Linux-AWK/C2/More-on-Single-Dimensional-Array-in-awk/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | awk లో More on single dimensional array పై ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టూటోరియల్ లో మనం నేర్చుకోబోయే అంశాలు : ఫైల్ తో awk array ని ఉపయోగించడం |
00:13 | array లోని element లను స్క్యాన్ చేయడం |
00:16 | డీలీట్ స్టేట్ మెంట్ |
00:18 | ARGV array మరియు ENVIRON array. |
00:22 | వీటిని మనం కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. |
00:25 | ఈ టుటోరియల్ రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System మరియు gedit text editor 3.20.1 లను వాడుతున్నాను. |
00:37 | మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:41 | ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి. |
00:48 | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
00:55 | లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి. |
01:00 | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ ట్రాక్ట్ చేయండి. |
01:10 | ఇంతకుముందు మనము awk arrays యొక్క కొన్ని అంశాలను కవర్ చేసాము. |
01:14 | మనం ఇప్పుడు ఒక ఫైల్ తో awk array ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. |
01:19 | మనము ఇంతకుముందు ఉపయోగించిన అదే awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము. |
01:25 | ఇక్కడ మొదటి ఫీల్డ్ రోల్ నంబర్ మరియు ఆరవ ఫీల్డ్ అనేది విద్యార్థి యొక్క స్టైఫండ్. |
01:32 | మొదట విద్యార్థులందరి కొరకు HRA ను లెక్కిద్దాం. |
01:36 | ఇక్కడ, HRA అనేది వారి స్టైపెండ్ మొత్తంలో 30%. |
01:41 | నేను ఇంతకుముందే కోడ్ ని రాసి దానికి calculate_hra.awk గా సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఆ ఫైల్ ని చూద్దాం. |
01:51 | BEGIN section లోపల, field separator, Pipe symbol తో ఇనీశియలైజ్ చేయబడింది. |
01:57 | తర్వాత, మనం action section లో array elements ని ఇనీశియలైజ్ చేస్తున్నాం. |
02:02 | ఈ section ఇన్ పుట్ ఫైల్ లోని ప్రతీ లైన్ కొరకు ఒకసారి అమలు అవుతుంది. |
02:08 | నేను HRA ని array వేరియబుల్ గా మరియు dollar one ని index గా డిక్లేర్ చేసాను. |
02:14 | ఇక్కడ dollar 1 అనేది మొదటి ఫీల్డ్ అయిన రోల్ నంబర్ ని సూచిస్తుంది. మరియు విలువ dollar 6 సున్నా పాయింట్ 3 తో గుణించబడుతుంది. ఇక్కడ డాలర్ సిక్స్ అనేది స్టైఫండ్ విలువ. |
02:27 | కనుక, index రోల్ నంబర్ వద్ద array HRA సంబంధిత HRA మొత్తాన్ని విలువగా కలిగి ఉంటుంది. |
02:35 | మనం ఈ అర్రె యొక్క అన్ని ఎలిమెంట్ లను ఎలా స్కాన్ చేయవచ్చు? |
02:39 | దానికోసం మీరు ఈ for loop యొక్క మరో రకాన్ని ఉపయోగించాలి. |
02:43 | ఈ లూప్ అర్రె లోని ప్రతీ ఇండెక్స్ కొరకు ఒకసారి స్టేట్మెంట్లను అమలు చేస్తుంది. |
02:48 | వేరియబుల్ var ఇండెక్స్ విలువలకు ఒకదానితరువాత ఇంకొకటి గా సెట్ చేయబడుతుంది. |
02:53 | ఈ కోడ్ END section లోపల వ్రాయబడింది. |
02:57 | ఇన్ పుట్ ఫైల్ యొక్క అన్ని లైన్ లను awk ప్రాసెస్ చేసిన తర్వాత ఈ section అమలు అవుతుంది. |
03:04 | ప్రతీ ఇండెక్స్ విలువ లేదా రోల్ నంబర్ కు ఒకదానితర్వాత మరోదానికి వేరియబుల్ i ఇనీశియలైజ్ చేయబడుతుంది. |
03:10 | for loop యొక్క ప్రతి పునరావృతంలో, ఒక నిర్దిష్ట రోల్ నంబర్ కొరకు HRA ముద్రించబడుతుంది. |
03:16 | టర్మినల్ కి మారి ఫైల్ ని అమలు చేయండి.
Ctrl, Alt మరియు T లను నొక్కి టర్మినల్ ని తెరవండి. |
03:24 | మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి. |
03:31 | ఇప్పుడు awk space hyphen small f space calculate_hra.awk space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:45 | అవుట్పుట్ విద్యార్థులందరి కొరకు రోల్ నంబర్ మరియు HRA ని చూపిస్తుంది. |
03:50 | ఇప్పుడు నేను రోల్ నంబర్ S02 తో ఉన్న విద్యార్థి కొరకు రికార్డును తొలగించాలనుకుంటున్నాను. |
03:56 | కనుక, మనం index S02 వద్ద array element ని తొలగించాలి. |
04:01 | దీన్ని Calclate_hra.awk కోడ్ ను ఉపయోగించి నన్ను చేయనివ్వండి |
04:06 | for loop కి ముందు, ఎంటర్ నొక్కి ఈ కోడ్ delete space hra square brackets లోపల double quotes లోపల S02 ని టైప్ చేయండి. |
04:19 | ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి. |
04:23 | నేను టర్మినల్ ను క్లియర్ చేస్తాను. |
04:26 | మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కి ఎంటర్ నొక్కండి. |
04:33 | రోల్ నంబర్ S02 ఉన్న విద్యార్థి రెకార్డ్ ఔట్ పుట్ లో ప్రింట్ అవలేదు. |
04:39 | కనుక, ఏ array element ని అయినా delete command ను ఉపయోగించి తొలగించవచ్చు. |
04:44 | మీరు array పేరు ని index తోపాటూ పేర్కొనాలి. |
04:48 | ఒకవేళ నేను పూర్తి array ని తొలగించాంచాలంటే?
దీనిని తొలగించాల్సిన array పేరు ని delete statement లో పేర్కోనడం ద్వారా చేయవచ్చు. |
04:56 | దీన్ని ప్రయత్నించడానికి కోడ్ కి మారదాం. |
04:59 | index S02 ని కోట్స్ తో పాటూ తొలగించి delete statement నుండి స్కేర్ బ్రాకెట్స్ ని తొలగించండి. |
05:07 | ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి. |
05:10 | టర్మినల్ ను క్లియర్ చేసి మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కండి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
05:19 | చూడండి, మనము ఎటువంటి అవుట్పుట్ పొందడం లేదు. పూర్తి array తొలగించబడింది. |
05:25 | మునుపటి టుటోరియల్ awk built-in variables లో ARGC implies the number of command line arguments అని మనం చెప్పామనిగుర్తుకు తెచ్చుకో౦డి. |
05:36 | ARGV అనేది command line arguments ని నిల్వ చేస్తుంది.
మనం వాటి విలువలను ఎలా చూపించగలం? మనం చూద్దాం. |
05:45 | నేను ఇప్పటికే argc_argv.awk లో కోడ్ ని రాసిఉంచాను. ఇప్పుడు కంటెంట్ లను పరిశీలిద్దాం. |
05:53 | కోడ్ awk BEGIN section లోపల రాయబడిఉంది. |
05:57 | మొదట మనం ARGC విలువ అయిన arguments యొక్క సంఖ్య ను ప్రింట్ చేస్తున్నాం. |
06:03 | తర్వాత, for loop ఉపయోగించి మనం i యొక్క విలువను 0 నుండి ARGC-1 వరకు లూపింగ్ చేస్తున్నాం. |
06:11 | ఇంకా మనం ARGV ని index i వద్ద ప్రింట్ చేస్తున్నాం.టర్మినల్ కు మారి ఫైల్ ను అమలు చేయండి. |
06:19 | ఇప్పుడు టర్మినల్ పై awk space hyphen small f space argc underscore argv dot awk space one space two space three అని టైప్ చేయండి. |
06:35 | ఇక్కడ one two three అనేవి command line argument లు. కమాండ్ ని అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి. |
06:43 | మనకు arguments ల సంఖ్య 4 గా వచ్చింది. కానీ మనం కేవలం 3 arguments మాత్రమే సరఫరా చేశామని గుర్తుంచుకోండి. |
06:50 | మనం వ్యక్తిగత arguments ని చూద్దాం. index 0 వద్ద మొదటి argument లేదా argv, అనేది వాస్తవానికి awk ఇది కమాండ్ పేరు. |
07:02 | తర్వాతమనకు, మనం కమాండ్ లైన్ లో పొందుపరచిన మూడు arguments ఉన్నాయి. |
07:07 | అందువల్ల ARGC విలువ ఎల్లప్పుడూ మనం ఇచ్చిన కమాండ్ లైన్ ల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువగా ఉంటుంది. |
07:16 | ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. Built-in variable ENVIRON అనేది environment variables యొక్క associative array. |
07:24 | array element indices అనేవి environment variable పేర్లు. array element విలువలు అనేవి నిర్దిష్ట ఎన్విరాన్ మెంట్ వేరియబుల్స్ యొక్క విలువలు. |
07:35 | మనం వేర్వేరు environment variables యొక్క విలువలను ఎలా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. |
07:40 | ముందుగా, మనం మన username ని ప్రింట్ చేద్దాం. |
07:43 | మనం environment variable USER యొక్క విలువను ప్రింట్ చేయాలి. |
07:48 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద కింది వాటిని టైప్ చేయండి. |
07:53 | ఎంటర్ నొక్కండి. |
07:55 | ఔట్పుట్ లాగిన్ అయిన యూజర్ యొక్క పేరు ను చూపిస్తుంది. |
08:00 | ఇంతటితో ఈ టుటోరియల్ యొక్క చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం. |
08:05 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న విశయాలు: awk array ని ఫైల్ తోపాటూ ఉపయొగించడం. |
08:11 | array యొక్క ఎలిమెంట్ లను స్కాన్ చేయడం. |
08:14 | డిలీట్ స్టేట్ మెంట్, ARGV array మరియు ENVIRON array |
08:20 | ఒక అస్సైన్ మెంట్- ఉత్తీర్ణులైన విద్యార్థుల కొరకు కొన్నిఅలవెన్సులను లెక్కించండి. |
08:25 | పేపర్ ప్రెజెంటేశన్ అల్లొవెన్స్ ఇది స్టైఫండ్ లో 80%. |
08:30 | పర్ ఫామెన్స్ ఇంసెంటివ్ ఇది స్టైఫండ్‌లో 20%. |
08:35 | అల్లొవెన్స్ లను రెండు వేర్వేరు arrays లో నిల్వ చేయండి. |
08:38 | ప్రతీ అల్లొవెన్స్ కీ కావలసిన మొత్తం సొమ్ము మరియు దాని సరాసరిని ప్రింట్ చేయండి. |
08:43 | awk ప్రోగ్రాం నుండి environment variable PATH యొక్క విలువను ప్రింట్ చేయండి. |
08:48 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
08:56 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ మరియు ఎన్ బి ఎస్ పి టీం, స్పొకన్ టుటోరియల్స్ సాయంతో వర్క్ శాప్ లను నిర్వహిస్తాయి.
ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:05 | మరింత సమాచారం కోసం మాకు రాయండి. |
09:08 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
09:12 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
09:24 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు |