LaTeX-Old-Version/C2/What-is-Compiling/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:28, 16 October 2019 by Nancyvarkey (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Click here for reviews

Compiling అంటే ఏమిటి?

ఈ మౌఖిక tutorial కు సుస్వాగతం. మనం ఇప్పుడు LaTeX ను ఉపయోగిస్తూ ఒక సరళమైన దస్తావేజు (document) ఎలా తయారు చెయ్యాలో నేర్చుకుందాము. నేను దీనిని వివరించడానికి Macoxs OS ని ఉపయోగించాను. ఇటువంటి రీతి మీకు వేరే operating systems, అంటే, Linux మరియు Windows లో కూడా లభిస్తాయి. ముందుగ, మనము editor ను ఉపయోగించి source file ని తయారు చేసుకోవాలి. నాకు ఇష్టమైన ఎడిటర్ (editor) ఈమాక్స్ (Emacs). నేను ఈ ఫైల్ పేరు Hello.tex అని పెట్టాను. ఫైల్ తాలుకు ఎక్స్టెన్షన్ '.tex'. దాని స్పెల్లింగ్ T-e-x ఐనప్పటికీ, మొదటి నుండి దానిని 'tec' అని పలుకుతారు.

మొదట మనము LaTeX లో రాయడానికి ఎ దస్తావేజు (document) తరగతి (class) వాడుతున్నామో చెప్పాలి. నేను ఆర్టికల్ class నీ ఈ విధంగా వాడుతున్నాను. Save చేస్తాను. దీంట్లో రకరకాల క్లాసులు ఉన్నాయి. కొన్నిటిని మనము ఇతర tutorials లో చూద్దాము. నేను 12 పాయింట్ ఫాంట్(font) ప్రమాణమును వాడుతున్నాను. రెండు చిన్న ప్రమాణములు 11 పాయింట్ మరియు 10 పాయింట్ ఫాంట్స్ కుడా LaTeX లో ప్రసిద్ధి చెందినవి.

మనము ఇప్పుడు దస్తావేజుని మొదలు పెడదాం. నేను "Hello world" అని text ని టైపు చేస్తాను. దీనితో దస్తావేజుని పూర్తి చేస్తాను. save చేస్తాను. Begin మరియు end దస్తావేజు మధ్యలో ఏ text ఉందొ అదే చివరిగా output లో వస్తుంది. దీనిని compile చెయ్యడానికి 'Pdf LaTeX' అనే ఆదేశాని ఉపయోగిస్తాను. ఇక్కడికి వచ్చి ఆదేశాని చూద్దాం "pdf latex hello.tex."

మనము దీనిని ఎక్స్టెన్షన్ '.tex' లేకుండా 'pdf latex hello' అని కుడా compile చేయవచ్చు. మాములుగా ఫైల్ కు '.tex' ఎక్స్టెన్షన్ వాడుతారు. Pdf file అనే ఆదేశాన్ని ఉపయోగించి మనము సోర్సు ఫైల్ నుంచి pdf ఫైల్ తయ్యారు చేస్తాము. ఈ ఆదేశాన్ని వాడేటప్పుడు LaTeX మనకు ఉపయోగకరమైన output ఇస్తుంది. అలాగే ఈ సందేశాలను ఇక్కడ మనము చూస్తున్నట్లుగా, హలో.లాగ్ (Hello.log) లో భద్రపరుస్తుంది. మీరు గమనించారా? మనము తయారు చేసిన ప్రతి ఫైల్ లోను 'హలో' కనిపిస్తుంది. మనము ఇప్పుడు 'Hello.pdf' ఫైల్ ని ఓపెన్ చేసి చూద్దాము. ఈ pdf ని ఎలా ఓపెన్ చెయ్యాలో చెబుతాను.

మాక్ సిస్టం (Mac system) లో ఇది చెయ్యడానికి మనము ఈ ఆదేశము 'స్కిం హలో.pdf' (Skim hello.pdf) ని ఉపయోగిస్తాము. స్కిం Macoxs లో లభించే ఒక ఉచితమైన pdf రీడర్. ఈ ఆదేశము ఇవ్వగానే స్కిం ఈ హలో.pdf ను ఓపెన్ చేస్తుంది. మన text లో ఒక లైను మాత్రమే ఉంది కాబ్బటి output లో ఒక లైను వస్తుంది. దీనిని జూమ్ (zoom) చేసి చూద్దాము. స్కిం మనము ఓపెన్ చేసిన ఫైల్ తాలుకు కడపటి వర్షన్స్ (latest versions) ని చూపిస్తుంది.

ఉదాహరణకు ఒకవేళ నేను దీనిని మార్చివేస్తే, నేను మరొక "హలో వరల్డ్" అని రాస్తాను. ఇప్పుడు దీనిని save చేసి compile చేస్తాను. ఇప్పుడు ఫైల్ update ఇయ్యింది. సోర్సు ఫైల్ లో ఇప్పుడు దీనిని తీసేసి (delete చేసి) సేవ్ చేద్దాం. ఫైల్ compile చేస్తే మనకి ఒరిజినల్ ఫైల్ వస్తుంది. మీరు గమనించారా? నేను ప్రతిసారి save చేసి compile చేస్తున్నాను. మొదట save చేసి మల్లి compile చెయ్యండి. save చెయ్యకపోతే మనము క్రితం సారి save చేసిన తరువాత చేసిన మార్పులు compile కావు.

ఈ మౌఖిక tutorial తయారు చెయ్యడానికి నేను మూడు విండోస్ (windows ) ని ఈ విధంగా అమర్చుకున్నాను. మీరు దస్తావేజులు తయారు చెయ్యడానికి ఈ విధంగా అమర్చుకోన్నఖర్లేదు. అది అవసరం లేదు. దయచేసి గుర్తించుకోండి మీరు మీకు ఇష్టమైన ఎడిటర్ ను మరియు pdf రీడర్ ను వాడవచ్చు. LaTeX వాడడానికి ప్రతి ఒక్కరు ఈ పద్దతులని పాటించాలి. సోర్సు నిర్మించడం, compile చెయ్యడం, మరియు pdf ఫైల్ చూడడం. మిమ్మల్నీ నేను సోర్సు ఫైల్ మారుస్తూ ఈ పద్దతులని పాటించడానికి ప్రోత్సహిస్తాను. మీకు కావాలంటే బిగిన్ మరియు ఎండ్ దస్తావేజు మధ్యలో ఇంకొంచం text add చేసుకోవచ్చు. మీరు హలో.లాగ్ ఫైల్ ని కుడా బ్రౌసె (browse ) చేసుకోవచ్చు. ఈ tutorial లో ముందుకు సాగుతూ ఒక presentation చూపిస్తాను.

మొదట LaTeX యొక్క ఉపయోగాలు చూద్దాము.

LaTeX ఒక అద్భుతమైన టైపు సెట్టింగ్ సాఫ్ట్వేర్. LaTeX ద్వారా వచ్చే దస్తావేజులు ఇతర సాఫ్ట్వేర్లతో పోల్చలేము. LaTeX ఒక ఉచితమైన ఓపెన్ సాఫ్ట్వేర్. ఇది అన్ని విండోస్ (windows), లినక్సు(Linux) మరియు మాక్ సిస్టం (Mac system) తోపాటు ఇతర యునిక్స్ (Unix) సిస్టం లో కూడా లబిస్తుంది. equations (సమీకరణముల) కు నంబరింగ్ ఇవ్వడం, chapters మరియు సెక్షన్స్, ఫిగర్స్ మరియు టేబుల్స్ ఇవన్ని LaTeX తాలుకు ప్రత్యేకతలు. Latex ను ఉపయోగించి గణిత సమీకరణములు (mathematical equations) ఉన్న దస్తావేజులను అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. Bibliographic entries కూడా అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. Formatting గురించి LaTeX జాగ్రత తీసుకోవడం వలన, యూసర్ తన ధ్యాస అంత రాయడం మరియు రాసే విధానం మిద దృష్టి సాధించుకోవచ్చు.

LaTeX మిద మరికొన్ని మౌఖిక tutorials ఉన్నాయి. మౌద్గల్య.ఓఆర్జి (Moudgalya.org ) అనే సైట్ కు వెళ్లి ఈ క్రింద ఇచ్చిన మౌఖిక tutorials చూడవచ్చు. Compilation అంటే ఏంటి? లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, mathematical type-setting, equations, టేబుల్స్ మరియు ఫిగర్స్, 'How to create bibliography' మరియు 'Inside story of bibliography' ఈ ప్రకారంగా tutorials ని చూడడానికి ప్రోత్సహిస్తున్నాను. ఈ tutorial తయారు చెయ్యడానికి వాడిన సోర్సు ఫైల్ వెబ్సైటు లో కలదు. విండోస్ ఓస్ లో LaTeX ని Install చెయ్యడానికి కూడా ఒక tutorial తయారు చేద్దాము అని అనుకుంటున్నాము. త్వరలో మరొక tutorial రాబోతుంది (ఉదాహరణకు slide presentation కోసం beamer). ఈ presentation ని కూడా మేము LaTeX లో beamer ను ఉపయోగించి తయారు చేశాము.

కొన్ని సూత్రాలు.

1. మీకు ఎన్ని వీలైతే అన్ని మౌఖిక tutorials ని చూడండి. 2. ఒకటి ఐన తరువాత ఇంకొక అభ్యాసము ను చేయండి. 3. ఒక వర్కింగ్ LaTeX ఫైల్ తో ప్రారంభించండి. 4. ఒకసారి ఒక మార్పు చేసి సేవ్ చేసి, compile చేసి చూడండి. చేసిన మార్పులు కనిపించిన పిదప ముందుకు వెళ్ళండి. సేవ్ చేసిన తరువాత compile చెయ్యడం మరచిపోకండి.

LaTeX కు సంభందించి చాల పుస్తకాలు ఉన్నపటికీ మేము రెండు పుస్తకాలను సిఫారస్తు చేస్తాను. మొదటిది D. Leslie Lamport వ్రాసిన LaTeX. ఈ పుస్తకము భారతీయ సంచిక లో చాల చవకగా దొరుకుతుంది. అగ్రస్థాయి వినియోగదారులు 'LaTeX కంపనిఒన్' అనే పుస్తకము ను కూడా ఉపయోగించుకోవచ్చు. చాల వరకు మొదట చెప్పిన పుస్తకం మరియు వెబ్ ని శోధన చేస్తే సరిపోతుంది. కాని ఇతర పుస్తకాల కోసం ctan.org అనే వెబ్సైట్ ని చూసుకోవచ్చు.

ఈ tutorials కు నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ICT ద్వార నిధులు ఇస్తుంది. ఈ ప్రణాళిక ను MHRD, భారతీయ సర్కారు ప్రారంభించారు. ఈ మిషన్ తాలుకు యూఆర్ఎల్: www.sakshat.ac.in. ఈ tutorial పైన చెప్పిన మిషన్ లో "టాక్-to-a-టీచర్" అనే ఒక ప్రాజెక్ట్ యొక్క మొదటి యత్నము. దీనిని CDEEP, IIT BOMBAY సహకరిస్తోంది. దీని వెబ్సైటు: cdeep.iitb.ac.in.

ఈ సాఫ్ట్వేర్ అభివృద్ధి ని సర్వసమ్మతము (popularize) చెయ్యడానికి, ఈ మౌఖిక tutorial యొక్క వాడుక, మరియు దాని ఉపయోగాలలో సమన్వయము చేస్తున్న సైట్ 'fossee.in'. fossee అనగా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ ఇన్ సైన్సు అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఈ ప్రాజెక్ట్ ను నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అంద చేస్తుంది. మరిన్ని మౌఖిక tutorials కొరకు మరియు ఇతర భాషల అనువాదం కోసం ఈ లింకులని చూస్తూ ఉండండి.

ఇంతటితో ఈ tutorial ని ముగిస్తాను. CDEEP, IIT BOMBAY తరఫు నుండి ఉమా ధన్యవాదాలు.

Contributors and Content Editors

Nancyvarkey, Sneha