Python-3.4.3/C3/Getting-started-with-files/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:43, 3 August 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Getting Started with files అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు ఒక ఫైల్ ను తెరవడం
00:13 ఫైల్ యొక్క కంటెంట్ లను ఒక లైన్ తర్వాత మరొక లైన్ గా చదవడం.
00:16 ఫైల్ యొక్క మొత్తం కంటెంట్‌ను ఒకేసారి చదవడం.
00:20 ఫైల్ యొక్క లైన్ లను జాబితాకు చేర్చడం మరియు ఫైల్ ను మూసివేయడం లను నేర్చుకుంటారు.
00:26 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:40 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

Lists మరియు for statement ల గురించి తెలిసి ఉండాలి.

00:48 ఒకవేళ లేకపోతే, ముందస్తు అవసరాలపై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:54 ఒక ఫైల్ ను చదవడం లేదా వ్రాయడం కొరకు, మనం open()అని పిలువబడే built in function ను ఉపయోగించవచ్చు.
01:01 Open() function అనేది file objectను తిరిగి ఇస్తుంది.

సింటాక్స్ ఇక్కడ చూపబడింది. Filename అనేది తెరవవలసిన ఫైల్ యొక్క పేరు.

01:12 Mode- ఇది ఫైల్ ఎలా తెరవబడుతుందో సూచిస్తుంది.
01:17 r అనేది Read mode కొరకు
01:20 w అనేది Write mode కొరకు
01:23 a అనేది Appending mode ను సూచిస్తుంది మరియు r+ అనేది రీడ్ మరియు రైట్ మోడ్ రెండింటి కొరకు.

మోడ్ ను పేర్కొనడం అనేది ఐచ్ఛికం.

01:32 టెక్స్ట్ ఎడిటర్‌లో మనం pendulum.txt అనే ఫైల్‌ను తెరుద్దాం.
01:38 ఈ ఫైల్ pendulum యొక్క length మరియు time అనే 2 డేటా కాలమ్స్ ను కలిగిఉంది.

మన ప్రదర్శన కోసం మనం ఈ టెక్స్ట్ ఫైల్‌ని ఉపయోగిస్తాము.

01:49 pendulum.txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క Code File link లో అందుబాటులో ఉంది.

దయచేసి దీన్ని Home directory లో డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.

02:00 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
02:07 ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
02:12 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

%pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

02:20 మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం.
02:23 Pendulum.txt ఫైల్‌ను తెరుద్దాం.
02:27 f is equal to open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum dot txt అని టైప్ చేయండి.
02:38 ఇక్కడ mode అనేది పేర్కొనబడలేదు. అప్రమేయంగా, ఇది r .
02:43 అది ఏమిటో చూడటానికి మనం టెర్మినల్ పై f అని టైప్ చేద్దాం.
02:48 file object f అనేది తెరుచుకున్న ఫైల్ యొక్క ఫైల్ పేరు మరియు మోడ్ లను చూపిస్తుంది.
02:57 r అంటే read only mode

మీరు చూస్తున్నట్లుగా, ఈ ఫైల్ అనేది read only mode లో తెరవబడింది.

03:06 ఇప్పుడు మనం మొత్తం ఫైల్ ను ఒకే వేరియబుల్ లోనికి చదవడం నేర్చుకుందాం.
03:11 Pend equal to f dot read తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేయండి.
03:18 ఫైల్ లోని అన్ని కంటెంట్ లను variable pend లోనికి చదవడానికి మనం read method ను ఉపయోగిస్తాము.

Enter నొక్కండి

03:27 read method ను ఉపయోగించడానికి మనము file object dot read method ను ఉపయోగిస్తాము.
03:34 ఇప్పుడు మనం, print పరన్తసిస్ ల లోపల pend అని టైప్ చేసి Enter నొక్కి pend ఏమి కలిగిఉందో చూద్దాం.
03:44 pend అనేది pendulum.txt ఫైల్ యొక్క మొత్తం డేటాని కలిగివుందని మనం చూడవచ్చు.
03:50 అందులో ఇంకా ఏమి ఉందో మరింత స్పష్టంగా చూడటానికి, pend అని టైప్ చేయండి.
03:56 అవుట్‌పుట్‌లో మనం newline characters ను కూడా చూడవచ్చు.
04:01 మనం variable pend ను ఫైల్‌లోని లైన్స్ యొక్క ఒక list గా చీల్చడం నేర్చుకుందాం.
04:07 ఫైల్ యొక్క డేటాను లైన్స్ యొక్క list గా చీల్చడానికి మనం method splitlines ను ఉపయోగిస్తాం
04:14 దీని కోసం మనం ఈ list ను pend_list అనే వేరియబుల్ లో నిల్వ చేయాలి.
04:21 pend_list equal to pend dot splitlines తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:33 Pend underscore list అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:37 మనం డేటాను లైన్స్ యొక్క list గా పొందాము.
04:41 pend_list అనేది \n వంటి newline characters లను కలిగిఉండదు.
04:47 ఇది ఎందుకంటే string pend అనేది newline charactersపై చీల్చబడింది కనుక.
04:53 f లోనికి తెరిచిన file ను మూసివేద్దాం.
04:57 f dot close తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:04 మనము తెరచిన ఏవైనా file objects ను వాటి పని పూర్తయిన తర్వాత మూసివేయడం అనేది ఒక మంచి ప్రోగ్రామింగ్ అభ్యాసం.
05:11 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.
05:17 Pendulum.txt ఫైల్‌ను f అనే file objectతో తిరిగి తెరవండి.
05:23 మనము ఇంతకుముందు ఆ ఫైల్ ను మూసివేసినట్లు గుర్తుచేసుకోండి.
05:27 మనం టెర్మినల్‌కు తిరిగి వెళ్దాం.
05:30 ఇప్పుడు లైన్ల వారీగా ఫైళ్ళను చదవడానికి ముందుకు వెళ్దాం.
05:34 ఫైల్‌ను మళ్లీ తెరవడానికి,

f is equal to open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum.txt అని టైప్ చేయండి.

05:47 ఇప్పుడు, ఫైల్ ను లైన్ తర్వాత లైన్ గా చదవడానికి, మనము for loop ను ఉపయోగించి file object పై iterate చేస్తాము.
05:54 మనం లైన్ల వారీగా ఫైల్ పై iterate చేసి ప్రతి ఒక్క లైన్ ను ప్రింట్ చేద్దాం

మనం terminal ను క్లియర్ చేద్దాం.

06:03 for line in f colon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

four spaces print inside parentheses line

06:16 ఇక్కడ, లైన్ అనేది ఒక loop variable, మరియు ఇది ఒక keyword కాదు.
06:21 మనము మరేదైనా వేరియబుల్ పేరును ఉపయోగించుకోవచ్చు, కానీ line అనేది తగినంత అర్ధవంతమైనదిగా అనిపిస్తుంది.

Enter ను రెండు సార్లు నొక్కండి.

06:30 ఈ లైన్ లను ప్రింట్ చేయడానికి బదులుగా మనం వాటిని line_list అనే ఒక list లోనికి చేర్చుదాం.
06:37 మొదట మనం ఒక line_list ను empty-list గా initialize చేస్తాము.
06:42 line underscore list is equal to తెరచిన మరియు మూసిన పరన్తసిస్ లను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:54 కోడ్ ను

for line in open పరన్తసిస్ ల లోపల కోట్స్ లోపల pendulum dot txt colon గా టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

07:10 four space line underscore list dot append పరన్తసిస్ ల లోపల line

Enter ను రెండు సార్లు నొక్కండి.

07:23 ఇక్కడ, for లూప్, pendulum.txt ఫైల్ ను లైన్లవారీగా చదువుతుంది.
07:29 append method అనేది line_list అనే లిస్ట్ కు లైన్ యొక్క ప్రతిదాన్ని

జోడిస్తుంది.

07:35 మనము ఎప్పటిలాగే f.close () ను ఉపయోగించి ఫైల్‌ను మూసివేసి దాన్ని తిరిగి తెరవగలము.
07:42 కానీ, ఈసారి, మనం file object f ను వదిలివేసి, ఆ ఫైల్ ను for statement లో నేరుగా తెరుద్దాం.
07:50 ఇది మనం దానిని తెరచిన ప్రతిసారి మనకు ఫైల్ ను మూసివేసే సమస్య లేకుండా చేస్తుంది.
07:55 మనం Line_list ఏమి కలిగిఉందో చూద్దాం.

line underscore list అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

08:05 line underscore list అనేది newline characters తో పాటుగా ఫైల్ లోని లైన్ల యొక్క ఒక జాబితా.
08:13 మనం కొన్ని string methods ను ఉపయోగించి లైన్స్ నుండి newline characters లను తీసివేయవచ్చు.
08:20 ఇది strings పై తదుపరి ట్యుటోరియల్‌లో కవర్ చేయబడుతుంది.
08:25 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.

ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , ఓపెన్ మరియు క్లోజ్ మెథడ్స్ ని ఉపయోగించి ఫైళ్ళను వరుసగా తెరవడం మరియు మూసివేయడం.

08:38 read method ను ఉపయోగించి, ఫైల్స్ లోని డేటాను మొత్తంగా చదవడం.
08:43 for loop ను ఉపయోగించి file object పై మళ్ళించడం ద్వారా డేటాను లైన్ తర్వాత లైన్ గా చదవడం.
08:50 for loop లోపల append method ను ఉపయోగించి ఫైల్ యొక్క లైన్ లను ఒక జాబితాకు చేర్చడం.
08:56 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
09:01 1.open function అనేది దేనిని తిరిగిఇస్తుంది

string, list, file object,function

09:07 2.function splitlines()అనేది ఏమి చేస్తుంది.
09:11 డేటానంతా strings గా ఒక లైన్ లో ప్రదర్శిస్తుంది
09:14 డేటాను లైన్ తర్వాత లైన్ లా స్ట్రింగ్స్ గా ప్రదర్శిస్తుంది
09:18 డేటాను లైన్ తర్వాత లైన్ లా ప్రదర్శిస్తుంది కానీ స్ట్రింగ్స్ గా కాదు.
09:24 మరియు సమాధానాలు,

1.open function అనేది ఒక file object ను తిరిగిఇస్తుంది

09:31 splitlines() అనేది డేటాను లైన్ తర్వాత లైన్ లా strings గా ప్రదర్శిస్తుంది.
09:37 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
09:41 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
09:46 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
09:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
10:01 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya