాత్రికల) కు వెళదాం. |
09:12 | a m s math ప్యాకేజీ లో నేను ఇష్టపడే కొన్ని మాత్రిక నిర్వచనాలు ఉన్నాయి. |
09:19 | usepackage కమాండ్ ద్వారా దీనిని చేర్చండి. |
09:26 | ampersand చిహ్నం; ఇది కోలమ్ లను వేరు చేయడానికి ఉపయోగించే సంకేతం. |
09:31 | మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాము. |
09:34 | మనం begin matrix a and b , end matrix అని వ్రాద్దాం. డాలర్ సంకేతాలు మర్చిపోవద్దు. |
09:44 | మ్యాట్రిక్స్ ని కంపైల్ చేయండి మరియు చూడండి. ఇది ఊహించిన విధంగా ఉంది. |
09:49 | ఇప్పుడు మనం రెండో వరుసను చేర్చాలనుకుందాం, రెండు బ్యాక్ స్లాష్ లను ఉంచుదాం. దీని అర్థం, తరువాత లైన్ కి వెళ్ళమని. |
09:59 | మనకు రెండవ వరుసలో, c, d, e అనే మూడు ఎంట్రీలు కావాలనుకుందాం. దీనిని కంపైల్ చేయండి, రెండో వరుస కూడా ఇప్పుడు చేర్చబడింది. |
10:11 | మనం begin and end వద్ద matrix ను pmatrix గా మార్చమనుకుందాం. |
10:17 | కంపైల్ చేసి దీనిని పొందండి. |
10:21 | మీరు అన్వేషించడం ప్రారంభించాల్సిన సమయం ఇది. ఇప్పుడు స్లైడ్స్ కు వెళ్ళండి. |
10:28 | ఈ ట్యుటోరియల్ లో మనం తెలుసుకున్న దాన్ని సంగ్రహించుదాం. |
10:31 | గణిత నమూనాలోకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం. స్పేస్ లు ఉపయోగించటం మరియు వాటిని సృష్టించడం. |
10:37 | భిన్నాలు, సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్. బ్రాకెట్లలో ఒక ఆర్గ్యుమెంట్ ను నిర్వచించడం. |
10:44 | మాత్రికలను రూపొందించడానికి amsmath ప్యాకేజీ. |
10:48 | ఇప్పుడు కొన్ని అసైన్మెంట్లు ఇస్తాను. |
10:51 | ఈ అసైన్మెంట్ స్పేసేస్ గురించి. పెద్దవి మరియు చిన్నవి. దయచేసి వీడియోను ఆపి, స్లయిడ్ చదివి అప్పగించిన పనిని చేయండి. |
11:01 | ఈ అసైన్మెంట్ బ్రెసెస్ ను ఉపయోగించి fractions ను గురించి. |
11:06 | ఈ అసైన్మెంట్ సబ్ స్క్రిప్ట్ మరియు సూపర్ స్క్రిప్ట్ గురించి. |
11:11 | ఈ అసైన్మెంట్ చే మనం మాత్రికలను సృష్టించడానికి మరికొన్ని పద్ధతులను నేర్చుకుంటాము. |
11:17 | ఈ అసైన్మెంట్ మరిన్ని గణిత చిహ్నాలను సృష్టిస్తుంది. |
11:21 | ఇది TUG India LaTeX గైడ్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ను చూద్దాము. |
11:29 | ఈ పత్రాన్ని మా వెబ్ పేజీ నుండి డౌన్లోడ్ చేయమని నేను ఇప్పటికే మీకు చెప్పా. |
11:34 | ఈ డాక్యుమెంట్లో ఇచ్చిన కొన్ని చిహ్నాలు మళ్ళీ తయారు చేస్తాము. |
11:39 | మీరు తరువాత అసైన్మెంట్ ద్వారా మరిన్ని చిహ్నాలకు ప్రయత్నించండి. |
11:43 | ఈ అసైన్మెంట్ కుడా TUG India డాక్యుమెంట్ పై ఆధారపడి ఉంది. |
11:48 | మీరు ఈ అసైన్మెంట్ లో పేరాగ్రాఫ్ ఇండెంట్ పై ప్రయోగాలు చేస్తారు. |
11:53 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది. |
11:56 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని చూపిస్తుంది. |
12:00 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:04 | మనము స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ ను నిర్వహిస్తున్నాము. సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
12:11 | మీకు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ పై ప్రశ్నలు ఉన్నాయా? దయచేసి ఈ సైట్ను సందర్శించండి, ఈ ట్యుటోరియల్ లో మీరు ప్రశ్నను కలిగి వున్న నిమిషం మరియు సెకండ్ ను choose చేయండి. |
12:20 | మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా బృందం నుండి ఎవరైనా సమాధానం ఇస్తారు. |
12:27 | ఈ ట్యుటోరియల్ లో నిర్దిష్ట ప్రశ్నల కోసం స్పోకెన్ ట్యుటోరియల్ ఫోరమ్ వున్నది. దయచేసి సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
12:36 | ఇది చిందరవందరను తగ్గిస్తుంది. తక్కువ అయోమయ తో, మనము ఈ చర్చలను బోధనా సామగ్రిగా ఉపయోగించవచ్చు. |
12:44 | స్పోకెన్ ట్యుటోరియల్స్లో కవర్ చేయని అంశాలకు ఈ చిరునామాలో stack exchange ను సందర్శించండి. |
12:50 | LaTeX పై సమాధానాలను పొందడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం. |
12:53 | మీరు మా వర్క్ షాప్స్, సర్టిఫికేట్లు మొదలైన వాటిపై కూడా ప్రశ్నలు వేయవచ్చును. ఈ ఈ-మెయిల్ చిరునామాను ఉపయోగించి మాతో సన్నిహితంగా ఉండండి. |
13:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, భారత ప్రభుత్వంచే నిధులు సమకూర్చుకుంటుంది. |
13:09 | Goodbye పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |