Python-3.4.3/C2/Subplots/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:17, 14 June 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Subplots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు subplots మధ్య సృష్టించడం మరియు మారడం చేయగలుగుతారు
00:14 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:29 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం Plots ను ఇంటరాక్టీవ్గా ఉపయోగించడం ఒక plot ను ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.

00:48 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

01:01 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:10 రెండు plots ను పోల్చడానికి మనము ఒకే plotting area లో plots ను గీస్తాము.
01:15 ఇప్పుడు మనం ఒకే plotting area లో ఒక cosine plot మరియు ఒక exponential curve రెండు plots ను సృష్టిద్దాం.
01:24 x equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 50 కామా 500 అని టైప్ చేసి Enter నొక్కండి.

Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x)

01:45 y equals to linspace బ్రాకెట్స్ లోపల 0 కామా 5 కామా 100

Plot బ్రాకెట్స్ లోపల y కామా y square అని టైప్ చేసి Enter నొక్కండి.

02:04 ఇక్కడ వేర్వేరు సాధారణ axes ను కలిగిన రెండు plots ఉన్నాయి. కనుక మనం overlaid plots ను గీయలేము.
02:13 అటువంటి సందర్భాల్లో మనము subplots ను గీయవచ్చు.
02:17 దీనిని సాధించడానికి మనము subplot command ను వాడతాము.

clf()

Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా 1 అని టైప్ చేయండి.

02:33 మనము మొదటి subplot ను చూడవచ్చు. Subplot command మూడు argumentsను తీసుకుంటుంది.
02:40 మొదటి argument అనేది subplots యొక్క rows యొక్క సంఖ్య. అది తప్పకుండా సృష్టించాలి.

ఇక్కడ మొదటి argument 2. దానిని plot ను అడ్డంగా విభజించటానికి వాడుతాము.

02:53 రెండవ argument అనేది subplots యొక్క columns యొక్క సంఖ్య. అది తప్పకుండా సృష్టించాలి.

ఇక్కడ రెండవ argument అనేది 1. దాని వలన plot ను నిలువుగా విభజించబడదు.

03:07 చివరి argument అనేది subplot కొరకు serial number ను పేర్కొంటుంది.

ఇక్కడ మనము argument గా 1 ని పంపించాము, అది అప్పర్ subplot ను సృష్టిస్తుంది.

03:19 ఒకవేళ మనము subplot command గా

Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా2 ను అమలుచేస్తే, lower subplot సృష్టించబడుతుంది.

03:34 ఇక్కడ, మనము రెండు subplots ను చూడవచ్చు.
03:38 ఇప్పుడు మనము plot command ను ఉపయోగించి subplot area యొక్క అన్నిటిలో plots ను గీయవచు.

Subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా1 Plot బ్రాకెట్స్ లోపల x కామా cos(x) అని టైప్ చేయండి.

04:00 ఇప్పుడు subplot బ్రాకెట్స్ లోపల 2 కామా 1 కామా2

plot y కామా y square అని టైప్ చేయండి.

04:16 ఇది subplot ఏరియా యొక్క ప్రతి ఒకదానిలో రెండు plots సృష్టించింది. ఎగువ subplot ఒక cosine curve ను మరియు దిగువ subplot ఒక parabola ను కలిగి ఉంటుంది.
04:29 ఈ రెండు subplots నుండి, వాటికీ రెండూ విభిన్న regular axes ఉన్నాయని అర్థం అవుతుంది.
04:35 cosine curve కొరకు, x-axis 0 నుండి 50 వరకు మరియు y-axis మైనస్ 1 నుండి 1 వరకు ఉంటుంది.
04:46 parabolic curve కొరకు, x-axis 0 నుండి 5 వరకు ఉంటుంది మరియు y-axis 0 నుండి 25 వరకు ఉంటుంది.
04:57 ఇప్పుడు ప్లాట్ విండోను క్లియర్ చేయండి
05:00 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
05:05 Pressure, Volume మరియు Temperatures అనేవి సమీకరణము Pv equals to nRT ద్వారా నిర్వచించ బడుతాయి, ఇక్కడ nR అనేది ఒక స్థిరాంకాము.
05:16 nR equals to 0.01 Joules per Kelvin మరియు T equals to 200K అనుకోండి. అప్పుడు v పరిధి 21cc నుండి 100cc వరకు ఉంటుంది.
05:29 subplots గా రెండు విభిన్న ప్లాట్స్ Pressure v/s Volume plot మరియు Pressure v/s Temperature plot లను గీయండి.
05:39 పరిష్కారం కొరకు terminal కు మారండి.
05:43 మొదలు పెట్టుటకు,మనం నిర్వచించగల వేరియబుల్ v నుండి Volume యొక్క range,
05:51 v equals to linspace బ్రాకెట్స్ లోపల 21 కామా 100 కామా 500 మనకు ఇవ్వబడింది.
06:03 మనము ఈ v ను ఉపయోగించి మొదటి subplot ను సృష్టించవచ్చు మరియు Pressure v/s Volume graph ను గీయవచ్చు.

subplot(2 కామా 1 కామా 1) plot(v కామా 2 point 0 by v)

06:24 nRT అనేది ఒక constant అని, అది 2.0 కు సమానం అని మనకు తెలుసు

అందువలన nR = equals to 0.01 Joules per Kelvin మరియు T equals to 200 Kelvin.

06:38 ఇప్పుడు మనము కింది విధంగా రెండవ subplot ను సృష్టించవచ్చు మరియు Pressure v/s Temperature plot ను గీయవచ్చు

subplot (2 కామా 1 కామా 2) plot (200 కామా 2 పాయింట్ 0/ v).

07:02 ఇప్పుడు మనకు x మరియు y dimensions సరిపోలడం లేదు అని చెప్పే ఒక ఎర్రర్ ఉంది.
07:08 కనుక మనము temperature కొరకు అదే సంఖ్యలో points ను సృష్టించాలి.
07:14 t equals to linspace బ్రాకెట్స్ లోపల 200 కామా 200 కామా 500 అని టైప్ చేయండి.
07:27 ఇప్పుడు, మనం t లో 500 విలువలు కలిగి ఉన్నాము మరియు ప్రతి విలువ 200 కెల్విన్ తో ఉంటుంది.
07:35 ఈ డేటాను Plotting చేస్తే, మనము అవసరమైన plot ను పొందుతాము.

Plot బ్రాకెట్స్ లోపల t కామా 2 point 0 divided by v.

07:48 మనం వరుసగా Pressure v/s Volume మరియు Pressure v/s Temperature యొక్క రెండు subplots ను చూడవచ్చు.
07:56 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.

ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, subplots ను సృష్టించడం మరియు వాటి మధ్య మారడం.

08:08 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-
08:12 1.కింది వాటిలో ఏది సరైనది?

Subplot బ్రాకెట్స్ లోపల numRows కామా numCols, plotNum Subplot బ్రాకెట్స్ లోపల numRows కామా numCols Subplot బ్రాకెట్స్ లోపల numCols కామా numRows

08:36 మరియు సమాధానం మొదటి ఎంపిక.

1. subplot command,rows యొక్క సంఖ్య, columns యొక్క సంఖ్య మరియు plot నెంబర్ అనే పేర్లుగల మూడు arguments ను తీసుకుంటుంది.

08:48 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
08:53 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
08:59 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
09:04 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
09:15 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya