Moodle-Learning-Management-System/C2/Teachers-Dashboard-in-Moodle/Telugu
Time | Narration |
00:01 | Moodle లో టీచర్స్ డాష్‌బోర్డ్ అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము, ఒక విలక్షణ Moodle కోర్సు సమీక్ష గురించి నేర్చుకుంటాము. |
00:14 | తరువాత మనం:
టీచర్స్ డాష్‌బోర్డ్ ప్రొఫైల్ ను ఎలా సవరించాలి మరియు preferencesను ఎలా సవరించాలి అనే వాటిని గురించి నేర్చుకుంటాము. |
00:25 | చివరగా, మనము Moodle పై మన కోర్స్ కు సంబందించిన కొన్ని ప్రాథమిక వివరాలను చేర్చడం నేర్చుకుంటాము. |
00:33 | ఈ ట్యుటోరియల్:
ఉబుంటు లైనక్స్ OS 16.04, XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:59 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
01:07 | ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసి, మీకు ఉపాధ్యాయుల అధికారాలను కలిగి ఉన్న ఒక కొత్త, ఖాళీ కోర్సు కు మీకు కేటాయించారని అనుకుంటుంది.
నా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పటికే ఈ కిందిది చేసారు. |
01:26 | దయచేసి గమనించండి:
కాలిక్యులస్ కోర్సు కొరకు యూజర్ రెబెక్కా రేమండ్ కు టీచర్ రోల్ కేటాయించబడింది |
01:34 | ఈ వెబ్సైట్ పై Moodle ట్యుటోరియల్స్ ను సూచించడానికి మీసైట్ అడ్మినిస్ట్రేటర్ ని అడగండి. |
01:41 | మరియు కనీసం ఒక కోర్స్ కొరకు ఉపాధ్యాయ హక్కులను కలిగి ఉన్న ఒక యూజర్ ను మీకొరకు సృష్టించండి. |
01:48 | బోధన మరియు అభ్యాస వ్యవస్థలో సులభంగా ఉపయోగించడానికి, అత్యంత సౌకర్యవంతమైన, సృజనాత్మకమైన వాటిలో Moodle ఒకటి. |
01:56 | సాధారణంగా, Moodle ఉపాధ్యాయులచే,
వారి బోధన-అభ్యాస వనరులను అప్ లోడ్ చేయడం వారి మల్టీమీడియా ఇ-వనరులు అనగా ఫైళ్ళు, వీడియోస్ మొదలైన వాటి యొక్క సేకరణ. |
02:12 | వెబ్ వనరులను భాగస్వామ్యం చేయడం మరియు విద్యా వనరులను తెరవడం
YouTube / Vimeo వీడియోలు పొందుపరచడం. |
02:22 | క్విజ్ లు మరియు అసైన్మెంట్స్ నిర్వహించడం
వికీ, గ్లోసరీ వంటి సహకార విషయాలయొక్క వినియోగాన్ని ప్రోత్సహించడం మొదలైనవి. |
02:34 | సమకాలికంగా మరియు అసమకాలికంగా విద్యార్థులతో ప్రతిస్పందన తెలియజేయడం మరియు విద్యార్థుల అభ్యాస పురోగతిని దారిలో పెట్టడం చేయడానికి ఉపయోగించబడుతుంది. |
02:44 | నేను నా కాలిక్యులస్ కోర్సు యొక్క కోర్సు అవలోకనాన్ని నా వద్ద కలిగి ఉన్నాను. |
02:50 | నా దగ్గర
కవర్ చేయబడిన ఉన్నవిషయాలు వారానికి సరిపడే ఉపన్యాసాల సంఖ్య కోర్సు కొరకు అసైన్మెంట్ ల యొక్క మొత్తం సంఖ్య |
03:01 | క్విజ్ ల యొక్క మొత్తం సంఖ్య (వారానికి లేదా పక్షం రోజులకు )
కోర్సు యొక్క చివరి పరీక్షల యొక్క మొత్తం సంఖ్య మార్కుల పంపిణీ కోర్సు మెటీరియల్స్ మరియు బుక్ సూచనలు |
03:18 | నేను నా కోర్స్ నిర్మాణం చేసి అదే ప్రకారంగా మొత్తం మెటీరియల్ ను Moodle పై అప్ లోడ్ చేయాలి. |
03:25 | బ్రౌజర్ కు మారి Moodle site ను తెరవండి. |
03:30 | అందుబాటులో ఉన్న కోర్సులు మరియు శీర్షికతో ఉన్న ఒకపేజీ ప్రదర్శించబడుతుంది. |
03:35 | విండో యొక్క కుడి ఎగువ మూల వద్ద ఉన్న Login లింక్ పై క్లిక్ చేయండి. |
03:40 | నేను టీచర్ రెబెక్కా రేమండ్ గా లాగిన్ చేస్తాను. |
03:44 | మనం మన పాస్ వర్డ్ ను మార్చమని అడిగే పేజీపై ఉన్నాము. ఇది ఎందుకంటే Force password change ఎంపిక అడ్మిన్ చే మునుపు ఆక్టివేట్ చేయబడిఉంది కనుక. |
03:57 | ప్రస్తుత పాస్ వర్డ్ తరువాత కొత్త పాస్ వర్డ్ ను టైప్ చెయ్యండి. నేను Spokentutorial12# అని టైప్ చేస్తాను. |
04:07 | కొత్త పాస్ వర్డ్ ను మళ్లీ టైప్ చేయండి. తరువాత పేజీ క్రింద ఉన్న Save changes బటన్ పైన క్లిక్ చేయండి. |
04:15 | పాస్ వర్డ్ మార్చబడిందని ఒక విజయవంతమైన సందేశం కనిపిస్తుంది. Continue బటన్ పై క్లిక్ చేయండి. |
04:24 | మనము ఇపుడు ఉన్న పేజీని డాష్‌బోర్డ్ అని పిలుస్తారు. |
04:29 | మన డాష్‌బోర్డ్ 3 నిలువు వరుసలుగా విభజించబడింది. |
04:34 | ఎడమ వైపున ఉన్నది నావిగేషన్ మెనూ. మధ్యలో విస్తృతమయి ఉన్నది ప్రధాన Course overview ప్రాంతం, అది Timeline మరియు Courses ట్యాబ్ లతో కలిసి ఉంది. |
04:47 | కుడి వైపున ఉన్నది Blocks column. |
04:51 | Courses tab మీరు చేర్చే కోర్సులను జాబితా చేస్తుంది, Course overview ప్రాంతంలోని Courses ట్యాబ్‌పై క్లిక్ చేయండి. |
05:02 | In Progress ట్యాబ్ లో, మనము ఇక్కడ 2 కోర్సులు కాలిక్యులస్ మరియు లీనియర్ ఆల్జీబ్రా లను చూస్తాము. ఈ కోర్సులు టీచర్ రెబెక్కా రేమండ్ కు admin చేత కేటాయించబడినవి. |
05:17 | ఆమెకు భవిష్యత్తు లో కేటాయించబడిన కోర్సులు, ఫ్యూచర్ టాబ్ లో కనిపిస్తాయి. అదే విధంగా, ఆమె యొక్క అయిపోయిన కోర్సులు, Past ట్యాబ్ కింద చూపబడతాయి. |
05:30 | ఇప్పుడు మనము పేజియొక్క శీర్షిక ను చూద్దాం. పేజీ యొక్క ఎగువ ఎడమ మూలలో మనము నావిగేషన్ ద్రావర్ లేదా నావిగేషన్ మెనుని చూడవచ్చు. |
05:41 | ఇది Calendar, Private Files మరియు My courses లింకులకు యాక్సిస్ కల్పిస్తుంది. |
05:48 | ఇది ఒక టోగుల్ మెనూ, అంటే దానిని క్లిక్ చేసినపుడు అది దాని యొక్క స్థితిని open నుండి close కు అలాగే close నుండి open కు మార్చుతుందని అర్ధం. |
05:58 | ఎగువ కుడి భాగం వద్ద, నోటిఫికేషన్లు మరియు మెసేజెస్ కొరకు శీఘ్ర ఆక్సెస్ చిహ్నాలు ఉన్నాయి. |
06:06 | ఎగువ కుడి భాగం వద్ద ఉన్న profile pictureపై క్లిక్ చేస్తే, యూజర్ మెనూ ను యాక్సెస్ చేయడానికి మనకు వీలు కల్పిస్తుంది. దీన్ని quick access user menu అని కూడా అంటారు. |
06:18 | దానిపై క్లిక్ చేయండి. ఎడమవైపున ఉన్నదానిలాగా ఈ మెను ఐటమ్ లు అన్నీ కూడా టోగుల్ మేనులే. |
06:28 | ప్రొఫైల్ ఎంపికపై క్లిక్ చేయండి. Moodle లో ప్రతి యూజర్ కి ఒక ప్రొఫైల్ పేజీ ఉంటుంది. |
06:36 | ఇది యూజర్లకు వారి ప్రొఫైల్ సమాచారాన్ని ఎడిట్ చేయటానికి, వారు చేరియున్న కోర్సులను చూడడానికి, |
06:46 | వారి బ్లాగ్ లేదా ఫోరమ్ పోస్ట్స్ లను వీక్షించడానికి, వారికి యాక్సెస్ ఉన్న reports ను చెక్ చేయడానికి మరియు చివరిసారి లాగిన్ చేయడానికి ఉపయోగించబడిన వారి access logs చూడటాన్ని అనుమతినిచ్చే లింక్ లను కలిగిఉంది. |
07:01 | ఇప్పుడు Edit Profile' లింక్ పై క్లిక్ చేద్దాం. |
07:06 | Edit Profile page తెరుచుకుంటుంది
ఈ పేజీ 5 విభాగాలుగా విభజించబడింది: General User Picture Additional Names Interests Optional |
07:24 | General మరియు User picture విభాగాలు అప్రమేయంగా విస్తరించబడ్డాయి. |
07:30 | కుడివైపున ఉన్న Expand all లింక్, అన్నివిభాగాలను విస్తరిస్తుంది. |
07:36 | మరియు ఏదైనా విభాగం పేరు మీద క్లిక్ చేస్తే అది దాన్ని విస్తరిస్తుంది లేదా కొలాప్స్ చేస్తుంది. |
07:42 | ఇక్కడ అన్ని ఫీల్డ్స్ ను సవరించవచ్చు. |
07:45 | ఇపుడు నేను చేసినట్లుగా, మీరు మీ వ్యక్తిగత వివరాలను General section లో నమోదు చేసుకోవచ్చు. |
07:52 | ఒక టీచర్ గా, నా విద్యార్ధులు నా గురించి కొంచెం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. |
07:58 | కనుక, ఇక్కడ Description ఫీల్డ్ లో నేను కొన్ని వివరాలను నింపుతాను. |
08:04 | ట్యుటోరియల్ని పాజ్ చేసి, నేను ఇక్కడ చేసినట్లుగా మీ వివరాలను నింపండి. |
08:10 | మీరు ఇతర ఫీల్డ్ ల లో మరియు విభాగాలలో కొంత సమాచారాన్ని కూడా జోడించవచ్చు. అదేవిధంగా మీరు మీ చిత్రాన్ని కూడా అప్లోడ్ చేయవచ్చు. |
08:19 | నేను General మరియు Optional విభాగాలలో మరికొన్ని వివరాలను జోడించాను. |
08:25 | తరువాత Update Profile బటన్ పై క్లిక్ చేసి, పేజీని సేవ్ చేయండి. |
08:30 | ఇప్పుడు ఎగువ కుడి భాగం వద్ద ఉన్నquick access user menuపై మళ్ళీ క్లిక్ చేసి ఆపై Preferences లింకుపై క్లిక్ చేయండి. |
08:40 | Preferences పేజీ, యూజర్స్ కు వారు సవరించదలిచిన వివిధ సెట్టింగులకు త్వరిత ప్రాప్తి ని ఇస్తుంది. |
08:48 | ఒక teacher యొక్క account కొరకు Preferences పేజీ అనేది యూజర్ అకౌంట్, బ్లాగ్స్ మరియు బాడ్జేస్ గా విభజించబడింది. |
09:00 | మనము Edit Profile మరియు Change Password లను ఇప్పటికే చూసాము. |
09:06 | ఇక్కడ Language,
Forum, Editor, Course, Calendar. Message, Notification కొరకు కొన్ని యితర preferences ఉన్నాయి. |
09:19 | Calendar preferences పై క్లిక్ చేద్దాం. |
09:23 | మనము 24 గంటల ఫార్మాట్లో సమయాన్ని ప్రదర్శించడానికి క్యాలెండర్ ను సెట్ చేస్తాము. |
09:29 | మనము Upcoming events look-ahead ను కూడా 2 వారాలకు సెట్ చేస్తాము. |
09:35 | అంటే మనము క్యాలెండర్లో తదుపరి 2 వారాలలో జరుగుతున్న అన్ని ఈవెంట్లకు నోటిఫికేషన్లను చూస్తామని అర్ధం. |
09:43 | Save Changes బటన్ పై క్లిక్ చేయండి. |
09:46 | మనము ఈ సిరీస్‌లో తర్వాత, ఆ లక్షణాలను చర్చించినప్పుడు preferences యొక్క మిగిలినవాటి గూర్చి తెలుసుకుంటాము. |
09:54 | ఇక్కడ సమాచారాన్ని గమనించండి. |
09:57 | ఇది breadcrumb navigation. ఇది ఒక దృశ్య సహాయకం వంటిది అంటే మనము Moodle site యొక్క సోపానక్రమంలో ఏ పేజీపై ఉన్నామో అది సూచిస్తుంది. |
10:09 | ఒకే ఒక్క క్లిక్ తో ఇది మనల్ని ఉన్నత-స్థాయి పేజీకి తిరిగి వెళ్లడానికి సహాయపడుతుంది. |
10:15 | డాష్‌బోర్డ్ కు వెళ్ళడానికి breadcrumbs లోని డాష్‌బోర్డ్ లింకుపై క్లిక్ చేయండి. |
10:21 | ఇప్పుడు కాలిక్యుస్ కోర్సు కొరకు ఒక అంశాన్ని మరియు సంక్షిప్త సారాంశాన్ని ఎలా చేర్చాలో చూద్దాం. |
10:28 | ఎడమవైపున నావిగేషన్ మెను లోని Calculus course పై క్లిక్ చేద్దాం. |
10:34 | క్రొత్త పేజీలో, కుడిఎగువభాగం వద్ద ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేయండి. |
10:40 | తరువాత Turn editing on ఎంపిక పై క్లిక్ చేయండి. |
10:45 | పేజీ ఇప్పుడు మరిన్ని సవరణ ఎంపికలను ప్రదర్శిస్తుంది. |
10:50 | Topic 1 పక్కన ఉన్న పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
10:55 | ఇప్పుడు, కనిపించే టెక్స్ట్ బాక్స్ లో, Basic Calculus అని టైప్ చేసి Enter నొక్కండి. |
11:03 | టాపిక్ పేరు యొక్క మార్పును గమనించండి. |
11:06 | ఇప్పుడు ఆ టాపిక్ యొక్క కుడి వైపున ఉన్న Edit లింకుపై క్లిక్ చేయండి. |
11:11 | ఆపై Edit topic ఎంపికపై క్లిక్ చేయండి. |
11:15 | ఇది మనల్ని Summary పేజీకి తీసుకొస్తుంది. |
11:18 | ఇక్కడ, Summary ఫీల్డ్ లో, మన టాపిక్ యొక్క క్లుప్తమైన సారాంశాన్ని ఇవ్వవచ్చు. చూపిన విధంగా నేను టైప్ చేస్తాను |
11:27 | క్రిందికి స్క్రోల్ చేసి Save Changes బటన్ పై క్లిక్ చేయండి. |
11:32 | మార్పును గమనించండి. |
11:34 | ఈ విధంగా Moodle లో మన కోర్సు యొక్క వివరాలను ఇలా జోడించడం ప్రారంభించాము. |
11:40 | ఇప్పుడు మనం Moodle నుండి లాగౌట్ చేద్దాం. అలా చేయటానికి, ఎగువ కుడి భాగంవద్ద ఉన్నuser icon పై క్లిక్ చేయండి. ఇప్పుడు Log out ఎంపికను ఎంచుకోండి. |
11:50 | దీనితో, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి వస్తాము. సారాంశం చూద్దాం. |
11:56 | ఈ ట్యుటోరియల్ లో మనము, కోర్స్ అవలోకనం వివరాలు, టీచర్స్ డాష్‌బోర్డ్ |
12:05 | ప్రొఫైల్ ను ఎలా సవరించాలి మరియు
ప్రాధాన్యతలను ఎలా సవరించాలి, Moodle లో కోర్స్ యొక్క ప్రాధమిక వివరాలను జోడించడం గురించి నేర్చుకున్నాము. |
12:16 | అసైన్మెంట్ గా,
Calculus course లోని అన్ని టాపిక్స్ యొక్క పేర్లను మార్చండి. అన్ని టాపిక్స్ కు సంబంధిత సారాంశాలు జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. |
12:31 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:39 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
12:49 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
12:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:06 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. |
13:17 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |