Moodle-Learning-Management-System/C2/Uploading-and-editing-resources-in-Moodle/Telugu
Time | Narration |
00:01 | Moodle లో Uploading and Editing Resources అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము :
URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకుంటాము. |
00:19 | ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:25 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, |
00:33 | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:43 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:51 | ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసారని, మరియు మిమ్మల్ని ఒక టీచర్ గా రిజిస్టర్ చేసారని అనుకుంటుంది |
01:01 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి.
అడ్మినిస్ట్రేటర్ చేత వారికి కనీసం ఒక కోర్సు అయిన కేటాయించబడాలి, |
01:11 | మరియు వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి. |
01:16 | ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి. |
01:22 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి. |
01:28 | ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. |
01:35 | నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను చేర్చాను. |
01:41 | బ్రౌజర్ కు మారి మీ moodle site లో ఒక టీచర్ గా లాగిన్ అవ్వండి. |
01:48 | ఎడమవైపున navigation menu లో Calculus course పై క్లిక్ చేయండి. |
01:53 | ఈ సిరీస్లో మునుపు మనము ఒక page resource మరియు ఒక folder resource ను జోడించాము. |
02:00 | ఇప్పుడు మనము కొంత అదనపు course material ను జోడిస్తాము.
కుడి ఎగువభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆ తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి. |
02:11 | Basic Calculus section యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource పై క్లిక్ చేయండి. |
02:19 | resources యొక్క జాబితాతో ఒక పాప్ అప్ తెరుచుకుంటుంది.
దీనిని activity chooser అని పిలుస్తారు. |
02:26 | క్రిందికి స్క్రోల్ చేసి జాబితా నుండి URL ను ఎంచుకోండి.
resource గురించి సమగ్రమైన వివరణ కుడి వైపున కనిపిస్తుంది. |
02:37 | ఒక URL resource తో online resources కు లింక్ లను జోడించవచ్చు. |
02:43 | ఇవి documents, online videos, wiki pages, open educational resources మొదలైనవి కావచ్చు. |
02:52 | activity chooser యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add button పై క్లిక్ చేయండి. |
02:57 | Name ఫీల్డ్ లో, నేను Evolutes of basic curves అని టైప్ చేస్తాను. |
03:03 | తరువాత External URL టెక్స్ట్ బాక్స్ లో ఇక్కడ పేర్కొన్న URL ను టైప్ చేయండి. |
03:10 | Description టెక్స్ట్ ఏరియా అనేది ఒక ఐచ్చిక field.
ఇక్కడ చూపిన విధంగా నేను టెక్స్ట్ ను టైప్ చేస్తాను. |
03:17 | టెక్స్ట్ ఏరియా కిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
03:24 | ఇప్పుడు సెక్షన్ ను విస్తరించడానికి Appearance పై క్లిక్ చేయండి. |
03:29 | వీడియో ఎలా ప్రదర్శించబడాలో నిర్ణయించుకోవడానికి ఇక్కడ Display ఎంపిక ఉంది. |
03:35 | డ్రాప్ డౌన్ లో ఇక్కడ నాలుగు ఎంపికలు ఉన్నాయి.
Automatic ఎంపిక అనేది browser settings మరియు screen resolution లపై ఆధారపడి ఉత్తమమైన ఎంపికను ఎంచుకుంటుంది. |
03:45 | Embed అదే కోర్స్ లోపలి వీడియోను తెరుస్తుంది.
Open, యూజర్ ను అదే విండో లో URL కు తిరిగి పంపుతుంది. |
03:55 | In pop-up, వీడియో ను ఒక కొత్త పాప్ అప్ విండో లో తెరుస్తుంది. |
04:00 | మీరు In pop-up ను ఎంచుకొన్నపుడు, Pop-up width మరియు Pop-up height ఎంపికలు ఎనేబుల్ అవుతాయి
మీరు మీ ప్రాధాన్యత ప్రకారం విలువలను సవరించవచ్చు. |
04:12 | నేను Display ఎంపికగా Embed ను ఎంచుకుంటాను. |
04:17 | Activity completion section వరకు స్క్రోల్ చేసి దానిని విస్తరించడానికి దాని పై క్లిక్ చేయండి. |
04:24 | ఒకవేళ ఉపాధ్యాయిని ఒక కార్యాచరణ యొక్క ముగింపును ట్రాక్ చేయాలనుకుంటే, ఈ section అనేది ఆమెకు నిర్ణయించటంలో సహాయపడుతుంది. |
04:32 | ఇక్కడ Completion tracking కింద మూడు ఎంపికలు ఉన్నాయి.
resource ఆధారంగా మీరు ట్రాకింగ్ క్రియా విధానాన్ని నిర్ణయించవచ్చు. |
04:41 | ఇక్కడ నన్ను మూడవ ఎంపికను ఎంచుకోనివ్వండి. మరియు Student must view this activity to complete it చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
04:51 | కిందికి స్క్రోల్ చేసి దిగువభాగం వద్ద ఉన్న Save and return to course బటన్ పై క్లిక్ చేయండి. |
04:58 | యాక్టీవిటీ నేమ్ పక్కన ఉన్న చెక్ మార్క్ అనేది, కార్యాచరణ ఎప్పుడు పూర్తి అవుతుందో సూచిస్తుంది. |
05:05 | ఇప్పుడు మనము ఒక book resource ను సృష్టిద్దాం. పేరు సూచించినట్లుగా ఇది బహుళ పేజీలు, అధ్యాయాలు మరియు ఉప అధ్యాయాలను కలిగి ఉంటుంది. |
05:16 | అలాగే ఇది మల్టీమీడియా కంటెంట్ ను కలిగి ఉంటుంది. |
05:20 | ఇప్పుడు browser విండో కు తిరిగి వెళ్ళండి. |
05:23 | Basic Calculus section యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి. |
05:30 | కిందికి స్క్రోల్ చేసి Resources యొక్క జాబితా నుండి Book ను ఎంచుకోండి |
05:34 | activity chooser యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి. |
05:39 | Name ఫీల్డ్ లో Iterating evolutes and involutes అని టైప్ చేయండి. |
05:45 | ఇక్కడ చూపిన విధంగా వివరణను టైప్ చేయండి. |
05:48 | సెక్షన్ ను విస్తరించడానికి Appearance పై క్లిక్ చేయండి. |
05:51 | మొదటి ఎంపిక Chapter formatting.
ఇది మనము అధ్యాయాలు మరియు ఉప అధ్యాయాలను ఎలా చూడాలో నిర్ణయిస్తుంది. |
05:59 | ఈ ఎంపికలు స్వీయ వివరణాత్మకమైనవి. వివరణలను చదవడానికి డ్రాప్ డౌన్ కు ముందు ఉన్న Help icon పై మీరు క్లిక్ చేయవచ్చు |
06:08 | నేను దానిని Numbers గా ఉంచుతాను. |
06:11 | తరువాతి ఎంపిక Style of navigation. ఇది మనము మునుపటి మరియు తరువాతి linksని ఎలా చూపించాలో నిర్ణయిస్తుంది. |
06:19 | TOC అంటే Table of Contents. |
06:23 | ఒకవేళ మనము Images ను ఎంచుకుంటే, మునుపటివి మరియు తరువాతవి బాణాలుగా చూపబడతాయి. |
06:29 | Text మునుపటి మరియు తరువాతి అధ్యాయాలు నావిగేషన్ లో చూపిస్తుంది. |
06:34 | మనకు ప్రతీ అధ్యాయం నావిగేషన్ కు ఒక కస్టమ్ title ను అందజేయడానికి కూడా ఎంపిక ఉంది. |
06:40 | ఇది తరువాత టెక్స్ట్ గా చూపబడే అధ్యాయం పేరును భర్తీ చేస్తుంది. |
06:45 | నేను Text ను Style of navigation గా ఎంచుకుంటాను. |
06:49 | తరువాత, Restrict Access సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి.
ఇది ఈ resource కు యాక్సిస్ ఉన్నవారిని నిర్ణయించటానికి మనకు సహాయం చేస్తుంది. |
06:59 | అప్రమేయంగా, ఎటువంటి పరిమితి లేదు. అంటే ఈ course లో చేరియున్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చూడగలరని దీని అర్ధం. |
07:08 | నన్నుAdd restriction బటన్ పై క్లిక్ చేయనివ్వండి. |
07:12 | ఇక్కడ కొన్ని ఎంపికలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక దాని యొక్క వివరణను చదవవచ్చు మరియు ఎటువంటి పరిమితిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. |
07:21 | మనము ముందుగా సృష్టించిన URL resource కొరకు ఒక పూర్తిస్థాయి కార్యాచరణను ఉంచుతాము. |
07:27 | ఒక విద్యార్థి ఒక పుస్తకం పూర్తి అయ్యిందనే సంకేతం ఇచ్చేవరకు, దానికి యాక్సెస్ చేయడాన్ని పరిమితం చేద్దాం. |
07:33 | Activity completion పై క్లిక్ చేయండి. మనము పరిమితి కొరకు ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి, ఇక్కడ ఫీల్డ్స్ వేరుగా ఉంటాయి. |
07:42 | Activity completion డ్రాప్ డౌన్ లో Evolutes of basic curve ను ఎంచుకోండి.
తరువాత కండిషన్ గా Must be marked complete ను ఎంచుకోండి |
07:54 | కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
08:00 | ఇప్పుడు మనము ఈ పుస్తకానికి అధ్యాయాలు మరియు ఉప అధ్యాయాలను చేర్చవచ్చు. |
08:05 | Chapter title ను Introduction గా టైప్ చేయండి. |
08:09 | Content ను Introduction to evolutes and involutes గా టైప్ చేయండి.
ఒకవేళ ఏదైనా ఉంటే, మీరు మీ లెక్చర్ నోట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు. |
08:19 | పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
08:24 | ఈ అధ్యాయాన్ని మీరు ఇప్పుడు పేజీ యొక్క మధ్యలో చూడవచ్చు.
కుడి వైపున table of contents (విషయాల పట్టిక) ఉంది. |
08:32 | Exit Book లింకుపై క్లిక్ చేస్తే, కాలిక్యులస్ కోర్సు కు తిరిగి తీసుకు వెళ్ళ బడుతాము. |
08:38 | ఇక్కడ Introduction చాప్టర్ క్రింద ఉన్న Table of Contents బ్లాక్ లో కుడివైపున 4 ఐకాన్స్ ఉన్నాయి. |
08:46 | Edit, Delete, Hide మరియు Add new chapter. |
08:55 | ఇప్పుడు నన్ను ఒక subchapter నుజోడించనివ్వండి. Add new chapter ను సూచించే plus iconపై క్లిక్ చేయండి.
ఉప అధ్యాయాలు అనేవి అధ్యయాలు లాగానే సృష్టించబడతాయి. |
09:07 | అవి ఉప అధ్యయాలు అని సూచించడానికి ఒక అదనపు చెక్ బాక్స్ ను కలిగిఉంటాయి
ఈ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
09:15 | Chapter title గా Classical evolutes and involutes ను టైప్ చేయండి.
ఇక్కడ చూపిన విధంగా కంటెంట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి. |
09:24 | మీరు ఈ బుక్ IteratingEvolutesAndInvolutes.odt కొరకు కంటెంట్ ను ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్ లో కనుగొంటారు. |
09:31 | పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
09:37 | ఇప్పుడు మీరు (subchapter ను) ఉప అధ్యాయాన్ని చూడవచ్చు. అలాగే మునుపటి అధ్యాయం కొరకు నావిగేషన్ని కూడా గమనించండి. |
09:44 | కుడి వైపున icons పక్కన ఒక అదనపు ఐకాన్ ఉందని గమనించండి. |
09:49 | అప్ మరియు డౌన్ బాణాలు అనేవి అధ్యాయాలను క్రమంలో పెట్టడానికి. |
09:54 | మనం ఈ ఉప అధ్యాయాన్ని పైకి తరలించినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాము.
Up బాణం పై క్లిక్ చేయండి. |
10:01 | Introduction ఇప్పుడు ఉప అధ్యాయానికి బదులుగా రెండవ అధ్యాయంగా మారుతుంది గమనించండి. |
10:08 | దాన్ని మళ్ళీ తిరిగి మొదటి అధ్యాయంగా తరలించండి. |
10:11 | మళ్ళీ Classical evolutes and involutes ను మనము ఒక subchapter గా ఎలా చేస్తాము?
దానిని సవరించడానికి శీర్షిక క్రింద ఉన్న gear icon పై క్లిక్ చేయండి. |
10:21 | ఇప్పుడు దానిని ఒక ఉప అధ్యాయంగా చేయడానికి Subchapter చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
10:26 | క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
10:30 | మనం మళ్ళీ కాలిక్యులస్ కోర్సుకు తిరిగి వెళ్దాము. |
10:34 | ఇప్పుడు మనకు ఈ టాపిక్ Basic Calculus కొరకు క్రింది వనరులు (రిసోర్స్ లు) ఉన్నాయి. |
10:40 | వాటిని లాగడం ద్వారా మనము ఈ resources ను తిరిగి క్రమంలో పెట్టవచ్చు. |
10:45 | నన్ను Evolutes of Basic curves URL రిసోర్స్ ను ఇతర రెండింటి కంటే పైకి డ్రాగ్ చేయనివ్వండి. |
10:52 | ఇక్కడ ప్రతి resource యొక్క కుడి వైపున ఒక Edit లింక్ ఉంది. దానిపై క్లిక్ చేయండి. |
10:58 | ఇక్కడ resource ను edit,hide,duplicate మరియు delete చేయటానికి సెట్టింగులు ఉన్నాయి.
ఇవి స్వీయ-వివరణాత్మకమైనవి. |
11:09 | ఇక్కడ రెండు ఇతర ఎంపికలు Move right మరియు Assign roles ఉన్నాయి. |
11:14 | Move right పై క్లిక్ చేయండి.
ఇది రిసోర్స్ కు కొద్దిగా ఇండెంటేషన్ని ఇస్తుంది. |
11:21 | వేరొక రిసోర్స్ యొక్క భాగంగా ఉన్న ఒక రిసోర్స్ యొక్క దృశ్య ప్రాతినిధ్యం కోసం ఇది ఉపయోగపడుతుంది. |
11:28 | ఈ resource ను మళ్ళీ తిరిగి దాని అసలు స్థానానికి తీసుకురావడానికి Move left పై క్లిక్ చేస్తాను. |
11:34 | ఇప్పుడు మనం Moodle నుండి లాగౌట్ చేయవచ్చు. |
11:38 | ఇపుడు విద్యార్థిని Priya Sinha గా నన్ను లాగిన్ అవ్వనివ్వండి. |
11:41 | విద్యార్థిని ప్రియ సిన్హా ఈ పేజీని ఈ విధంగా చూస్తారు. |
11:46 | completion బాక్స్ లు మూదటిసారి టిక్ కాలేదని గమనించండి |
11:51 | ఈ రిసోర్స్ ని పూర్తి అయిందని మార్క్ చేయడానికి ఆమె ఈ URL ను చూడాలి. |
11:56 | URL resource పూర్తీ అయిందని మార్క్ చేసేవరకు వరకు book resource ను క్లిక్ చేయడం అవ్వదు. |
12:02 | నన్ను Evolutes of basic curves resource పై క్లిక్ చేయనివ్వండి. |
12:07 | ఇప్పుడు breadcrumb లింక్ లోని Calculus పై క్లిక్ చేయండి.
ఇప్పుడు resource పూర్తి అయ్యిందని మార్క్ చేయబడింది మరియు పుస్తకం విద్యార్థులకు అందుబాటులో ఉంది. |
12:17 | దీనితో, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి వచ్చాము.
సారాంశం చూద్దాం. |
12:23 | ఈ ట్యుటోరియల్ లో, మనము :URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకు న్నాము . |
12:34 | ఇక్కడ మీ కొరకు ఒక చిన్న అసైన్మెంట్.
మనము మునుపు సృష్టించిన పుస్తకంలో మరిన్ని అధ్యాయాలు మరియు ఉపఅధ్యాయాలను జోడించండి. |
12:42 | నిర్దేశిత విధంగా వాటిని క్రమం చేయండి.
వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. |
12:50 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:59 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
13:09 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
13:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:26 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |