Health-and-Nutrition/C2/Breast-crawl/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:10, 6 August 2019 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 తొలిసారి ముర్రుపాలు పట్టించటం పై ఈ స్పొకన్ టుటొరియల్ కి స్వాగతం.
00:05 ఈ టుటొరియల్ లొ మనము మొదటి సారి స్తనపానం చేయించడం,
00:10 ముర్రుపాలు పట్టించే విధానం మరియు
00:13 బ్రెస్ట్ క్రాల్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
00:18 ముందుగా బ్రెస్ట్ క్రాల్ అంటె ఏమిటి? అని తెలుసుకుందాం.
00:23 ఒక బిడ్డ పుట్టుకతోనే తల్లిపాలను సేవించే గుణాన్ని కలిగిఉంటుంది.
00:28 ప్రసవం జరిగిన వెంటనే తల్లి రొమ్ముకు దగ్గరగా పొట్టపైన బిడ్డను బోర్లా పడుకొపెడితె ఆ బిడ్డ తల్లి రొమ్ముని గుర్తించి పాలను త్రాగడం ప్రారంభిస్తుంది.
00:40 ఈ మొత్తం ప్రక్రియను బ్రెస్ట్ క్రాల్ అంటారు.
00:46 ఈ పూర్తి ప్రక్రియను నార్మల్ డెలివరీ ద్వారా లేదా సిజేరియన్ డెలివరీ ద్వారా పుట్టిన ప్రతి ఆరొగ్యవంతమైన బిడ్డ మరియు
00:58 పుట్టిన వెంటనే బాగా ఏడ్చిన బిడ్డ చేయగలదని గమనించాలి.
01:03 ఈ ప్రక్రియను అనారోగ్యంతొ పుట్టిన బిడ్డలకు మరియు పుట్టుకతో తక్కువ బరువు ఉన్న బిడ్డలకు చెయ్యకూడదు; చేయిస్తే వారు ఊపిరి అందకపోవడం వంటి సమస్యలతో బాధపడవచ్చు.
01:15 ఇప్పుడు, మనం స్తనపాన విధానాన్ని ఆ తరువాత దానియొక్క యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్చుకుంటాము.
01:22 ముందు, కాన్పుచేసే గది ఉష్ణోగ్రత దాదాపుగా 26 డిగ్రీల సెల్సియస్ ఉంది అని నిర్ధారించుకోండి.
01:29 తరువాతది బిడ్డను తల్లి పొత్తికడుపుపై పడుకోపెట్టి శుభ్రపరచడం.
01:35 బిడ్డ చేతులు తప్ప పూర్తి శరీరాన్ని శుభ్రమైన పొడిగుడ్డతొ బాగా శుభ్రం చేయాలి.
01:42 బిడ్డ చేతులు మాత్రం తడిగానే ఉంచాలని గుర్తుపెట్టుకోండి.
01:46 శుభ్రం చేసేటప్పుడు బిడ్డ చర్మంపై ఉన్న తెల్లని రక్షణ పొరను తొలగించవద్దు.
01:53 ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే అది శిశువును రక్షిస్తుంది.
01:56 బిడ్డను శుభ్రం చేసిన తరువాత తడిగుడ్డను తీసేయండి.
02:01 బిడ్డను తుడిచిన తరువాత, ప్రసవం చెసేవ్యక్తి బొడ్డునాడి కొట్టుకోవడాన్ని గమనించాలి.
02:08 బొడ్డునాడి కొట్టుకోవడం ఆగిన తరువాత ఆమె బొడ్డుతాడు ను కత్తిరించాలి.
02:13 తరువాత, బిడ్డని తన కడుపుతో తల్లి కడుపుని తాకే విధంగా తల్లి యొక్క పొత్తికడుపుపై మరోసారి పడుకోపెట్టండి.
02:22 బిడ్డ తలను తల్లి యొక్క కడగని రొమ్ముల మధ్య ఉంచాలి.
02:26 బిడ్డనోరు తల్లి రొమ్ము క్రింద ఉండేలా చూసుకొండి.
02:30 ఇప్పుడు బిడ్డ మొదటిసారి ముర్రుపాలు త్రాగే౦దుకు తయారుగా ఉంచబడినది.
02:37 నవజాత శిశువుకు ముందుకు పాకడం అనేది చాలా సహజం కనుక, బిడ్డ సులభంగా ప్రాకుతూ తల్లి రొమ్ము వైపు చేరుకోగలదు.
02:46 తరువాత చేయవలసిన విషయం ఏమిటంటే-తల్లి బిడ్డలను వెచ్చగా ఉంచడానికి వారిద్దరిని శుభ్రమైన పొడి వస్త్రంతో కప్పండి.
02:54 బిడ్డ తలపై ఒక టోపీని ఉంచండి
02:57 దయచేసి గమనించండి- మేము తరువాతి చిత్రాలలో టోపీ మరియు వస్త్రాన్ని చూపించలేదు.
03:04 మొదటిసారి జరిగే స్తనపాన సమయంలో బిడ్డను ఎలా పడుకోబెట్టాలి అని స్పష్టంగా గమనించడానికి ఇది మనకు సహాయపడుతుంది.
03:10 బిడ్డను గుడ్దతో కప్పిన తరువాత, బిడ్డ వీపుకి తల్లి చేతులతో ఆసరా ఇవ్వాలి.
03:18 మొదటిసారి స్తనపానం చేయడంలో సహాయపడే బిడ్డకుగల సామర్థ్యాలను చర్చిద్దాం.
03:24 ప్రసవం తరువాత బిడ్డ చాలా అప్రమత్తంగా మరియు సహజంగా ఉంటుంది..
03:29 తన శుభ్రపరచని చేతి వాసన తన నోటిలో లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది.
03:35 అలాగే, తనకు ఉన్న పరిమిత దృష్టితో బిడ్డ, తన తల్లి ముఖాన్ని మరియు చూచుకాన్ని చూడవచ్చు
03:43 చూచుకము అనగా చనుమొన చుట్టూ ఉన్న నల్లనిప్రదేశం.
03:47 చివరికి, బిడ్డ తన చేతులు మరియు కాళ్ళను ఉపయోగించి కదలడం ప్రారంభిస్తుంది. క్రమంగా తన తల్లి రొమ్ము వైపు పాకుతుంది.
03:57 అయితే, కొంతమంది పిల్లలు వెంటనే ప్రాకడం ప్రారంభిస్తారు మరికొందరు ప్రాకడానికి కొంత సమయం తీసుకుంటారు.
04:04 స్తనాలను చేరుకొన్న తరువాత బిడ్డ ముందుగా తన చేతులతో స్తనాలను పట్టుకునే౦దుకు ప్రయత్నిస్తుంది.
04:12 ఈ సమయంలో బిడ్డ మొదటి స్తనపాలను తీసుకునే వరకు తల్లిబిడ్డలకు ఏ ఆటంకం కలిగించవద్దు.
04:20 ఈ ప్రక్రియలొ ప్రసవం చేసినవారు మరియు తల్లి ఇద్దరూ ఓర్పుతో ఉండాలి.
04:27 మొదటి స్తనపానం కొరకు బిడ్డ తన తల్లి రొమ్ము వరకు చేరుకోవడానికి 30-60 నిమిషాలు పట్టవచ్చు
04:35 తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించేటప్పుడు, బిడ్డ తన నోటిని వెడల్పుగా తెరిచి, తల్లి రొమ్మును లోతుగా నోటిలోనికి తీసుకుంటుంది.
04:45 పాలను పట్టడం పూర్తయిన తరువాత, బిడ్డను ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు అదే స్థితిలో ఉండనివ్వండి.
04:52 అలా చేయడం, తల్లి మరియు బిడ్డల మధ్య బంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
04:58 అయితే, తల్లి ఏదైనా మందులు తీసుకుంటే దయచేసి వైద్యుడిని సంప్రదించండి.
05:05 కొన్నిసార్లు ప్రసవం తరువాత ఇలా జరుగవచ్చు,తల్లి ప్రసవించిన గదినుండి మరొకగదికి వెళ్ళవలసి రావచ్చు.
05:13 అలాంటి సందర్భాల్లో, తల్లిని వేరే గదికి మార్చిన తరువాత, తల్లిబిడ్డలను ఒకరి చర్మాన్ని ఒకరు తాకేలా చెయడానికి ముందుగా చర్చించినట్లుగా బిడ్డను వెంటనే తల్లి పొత్తికడుపుపై ఉంచండి.
05:29 ఇప్పుడు, సిజెరియన్ అయినప్పుడు బిడ్డకు తొలిసారి తల్లిపాలను ఎలా పట్టించాలి అనేదాని గురించి చర్చించుకుందాం..
05:35 అలా చేయడానికి, బిడ్డను తల్లి పొత్తికడుపుకు బదులుగా ఎదపై ఉంచాలి- శిశువు యొక్క కాళ్ళు తల్లి తల వైపు ఉండాలి.
05:47 బిడ్డ ఎద మరియు పొట్ట తల్లిభుజాలపై మరియు బిడ్డనోరు తల్లి స్తనాలపై ఉండాలి.
05:54 బిడ్డను తల్లిస్తనాలను ఎంతసేపు ఐతే అంతసేపు చీకేందుకు ఆపరేషన్ థియేటర్ లోనే ఉంచండి.
05:59 గుర్తుంచుకోండి, ప్రసవించిన వెంటనే, నవజాత శిశువుల సంరక్షణ కంటే తల్లీబిడ్డల చర్మాలు తాకించడం అనేది చాల ముఖ్యమైనది.
06:09 .మొదటిసారి స్తనపానం పూర్తయిన తర్వాత మాత్రమే, ప్రసవం తర్వాత చేయాల్సిన నవజాత స౦రక్షణ ప్రక్రియలను చేయాలి.
06:17 ఇప్పుదు మొదటిసారి స్తనపానం వల్ల నవజాత శిశువుకు కలిగే ప్రయోజనాలగురించి తెలుసుకుందాం.
06:23 Breast crawl అనేది కొలోస్ట్రుం అని పిలువబడే తల్లి యొక్క మొదటి పాలను బిడ్డ పొందేలా చేస్తుంది
06:29 ఇది పసుపురంగు కలిగిన మందమైన ద్రవం.
06:33 ప్రసవం తరువాత, తల్లి పాలిచ్చే ప్రతిసారి బిడ్డ తీసుకునే కొలొస్ట్రమ్ పరిమాణం క్రమంగా పెరుగుతుందని గమనించండి
06:43 బిడ్డ మొదటిరోజు 5 మిల్లిలీటర్లు త్రాగుతుంది.
06:47 రెండోవరోజు 10 మిల్లిలీటర్లు,
06:50 మూడొవరోజు 25 మిల్లిలీటర్లు,
06:53 నాల్గొవరోజు 40 మిల్లిలీటర్లు, ఐదవరోజు 55 మిల్లిలీటర్లు, ఇలా ప్రతిసారి స్తనపాన సమయంలో ప్రతి రొమ్ము నుండి పెరుగుతూ పోతుంది.
07:05 ఇది నవజాత శిశువుకు సరిపోతుంది.
07:09 అందువల్ల శిశువుకు కొలొస్ట్రమ్ కాకుండా వేరే ఆహారం ఏది ఇవ్వకూడదు.
07:15 ముర్రుపాలలోని కొలోస్ట్రం నవజాత శిశువుకి మొదటి వ్యాక్సినేషన్లా పరిగణించబడుతుంది. ఇది క్రిములతొ పొరాడే మాంసకృత్తులు కలిగిఉంటుంది; అందువల్ల శిశువులొ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
07:27 తల్లి ప్రసవించిన తరువాత ఇది బిడ్డకు శక్తిని ఇచ్చే మొదటి వనరు.
07:33 ముర్రుపాలు (కొలోస్ట్రం) రక్తంలొ గ్లూకొస్ తగ్గకుండా అపుతుంది.
07:37 ఇది శిశువు యొక్క ఇతర శరీర ప్రక్రియలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
07:42 ఇది ఆరోగ్యవంతంగా మెదడుపెరుగుదలకు సహాయపడుతుంది.
07:46 ఇది శిశువుకు సౌఖ్యంగా మొదటి మలవిసర్జనకు సహాయపడుతుంది.
07:50 Breast crawl వల్ల తల్లిచర్మం తాకటంవల్ల శిశువుకు కావల్సిన వెచ్చదనం లభిస్తుంది.
07:57 బిడ్డ తల్లి రొమ్మును ఎలా లోతుగా అందుకోవాలో స్వయంగా నేర్చుకుంటుంది.
08:04 Breast crawl వల్ల తల్లిలోని ఆరొగ్యకరమైన సూక్ష్మజీవులు శిశువుకి అందుతాయి.
08:08 ఈ సూక్ష్మజీవులు శిశువు పేగులొచేరి రొగాణువులతొ పోరాడుతాయి.
08:13 దీనివలన శిశువుయొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
08:18 Breast crawl తల్లిబిడ్డల మధ్య ప్రేమ మరియు భద్రతాభావాలు పెంచి తల్లిబిడ్దల బాంధవ్యం పెంపొందిస్తుంది.
08:29 బ్రెస్ట్ క్రాల్ నుండి తల్లులకు కూడా ప్రయోజనం ఉంటుంది.
08:34 శిశువు యొక్క కాలు కదలికలు తన తల్లి గర్భంపై ఒత్తిడి తెస్తాయి. ఈ పీడనం గర్భాశయ సంకోచానికి మరియు మావిని బయటకి పంపే౦దుకు సహాయపడుతుంది.
08:45 తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించడం అనేది తల్లి శరీరంలో ఆక్సిటోసిన్ని పెంచుతుంది.
08:51 ఆక్సిటోసిన్ పెరుగుదల అనేది మావిని తొలగించడానికి సహాయపడుతుంది.
08:56 అందువలన breast crawl అనేది తల్లిలో రక్తస్రావం తగ్గించి అనీమియా కలగనివ్వదు.
09:03 అనీమియా అంటె రక్తంలో ఎరుపు రక్తకణాలు తగ్గిపోవడం.
09:08 ఇది తల్లిలో అలసట మరియు బలహీనతకు దారితీస్తుంది.
09:13 అందువల్ల, స్తనపానం అనేది తల్లి మరియు ఆమె బిడ్డకు అత్యంత ప్రయోజనకరమైన సహజ ప్రక్రియ.
09:21 ఇంతటితో breast craw పై ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
09:26 ఈ టుటొరియల్లో మనం తెలుసుకున్న అంశాలు: బ్రెస్ట్ క్రాల్ అంటే ఏమిటి?
09:30 బ్రెస్ట్ క్రాల్ ప్రక్రియ మరియు బ్రెస్ట్ క్రాల్ ప్రాముఖ్యత.
09:37 ఈ టుటొరియల్ స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబె వారి సమర్పణ .
09:43 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ఎంఈఐసిటి, ఎంహెచ్అర్డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చింది.
09:49 ఈ లింకులో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
09:54 ఈ టుటోరియల్కు వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ కొంత భాగం నిధులను సమకూర్చింది.
10:01 ఈ టుటోరియల్ మా ఔర్ శిశు పోషన్ ప్రాజెక్టులో ఒక భాగం. ఈ డొమైన్ సమీక్షకులు డా. రూపల్ దలాల్, ఎండి (పీడియాట్రిక్స్).
10:12 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి, మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద తీసుకుంటున్నాను పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Debosmita, Simhadriudaya