Linux-AWK/C2/More-on-Single-Dimensional-Array-in-awk/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:51, 7 July 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time
Narration
00:01 awk లొ More on single dimensional array పై ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టూటోరియల్ లో మనం నేర్చుకోబోయే అంశాలు : ఫైల్ తో awk array ని ఉపయోగించడం
00:13 array లోని element లను స్క్యాన్ చేయడం
00:16 డీలీట్ స్టేట్ మెంట్
00:18 ARGV array మరియు ENVIRON array
00:22 వీటిని మనం కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00:25 ఈ టుటోరియల్ రికార్డ్ చేయడం కొరకు నేను Ubuntu Linux 16.04 Operating System మరియు gedit text editor 3.20.1 లను వాడుతున్నాను.
00:37 మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్నయినా మీరు ఉపయోగించవచ్చు.
00:41 ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి.
00:48 మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.
00:55 లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.
01:00 ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్నCode Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ ట్రాక్ట్ చేయండి.
01:10 ఇంతకుముందు మనము awk arrays యొక్క కొన్ని అంశాలను కవర్ చేసాము.
01:14 మనం ఇప్పుడు ఒక ఫైల్ తో awk array ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.
01:19 మనము ఇంతకుముందు ఉపయోగించిన అదే awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము
01:25 ఇక్కడ మొదటి ఫీల్డ్ రోల్ నంబర్ మరియు ఆరవ ఫీల్డ్ అనేది విద్యార్థి యొక్క స్టైఫండ్.
01:32 మొదట విద్యార్థులందరి కొరకు HRA ను లెక్కిద్దాం.
01:36 ఇక్కడ, HRA అనేది వారి స్టైపెండ్ మొత్తంలో 30%.
01:41 నేను ఇంతకుముందే కోడ్ ని రాసి దానిని calculate_hra.awk గా సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఆ ఫైల్ ని చూద్దాం.
01:51 BEGIN section లోపల, field separator,Pipe symbol తో ఇనీశియలైజ్ చేయబడింది.
01:57 తర్వాత, మనం action section లో array elements ని ఇనీశియలైజ్ చేస్తున్నాం.
02:02 ఈ section ఇన్ పుట్ ఫైల్ లోని ప్రతీ లైన్ కొరకు ఒకసారి అమలు అవుతుంది.
02:08 నేను HRA ని array వేరియబుల్ గా మరియు dollar one ని index గా డిక్లేర్ చేసాను.
02:14 ఇక్కడ dollar 1 అనేది మొదటి ఫీల్డ్ అయిన రోల్ నంబర్ ని సూచిస్తుంది. మరియు విలువ dollar 6 సున్నా పాయింట్ 3 తో గుణించబడుతుంది. ఇక్కడ డాలర్ సిక్స్ అనేది స్టైఫండ్ విలువ.
02:27 కనుక ,index రోల్ నంబర్ వద్ద array HRA సంబంధిత HRA మొత్తాన్ని విలువగా కలిగి ఉంటుంది.
02:35 మనం ఈ అర్రె యొక్క అన్ని ఎలిమెంట్ లను ఎలా స్కాన్ చేయవచ్చు?
02:39 దానికోసం మీరు ఈ for loop యొక్క మరో రకాన్ని ఉపయోగించాలి.
02:43 ఈ లూప్ అర్రె లోని ప్రతీ ఇండెక్స్ కొరకు ఒకసారి స్టేట్మెంట్లను అమలు చేస్తుంది.
02:48 వేరియబుల్ var ను ఇండెక్స్ విలువలకు ఒకదానితరువాత ఇంకొకటి గా సెట్ చేయబడుతుంది.
02:53 ఈ కోడ్ END section లోపల వ్రాయబడింది.
02:57 ఇన్ పుట్ ఫైల్ యొక్క అన్ని లైన్ లను awk ప్రాసెస్ చేసిన తర్వాత ఈ section అమలు అవుతుంది.
03:04 ప్రతీ ఇండెక్స్ విలువ లేదా రోల్ నంబర్ కు ఒకదానితర్వాత మరోదానికి వేరియబుల్ i ని ఇనీశియలైజ్ చేయబడుతుంది.
03:10 for loop యొక్క ప్రతి పునరావృతంలో, ఒక నిర్దిష్ట రోల్ నంబర్ కొరకు HRA ముద్రించబడుతుంది.
03:16 టర్మినల్ కి మారి ఫైల్ ని అమలు చేయండి.

Ctrl, Alt మరియు T లను నొక్కి టర్మినల్ ని తెరవండి.

03:24 మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి.
03:31 ఇప్పుడు awk space hyphen small f space calculate_hra.awk space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:45 అవుట్పుట్ విద్యార్థులందరి కొరకు రోల్ నంబర్ మరియు HRA ని చూపిస్తుంది.
03:50 ఇప్పుడు నేను రోల్ నంబర్ S02 తో ఉన్న విద్యార్థి కొరకు రికార్డును తొలగించాలనుకుంటున్నాను.
03:56 కనుక, మనం index S02 వద్ద array element ని తొలగించాలి.
04:01 దీన్నిCalclate_hra.awk కోడ్ ను ఉపయోగించి నన్ను చేయనివ్వండి
04:06 for loop కి ముందు, ఎంటర్ నొక్కి ఈ కోడ్ delete space hra square brackets లోపల double quotes లోపల S02 ని టైప్ చేయండి.
04:19 ఫైల్ సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
04:23 నేను టర్మినల్ ను క్లియర్ చేస్తాను.
04:26 మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కి ఎంటర్ నొక్కండి.
04:33 రోల్ నంబర్ S02 ఉన్న విద్యార్థి రెకార్డ్ ఔట్ పుట్ లో ప్రింట్ అవలేదు.
04:39 కనుక,ఏ array element ని అయినా delete command ను ఉపయోగించి తొలగించవచ్చు.
04:44 మీరు array పేరు ని index తోపాటూ పేర్కోవాలి.
04:48 ఒకవేళ నేను పూర్తి array ని తొలగించాంచాలంటే?

దీనిని తొలగించాల్సిన array పేరు ని delete statement లో పేర్కోనడం ద్వారా చేయవచ్చు.

04:56 దీన్ని ప్రయత్నించడానికి కోడ్ కి మారదాం.
04:59 index S02 ని కోట్స్ తో పాటూ తొలగించి delete statement నుండి స్కేర్ బ్రాకెట్స్ ని తొలగించండి.
05:07 ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
05:10 టర్మినల్ ను క్లియర్ చేసి మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కండి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
05:19 చూడండి, మనము ఎటువంటి అవుట్పుట్ పొందడం లేదు. పూర్తి array తొలగించబడింది.
05:25 మునుపటి టుటోరియల్ awk built-in variables లో ARGC implies the number of command line arguments అని మనం చెప్పామనిగుర్తుకుతెచ్చుకో౦డి.
05:36 ARGV అనేది command line arguments ని నిల్వ చేస్తుంది.

మనం వాటి విలువలను ఎలా చూపించగలం? మనం చూద్దాం

05:45 నేను ఇప్పటికే argc_argv.awk లో కోడ్ ని రాసిఉంచాను.ఇప్పుడు కంటెంట్ లను పరిశీలిద్దాం.
05:53 కోడ్ awk BEGIN section లోపల రాయబడిఉంది.
05:57 మొదట మనం ARGV విలువ అయిన arguments యొక్క సంఖ్య ను ప్రింట్ చేస్తున్నాం.
06:03 తర్వాత, for loop ఉపయోగించి మనం i యొక్క విలువకు 0 నుండి -1 వరకు లూపింగ్ చేస్తున్నాం.
06:11 ఇంకా మనం ARGV ని index I వద్ద ప్రింట్ చేస్తున్నాం.టర్మినల్ కు మారి ఫైల్ ను అమలు చేయండి.
06:19 ఇప్పుడు టర్మినల్ పై awk space hyphen small f space argc underscore argv dot awk space one space two space three అని టైప్ చేయండి.
06:35 ఇక్కడone two three అనేవి command line argument లు.కమాండ్ ని అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి.
06:43 మనకు arguments ల సంఖ్య 4 గా వచ్చింది.కానీ మనం కేవలం 3 arguments మాత్రమే సరఫరా చేశామని గుర్తుంచుకోండి.
06:50 మనం వ్యక్తిగత arguments ని చూద్దాం. index 0 వద్ద మొదటి argument లేదా argv, అనేది వాస్తవానికి awk కమాండ్ పేరు..
07:02 తర్వాతమనకు, మనం కమాండ్ లైన్ లో పొందుపరచిన మూడు arguments ఉన్నాయి.
07:07 అందువల్ల ARGC విలువ ఎల్లప్పుడూ మనం ఇచ్చిన కమాండ్ లైన్ ల సంఖ్య కన్నా ఒకటి ఎక్కువగా ఉంటుంది.
07:16 ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. Built-in variable ENVIRON అనేది environment variables యొక్క associative array.
07:24 array element indices అనేవి environment variable పేర్లు. array element విలువలు అనేవి నిర్దిష్ట ఎన్విరాన్ మెంట్ వేరియబుల్స్ యొక్క విలువలు.
07:35 మనం వేర్వేరు environment variables యొక్క విలువలను ఎలా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
07:40 ముందుగా, మనం మన username ని ప్రింట్ చేద్దాం.
07:43 మనం environment variable USER యొక్క విలువను ప్రింట్ చేయాలి.
07:48 కమాండ్ ప్రాంప్ట్ వద్ద కింది వాటిని టైప్ చేయండి.
07:53 ఎంటర్ నొక్కండి.
07:55 ఔట్పుట్ లాగిన్ అయిన యూజర్ యొక్క పేరు ను చూపిస్తుంది.
08:00 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం.
08:05 ఈ టుటోరియల్ లొ మనం నేర్చుకున్న విశయాలు: awk array ని ఫైల్ తోపాటూ ఉపయొగించడం.
08:11 array యొక్క ఎలిమెంట్ లను స్కాన్ చేయండం.
08:14 డిలీట్ స్టేట్ మెంట్,ARGV array మరియు ENVIRON array
08:20 ఒక అస్సైన్ మెంట్‌‌- ఉత్తీర్ణులైన విద్యార్థుల కొరకు కొన్నిఅలవెన్సులను లెక్కించండి.
08:25 పేపర్ ప్రెజెంటేశన్ అల్లొవెన్స్ ఇది స్టైఫండ్ లో80%.
08:30 పర్ ఫామెన్స్ ఇంసెంటివ్ ఇది స్టైఫండ్‌లో 20%.
08:35 అల్లొవెన్స్ లను రెండు వేర్వేరు arrays లో నిల్వ చేయండి.
08:38 ప్రతీ అల్లొవెన్స్ కీ కావలసిన మొత్తం సొమ్ము మరియు దాని సరాసరిని ప్రింట్ చేయండి.
08:43 awk ప్రోగ్రాం నుండి environment variable PATH యొక్క విలువను ప్రింట్ చేయండి.
08:48 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
08:56 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ మరియు ఎన్ బి ఎస్ పి టీం, స్పొకన్ టుటోరియల్స్ సాయంతో వర్క్ శాప్ లను నిర్వహిస్తాయి.

ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

09:05 మరింత సమాచారం కోసం మాకు రాయండి.
09:08 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
09:12 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
09:24 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya