Health-and-Nutrition/C2/Breast-conditions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 00:15, 14 October 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 పాలిచ్చే తల్లులలో బ్రెస్ట్ కండీషన్స్ (రొమ్ము పరిస్థితుల) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యూటోరియల్ లొ మనం (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు మరియు స్తనశోఫ (మాస్టిటిస్) గురించి నేర్చుకుందాం.
00:13 ముందుగా (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు తో ప్రారంభిద్దాం.
00:17 (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు అనేది కాన్పు తర్వాత 3 నుండి 5 రోజుల మధ్య చాలా సాధారణంగా సంభవిస్తుంది.
00:23 ఇది రెండు స్తనాలలో ఒకేసారి సంభవిస్తుంది.
00:28 తల్లి స్థనాల వాపుని స్తనసంపూర్ణత్వం అని అనుకుని పొరపడకూడదు.
00:33 అందువల్ల, ఇప్పుడు మనం స్తనాల వాపు మరియు స్తనసంపూర్ణత్వం మధ్య తేడాను గురించి చర్చిస్తాము.
00:40 స్తనాల వాపు లొ స్తనం అనేది గట్టి పడుతుంది, వాపు వచ్చి నొప్పిపెడుతూ పాలతో నిండి ఉంటుంది.
00:46 ఇది చర్మం మెరిసేలా చేస్తుంది మరియు పైభాగంలో నరాలు ఉబ్బి ఉంటాయి.
00:52 తల్లి 24 గంటలకు పైగా ఉండే జ్వరంతో బాధపడవచ్చు మరియు బిడ్డకు తల్లి స్తనాన్ని లోతుగా పట్టుకోవడం కష్టం కావచ్చు.
01:01 అయితే, పాలతో నిండివున్న స్తనాలు అనేవి సహజం.
01:04 పాలతో నిండివున్న స్తనాలు (పూర్ణ స్తనాలు) అనేవి పెద్దవిగా కనిపిస్తాయి కాని అవి చర్మాన్ని మెరిసేలా చేయవు.
01:10 పాలతో నిండివున్న స్తనాలు (పూర్ణ స్తనాలు) అనేవి నొప్పిగా ఉండవు మరియు స్తనాలు సంపూర్ణంగా ఉన్న సమయంలో జ్వరం ఉండదు.
01:17 ఇప్పుడు, పాలిచ్చే తల్లులలో (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు యొక్క కారణాలను చర్చిద్దాం.
01:23 ఈ క్రింది పరిస్థితులలో (బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్) స్తనముల వాపు సంభవించవచ్చు-
01:27 ఒకవేళ ప్రసవించిన వెంటనే తల్లి తన బిడ్డకు పాలివ్వనపుడు.
01:32 తల్లి తన బిడ్డకు తరచుగా పాలివ్వనపుడు.
01:36 తల్లి పాలిచ్చే సమయంలో బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా సరిగ్గా పట్టుకోనపుడు.
01:42 తల్లి హఠాత్తుగా పాలివ్వడాన్ని ఆపివేసినపుడు.
01:47 స్తనాల వాపుకి ఎలా చికిత్స చేయవచ్చో ఇప్పుడు చర్చిద్దాం.
01:51 మొదట- స్వచ్ఛమైన నీటితో చేతులు కడుక్కోమని తల్లిని అడగండి
01:56 తరువాత, బిడ్డను తల్లికి చాలా దగ్గరగా తీసుకురండి, దానివల్ల ఆమె బిడ్డను చూడవచ్చు, వాసన చూడవచ్చు మరియు ఆమె బిడ్డను తాకవచ్చు.
02:03 ఒకవేళ శిశువు చాలా చిరాగ్గా ఉంటె, తల్లి శిశువు యొక్క తువ్వాలు (టవల్) వాసన చూడవచ్చు.
02:08 ఆ తరువాత, తల్లి ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.
02:12 తరువాత, వేడినీటిలో తడిపిన వస్త్రాన్ని ఆమె స్తనాల పైన 5 నుండి 10 నిమిషాల సేపు ఉంచండి లేదా
02:18 తల్లి వేడినీళ్ళతో స్నానం కూడా చేయవచ్చు.
02:21 ఇది తల్లి పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది.
02:24 ఆ తరువాత, ఆరోగ్య కార్యకర్త తల్లిని విశ్రాంతి తీసుకోమని చెప్పాలి, ఎందుకంటే ఒత్తిడి అధికంగా ఉండటం వలన లెట్-డౌన్ రిఫ్లెక్స్ అవుతుంది మరియు
02:33 పాలు బయటకు రావు.
02:36 ఇప్పుడు, ఆరోగ్య కార్యకర్త లేదా కుటుంబ సభ్యులెవరైనా తల్లి మెడ మరియు వీపు పై భాగంలో మసాజ్ చేయాలి.
02:43 ఇది తల్లి పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది.
02:46 ఎందుకంటే, వీపు పైభాగం మరియు రొమ్ము వైపు నరాల వ్యవస్ధ ఒకటే కనుక.
02:52 తరువాత, తల్లి తన స్తనాలను సున్నితంగా వృత్తాకార కదలికలో మసాజ్ చేయడం ప్రారంభించాలి.
02:57 మసాజ్ చేయడం అనేది ఆమెకు విశ్రాంతినిస్తుంది మరియు లెట్-డౌన్ రిఫ్లెక్స్‌ను మెరుగుపరుస్తుంది.
03:03 ఈ విషయాలన్నీ ఆక్సిటోసిన్ విడుదలలో సహాయపడతాయి.
03:07 దీనిని ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్ లేదా లెట్-డౌన్ రిఫ్లెక్స్ అంటారు.
03:12 ఆక్సిటోసిన్ అనేది ఒక హార్మోన్, ఇది తల్లి పాలు బయటకు రావడానికి సహాయపడుతుంది.
03:17 ఇప్పుడు, తల్లి అరియోలా ను మెత్తగా చేయడానికి, తానే స్వయంగా నొక్కి కొంచం పాలను బయటకు తీయాలి.
03:23 ఇది బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకోవడానికి సహాయపడుతుంది.
03:27 తల్లి తాను స్థనాలను నొక్కి పాలను బయటకి తీసే సమయంలో, ఆమె అరియోలా చుట్టూ ఒత్తిడి కలగించాలి.
03:33 స్తనాలను నొక్కి పాలను తీసిన తరువాత, బిడ్డకు తాను స్వయంగా స్థనాన్ని పట్టుకోవడం కష్టమవుతుంది కనుక తల్లి అరియోలా ను బిడ్డ నోటిలో పెట్టుకొనేలా నేర్పించాలి.
03:43 రెండు వైపుల నుండి పాలివ్వటానికి ప్రయత్నించండి.
03:46 పాలిచ్చే సమయాల మధ్య, తల్లి 5- 10 నిమిషాల సేపు తన రొమ్ములపై చల్లని తడి వస్త్రాన్ని ఉంచాలి. లేదా,
03:54 తల్లి చల్లని క్యాబేజీ ఆకులను తన స్తనాల పై ఉంచుకోవచ్చు.
03:58 ఆమె ఈ క్యాబేజీ ఆకులను రిఫ్రిజిరేటర్‌లో లేదా మట్టి కుండలో నిల్వ చేయవచ్చు.
04:04 ఇది రొమ్ములోని మెత్తదనం మరియు (ఎడెమాను) వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
04:09 తరువాత, తల్లి తరచుగా తన బిడ్డకు పాలిస్తుఉండాలి.
04:13 ఇప్పుడు మనం స్తనాల వాపుని ఎలా నివారించవచ్చొ తెలుసుకుందాం.
04:17 మొదట, శిశువు యొక్క ఇటువంటి ఆకలి సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆకలితో విలవిలలాడడం,
04:25 పెరుగుతున్న రూటింగ్ రిఫ్లెక్స్- (పాలకొసం చాలా వెతకడం).
04:28 రూటింగ్ రిఫ్లెక్స్ లొ, ఏదయినా తన చెంప లేదా నోటిని తాకితే బిడ్డ తన తలను అటు వైపు తిప్పుతుంది.
04:36 వేళ్ళను చీకడం.
04:39 చివరి దశలో, శిశువు ఏడుపు ప్రారంభిస్తుంది.
04:43 ఆకలికి ముందు వచ్చే సంకేతాలను చూపించినప్పుడల్లా బిడ్డకు తల్లిపాలు ఇవ్వండి అంతేగాని బిడ్డ ఏడ్చే వరకు ఆగకండి.
04:50 బిడ్డ స్థనాన్ని లోతుగా పట్టుకుందని పాలను బాగా తాగుతుందని నిర్ధారించుకోండి.
04:55 గుర్తుంచుకోండి, మీరు మరొక స్తనానికి బిడ్డను మార్చే ముందు, ఒక స్తనం నుండి వచ్చే మొత్తం పాలను బిడ్డకు పట్టించాలి.
05:02 తరువాత,స్తనసోఫ (మాస్టిటిస్) అని పిలువబడే మరొక రొమ్ము పరిస్థితిని తెలుసుకుందాం.
05:08 ఇది రొమ్ము యొక్క భాగం ఎరుపు గా అయ్యి, వాపు వచ్చి మరియు గట్టిగా మారే పరిస్థితి.
05:14 తల్లికి తీవ్రమైన నొప్పి, జ్వరం మరియు అనారోగ్యం అనిపిస్తుంది.
05:18 చాలా మంది తల్లులకు మొదటి 6 వారాలలొ ఈ స్తనసోఫ కలిగే అవకాశముంది.
05:22 కానీ, ఇది తల్లిపాలు ఇస్తున్న మహిళలో ఎప్పుడైనారావచ్చు.
05:27 దీనిని కొన్నిసార్లు స్తనాలవాపుఅని పొరబడొచ్చు.
05:31 ఏదేమైనా, స్తనాల వాపు అనేది మొత్తం రొమ్ముకు మరియు తరచుగా రెండు రొమ్ములకు వస్తుంది.
05:37 అయితే, (మాస్టిటిస్) స్తనసోఫ అనేది రొమ్ము యొక్క కొంత భాగానికి మరియు సాధారణంగా ఒక రొమ్ము కు మాత్రమే వస్తుంది.
05:44 (మాస్టిటిస్) స్తనసోఫ అనేది వాచిన స్తనాలలొ రావొచ్చు లేదా లెదా పాల వాహికలలొ ఆటంకంఉన్నపుడు రావొచ్చు.
05:51 ఇప్పుడు, పాల వాహిక లొ ఆటంకంఉన్న స్తనాలను చికిత్స చెయక పొతె అది స్తనసోఫగా ఎలా మారుతుందో మనం చర్చిస్తాము.
05:59 ఆటంకం ఏర్పడిన పాళావాహిక అనేది రొమ్ము యొక్క భాగం నుండి పాలు తొలగించబడని పరిస్థితి.
06:04 సాధారణంగా ఈ వాహిక అనేది చిక్కని పాలతో అడ్డుపడిన రొమ్ము యొక్క భాగం.
06:11 ఇది గడ్డ ఏర్పడటానికి దారితీస్తుంది.ఈ గడ్డ మృదువైనది మరియు గడ్డ మీద చర్మం ఎర్రగా మారుతుంది.
06:20 ఆటంకం ఉన్న పాలవాహిక మరియు స్తనాల వాపు అనేవి పాలు కదలకుండా ఉండటానికి కారణమవుతాయి.
06:24 ఆటంకం ఉన్న పాలవాహిక మరియు స్తనాల వాపులో, రొమ్ము యొక్క కొంతభాగంలో పాలు ఉండిపోయినపుడు, దానిని స్టాసిస్ (నిశ్చలత) అంటారు.
06:32 ఒకవేళ ఈ స్టాసిస్ ను తొలగించకపోతే, అది రొమ్ము కణజాలం యొక్క వాపుకు దారితీస్తుంది.దీనిని నాన్-ఇన్ఫెక్టివ్ మాస్టిటిస్ (సంక్రమించని స్తనసోఫ) అంటారు.
06:42 అయితే, కొన్నిసార్లు బ్యాక్టీరియాతో రొమ్ము ఇన్ఫెక్షన్ బారిన పడుతుంది దీనిని ఇన్ఫెక్టివ్ మాస్టిటిస్ (సంక్రమించిన స్తనసోఫ) అంటారు.
06:51 క్రింది పరిస్థితులలో, పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుంది:
06:56 ఒకవేళ రొమ్ముపై పగుళ్లు ఉంటే, మాస్టిటిస్ కు చికిత్స చేయకుండా చికిత్స ను ఆలస్యం చేస్తే.
07:06 చికిత్స చేయని మాస్టిటిస్ రొమ్ములో గడ్డగా పెరుగుతుంది అని గమనించండి.
07:11 ఇప్పుడు, మనం (మాస్టిటిస్) స్తనసోఫ యొక్క కారణాలను చర్చిద్దాం.
07:15 మాస్టిటిస్ యొక్క మొట్టమొదటి మరియు ప్రధాన కారణం తల్లి బిడ్డకు తరచుగా పాలివ్వకపోవడం.
07:21 ఒకవేళ పాలిచ్చే తల్లి పని చేసే మహిళ అయితే తరచుగా బిడ్డకు తల్లి పాలివ్వడం అనేది ఆమెకు సవాలుగా మారుతుంది.
07:27 తరచుగా తల్లిపాలు ఇవ్వకపోవడానికి మరొక కారణం తల్లి లేదా బిడ్డలో అనారోగ్యం కావచ్చు.
07:33 రెండవది బిడ్డ చనుమొన నుండి మాత్రమే పాలను త్రాగడం. చనుమొన నుండి మాత్రమే త్రాగడంలో, బిడ్డ స్తనం లొని పాలను పూర్తిగా తాగి ఖాళీ చేయదు.
07:40 మూడవది తల్లికి పాలు ఎక్కువగా ఉండడం.
07:43 నాల్గవది బిడ్డకు తల్లిపాలను తొందరగా మాన్పించడం, ఇక్కడ శిశువు తల్లి పాలను కాకుండా ఇతర ఆహారాన్ని తీసుకుంటుంది.
07:50 ఐదవది బిగుతుగా ఉన్న బట్టలు- ఒకవేళ తల్లి బిగుతుగా ఉన్న బట్టలు వేసుకుంటే, ముఖ్యంగా రాత్రి సమయంలో తల్లి బిగుతుగా ఉన్న బ్రా ను ధరిస్తే, అది రొమ్ముపై ఒత్తిడి తెస్తుంది కనుక పాలవాహికలకు ఆటంకం కలగవచ్చు.
08:03 ఆరవది తల్లి ఒత్తిడి - తల్లి ఏదైనా ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, అది లెట్-డౌన్ రిఫ్లెక్స్‌ను ప్రభావితం చేస్తుంది.
08:12 ఏడవది చనుమొన పగుళ్లు- ఇది రొమ్ము కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది మరియు (మాస్టిటిస్) స్తనసోఫకు దారితీస్తుంది.
08:22 (మాస్టిటిస్) స్తనసోఫకు చికిత్సను చూద్దాం.
08:26 మొదట కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి తరువాత చికిత్సను ప్రారంభించండి.
08:31 తల్లి బిడ్డకు పాలివ్వటానికి ముందు ఆమె వేడినీళ్ళతో కాపడం పెట్టుకోవాలి.
08:35 లేదా ఆమె వేడినీళ్ళతో స్నానం చేయాలి.
08:37 ఆమె మొదట స్తనసోఫ కలిగిన స్తన౦నుండే బిడ్డకు తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించాలి.
08:42 ఒకవేళ ఇది నొప్పిని పెంచుతుంటే లేదా పాలు సరిగ్గా బైటికి రాక పొతే, అపుడు ప్రభావితం కాని రొమ్ము నుండి పాలివ్వడం ప్రారంభించండి.
08:50 గుర్తుంచుకోండి, తల్లి బిడ్డకు తరచుగా పాలివ్వడం అవసరం.
08:55 ఒకవేళ చనుమొనపై లేదా అరియోలపై గాయం బయటకి లేకపోతే, అప్పుడు తల్లి స్తనసోఫ కలిగిన స్తనం నుండి పాలివ్వవచ్చు.
09:04 గుర్తుంచుకోండి, తల్లి (మాస్టిటిస్) స్తనసోఫ కలిగిన స్తనం నుండి బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు-
09:09 శిశువు కూడా ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశం ఉంటుంది కనుక ఆమె శిశువు లో సంక్రమణ లక్షణాలను జాగ్రతగా గమనించాలి.
09:17 స్తనసోప సంక్రమించిన వైపు నుండి తల్లి పాలు చాలా హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి కనుక.
09:24 రొమ్ముకు మసాజ్ చేయడం వల్ల పాలు బాగా రావొచ్చు.
09:28 ఇది స్తనసోఫ కలిగిన ప్రాంతం నుండి చనుమొన వైపు సున్నితమైన మసాజ్ చేయాలి.
09:34 మరియు తల్లి తగినంత విశ్రాంతి తీసుకొవాలి.
09:37 ఒకవేళ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆమె వైద్యుడిని సంప్రదించాలి.
09:40 స్తనాలలో గడ్డల నుండి గట్టిపడిన పాలను బయటకి పంపడానికి శస్త్రచికిత్స మరియు యాంటీబయాటిక్ లు అవసరం.
09:47 ఇవి కాకుండా, తల్లి తన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, దీర్ఘంగా మరియు సమానంగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి.
09:55 మ్రుదు సంగీతాన్ని వినడం మరియు తన బిడ్డ గురించి ఆలొచించడం అనేవి లెట్-డౌన్ రిఫ్లెక్స్ ను ప్రారంభించడంలో సహాయపడతాయి.
10:04 (మాస్టిటిస్) స్తనసోఫను నివారించడానికి, పాలివ్వడానికి సరైన పద్దతిలో పట్టుకోవడం అవసరం అని గుర్తుంచుకోండి.
10:09 ఇది పాలవాహికకు ఆటంకం కలగకుండా చేస్తుంది మరియు శిశువుకు తగినన్ని పాలు లభిస్తాయి.
10:14 రొమ్ము యొక్క ఈ పరిస్థితులన్నింటినీ నివారించడానికి కీలకమైనవి- బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకుని ఉండడం మరియు బిడ్డను సరైన స్థితిలో ఉంచడం ఇంకా తల్లి తరచుగా బిడ్డకు పాలివ్వడం.
10:24 ఇది మనల్ని పాలిచ్చే తల్లులలో రొమ్ము పరిస్థితులపై ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
10:31 ఈ టుటొరియల్ లొ మనము స్తనాల వాపు మరియు స్తన సోఫల గురించి తెలుసుకున్నాం.
10:37 ఈ టుటొరియల్ స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబె వారి సమర్పణ.
10:43 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ఎంఈఐసిటి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ఈ లింకులో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
10:56 ఈ టుటొరియల్ కు వీల్స్ గ్లొబల్ ఫౌండెషన్ కొంత భాగం నిధులను సమకూర్చింది.
11:03 ఈ టుటోరియల్ మా ఔర్ శిశు పొషన్ ప్రాజెక్ట్ లొ ఒక భాగం.
11:07 ఈ డొమైన్ సమీక్షకులు డా.రూపల్ దలాల్, ఎండి పీడియాట్రిక్స్ మరియు డా.తరు జిందాల్, ఎం ఎస్ ఒబెస్ట్రిక్స్ మరియు గైనకాలజి.
11:20 ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Debosmita, Simhadriudaya