Linux-AWK/C2/Basics-of-Single-Dimensional-Array-in-awk/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:56, 15 July 2019 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 awk లోని Basics of single dimensional array అనే ఈ స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటొరియల్ లో మనం awk లో Arrays గురించి
00:12 array elements ని అసైన్ చేయడం.
00:15 ఇది ఇతర ప్రొగ్రామింగ్ భాశల లోని arrays తో ఎలా భిన్నంగా ఉంటుంది మరియు arrays యొక్క elements ను రెఫెర్ చేయడం గురించి నేర్చుకుంటాము.
00:23 మనం వీటిని కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం.
00:26 ఈ ట్యుటొరియల్ ని రెకార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం ను మరియు gedit text editor 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
00:38 మీరు మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయిన ఉపయోగించవచ్చు.
00:42 ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్ పై అవగాహన ఉండాలి.
00:49 మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాశ C లేదా C++ లాంటి వాటిపై ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:56 లేదంటే, తత్సంభందిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.
01:02 ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్సట్రాక్ట్ చేయండి.
01:11 awk లో array అంటే ఏమిటి?

awk సంబంధిత మూలకాలను నిల్వ చేయడానికి arrays కు మద్దతు ఇస్తుంది.

01:18 Elements అనేవి నంబర్ లేదా స్ట్రింగ్ కావచ్చు.
01:21 awk లో Arrays అనేవి associative.
01:24 అంటే ప్రతి array element ఒక index-value pair అని అర్థం.
01:29 ఇది వేరే ప్రోగ్రామింగ్ భాశలలోని arrays లాగానే కనిపిస్తుంటుంది.
01:33 కానీ ఇక్కడ కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి.

మనం అర్రే ని వాడకముండు దానిని డీక్లేర్ కి చేసే అవసరం లేదు.

01:41 అలాగే array లో ఎన్ని elements (అంశాలు) ఉన్నాయో పేర్కొనవలసిన అవసరం లేదు.
01:47 ప్రోగ్రామింగ్ భాశలలోని array index సాధారణంగా ఒక ధన పూర్ణసంఖ్య గా ఉంటుంది.
01:52 మామూలుగా ఇండెక్స్ 0 నుండి మొదలై తర్వాత 1, తర్వాత 2 అలా ముందుకు కొనసాగుతుంది.
01:58 కానీ awk లో ఇండెక్స్ ఏదైనా సంఖ్య లేదా ఒక స్ట్రింగ్ కావచ్చు.
02:03 ఇది awk లో array element ని కేటాయించే సింటాక్స్. Array name ఏదైనా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ పేరు కావచ్చు.
02:11 ఇక్కడ ఇండెక్స్, పూర్ణసంఖ్య లేదా స్త్రింగ్ కావచ్చు.
02:16 స్త్రింగ్స్ ని డబల్ కోట్ లోనే రాయాలి. అవి ఇండెక్స్ పేరు లేదా విలువ ఏదైనా కావచ్చు.
02:23 దీనిని ఒక ఉదాహరణ తో అర్థం చేసుకుందాం.
02:27 నేను ఇంతకుముందే కోడ్ ని రాసి దానిని array_intro.awk గా సేవ్ చేసాను.
02:34 ఈ ఫైల్ ఈ ప్లేయర్ కింద ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉంది. దానిని డౌన్ లోడ్ చేసుకోని వాడండి.
02:41 ఇక్కడ నేను వారం లోని రోజులను ఉదాహరణగా తీసుకుని దానిని BEGIN section లో రాశాను.
02:48 ఇక్కడ అర్రె పేరు day.
02:52 నేను ఇండెక్స్ 1 గా ఇంకా విలువ Sunday గా ఉంచాను.
02:57 ఈ array element లో, నేను string ని ఒక index గా ఉపయోగించాను. కాబట్టి index first, విలువ Sunday.
03:06 మొత్తం అర్రె ఇలాగే నిర్మించబడింది.
03:10 ఇక్కడ గమనించండి array elements క్రమం లో లేవు. నేను day four ని day three కంటే ముందే డిక్లేర్ చేశాను.
03:18 awk arrays లో ఇండెక్స్ లు క్రమ పద్దతిలో ఉండాల్సిన అవసరం లేదు.
03:23 associative array వల్ల లాభం ఏమిటంటే కొత్త జతలనుఏ సమయం లోనైనా చేర్చవచ్చు.
03:29 ఇప్పుడు నేను day 6 ని array లో జోడిస్తాను.
03:33 కర్సర్ ని చివరి వరుసలోని చివరిలో ఉంచి ఎంటర్ నొక్కండి. ఆపై క్రింది వాటిని టైపు చేయండి.
03:42 ఫైల్ ని సేవ్ చేయండి.
03:44 మనం అర్రె ని డిక్లేర్ (ప్రకటించాం)చేశాము. కానీ మనం array element ని ఎలా సిఫార్సు చేస్తాము?
03:49 ఒక నిర్దిష్ట ఇండెక్స్ వద్ద element ను సూచించడానికి arrayname మరియు ఇండెక్స్ ని చదరపు బ్రాకెట్లలో వ్రాయండి. దీని ప్రయత్నిద్దాం.
03:58 మరోసారి కోడ్ కి మారండి.
04:01 కర్సర్ ని క్లొజింగ్ కర్లీ బ్రెస్ దగ్గర ఉంచండి.
04:05 ఎంటర్ నొక్కి print space day చదరపు బ్రాకెట్ లలో 6 అని టైప్ చేయండి.
04:13 కోడ్ ని సేవ్ చేయండి.
04:15 Ctrl, Alt మరియు T కీలను నొక్కిటర్మినల్ ను తెరవండి.
04:20 మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి.
04:27 ఇప్పుడు awk space hyphen small f space array_intro.awk అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:38 మనకు ఔట్ పుట్ Fridayగా వచ్చింది చూడండి.
04:42 తర్వాత మనం అర్రెలో ఏదైనా element ఒక నిర్దిశ్టమైన ఇండెక్స్ లో ఉందా అని పరిశీలిద్దాం.
04:48 దానికోసం మనం in operatorని ఉపయోగించాలి. దీనిని ఒక ఉదాహరణ తో వివరిస్తాను.
04:55 ఎడిటర్ విండోలోని కోడ్ కు మారండి.
04:59 కర్సర్ ని print statement చివరన ఉంచి ఎంటర్ నొక్కండి. తర్వాత ఇలా టైప్ చేయండి.
05:09 కోడ్ ని సేవ్ చేయండి.
05:11 ఇప్పుడు నేను రెండు if కండిషన్ లను చేర్చాను.
05:15 మొదటి if కండిశన్ ,index two అనేది ప్రస్తుతం day లో ఉందా లేదా అని పరిశీలిస్తుంది.
05:21 ఒకవేళ అది అవును ఐతే అప్పుడు తత్సంభంద print statement అమలు అవుతుంది.
05:26 తర్వాత రెండవ condition (శరతు) అనేది, day లో index seven ఉందా లేదా అని పరిశీలిస్తుంది.

ఇది ట్రూ అయితే ప్రింట్ స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.

05:35 మనం చూస్తున్నట్టుగా index two అనేది array లొ ఉంది కానీ seven లేదు.

అవుట్ ఫుట్ ని ధృవీకరించడానికి ఈ ఫైల్ను అమలు చేద్దాం.

05:44 టర్మినల్ కు మారండి. అప్ యారో కీ ని నొక్కి ముందుగా అమలుచేసిన కమాండ్ కి వెళ్ళండి.
05:51 అమలుచేయడానికి ఎంటర్ నొక్కండి.
05:54 మనం అనుకున్నట్టుగానే ఔట్ పుట్ వచ్చింది.
05:57 మనం కోడ్ లో మరికొన్ని మార్పులను చేద్దాం. కోడ్ ని ఇక్కడ చూపినవిధంగా నవీకరించండి.
06:04 day కండిషన్ లో 7 కింద నేను మరొక కండిషన్ ను చేర్చాను.
06:09 ఇది index seven విలువ null అవునా కాదా అని పరిశీలిస్తుంది.
06:14 ఒకవేళ ట్రూ ఐతే అది Index 7 is not null అని ముద్రిస్తుంది.
06:18 మనకు 7 తో ఇండెక్స్ లేదు అని ఇదివరకే తెలుసు. కనుక అది దేనిని ముద్రించదు.
06:24 తర్వాత మనం day లోని condition 7 యొక్క print statement ని మార్చాము.
06:30 కోడ్ ని సేవ్ చేయండి. మనం కోడ్ ని అమలు చేస్తే ఏమవుతుందో చూద్దాం.
06:35 టర్మినల్ కు మారండి. అప్ యారో కీ ని నొక్కి ముందుగా అమలుచేసిన కమాండ్ కు వెళ్ళండి.
06:43 అమలుచేయడానికి ఎంటర్ నొక్కండి.
06:46 మనకు అనుకోని ఔట్ పుట్ వచ్చింది.
06:49 Index 7 is present after null comparison అనే వాక్యం ముద్రించబడింది. ఇది ఎలా సాధ్యం?
06:57 మనం day[7] not equal to null అని రాసినప్పుడు, మనం index 7 వద్ద element ని అక్కెస్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
07:04 ఈ యాక్సెస్ తనకుతానే మొదట ఇండెక్స్ 7 వద్ద ఒక ఎలిమెంట్ ని సృష్టిస్తుంది మరియు దానిని శూన్య విలువతో ప్రారంభిస్తుంది.
07:12 తరువాత, మనం వాస్తవానికి ఏదైనా ఎలిమెంట్ index 7 వద్ద ఉందో లేదో తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
07:18 null element ముందే సృష్టిటించబడింది, కాబట్టి అది Index 7 is present after null comparison అని చూపిస్తుంది.
07:26 కాబట్టి గుర్తుంచుకొండి day at index 7 not equal to null అనేది ఒక ఎలిమెంట్ యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి సరైన పధ్ధతి కాదు.
07:34 ఇది index 7 వద్ద ఒక null element ని సృష్టిస్తుంది.
07:38 దానికి బదులు, మనం in operator ను ఉపయోగించాలి.
07:41 అది అర్రె లో ఏ అదనపు ఎలిమెంట్ నూ సృష్టిటించదు. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:50 ఈ ట్యుటొరియల్ లో మనం awk లో Arrays గురించి మరియు
07:54 array elements ని ఎలా అసైన్ చేయాలో తెలుసుకున్నాం.
07:56 ఇది ఇతర ప్రోగ్రామింగ్ భాశల లోని arrays కంటే ఎంత భిన్నం గా ఉంది.
08:00 array యొక్క elements ని సిఫార్సు చేయడం కూడా తెలుసుకున్నాము.
08:03 ఒక అస్సైన్మెంట్ గా -array flowerColor ని నిర్వచించండి.
08:07 ఇక్కడ ఇండెక్స్ అనేది పూల పేర్లు.
08:10 విలువ అనేది పువ్వుల యొక్క సంబంధిత రంగు అవుతుంది.
08:14 ఏవైనా ఐదు పువ్వుల పేర్లను దానిలో చేర్చండి.
08:18 నాల్గవ పువ్వు యొక్క రంగును ముద్రించండి. ఆ array లో Lotus (తామరపువ్వు) ఉందా అని పరిశీలించండి.
08:25 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
08:33 స్పొకన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:42 మరింత సమాచారం కోసం మాకు రాయండి.
08:46 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
08:50 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
09:01 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya