Moodle-Learning-Management-System/C2/Formatting-Course-material-in-Moodle/Telugu
Time | Narration |
00:01 |
Moodle లో Formatting course material అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనము :
Moodle లో వనరులు అదనపు course material ను జోడించడం అప్రమేయ text editor లో Formatting ఎంపికలు గురించి నేర్చుకుంటాము |
00:21 | ఈ ట్యుటోరియల్ :
ఉబుంటు లైనక్స్ OS 16.04, XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:48 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది. |
00:56 | ఈ ట్యుటోరియల్,
మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసారని, మరియు మిమ్మల్ని ఒక టీచర్ గా రిజిస్టర్ చేశారని అనుకుంటుంది. |
01:06 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు
Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి. అడ్మినిస్ట్రేటర్ చేత వారికి కనీసం ఒక కోర్సు అయిన కేటాయించబడాలి, వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి. |
01:21 | ఒకవేళ 'లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి. |
01:27 | బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి. |
01:31 | మీ టీచర్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి. |
01:36 | మనము ఇప్పుడు teacher dashboard లో ఉన్నాము. |
01:39 | ఎడమవైపున ఉన్న navigation menu లో, My Courses దిగువన ఉన్న Calculus ను గుర్తించండి. |
01:45 | Calculus course పై క్లిక్ చేయండి. |
01:48 | మనము ముందుగానే announcements మరియు కొన్ని సాధారణ course వివరాలను జోడించియున్నాము. |
01:54 | ఇప్పుడు మనము కొంత అదనపు course material ను జోడిస్తాము. |
01:58 | Moodle లోని అన్నిcourse material లు Resources అని పిలువబడతాయి.
ఈ materialని ఒక టీచర్, అభ్యాసానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. |
02:09 | Resourcesఅనేవి ఉపన్యాస గమనికలు, పుస్తకాలూ వంటి అంతర్గతమైనవి లేదా Wikipedia links వంటి బాహ్యమైనవి ఏవయినా కావచ్చు. |
02:19 | ప్రారంభిద్దాం
పేజియొక్క ఎగువ కుడిభాగం వద్ద ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి. |
02:29 | గమనిక: మీరు కోర్స్ కు ఏవైనా మార్పులు చేయటానికి , editing ను on చేయవలసి ఉంటుంది. |
02:36 | Basic Calculus section యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్నAdd an activity or resource లింక్ పై క్లిక్ చేయండి. |
02:44 | resources యొక్క జాబితాతో ఒక పాప్ అప్ తెరుచుకుంటుంది. |
02:48 | క్రిందికి స్క్రోల్ చేసి జాబితా నుండి Page ను ఎంచుకోండి. మీరు ఏదయినా resourceను ఎంచుకున్నప్పుడు దాని కుడిభాగం పైన resource గురించి వివరణాత్మక వర్ణనను చదవండి. |
03:01 | పాప్ అప్ స్క్రీన్ యొక్క దిగువభాగం వద్ద ఉన్నAdd button పై క్లిక్ చేయండి. |
03:06 | Name ఫీల్డ్ లో, నేను Lecture 1 Notes ను టైప్ చేస్తాను. |
03:12 | తరువాత Description బాక్స్ లో, Involutes and construction of Involute of circle టైప్ చేయండి. |
03:22 | Display description on course page ఎంపికను తనిఖీ చేయండి. |
03:27 | Page Content బాక్స్ ను చూడటానికి స్క్రోల్ చేయండి. BasicCalculus-Involutes.odt ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి. |
03:40 | మనము తరువాత దశలో చిత్రాన్ని అప్లోడ్ చేస్తాము. ఈ ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్ లో అందుబాటులో ఉంది. |
03:51 | ఇప్పుడు మనం టెక్స్ట్ ను format చేద్దాం. menu widgets లను విస్తరించేందుకు ఎగువ ఎడమ భాగం వద్ద ఉన్న డౌన్-బాణం పై క్లిక్ చేయండి. |
04:03 | చూపబడినవిధంగా నేను శీర్షికలను మరింత స్పష్టంగా చేస్తాను. |
04:07 | text editor లోని ఎంపికలు, ఏదయినా ఇతర ప్రామాణిక text editor కు సమానంగా ఉంటాయి. ఇక్కడ మనం Bold, Italics, Unordered మరియు Ordered lists వంటి ఎంపికలను చూడవచ్చు. |
04:24 | మనం ఒక టెక్స్ట్ ను hyperlink మరియు unlink చేయడానికి ఎంపికలను చూస్తాము. |
04:30 | అలాగే ఇక్కడ ఒక చిత్రాన్ని జోడించడానికి కూడా ఎంపిక ఉంది. Figure 1 shows the involute of a circle టెక్స్ట్ కు తరువాత ఒక చిత్రాన్ని జోడిద్దాం. |
04:41 | చిత్రం కొరకు స్థలాన్ని ఖాళీని చేయడానికి Enter నొక్కండి. తరువాత Image iconపై క్లిక్ చేయండి. |
04:48 | Image properties విండో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఒక external image ను చేర్చదలచినట్లయితే, ఇక్కడ image యొక్క URL ను ఎంటర్ చెయ్యవచ్చు. |
04:58 | నేను ఒక imageని అప్ లోడ్ చేయడానికి Browse Repositories బటన్ పై క్లిక్ చేస్తాను. |
05:04 | File Picker అనే శీర్షికతో ఒక పాప్ అప్ విండో తెరుచుకుంటుంది. |
05:09 | Upload a file పై క్లిక్ చేయండి . తరువాత Choose File లేదా Browse బటన్ పై క్లిక్ చేసి, మీ మెషీన్ నుండి ఫైల్ను ఎంచుకోండి. |
05:19 | ఈ image, Code Filesలింక్ లో కూడా అందుబాటులో ఉంది. మీరు దానిని డౌన్లోడ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. |
05:26 | Upload this file బటన్ పై క్లిక్ చేయండి. |
05:29 | మనము వివరణనుThis is the involute of a circle గా టైప్ చేస్తాము. |
05:36 | చివరగా, image ను చేర్చడానికి Save image బటన్ పై క్లిక్ చేయండి. |
05:42 | తరువాతి ఎంపిక అనేది mediaను జోడించడానికి. ఇది URL, video లేదా audio ఫైల్ కావచ్చు. మళ్ళీ, ఇది ఒక బాహ్య URL అయి ఉండవచ్చు లేదా మన మెషిన్ నుండి అప్లోడ్ చేయబడినది కావచ్చు. |
05:58 | తరువాతది Manage Files ఎంపిక, దానిపై క్లిక్ చేద్దాం. |
06:04 | Manage Files ఎంపిక అనేది మీరు నిల్వ చేయదలిచిన మరియు ప్రదర్శించదలిచిన ఫైల్స్ యొక్క ఒక జతను కలిగి ఉండాలి. ఇది assignment submissions, resource files, మొదలైనవి చేర్చుకునేలా ఉండాలి. |
06:17 | అవి ఈ course లో ఏవయినా ఇతర resourceల ద్వారా ఉపయోగించబడవచ్చు. మనము ఇప్పుడే అప్ లోడ్ చేసిన image కూడా ఇక్కడ ఉంది. |
06:27 | ఈ పాప్-అప్ బాక్స్ కి ఎడమవైపున 3ఐకాన్స్ ఉన్నాయి. |
06:32 | మొదటిది File picker, దానిపై క్లిక్ చేద్దాం. |
06:37 | ఇది server files, recent files, మొదలైనవి చూడటానికి ఎంపికలను కలిగిఉంది. Server files అనేవి కోర్సులో మరెక్కడైనా ఉపయోగించిన మరియు తిరిగి ఉపయోగించబడే ఫైళ్ళు. |
06:52 | X icon పై క్లిక్ చేయడం ద్వారా ఇప్పటి కొరకు నేను దీనిని మూసివేస్తాను. |
06:57 | తరువాత, మనం Create Folder icon పై క్లిక్ చేస్తాము, ఇది రెండవ ఐకాన్. |
07:04 | New folder name ఫీల్డ్ లో, Assignments అని టైప్ చేద్దాం. |
07:10 | తరువాత Assignments ఫోల్డర్ ను తెరవడానికి దానిపై క్లిక్ చేయండి. |
07:15 | Assignments ఫోల్డర్ లోపలి నా ఫైల్ ను నన్ను డ్రాగ్ చేయనివ్వండి. |
07:20 | ఇప్పుడే అప్ లోడ్ చేయబడిన, ఆ ఫైల్ పై క్లిక్ చేయండి. |
07:24 | ఈ పాప్-అప్, ఫైల్ పేరు మరియు రచయితను సవరించడానికి ఎంపికను కలిగి ఉంది. అలాగే ఫైల్ ను డౌన్లోడ్ చేయడానికి లేదా తొలగించదానికి కూడా. |
07:34 | నేను దేనినీ మార్చాలని అనుకోవడం లేదు. కనుక నేను పాప్-అప్ యొక్క దిగువభాగం వద్ద ఉన్నCancel బటన్ పై క్లిక్ చేస్తాను. |
07:41 | ఇప్పుడు, ట్యుటోరియల్ ను పాజ్ చేసి ఈ చిన్న అసైన్మెంట్ ను చేయండి:
Reference Material అనే ఒక ఫోల్డర్ ను సృష్టించండి. ఈ ఫోల్డర్, Files అనే ఫోల్డర్ లోపల ఉందని మరియు Assignments అనే సబ్ ఫోల్డర్ లోపల లేదని నిర్ధారించుకోండి. |
07:57 | 3 ఫైళ్ళను అప్లోడ్ చేయండి. మీరు ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్లో వాటిని కనుగొంటారు. |
08:05 | మీరు ఈ అసైన్మెంట్ ను పూర్తి చేసిన తర్వాత ఈ ట్యుటోరియల్ను పునఃప్రారంభించండి. |
08:10 | మీ File manager ఇప్పుడు 2 ఫోల్డర్లను అనగా Assignments మరియు Reference Material కలిగి ఉండాలి. |
08:18 | మరియు involutes-img1.png అనే పేరు గల మరో ఫైల్. |
08:26 | ఎగువ కుడిభాగం వద్ద ఉన్న X icon పై క్లిక్ చేయడం ద్వారా పాప్ అప్ విండో ను మూసివేయండి . |
08:33 | తరువాతి ఫార్మాటింగ్ ఎంపికల యొక్క సెట్,
Underline, Strikethrough, Subscript మరియు Superscript. |
08:45 | Align మరియు indent ఎంపికలు వీటిని అనుసరిస్తాయి. ఇవి ఏదయినా ఇతర text editor లోని వాటిలాగానే పనిచేస్తాయి. |
08:53 | equation editor అనే తరువాతి ఎంపికను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
08:59 | నేను ఈ వాక్యాన్ని ఒక సమీకరణంతోపాటు జోడించాలనుకుంటున్నాను. కనుక నేను equation editor ఐకాన్ పై క్లిక్ చేస్తాను. తరువాత సమీకరణాన్ని టైప్ చేయడానికి equation editor ను ఉపయోగించండి. |
09:14 | సమీకరణాలను టైప్ చేయడానికి LaTeX ను ఎలా ఉపయోగించాలి అనేదాని గురించి వివరాలు Additional Reading Material లింక్ లో ఉన్నాయి. మీరు పూర్తి చేసిన తర్వాత Save equation బటన్ పై క్లిక్ చేయండి. |
09:29 | Insert character, insert table మరియు clear formatting ఎంపికలు,ఏదయినా ఇతర text editor లోని వాటిలాగానే పనిచేస్తాయి. |
09:40 | తరువాతి రెండు ఎంపికలు Undo మరియు Redo. ఎప్పుడైనా కొన్ని సేవ్ కాని టెక్స్ట్ లు ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఎనేబుల్ అవుతాయి. |
09:51 | దీని తర్వాత, accessibility కొరకు 2 ఎంపికలు ఉన్నాయి. మొదటి ఐకాన్ Accessibility checker మరియు రెండవది screen reader helper. |
10:05 | accessible websitesమరియు ఈ ఎంపికల గురించిన వివరాలు Additional Reading Material లింక్ లో ఉన్నాయి. |
10:14 | చివరి ఎంపిక editor view నుండి HTML code వ్యూ కు టోగుల్ చేయుటకు ఉంది. ఇది చిత్రాలను embed చేయుటకు, వీడియోస్, PPT, ఇంటరాక్టివ్ కంటెంట్, మొదలైనవాటికి ఉపయోగించబడవచు. |
10:30 | HTML టోగుల్ పై మళ్ళీ క్లిక్ చేయండి. ఇది మనల్ని సాధారణ editor view కు తీసుకువస్తుంది. |
10:39 | ఈ ప్రదర్శన కోసం bold, italics మరియు listఎంపికలను ఉపయోగించి నేను టెక్స్ట్ ను ఫార్మాట్ చేశాను. మీ కంటెంట్ కొరకు మీరు కూడా అదేవిధంగా చేయండి. |
10:52 | మీరు ఫార్మాటింగ్ ను పూర్తి చేసిన తర్వాత, దిగువ భాగానికి స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
11:01 | ఇప్పుడు మనం Moodle నుండి లాగౌట్ చేయవచ్చు. |
11:05 | విద్యార్థిని ప్రియ సిన్హా ఈ పేజీని ఈ విధంగా చూస్తారు. |
11:11 | దీనితో, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. |
11:19 | ఈ ట్యుటోరియల్ లో, మనము :
Moodle లో రిసోర్సెస్ course material ను జోడించడం అప్రమేయ text editor లో Formatting ఎంపికలు గురించి నేర్చుకున్నాము |
11:34 | ఇక్కడ మీ కొరకు మరొక అసైన్మెంట్.
Basic Calculus లో resource అనే ఒక కొత్త ఫోల్డర్ ను జోడించండి File Managerనుండి reference filesను జోడించండి వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. |
11:51 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
12:10 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
12:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:27 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. |
12:38 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |