Linux-AWK/C2/Overview-of-Linux-AWK/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | నమస్కారం Overview of Linux AWK commands పై ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో మనం Linux AWK మరియు Linux AWK సిరీస్‌లో ఉన్న ట్యుటోరియల్స్ గురించి నేర్చుకుంటాము. |
00:17 | ఈ టుటోరియల్ను రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System ను వాడుతున్నాను. |
00:24 | AWK అనేది ఫైల్ నుండి డేటాను శోధించడానికి మరియు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
00:30 | మనం AWKను ఉపయోగించి డేటాను కూడా మార్చవచ్చు మరియు నివేదికలను రూపొందించవచ్చు. |
00:36 | ఇతర ప్రోగ్రామింగ్ భాషలలాగే AWK కూడా వేరియబుల్స్ మరియు ఆపరేటర్స్ ను కలిగిఉంది. |
00:41 | కండిశనల్ స్టేట్ మెంట్ లు లూప్ లు |
00:45 | సింగిల్ మరియు మల్టిడైమెన్శనల్ అర్రె లు
బిల్ట్ ఇన్ ఫంక్శన్ లు మరియు యూజర్ డిఫైండ్ ఫంక్శన్ లు ఉన్నయి. |
00:52 | సర్చ్ జరిగే సమయంలో- ఒక ఫైల్ అనేది రికార్డ్స్ యొక్క ఒక శ్రేణి వలె పరిగణించబడుతుంది. |
00:58 | ప్రతి లైన్ బహుళ ఫీల్డ్‌లతో ఒక సింగల్ రికార్డుగా పరిగణించబడుతుంది. |
01:04 | తర్వాత AWK, ఇచ్చిన నమూనాని శోధించి దానికి తగిన చర్య చేస్తుంది. |
01:11 | ఇప్పుడు, మనం ఈ సిరీస్‌లోని కొన్ని AWK ట్యుటోరియల్స్ ఒక్కొక్కదానికి క్లుప్తంగా వెళ్దాం. |
01:18 | Basics of awk ఈ ట్యుటోరియల్ AWK లో |
01:25 | ప్రాసెస్ చేసిన అవుట్‌పుట్‌ను ఎలా ప్రింట్ చేయాలి మరియు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఉపయోగించడం వంటి కొన్ని బేసిక్ ఆపరేశన్ లను వివరిస్తుంది. |
01:31 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
ఒక డీలిమిటర్ పదాలను ఒకదానికొకటి వేరు చేస్తుంది.
డీలిమిటర్ అనేది ఒకే తెల్లని స్థలం కూడా కావచ్చు. | |
01:43 | Variables and Operators ఇక్కడ మనం User defined variables, |
01:51 | వేరియబుల్ ఇనీశియలైజేశన్, ఆపరేటర్స్, |
01:55 | స్ట్రింగ్ కాన్ క్యాటెశన్ మరియు మ్యాచింగ్ ఆపరేటర
AWK లోని BEGIN మరియు END స్టెట్మెంట్ లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాం. |
02:03 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
02:05 | ఇక్కడ వేరియబుల్స్ స్మాల్ a మరియు స్మాల్ b అనేవి కాన్ క్యాటినెట్ అయి ఉంటాయి. కనుక, స్ట్రింగ్ కాంకాటనేషన్ ఆపరేటర్ అనేది కేవలం ఒక స్పేస్ మాత్రమే. |
02:16 | Built-In variables |
02:18 | ఈ ట్యుటోరియల్ AWK లోని ఈ క్రింది బిల్ట్ ఇన్ వేరియబుల్స్ |
02:24 | RS, FS
ORS, OFS NR, NF ARGV, ARGC వంటి వాటి గురించి వివరిస్తుంది. |
02:34 | ఈ ట్యుటోరియల్ AWK స్క్రిప్ట్ ని ఎలా రాయాలో కూడా నేర్పుతుంది. |
02:39 | ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఇక్కడ ఉంది. |
చివరిగా అమలు చేయబడిన కమాండ్ యొక్క సింగల్ కోట్స్ లోపల మనం ఏమి వ్రాసాము చూడండి. Prog1.awk ఫైల్ యొక్క కంటెంట్ సరిగ్గా అదే. | |
02:53 | Conditional statements
ఈ ట్యుటోరియల్‌లో, మనం awk లోని conditional స్టేట్మెంట్స్, If, else , else if లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
03:04 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
తర్వాత, if statement 6 వ ఫీల్డ్ యొక్క విలువ 8000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది. ఒకవేళ అది ఎస్ ఐతే రెండవ print statement అనేది అమలు చేయబడుతుంది. | |
03:21 | Loops - ఇక్కడ మనం AWK లో Conditional లూప్స్, for, while మరియు do-while loop వంటివాటి గురించి చర్చించాము. |
03:31 | AWK ను ఉపయోగించి సర్చ్ పాటర్న్స్ ను కూడా నేర్చుకుంటాం. |
03:35 | సింగల్ లేదా మల్టిపుల్ ఫైల్ ల నుండి డేటాను ప్రాసెస్ చేయడం. |
03:40 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
ఈ కోడ్ లో, ఇవి do loop లో ముందుగా అమలుపరచాల్సిన statements.
ఇది తనిఖీ చేయబడే condition. | |
03:53 | Basics of Single Dimensional Array ట్యుటోరియల్
array elements ను అస్సైన్ చేయడం |
03:59 | arrays యొక్క elements ను రెఫెర్ చేయడం
AWK arrays కి ఇండెక్సింగ్ చేయడం |
04:04 | associative array యొక్క ఉపయోగం |
04:07 | array లోని ఒక నిర్దిష్ట ఇండెక్స్ వద్ద ఏదైనా element ఉందా అని పరిశీలించడం లను వివరిస్తుంది. |
04:14 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
ఇక్కడ గమనించండి array elements క్రమం లో లేవు. నేను day four ని day three కంటే ముందే డిక్లేర్ చేశాను. awk arrays లో ఇండెక్స్ లు క్రమ పద్దతిలో ఉండాల్సిన అవసరం లేదు. | |
04:30 | సింగిల్ డైమెన్షనల్ అర్రే పై ఈ అధునాతన స్థాయి ట్యుటోరియల్
ఫైల్‌తో AWK arrayను ఉపయోగించడం. ఒక arrayయొక్క elementsను స్కాన్ చేయడం |
04:41 | for loop యొక్క కొత్త వేరియేశన్
ఒక అర్రె ఎలిమెంట్ ని తొలగించడం |
04:47 | మొత్తం అర్రె ని తొలగించడం |
04:50 | ARGC మరియు ARGV యొక్క విలువలు ను వివరిస్తుంది. |
04:54 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
index S02 ని కోట్స్ తో పాటూ తొలగించి delete statement నుండి స్కేర్ బ్రాకెట్స్ ని తొలగించండి. ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి. | |
05:08 | AWK లోని Multi Dimensional Array. |
05:12 | మల్టీపుల్ indices యొక్క ఒక క్రమం ద్వారా ఒక ఎలిమెంట్ ని గుర్తించడం. |
05:17 | ఒక సింగల్ string లోనికి కాన్ క్యాటినేట్ చేయడం. |
05:20 | AWK లో 2 by 2 multidimensional array ని క్రియేట్ చేయడం. |
05:24 | 2 బై 2 మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్ పోజ్ ని క్రియేట్ చేయడం. |
05:28 | multidimensional array ని స్కాన్ చేయడం |
05:31 | split function తో for loop ను కలపడం గురించి వివరిస్తుంది. |
05:35 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
మొదట ఈ awk script యొక్క action section ను చూడండి. ఇక్కడ మనం ఒక రో లోని ఫీల్డ్స్ యొక్క గరిష్ట సంఖ్యను లెక్కిస్తున్నాము. | |
05:48 | Built-in Functions.
దీనిలో మనం AWK built-in functions: Arithmetic functions |
05:57 | Random functions, String functions |
06:01 | Input మరియు Output functions మరియు Timestamp functions వంటివి నేర్చుకున్నాం. |
06:07 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
టర్మినల్ లో ఇక్కడ చూపినట్టుగా ఈ కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ రోజు యొక్క తేది మరియు సమయం టర్మినల్ పై ఔట్ పుట్ గా చూపించబడుతాయి. | |
06:23 | User defined functions ట్యుటోరియల్ లో మనం మన సొంత function ని స్రుశ్టించడం |
06:30 | Function call, Return statement మరియు Reverse function ల గురించి నేర్చుకున్నాం. |
06:37 | మనం ఈ ట్యుటోరియల్‌ని చూద్దాం. |
తర్వాత awk script లోపల మనం డాలర్ 2 ని ప్రింట్ చేసాము.ఇది రెండవ field అంటే పేరు.
తర్వాత మనం function changeit ని పారామీటర్ డాలర్ 6 తో కాల్ చేస్తాము. అది స్టైఫండ్. | |
06:54 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం. |
07:00 | ఈ ట్యుటోరియల్ లో మనం AWK గురించి నేర్చుకున్నాం మరియు ఈ సిరీస్‌లోని ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళాము. |
07:08 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
07:16 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. |
07:26 | మీకు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలుంటే దయచేసి మాకు వ్రాయండి. |
07:31 | మీకు సందహం కలిగిని నిమిశం మరియు క్షణాన్ని ఎంపికచేసి మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. |
07:38 | మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు. |
07:42 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకెన్ ట్యుటోరియల్ ఫోరం ఉంది. |
07:47 | దయచేసి అనుచితమైన, అసంధర్భమైన ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
07:52 | దీనివల్ల ఫోరం అస్థవ్యస్థం అవ్వకుండా ఉంటుంది. సంధర్భసహిత చర్చలు ఉంటే ఇవి మంచి సూచనలు గా ఉపయోగపడతాయి. |
08:01 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
08:12 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు |