Python-3.4.3/C2/Getting-started-with-IPython/Telugu
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, getting started with IPython అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు IPython interpreter ను ప్రయోగించడం, |
00:13 | IPython interpreter నుండి నిష్క్రమించడం, |
00:16 | IPython session హిస్టరీ ని నావిగేట్ చేయడం, |
00:20 | IPython లోపల tab-completion ను ఉపయోగించడం, |
00:23 | IPython లో డాక్యుమెంటేషన్ ను చూడటం, |
00:26 | అసంపూర్ణం లేదా తప్పు commandలకు అంతరాయం చేయగల్గుతారు. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, |
00:37 | Python 3.5.2, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:44 | IPython అంటే ఏమిటి?
IPython ఒక మెరుగుపరచబడిన interactive Python interpreter. |
00:50 | ఇది tab-completion వంటి ఫీచర్స్ ను మరియు సులభమైన యాక్సెస్ ను అందిస్తుంది. |
00:56 | మొదట మనం IPython interpreter ను ఎలా ప్రారంభించాలో చూద్దాము. |
01:00 | ముందుగా మీ కీబోర్డ్ మీద Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
01:07 | Prompt వద్ద ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:13 | ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడకపోతే, దయచేసి Instruction sheet ను చూడండి. |
01:18 | ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడి ఉంటే, terminal లో ipython command రన్ చేయడం ద్వారా IPython interpreter లోడ్ అవుతుంది. |
01:25 | ఇన్స్టాల్ చేయబడిన Python మరియు IPython యొక్క వర్షన్లు, టర్మినల్ పై కనిపిస్తాయి. |
01:32 | IPython ద్వారా కొంత అదనపు ఉపయోగకరమైన సమాచారం terminal పై చూపబడుతుంది. |
01:37 | దీని తర్వాత, మనకు i n bracket 1: తో ఒక ప్రాంప్ట్ వస్తుంది. |
01:42 | ఇప్పుడు, మనము IPython interpreter నుండి ఎలా నిష్క్రమించాలో చూద్దాం.
Ctrl+D కీలను నొక్కండి. |
01:48 | ఒకవేళ మనము నిజంగా నిష్క్రమించాలనుకుంటున్నామా అని నిర్ధారించడానికి ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. |
01:53 | yes కొరకు y అని టైప్ చేసి IPython నుండి నిష్క్రమించండి. |
01:57 | గమనించండి Y అనేది square brackets లో ఇవ్వబడింది కనుక ఇది అప్రమేయం. |
02:02 | మనము Enter ని కూడా నొక్కవచ్చు, నొక్కితే అది నిష్క్రమిస్తుంది. |
02:05 | లేదంటే ఒకవేళ మీరు IPython నుండి నిష్క్రమించాలని అనుకోకపోతే no కొరకు n ని టైప్ చేయండి. |
02:10 | మనము y ని టైప్ చేద్దాం.
మనము IPython interpreter నుండి నిష్క్రమించి terminal prompt వద్దకు తిరిగి వెళ్తాము. |
02:16 | మనం దానిని మళ్ళీ ప్రారంభిద్దాం.
terminal లో ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:23 | ఇప్పుడు, మనం interpreter ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము.
మనం సరళమైన ఆపరేషన్ -addition తో ప్రారంభిద్దాం. |
02:30 | IPython prompt వద్ద 1 plus 2 అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:36 | Python command ను అమలు చేయడానికి మనము Enter ని నొక్కుతాము. దయచేసి ప్రతి command ను టైప్ చేసిన తర్వాత ఆలా చేయండి. |
02:43 | IPython తక్షణమే అవుట్పుట్ ను 3 గా ప్రదర్శిస్తుంది. |
02:47 | అవుట్పుట్ అనేది Out square brackets 1 అనే ఒక సూచనతో చూపించబడిందని గమనించండి. |
02:54 | ఇప్పుడు మనము అటువంటి మరి కొన్ని ఆపరేషన్ లు
5 minus 3, 7 multiplied by 4,లను ప్రయత్నిద్దాం. |
03:03 | ప్రతిసారి మనము Enter ను నొక్కి IPython console window పై ఔట్పుట్ ను చూస్తాము. |
03:10 | IPython లో మనము మునుపటి కమాండ్స్ కు ఎలా నావిగేట్ అవ్వవచ్చో చూద్దాం. |
03:15 | ఉదాహరణకు, మనము print open parenthesis 1 plus 2 close parenthesis ను అమలు చేయాలనుకుంటున్నాము. |
03:23 | మొత్తం command ను టైప్ చేయడానికి బదులు, మనము మునుపు టైప్ చేసిన command 1 plus 2 ను తిరిగి పిలవవచ్చు. |
03:30 | command 1 plus 2 కు తిరిగి వెళ్ళడానికి అప్ యారో కీ ని ఉపయోగించండి. |
03:35 | ఇప్పుడు లైన్ ప్రారంభంలో నావిగేట్ చేయడానికి లెఫ్ట్ యారో కీని ఉపయోగించండి. |
03:40 | కీబోర్డ్ పై print open parenthesis close parenthesis అనే పదాన్ని టైప్ చేయండి. |
03:49 | మనము command ను print (1 plus 2) కు మార్చాము. Enter నొక్కండి. |
03:53 | interpreter ఫలితాన్ని 3 గా ముద్రిస్తుంది.
గమనించండి, Out square brackets సూచన అనేది ఈ సారి ప్రదర్శించబడలేదు. |
04:03 | ఇప్పుడు మనం print 10 multiplied by 2 ను అమలుచేద్దాం.
మునుపటి command print (1 plus 2) కు నావిగేట్ చేయడానికి మనం అప్ యారో కీ ని ఉపయోగిస్తాం. |
04:14 | ఇప్పుడు 1 plus 2 ను 10 multiplied by 2 తో భర్తీచేసి Enter నొక్కండి. |
04:21 | ఏదయినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే, asterix ను multiplication operator కొరకు ఉపయోగించబడుతుంది. |
04:27 | console పై ఔట్పుట్ ను గమనించండి. |
04:30 | ఇప్పుడు, మనము tab-completion అంటే ఏమిటో చూద్దాం.
మనం ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. |
04:35 | మనం function print ఉపయోగించాలనుకుంటున్నామని అనుకుందాం. |
04:39 | దీని కొరకు మనము prompt వద్ద pri అని టైప్ చేసి tab key ని నొక్కుతాం. |
04:45 | మీరు చూస్తున్నట్లుగా console పై command pri ను print కు IPython స్వయంచాలకంగా పూర్తిచేస్తుంది. |
04:52 | IPython యొక్క ఈ ఫీచర్ ను tab-completion అంటారు. |
04:56 | మనం tab completion యొక్క మరి కొన్ని అవకాశాలను చూద్దాము.
p అని మాత్రమే టైప్ చేసి ట్యాబ్ ను నొక్కండి. |
05:05 | ఈ సందర్భంలో, IPython, command ను పూర్తి చేయలేదని మనం చూస్తాం. |
05:09 | ఇది ఎందుకంటే,ఐక్కడ p తో మొదలయ్యే ఒకటి కంటే ఎక్కువ command లు ఉన్నాయి కనుక. |
05:14 | అందువల్ల, ఇది కేవలం p యొక్క అన్ని సాధ్యమయ్యే tab-completions జాబితాను సూచిస్తుంది. |
05:20 | ఇప్పుడు మనం ఒక అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. |
05:23 | వీడియోను పాజ్ చేయండి, సమస్యను పరిష్కరించి వీడియోను పునఃప్రారంభించండి.
ab తో ప్రారంభమయ్యే commands ను కనుగొనండి. |
05:31 | a తో ప్రారంభమయ్యే commands ను జాబితా చేయండి. |
05:35 | ab, a b s abs కు స్వయంచాలకంగా పూర్తిచేస్తుంది |
05:40 | a తో ప్రారంభమయ్యే అన్ని commands యొక్క ఒక జాబితాను a tab ప్రదర్శిస్తుంది. |
05:46 | ఇప్పుడు, మనం function absదేనికొరకు ఉపయోగించబడుతుందో చూద్దాం. |
05:51 | దీనిని తెలుసుకోవడానికి మనం IPython యొక్క హెల్ప్ ఫీచర్ ను ఉపయోగిస్తాము. |
05:55 | ఒక function యొక్క డాక్యుమెంటేషన్ ను చూడటానికి, ఒక question mark చేత అనుసరించబడే function నేమ్ ను టైప్ చేయండి. |
06:03 | IPython interpreter, function కొరకు డాక్యుమెంటేషన్ ను చూపిస్తుంది. |
06:08 | ప్రదర్శించబడిన సమాచారం నుండి, అది abs ఒక సంఖ్యను ఇన్పుట్ గా అంగీకరించి దానియొక్క సంపూర్ణ విలువను తిరిగిఇస్తుంది అని చెప్తుంది. |
06:16 | మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. console పై, a b s minus 19 ఆపై a b s 19 అని టైప్ చేయండి. |
06:29 | రెండు సందర్భాల్లోనూ, ఊహించిన విధంగా మనము19 ని పొందుతాము. |
06:33 | ఇప్పుడు మనం దీనిని దశాంశ సంఖ్యల కొరకు ప్రయత్నిద్దాం.
a b s minus 10.5 ను ప్రయత్నిద్దాం. |
06:42 | ఫలితంగా మనం 10.5 ను పొందుతాము. |
06:46 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.
కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
06:52 | round యొక్క డాక్యుమెంటేషన్ ను చూడండి మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో చూడండి. |
06:57 | పరిష్కారం కొరకు console కు మారండి.
round question mark ను టైప్ చేయడం ద్వారా function round యొక్క డాక్యుమెంటేషన్ ను మీరు చూడవచ్చు. |
07:06 | ఇక్కడ function round, ఒక సంఖ్యను ఇచ్చిన precision కు రౌండ్ చేస్తుంది. |
07:12 | ndigits అనేది round function కొరకు precision విలువ.
గమనించండి, అక్కడ ndigits చుట్టూ అదనపు స్క్వేర్ బ్రాకెట్లు ఉన్నాయి. |
07:21 | దీని అర్థం ndigits అనేది ఐచ్ఛికం మరియు 0 అప్రమేయ విలువ. |
07:27 | Python డాక్యుమెంటేషన్ లో ఐచ్ఛిక పారామితులు స్క్వేర్ బ్రాకెట్లలో చూపించబడ్డాయి. |
07:33 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.
కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
07:38 | round 2.48, round 2.48 comma 1, round 2.484, round 2.484 comma 2 యొక్క ఔట్పుట్ ను తనిఖీచేయండి. |
07:52 | మనము round 2.48 is equal to 2.0 |
07:57 | round 2.48 comma 1 is 2.5 |
08:02 | round 2.484 is 2.0 |
08:06 | round 2.484 comma 2 is 2.48 లను పొందుతాము.
మనము ఏవి ఆశించామో అవే వచ్చాయి. |
08:13 | మనం console పై టైప్ చేస్తున్నప్పుడు మనము చేసే టైపింగ్ దోషాలను ఎలా సరిచేయవచ్చో ఇపుడు చూద్దాము. |
08:20 | మనము ఉద్దేశపూర్వకంగా ఒక టైపింగ్ దోషాన్నిచేద్దాము.
round open parenthesis 2.484 అని టైప్ చేసి parenthesis ను మూసివేయకుండా Enter నొక్కండి. |
08:32 | మనము చుక్కలతో ఒక prompt ను పొందుతాము.
ఈ prompt అనేది IPython యొక్క continuation prompt. |
08:40 | మునుపటి లైన్ అసంపూర్తి అయినప్పుడు ఇది కనిపిస్తుంది. |
08:44 | ఇప్పుడు close parenthesis తో command ను పూర్తిచేసి Enter నొక్కండి.
మనము ఊహించిన అవుట్పుట్ 2ను పొందుతాము. |
08:54 | ఒకవేళ మనం ఒక తప్పు command ను టైప్ చేసి, continuation prompt తో ముగిస్తే ఏమవుతుంది ? |
09:00 | అలాంటి సందర్భంలో, మనం command కు అంతరాయం కలిగించడానికి Ctrl+C కీలను నొక్కి IPython prompt ను తిరిగి పొందవచ్చు. |
09:09 | round ఇన్పుట్ గా సంఖ్యలను మాత్రమే తీసుకుంటుంది. round(1a అని టైప్ చేయండి. |
09:15 | parenthesis ను మూసివేయకుండ Enterను నొక్కండి |
09:19 | మనము ఇన్పుట్ గా ఆల్ఫా-సంఖ్యా విలువ 1 a ను ఇచ్చాము.
అమలుకు అంతరాయం కలిగించడానికి Ctrl + C ను నొక్కండి. |
09:28 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.
కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
09:34 | round 2.484 అని టైప్ చేసి, parenthesis ను మూసివేయకుండా Enter నొక్కండి. |
09:41 | తరువాత Ctrl + C ను ఉపయోగించి command ను రద్దుచేయండి. command round 2.484 comma 2 ను టైప్ చేయండి. |
09:51 | మీ console పై అవుట్పుట్ చూడటానికి ఇలా ఉండాలి. |
10:01 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. |
10:04 | ఈ ట్యుటోరియల్ లో మనం, terminal లో ipython అని టైప్ చేయడం ద్వారా IPython interpreter ను ప్రయోగించడం. |
10:13 | Ctrl+D ను ఉపయోగించడం ద్వారా IPython interpreter నుండి నిష్క్రమించడం. |
10:17 | యారో కీలను ఉపయోగించడం ద్వారా IPython session హిస్టరీ ని నావిగేట్ చేయడం |
10:23 | వేగంగా పని చేయడానికి tab-completion ను ఉపయోగించండం. |
10:27 | question mark ను ఉపయోగించి functions యొక్క డాక్యుమెంటేషన్ ను చూడటం. |
10:32 | ఎప్పుడైనా మనము ఒక తప్పును చేస్తే Ctrl+C ను ఉపయోగించి కమాండ్స్ కు అంతరాయం కలిగించడం నేర్చుకున్నాము. |
10:37 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు ఉన్నాయి. |
10:41 | IPython is a programming language similar to Python అనేది
తప్పా లేక ఒప్పా. |
10:46 | ఏ కీ సమ్మేళనం IPython ను నిష్క్రమిస్తుంది?
Ctrl + C, Ctrl + D, Alt + C, Alt + D |
10:55 | IPython లోడాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి, ఒక command చివరలో ఏ క్యారెక్టర్ ఉపయోగించబడుతుంది?
under score, question mark, exclamation mark, ampersand |
11:07 | మరియు సమాధానాలు- తప్పు. IPython కొత్త ప్రోగ్రామింగ్ భాష కాదు. ఇది కేవలం మెరుగుపరచబడిన ఇంటరాక్టివ్ Python interpreter. |
11:17 | మనము IPython interpreter ను నిష్క్రమించడానికి Ctrl + D ను ఉపయోగిస్తాము. |
11:21 | మనము దాని యొక్క డాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి command యొక్క చివరన question mark (?) ను ఉపయోగిస్తాము. |
11:28 | ఈ వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి, చూడవచ్చు. |
11:37 | మేము వర్క్ షాప్స్ ను నిర్వహిస్తాము. సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
11:42 | మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా ?
మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి. |
11:48 | మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి
FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
11:56 | మీరు Python లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా? |
11:59 | దయచేసి FOSSEE forum ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్ చేయండి. |
12:04 | FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది. |
12:10 | ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము.
మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
12:17 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
12:23 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |