Python-3.4.3/C2/Embellishing-a-plot/Telugu
From Script | Spoken-Tutorial
00:01 | ప్రియమైన స్నేహితులారా, Embellishing a Plot అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మనం నేర్చుకునేవి - plot యొక్క color, line style, linewidth వంటి లక్షణాలను సవరించడం. |
00:16 | embedded LaTeX తో plot కు ఒక శీర్షికను జోడించడం. |
00:20 | x మరియు y axes లను లేబుల్ చేయడం. plot కు ఉల్లేఖనాలను జోడించడం. |
00:26 | axes యొక్క limits ను సెట్ చేయడం మరియు పొందడం. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, |
00:37 | Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:43 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో మరియు Plots ను యింటరాక్టివ్గా ఉపయోగించడం తెలిసి ఉండాలి. |
00:54 | ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:59 | మనం ipython3 ను ప్రారంభిద్దాం.
terminal ను తెరవండి. |
01:05 | ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:11 | మనం pylab package ను ప్రారంభిద్దాం. |
01:15 | percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:21 | మనము మొదట ఒక సాధారణ plot ను తయారుచేసి దానిని సవరించడం ప్రారంభిద్దాం. |
01:26 | x = linspace బ్రాకెట్స్ లోపల మైనస్ 2 కామా 4 కామా 20 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:40 | తరువాత, plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x)అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:49 | plot విండోలో sine curve ను మనం ఇప్పుడు చూడవచ్చు. |
01:53 | లైన్ యొక్క అప్రమేయ రంగు మరియు మందం pylab చేత నిర్ణయించబడుతుంది. |
01:59 | ఇప్పుడు మనం ఈ curve యొక్క parameters ను మార్చుదాం. |
02:03 | మనము దీన్ని చేయడానికి plot command కు అదనపు arguments ను పంపవచ్చు. |
02:09 | ముందు మనం ipython console లో clf() అని టైప్ చేయడం ద్వారా plot విండోను క్లియర్ చేయాలి. |
02:16 | ఇప్పుడు మీరు ఒక ఖాళీ plot window ను చూడవచ్చు. |
02:20 | ఇప్పుడు అదే sine curve ను ఒక అదనపు color argument తో plot చేయండి. |
02:26 | కనుక మనం plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x)కామా ఇన్వర్టెడ్ కామాల లోపల r అని టైప్ చేసి Enter నొక్కుతాము
ఇక్కడ, అర్గుమెంట్ r అనేది ఎరుపు రంగు కొరకు. |
02:44 | plot window పై, అదే sine curve ఇప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది. |
02:50 | plot విండో ను మూసివేయవద్దు దానిని మినిమైజ్ చేయండి. |
02:54 | Linewidth ఆర్గుమెంట్ ను ఉపయోగించడం ద్వారా మనం లైన్ యొక్క మందాన్ని మార్చుకోవచ్చు. |
03:00 | ఈసారి మనం plot విండో పైన cosine curve ను గీస్తాము. |
03:05 | కనుక, plot బ్రాకెట్స్ లోపల x కామా cos (x) కామా linewidth is equals to 2 అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:18 | plot విండోలో ఒక cosine curve లైన్ మందం 2 తో ఉత్పత్తి చేయబడుతుంది. |
03:24 | ఇప్పుడు మనం ఒక sine curve ని నీలి రంగులో linewidth 3 తో ప్లాట్ చేసేందుకు ప్రయత్నిద్దాము. |
03:31 | ఇక్కడ నుండి, Ipython console పై మనంటైప్ చేస్తున్న ప్రతి కమాండ్ ను అమలు చేయడానికి Enter నొక్కండి. |
03:39 | మనం clf() అని టైప్ చేయడం ద్వారా plot విండోను క్లియర్ చేద్దాం. |
03:44 | మీరు మళ్ళీ ఒక ఖాళీ ప్లాట్ విండోని చూస్తారు. |
03:48 | ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల b కామా linewidth is equal to 3 అని టైప్ చేయండి. |
04:03 | color యొక్క కలయిక మరియు linewidth మన కొరకు ఈ పనిని చేస్తాయి. |
04:08 | ఘన శైలికి బదులుగా plot ను చుక్కల శైలిలో పొందడానికి, linestyle లో ఒక dot ను ఉంచండి. |
04:16 | మొదట, plot విండో ను క్లియర్ చేయడానికి clf() అని టైప్ చేయండి. |
04:20 | ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల dot అని టైప్ చేయండి. |
04:32 | మనము sine curve ను చుక్కల శైలిలో పొందుతాము. |
04:36 | మనం plot యొక్క సమాచారాన్ని చూద్దాం. |
04:40 | plot question mark అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:47 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
04:52 | x verses cos(x) యొక్క curve ను ఎరుపు రంగు dash line లో మరియు linewidth 3 తో Plot చేయండి. |
05:00 | పరిష్కారం కొరకు console కు మారండ. |
05:04 | plot విండో ను క్లియర్ చేయడానికి clf() అని టైప్ చేయండి. |
05:08 | ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా cos (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల r హైఫన్ హైఫన్ కామా linewidth equals to 3 అని టైప్ చేయండి. |
05:25 | మనం linewidth argument మరియు linestyle యొక్క కలయికను ఉపయోగిస్తాము. |
05:30 | ఒక సాధారణ plot ను color, style మరియు thickness తో ఎలా ఉత్పత్తి చేయాలో ఇప్పుడు మనకు తెలుసు. |
05:38 | plot ను మరింత సవరించడం చూద్దాం. |
05:42 | function minus x square plus 4x minus 5 కొరకు ఒక plot తో మనం ప్రారంభిద్దాం. |
05:51 | ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా minus x multiplied by x plus 4 multiplied by x minus 5 కామా ఇన్వర్టెడ్ కామాల లోపల r కామా linewidth equals to 2 అని టైప్ చేయండి. |
06:16 | మనము plot విండోలో ఈ సమీకరణం యొక్క వక్రతను చూస్తాము. |
06:21 | అయితే ఈ చిత్రంలో plot ను వివరించే ఎలాంటి వర్ణన లేదు. |
06:26 | plot కు శీర్షికను జోడించడానికి, title command ను ఉపయోగించండి. |
06:31 | కనుక, title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల Parabolic function minus x square plus 4x minus 5 అని టైప్ చేయండి. |
06:48 | title command మీరు చూస్తున్నట్లుగా, string ను ఒక argument గా తీసుకుంటుంది. |
06:54 | మనము plot విండోలో title చూడవచ్చు. కానీ అది ఫార్మాట్ చేయబడ లేదు మరియు శుభ్రంగా కనిపించడం లేదు. |
07:03 | ఒకవేళ అక్కడ fractions మరియు complex functions ఉంటే అది మరింత చిరిగినట్లు కనిపిస్తుంది. |
07:09 | చక్కగా కనిపించడం కొరకు మనం title ను LaTeX ఫార్మాట్ లో వ్రాద్దాం. |
07:14 | LaTeX ఫార్మాట్ కొరకు, మనం string కు ముందు మరియు తరువాత ఒక dollar sign ను ఉంచాము. |
07:20 | title బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల Parabolic function dollar minus x square plus 4x minus 5 dollar అని టైప్ చేయండి. |
07:38 | ఇక్కడ r అంటే string అనేది ఒక raw string గా పరిగణించబడుతుంది అని అర్ధం. |
07:45 | నేను అన్ని escape codesను పట్టించుకోను. |
07:49 | మనం చూస్తున్నట్లుగా, title లో polynomial ఇప్పుడు ఫార్మాట్ చేయబడింది. |
07:55 | మనము title ను కలిగిఉన్నప్పటికీ, x మరియు yఅక్షాలను లేబుల్ చేయకుండా plot పూర్తి కాదు. |
08:03 | కనుక మనం x మరియు y అక్షాలను LaTeX style లో లేబుల్ చేస్తాము. |
08:09 | xlabel బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar x dollar మరియు ylabel బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar y dollar అని టైప్ చేయండి. |
08:30 | plot ఇప్పుడు దాదాపు పూర్తి అయ్యింది. |
08:34 | ఇప్పుడు మనము point(2 comma minus 1) ను local maxima గా పరిగణలోకితీసుకుని points కు పేర్లు పెడతాము. |
08:42 | ఒక point కు పేరును పెట్టడానికి, మనం function annotate ను ఉపయోగిస్తాము. |
08:46 | annotate బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల local maxima comma xy equals to బ్రాకెట్స్ లోపల2 comma minus 1అని టైప్ చేయండి. |
09:03 | మనము local maxima ను 2 comma minus 1 పాయింట్ వద్ద చూడవచ్చు. |
09:09 | annotate command లో మొదటి argument అనేది పాయింట్ యొక్క పేరు. |
09:15 | రెండవ argument అనేది point యొక్క coordinates ను సూచిస్తుంది. |
09:20 | ఇది రెండు సంఖ్యలను కలిగి ఉన్న ఒక tuple. మొదటిది x coordinate మరియు రెండవది y coordinate. |
09:29 | తరువాత, xlim brackets అని టైప్ చేయండి.
lim function ప్రస్తుత x axis limits ను తిరిగి ఇస్తుంది. |
09:39 | తరువాత, ylim brackets అని టైప్ చేయండి.
ylim function ప్రస్తుత y-axis limits ను తిరిగిఇస్తుంది. |
09:49 | xlim బ్రాకెట్స్ లోపల minus 4 comma 5 అని టైప్ చేయడం ద్వారా మైనస్ 4 నుండి 5 వరకు గల limits of x-axis ను చూడండి. |
10:02 | అదేవిధంగా, limits of y-axisను ఇదే పద్ధతిలో సెట్ చేయండి. |
10:07 | ylim బ్రాకెట్స్ లోపల minus 15 comma 2 అని టైప్ చేయండి. |
10:19 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
10:24 | point (minus 4 comma 0) వద్ద root అని పిలువబడే ఒక annotation ను తయారు చేయండి. |
10:31 | మొదటి annotation కు ఏమి జరుగుతుంది? |
10:35 | పరిష్కారం కొరకు Ipython console కు మారండి. |
10:39 | annotate బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల root కామా xy is equal to minus 4 comma 0 అని టైప్ చేయండి. |
10:53 | ప్రతి annotate command చిత్రం పై ఒక నూతన annotation ను చేస్తుంది. |
10:59 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
అదనపు arguments ను పంపడం ద్వారా ఒక plot యొక్క color, line width, line style వంటి attributes ను సవరించడం. |
11:16 | title command ను ఉపయోగించి ఒక ప్లాట్ కు title ను జోడించడం. |
11:20 | string కు ముందు మరియు తరువాత ఒక $ చిహ్నాన్ని జోడించడం ద్వారా LaTeX style formatting ఆకృతీకరణను చేయడం. |
11:28 | Xlabel() మరియు ylabel() కమాండ్స్ ను ఉపయోగించి x మరియు y అక్షాలను లేబుల్ చేయడం. |
11:34 | Annotate() కమాండ్ ను ఉపయోగించి ఒక ప్లాట్ కు annotations ను జోడించడం. |
11:39 | Xlim() మరియు ylim() కమాండ్స్ ను ఉపయోగించి limits of axes ను పొందడం మరియు సెట్ చేయడం. |
11:46 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. |
11:51 | మైనస్ 2pi నుండి 2pi మధ్య లైన్ మందం 4 తో ఉన్న cosine graph యొక్క ఒక plot ను గీయండి. |
12:00 | command ylabel లోని టెక్స్ట్ యొక్క alignment ను సవరించడానికి ఏదయినా ఒక మార్గం ఉందా అని డాక్యుమెంటేషన్ ను చదివి, తెలుసుకోండి. |
12:09 | మరియు సమాధానాలు, మైనస్ 2pi నుండి 2pi మధ్య లైన్ మందం 4 తో ఉన్న cosine graph యొక్క ఒక plot ను గీయడానికి, మనం linspace మరియు plot command గా వరుసగా,
x equals to linspace బ్రాకెట్స్ లోపల minus 2pi కామా 2pi ను |
12:31 | plot (x కామా cos(x) కామా linewidth equals to 4) ను ఉపయోగిస్తాము. |
12:38 | రెండవ ప్రశ్నకు సమాధానం: లేదు.command ylabel లోని టెక్స్ట్ యొక్క alignment ను సవరించడానికి మనకు ఒక ఎంపిక లేదు. |
12:48 | మీరు ఈ Spoken Tutorial పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా? |
12:51 | మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి. |
12:55 | మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి.
FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
13:03 | Python పై మీరు ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా? |
13:08 | దయచేసి FOSSEE ఫోరమ్ ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్ చేయండి. |
13:12 | FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది. |
13:18 | ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము.
మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
13:27 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
13:34 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |