Python-3.4.3/C2/Loading-Data-From-Files/Telugu
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, loading data from files అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
సింగల్ కాలమ్ ఫార్మాట్ లేదా స్పేసేస్ చేత లేక ఇతర డెలీమీటర్స్ చేత వేరుచేయబడిన మల్టిపుల్ కాలమ్స్ లో డేటాను కలిగి ఉన్న ఫైల్స్ నుండి చదవడం. |
00:21 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:37 | మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసిఉండాలి. |
00:43 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ http://spoken-tutorial.org పై చూడండి. |
00:49 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:02 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:12 | మనము primes.txt ఫైల్ ను చదవడంతో మొదలుపెడదాము. ఈ ఫైల్ ఒక కాలమ్ లో జాబితా చేయబడిన ప్రధాన సంఖ్యల యొక్క జాబితాను కలిగి ఉంది. |
01:22 | Cat (space) primes(dot) txt అని టైప్ చేయండి |
01:29 | మనము ఫైల్ నుండి డేటాను పొందటానికి మరియు టెర్మినల్ పై ప్రదర్శించడానికి cat కమాండ్ ను ఉపయోగించవచ్చు. ఎంటర్ నొక్కండి. |
01:38 | టెర్మినల్ లో ప్రధాన సంఖ్యలు ప్రదర్శించబడటం మనం చూస్తాము. |
01:43 | ఇప్పుడు మనము ఈ జాబితాని వేరియబుల్ primes లో నిల్వ చేయడానికి loadtxt () కమాండ్ ను ఉపయోగించవచ్చు. |
01:50 | కనుక primes (equal to) loadtxt పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల primes (dot) txt అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:07 | దయచేసి primes.txt ఫైల్ కు మీరు అందిస్తున్న పాత్ సరైనదని నిర్ధారించుకోండి. |
02:13 | ఆ ఫైల్, మన కేస్ లో ప్రస్తుతం home ఫోల్డర్లో ఉంది. |
02:18 | primes అనేది ఇప్పుడు ఒక ప్రధాన సంఖ్యల శ్రేణి, అది primes.txt ఫైల్ లో జాబితా చేయబడింది. |
02:25 | ఇప్పుడు మనము వేరియబుల్ primes లోని కంటెంట్స్ ను ప్రదర్శిద్దాము. |
02:29 | కనుక print పరాంతసిస్ లోపల primes అని టైప్ చేసి Enter నొక్కండి. మనము ముద్రించబడిన శ్రేణిని చూస్తాము. |
02:41 | మనము గమనిస్తే అన్ని సంఖ్యలు ఒక పీరియడ్ (.)తో ముగుస్తాయి. ఇది ఎందుకంటే ఈ సంఖ్యలు అన్ని floats కనుక. |
02:51 | ఇప్పుడు cat(space)pendulum(dot)txt అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:01 | ఈ ఫైల్ డేటా యొక్క రెండు కాలమ్ లను కలిగి ఉంది. ఈ మొదటి కాలమ్ లో pendulum యొక్క పొడవు ఉంటుంది.
రెండవ కాలమ్ లో సంబంధిత time period ఉంటుంది. |
03:15 | ఇప్పుడు మనము loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి వేరియబుల్ pend లోనికి వెళ్లిన డేటాను చదువుదాం. |
03:23 | కనుక pend (equal to) loadtxt పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల pendulum(dot) txt అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:39 | దయచేసి గమనించండి, loadtxt కరకు రోస్ యొక్క సమాన సంఖ్యను కలిగిన ఫైల్ యొక్క రెండు కాలమ్ లూ అవసరం. |
03:47 | వేరియబుల్ pend లో ఏమి ఉందో చూడటానికి, దానిని ప్రింట్ చేయండి
Print పరాంతసిస్ లోపల pend అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:00 | గమనించండి ఆ వేరియబుల్ డేటా ఫైల్ యొక్క రెండు కాలమ్ లను కలిగి ఉన్న రెండు శ్రేణులను కలిగిఉంది. |
04:07 | మనం డేటాను రెండు వేర్వేరు శ్రేణులలో చదవడానికి, loadtxt కమాండ్ యొక్క ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ను ఉపయోగిద్దాం. |
04:16 | కనుక L కామా T(equal to) loadtxt(పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల)
pendulum(dot) txt (డబల్ కోట్స్ తరువాత కామా) unpack (equal to) True అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:42 | ఇప్పుడు L మరియు Tవేరియబుల్స్ ఏమి కలిగిఉన్నాయో చూడటానికి వాటిని ప్రింట్ చేయండి. |
04:47 | Print పరాంతసిస్ లోపల L అని టైప్ చేసి Enter నొక్కండి.
Print పరాంతసిస్ లోపల T అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:01 | గమనించండి,L మరియు T ఇప్పుడు pendulum.txt నుండి వరుసగా డేటా యొక్క మొదటి మరియు రెండవ కాలమ్ లను కలిగి ఉంటాయి. |
05:12 | unpack(equal to)Trueరెండు కాలమ్స్ ను రెండు వేర్వేరు మరియు సరళమైన శ్రేణులుగా చేసింది. |
05:20 | ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
05:27 | pendulum(underscore) semicolon(dot) txt ఫైల్ నుండి డేటా ను చదవండి. |
05:33 | ఈ ఫైలు రెండు కాలమ్స్ లో డేటాను కలిగి ఉంది. ఈ కాలమ్స్ సెమికోలన్ల ద్వారా వేరు చేయబడతాయి.
దీన్ని ఎలా చేయాలో చూడడానికి IPython హెల్ప్ ను ఉపయోగించండి. |
05:45 | మనం పరిష్కారం చూద్దాం. టర్మినల్ కు మారండి. |
05:50 | మొదట మనము ఫైల్ యొక్క కంటెంట్ ను చూస్తాము. |
05:54 | కనుక cat స్పేస్ pendulum(underscore) semicolon(dot) txt అని టైప్ చేసి Enter నొక్కండి. మనము సెమీ కోలన్ చేత వేరు చేయబడిన రెండు కాలమ్ లను చూస్తాము. |
06:12 | ఇప్పుడు, L (కామా) T(equal to) loadtxt(పరాంతసిస్ లోపల డబల్ కోట్స్ లోపల) pendulum(underscore) semicolon(dot) txt (డబల్ కోట్స్ తరువాత కామా) unpack (equal to) True (కామా) delimiter(equal to)( డబల్ కోట్స్ లోపల) semicolon అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:48 | ఇప్పుడు, print(పరాంతసిస్ లోపల) L Enter నొక్కండి.
print(పరాంతసిస్ లోపల) T Enter నొక్కండి. |
07:03 | ఇది L మరియుT రెండు వేరియబుల్స్ లోపలి కంటెంట్స్ ను ప్రదర్శిస్తుంది. |
07:09 | దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
loadtxt() కమాండ్ ను ఉపయోగించి ఫైల్స్ నుండి డేటాను చదవడం |
07:20 | ఆ డేటా అనేది
సింగల్ కాలమ్ ఫార్మాట్ ,మల్టిపుల్ కాలమ్స్ ఫార్మాట్,స్పేసేస్ చేత లేక ఇతర డెలీమీటర్స్ చేత వేరుచేయబడిన వాటిలోనుండి కావొచ్చు. |
07:31 | ఇక్కడ మీరు సాధించటానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు
loadtxt ఒకే కాలమ్ తో ఉన్న ఫైల్ నుండి మాత్రమే డేటాను చదవగలదు. ఇది తప్పా లేక ఒప్పా ? స్పేసేస్ చేత వేరుచేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక data.txt ఫైల్ ఇవ్వబడింది. దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి. |
07:58 | Colon చేత వేరుచేయబడిన డేటా యొక్క మూడు కాలమ్స్ తో ఒక data.txt ఫైల్ ఇవ్వబడింది. దానిని 3 వేర్వేరు సాధారణ శ్రేణుల లో చదవండి. |
08:09 | ఇప్పుడు మనం సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం తప్పు. |
08:17 | loadtxtకమాండ్ ఒక కాలమ్ మరియు బహుళ కాలమ్స్ లలో ఉన్న ఫైళ్ళ నుండి డేటా ను చదవగలదు. |
08:25 | రెండవ ప్రశ్నకు సమాధానం,
డేటాను మూడు కాలమ్స్ గా వేరు చేయడానికి, మనము ఈ క్రింది loadtxt () కమాండ్ ను ఉపయోగిస్తాము: |
08:35 | x(equal to) loadtxt(పరాంతసిస్ లోపల మరియు డబల్ కోట్స్ లోపల) data(dot) txt(డబల్ కోట్స్ తరువాత కామా) unpack(equal to) True |
08:50 | మూడవ ప్రశ్నకు సమాధానం,మనము loadtxt కమాండ్ లో డీలిమిటర్ యొక్క ఒక అదనపు ఆర్గుమెంట్ ను ఉపయోగించి మూడు వేర్వేరు శ్రేణులలో చదువుతాము. |
09:03 | కనుక x(equal to) loadtxt(పరాంతసిస్ లోపల మరియు డబల్ కోట్స్ లోపల) data(dot) (డబల్ కోట్స్ తరువాత కామా) unpack(equal to) True(కామా) delimiter(equal to) (డబల్ కోట్స్ లోపల) colon. |
09:22 | మీరు ఈ Spoken Tutorial పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా ? దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
09:29 | మీరు ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా? దయచేసి లింక్ లో ఇచ్చిన ఫోరమ్ ను సందర్శించండి. |
09:37 | FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది. |
09:43 | ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
09:52 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
09:59 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |