Health-and-Nutrition/C2/Breast-conditions/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 00:15, 14 October 2019 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:00 | పాలిచ్చే తల్లులలో బ్రెస్ట్ కండీషన్స్ (రొమ్ము పరిస్థితుల) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యూటోరియల్ లొ మనం (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు మరియు స్తనశోఫ (మాస్టిటిస్) గురించి నేర్చుకుందాం. |
00:13 | ముందుగా (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు తో ప్రారంభిద్దాం. |
00:17 | (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు అనేది కాన్పు తర్వాత 3 నుండి 5 రోజుల మధ్య చాలా సాధారణంగా సంభవిస్తుంది. |
00:23 | ఇది రెండు స్తనాలలో ఒకేసారి సంభవిస్తుంది. |
00:28 | తల్లి స్థనాల వాపుని స్తనసంపూర్ణత్వం అని అనుకుని పొరపడకూడదు. |
00:33 | అందువల్ల, ఇప్పుడు మనం స్తనాల వాపు మరియు స్తనసంపూర్ణత్వం మధ్య తేడాను గురించి చర్చిస్తాము. |
00:40 | స్తనాల వాపు లొ స్తనం అనేది గట్టి పడుతుంది, వాపు వచ్చి నొప్పిపెడుతూ పాలతో నిండి ఉంటుంది. |
00:46 | ఇది చర్మం మెరిసేలా చేస్తుంది మరియు పైభాగంలో నరాలు ఉబ్బి ఉంటాయి. |
00:52 | తల్లి 24 గంటలకు పైగా ఉండే జ్వరంతో బాధపడవచ్చు మరియు బిడ్డకు తల్లి స్తనాన్ని లోతుగా పట్టుకోవడం కష్టం కావచ్చు. |
01:01 | అయితే, పాలతో నిండివున్న స్తనాలు అనేవి సహజం. |
01:04 | పాలతో నిండివున్న స్తనాలు (పూర్ణ స్తనాలు) అనేవి పెద్దవిగా కనిపిస్తాయి కాని అవి చర్మాన్ని మెరిసేలా చేయవు. |
01:10 | పాలతో నిండివున్న స్తనాలు (పూర్ణ స్తనాలు) అనేవి నొప్పిగా ఉండవు మరియు స్తనాలు సంపూర్ణంగా ఉన్న సమయంలో జ్వరం ఉండదు. |
01:17 | ఇప్పుడు, పాలిచ్చే తల్లులలో (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు యొక్క కారణాలను చర్చిద్దాం. |
01:23 | ఈ క్రింది పరిస్థితులలో (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు సంభవించవచ్చు- |
01:27 | ఒకవేళ ప్రసవించిన వెంటనే తల్లి తన బిడ్డకు పాలివ్వనపుడు. |
01:32 | తల్లి తన బిడ్డకు తరచుగా పాలివ్వనపుడు. |
01:36 | తల్లి పాలిచ్చే సమయంలో బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా సరిగ్గా పట్టుకోనపుడు. |
01:42 | తల్లి హఠాత్తుగా పాలివ్వడాన్ని ఆపివేసినపుడు. |
01:47 | స్తనాల వాపుకి ఎలా చికిత్స చేయవచ్చో ఇప్పుడు చర్చిద్దాం. |
01:51 | మొదట- స్వచ్ఛమైన నీటితో చేతులు కడుక్కోమని తల్లిని అడగండి |
01:56 | తరువాత, బిడ్డను తల్లికి చాలా దగ్గరగా తీసుకురండి, దానివల్ల ఆమె బిడ్డను చూడవచ్చు, వాసన చూడవచ్చు మరియు ఆమె బిడ్డను తాకవచ్చు. |
02:03 | ఒకవేళ శిశువు చాలా చిరాగ్గా ఉంటె, తల్లి శిశువు యొక్క తువ్వాలు (టవల్) వాసన చూడవచ్చు. |
02:08 | ఆ తరువాత, తల్లి ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. |
02:12 | తరువాత, వేడినీటిలో తడిపిన వస్త్రాన్ని ఆమె స్తనాల పైన 5 నుండి 10 నిమిషాల సేపు ఉంచండి లేదా |
02:18 | తల్లి వేడినీళ్ళతో స్నానం కూడా చేయవచ్చు. |
02:21 | ఇది తల్లి పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది. |
02:24 | ఆ తరువాత, ఆరోగ్య కార్యకర్త తల్లిని విశ్రాంతి తీసుకోమని చెప్పాలి, ఎందుకంటే ఒత్తిడి అధికంగా ఉండటం వలన లెట్-డౌన్ రిఫ్లెక్స్ అవుతుంది మరియు |
02:33 | పాలు బయటకు రావు. |
02:36 | ఇప్పుడు, ఆరోగ్య కార్యకర్త లేదా కుటుంబ సభ్యులెవరైనా తల్లి మెడ మరియు వీపు పై భాగంలో మసాజ్ చేయాలి. |
02:43 | ఇది తల్లి పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది. |
02:46 | ఎందుకంటే, వీపు పైభాగం మరియు రొమ్ము వైపు నరాల వ్యవస్ధ ఒకటే కనుక. |
02:52 | తరువాత, తల్లి తన స్తనాలను సున్నితంగా వృత్తాకార కదలికలో మసాజ్ చేయడం ప్రారంభించాలి. |
02:57 | మసాజ్ చేయడం అనేది ఆమెకు విశ్రాంతినిస్తుంది మరియు లెట్-డౌన్ రిఫ్లెక్స్‌ను మెరుగుపరుస్తుంది. |
03:03 | ఈ విషయాలన్నీ ఆక్సిటోసిన్ విడుదలలో సహాయపడతాయి. |
03:07 | దీనిని ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్ లేదా లెట్-డౌన్ రిఫ్లెక్స్ అంటారు. |
03:12 | ఆక్సిటోసిన్ అనేది ఒక హార్మోన్, ఇది తల్లి పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది. |
03:17 | ఇప్పుడు, తల్లి అరియోలా ను మెత్తగా చేయడానికి, తానే స్వయంగా నొక్కి కొంచం పాలను బయటకు తీయాలి. |
03:23 | ఇది బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకోవడానికి సహాయపడుతుంది. |
03:27 | తల్లి తాను స్థనాలను నొక్కి పాలను బయటకి తీసే సమయంలో, ఆమె అరియోలా చుట్టూ ఒత్తిడి కలగించాలి. |
03:33 | స్తనాలను నొక్కి పాలను తీసిన తరువాత, బిడ్డకు తాను స్వయంగా స్థనాన్ని పట్టుకోవడం కష్టమవుతుంది కనుక తల్లి అరియోలా ను బిడ్డ నోటిలో పెట్టుకొనేలా నేర్పించాలి. |
03:43 | రెండు వైపుల నుండి పాలివ్వటానికి ప్రయత్నించండి. |
03:46 | పాలిచ్చే సమయాల మధ్య, తల్లి 5- 10 నిమిషాల సేపు తన రొమ్ములపై చల్లని తడి వస్త్రాన్ని ఉంచాలి. లేదా, |
03:54 | తల్లి చల్లని క్యాబేజీ ఆకులను తన స్తనాల పై ఉంచుకోవచ్చు. |
03:58 | ఆమె ఈ క్యాబేజీ ఆకులను రిఫ్రిజిరేటర్‌లో లేదా మట్టి కుండలో నిల్వ చేయవచ్చు. |
04:04 | ఇది రొమ్ములోని మెత్తదనం మరియు (ఎడెమాను) వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. |
04:09 | తరువాత, తల్లి తరచుగా తన బిడ్డకు పాలిస్తుఉండాలి. |
04:13 | ఇప్పుడు మనం స్తనాల వాపుని ఎలా నివారించవచ్చొ తెలుసుకుందాం. |
04:17 | మొదట, శిశువు యొక్క ఇటువంటి ఆకలి సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆకలితో విలవిలలాడడం, |
04:25 | పెరుగుతున్న రూటింగ్ రిఫ్లెక్స్- (పాలకొసం చాలా వెతకడం). |
04:28 | రూటింగ్ రిఫ్లెక్స్ లొ, ఏదయినా తన చెంప లేదా నోటిని తాకితే బిడ్డ తన తలను అటు వైపు తిప్పుతుంది. |
04:36 | వేళ్ళను చీకడం. |
04:39 | చివరి దశలో, శిశువు ఏడుపు ప్రారంభిస్తుంది. |
04:43 | ఆకలికి ముందు వచ్చే సంకేతాలను చూపించినప్పుడల్లా బిడ్డకు తల్లిపాలు ఇవ్వండి అంతేగాని బిడ్డ ఏడ్చే వరకు ఆగకండి. |
04:50 | బిడ్డ స్థనాన్ని లోతుగా పట్టుకుందని పాలను బాగా తాగుతుందని నిర్ధారించుకోండి. |
04:55 | గుర్తుంచుకోండి, మీరు మరొక స్తనానికి బిడ్డను మార్చే ముందు, ఒక స్తనం నుండి వచ్చే మొత్తం పాలను బిడ్డకు పట్టించాలి. |
05:02 | తరువాత,స్తనసోఫ (మాస్టిటిస్) అని పిలువబడే మరొక రొమ్ము పరిస్థితిని తెలుసుకుందాం. |
05:08 | ఇది రొమ్ము యొక్క భాగం ఎరుపు గా అయ్యి, వాపు వచ్చి మరియు గట్టిగా మారే పరిస్థితి. |
05:14 | తల్లికి తీవ్రమైన నొప్పి, జ్వరం మరియు అనారోగ్యం అనిపిస్తుంది. |
05:18 | చాలా మంది తల్లులకు మొదటి 6 వారాలలొ ఈ స్తనసోఫ కలిగే అవకాశముంది. |
05:22 | కానీ, ఇది తల్లిపాలు ఇస్తున్న మహిళలో ఎప్పుడైనారావచ్చు. |
05:27 | దీనిని కొన్నిసార్లు స్తనాలవాపుఅని పొరబడొచ్చు. |
05:31 | ఏదేమైనా, స్తనాల వాపు అనేది మొత్తం రొమ్ముకు మరియు తరచుగా రెండు రొమ్ములకు వస్తుంది. |
05:37 | అయితే, (మాస్టిటిస్) స్తనసోఫ అనేది రొమ్ము యొక్క కొంత భాగానికి మరియు సాధారణంగా ఒక రొమ్ము కు మాత్రమే వస్తుంది. |
05:44 | (మాస్టిటిస్) స్తనసోఫ అనేది వాచిన స్తనాలలొ రావొచ్చు లేదా లెదా పాల వాహికలలొ ఆటంకంఉన్నపుడు రావొచ్చు. |
05:51 | ఇప్పుడు, పాల వాహిక లొ ఆటంకంఉన్న స్తనాలను చికిత్స చెయక పొతె అది స్తనసోఫగా ఎలా మారుతుందో మనం చర్చిస్తాము. |
05:59 | ఆటంకం ఏర్పడిన పాళావాహిక అనేది రొమ్ము యొక్క భాగం నుండి పాలు తొలగించబడని పరిస్థితి. |
06:04 | సాధారణంగా ఈ వాహిక అనేది చిక్కని పాలతో అడ్డుపడిన రొమ్ము యొక్క భాగం. |
06:11 | ఇది గడ్డ ఏర్పడటానికి దారితీస్తుంది.ఈ గడ్డ మృదువైనది మరియు గడ్డ మీద చర్మం ఎర్రగా మారుతుంది. |
06:20 | ఆటంకం ఉన్న పాలవాహిక మరియు స్తనాల వాపు అనేవి పాలు కదలకుండా ఉండటానికి కారణమవుతాయి. |
06:24 | ఆటంకం ఉన్న పాలవాహిక మరియు స్తనాల వాపులో, రొమ్ము యొక్క కొంతభాగంలో పాలు ఉండిపోయినపుడు, దానిని స్టాసిస్ (నిశ్చలత) అంటారు. |
06:32 | ఒకవేళ ఈ స్టాసిస్ ను తొలగించకపోతే, అది రొమ్ము కణజాలం యొక్క వాపుకు దారితీస్తుంది.దీనిని నాన్-ఇన్ఫెక్టివ్ మాస్టిటిస్ (సంక్రమించని స్తనసోఫ) అంటారు. |
06:42 | అయితే, కొన్నిసార్లు బ్యాక్టీరియాతో రొమ్ము ఇన్ఫెక్షన్ బారిన పడుతుంది దీనిని ఇన్ఫెక్టివ్ మాస్టిటిస్ (సంక్రమించిన స్తనసోఫ) అంటారు. |
06:51 | క్రింది పరిస్థితులలో, పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుంది: |
06:56 | ఒకవేళ రొమ్ముపై పగుళ్లు ఉంటే, మాస్టిటిస్ కు చికిత్స చేయకుండా చికిత్స ను ఆలస్యం చేస్తే. |
07:06 | చికిత్స చేయని మాస్టిటిస్ రొమ్ములో గడ్డగా పెరుగుతుంది అని గమనించండి. |
07:11 | ఇప్పుడు, మనం (మాస్టిటిస్) స్తనసోఫ యొక్క కారణాలను చర్చిద్దాం. |
07:15 | మాస్టిటిస్ యొక్క మొట్టమొదటి మరియు ప్రధాన కారణం తల్లి బిడ్డకు తరచుగా పాలివ్వకపోవడం. |
07:21 | ఒకవేళ పాలిచ్చే తల్లి పని చేసే మహిళ అయితే తరచుగా బిడ్డకు తల్లి పాలివ్వడం అనేది ఆమెకు సవాలుగా మారుతుంది. |
07:27 | తరచుగా తల్లిపాలు ఇవ్వకపోవడానికి మరొక కారణం తల్లి లేదా బిడ్డలో అనారోగ్యం కావచ్చు. |
07:33 | రెండవది బిడ్డ చనుమొన నుండి మాత్రమే పాలను త్రాగడం. చనుమొన నుండి మాత్రమే త్రాగడంలో, బిడ్డ స్తనం లొని పాలను పూర్తిగా తాగి ఖాళీ చేయదు. |
07:40 | మూడవది తల్లికి పాలు ఎక్కువగా ఉండడం. |
07:43 | నాల్గవది బిడ్డకు తల్లిపాలను తొందరగా మాన్పించడం, ఇక్కడ శిశువు తల్లి పాలను కాకుండా ఇతర ఆహారాన్ని తీసుకుంటుంది. |
07:50 | ఐదవది బిగుతుగా ఉన్న బట్టలు- ఒకవేళ తల్లి బిగుతుగా ఉన్న బట్టలు వేసుకుంటే, ముఖ్యంగా రాత్రి సమయంలో తల్లి బిగుతుగా ఉన్న బ్రా ను ధరిస్తే, అది రొమ్ముపై ఒత్తిడి తెస్తుంది కనుక పాలవాహికలకు ఆటంకం కలగవచ్చు. |
08:03 | ఆరవది తల్లి ఒత్తిడి - తల్లి ఏదైనా ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, అది లెట్-డౌన్ రిఫ్లెక్స్‌ను ప్రభావితం చేస్తుంది. |
08:12 | ఏడవది చనుమొన పగుళ్లు- ఇది రొమ్ము కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది మరియు (మాస్టిటిస్) స్తనసోఫకు దారితీస్తుంది. |
08:22 | (మాస్టిటిస్) స్తనసోఫకు చికిత్సను చూద్దాం. |
08:26 | మొదట కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి తరువాత చికిత్సను ప్రారంభించండి. |
08:31 | తల్లి బిడ్డకు పాలివ్వటానికి ముందు ఆమె వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాలి. |
08:35 | లేదా ఆమె వేడినీళ్ళతో స్నానం చేయాలి. |
08:37 | ఆమె మొదట స్తనసోఫ కలిగిన స్తన౦నుండే బిడ్డకు తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించాలి. |
08:42 | ఒకవేళ ఇది నొప్పిని పెంచుతుంటే లేదా పాలు సరిగ్గా బైటికి రాక పొతే, అపుడు ప్రభావితం కాని రొమ్ము నుండి పాలివ్వడం ప్రారంభించండి. |
08:50 | గుర్తుంచుకోండి, తల్లి బిడ్డకు తరచుగా పాలివ్వడం అవసరం. |
08:55 | ఒకవేళ చనుమొనపై లేదా అరియోలపై గాయం బయటకి లేకపోతే, అప్పుడు తల్లి స్తనసోఫ కలిగిన స్తనం నుండి పాలివ్వవచ్చు. |
09:04 | గుర్తుంచుకోండి, తల్లి (మాస్టిటిస్) స్తనసోఫ కలిగిన స్తనం నుండి బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు- |
09:09 | శిశువు కూడా ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశం ఉంటుంది కనుక ఆమె శిశువు లో సంక్రమణ లక్షణాలను జాగ్రతగా గమనించాలి. |
09:17 | స్తనసోప సంక్రమించిన వైపు నుండి తల్లి పాలు చాలా హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి కనుక. |
09:24 | రొమ్ముకు మసాజ్ చేయడం వల్ల పాలు బాగా రావొచ్చు. |
09:28 | ఇది స్తనసోఫ కలిగిన ప్రాంతం నుండి చనుమొన వైపు సున్నితమైన మసాజ్ చేయాలి. |
09:34 | మరియు తల్లి తగినంత విశ్రాంతి తీసుకొవాలి. |
09:37 | ఒకవేళ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆమె వైద్యుడిని సంప్రదించాలి. |
09:40 | స్తనాలలో గడ్డల నుండి గట్టిపడిన పాలను బయటకి పంపడానికి శస్త్రచికిత్స మరియు యాంటీబయాటిక్ లు అవసరం. |
09:47 | ఇవి కాకుండా, తల్లి తన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, దీర్ఘంగా మరియు సమానంగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి. |
09:55 | మ్రుదు సంగీతాన్ని వినడం మరియు తన బిడ్డ గురించి ఆలొచించడం అనేవి లెట్-డౌన్ రిఫ్లెక్స్ ను ప్రారంభించడంలో సహాయపడతాయి. |
10:04 | (మాస్టిటిస్) స్తనసోఫను నివారించడానికి, పాలివ్వడానికి సరైన పద్దతిలో పట్టుకోవడం అవసరం అని గుర్తుంచుకోండి. |
10:09 | ఇది పాలవాహికకు ఆటంకం కలగకుండా చేస్తుంది మరియు శిశువుకు తగినన్ని పాలు లభిస్తాయి. |
10:14 | రొమ్ము యొక్క ఈ పరిస్థితులన్నింటినీ నివారించడానికి కీలకమైనవి- బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకుని ఉండడం మరియు బిడ్డను సరైన స్థితిలో ఉంచడం ఇంకా తల్లి తరచుగా బిడ్డకు పాలివ్వడం. |
10:24 | ఇది మనల్ని పాలిచ్చే తల్లులలో రొమ్ము పరిస్థితులపై ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. |
10:31 | ఈ టుటొరియల్ లొ మనము స్తనాల వాపు మరియు స్తన సోఫల గురించి తెలుసుకున్నాం. |
10:37 | ఈ టుటొరియల్ స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబె వారి సమర్పణ. |
10:43 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ఎంఈఐసిటి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ఈ లింకులో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
10:56 | ఈ టుటొరియల్ కు వీల్స్ గ్లొబల్ ఫౌండెషన్ కొంత భాగం నిధులను సమకూర్చింది. |
11:03 | ఈ టుటోరియల్ మా ఔర్ శిశు పొషన్ ప్రాజెక్ట్ లొ ఒక భాగం. |
11:07 | ఈ డొమైన్ సమీక్షకులు డా.రూపల్ దలాల్, ఎండి పీడియాట్రిక్స్ మరియు డా.తరు జిందాల్, ఎం ఎస్ ఒబెస్ట్రిక్స్ మరియు గైనకాలజి. |
11:20 | ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |