Moodle-Learning-Management-System/C2/Course-Administration-in-Moodle/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:52, 11 April 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Moodle లో Course Administration అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో Course కోర్సు నిర్వహణ, కార్యకలాపాలు

మరియు ఒక కోర్స్ లో వనరుల గురించి నేర్చుకుంటాము.

00:17 ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:24 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
00:33 Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
00:40 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.

00:52 ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసి, మిమ్మల్ని ఒక గురువుగా నమోదు చేసారని అనుకుంటుంది.
01:03 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి.
01:09 అడ్మినిస్ట్రేటర్ చేత వారికీ కనీసం ఒక్క కోర్స్ అయిన కేటాయించబడాలి,

వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి.

01:19 ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి.
01:26 బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి.
01:31 మీ టీచర్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి.

నేను ఇప్పటికే టీచర్ రెబెక్కా రేమండ్ గా లాగిన్ చేశాను.

01:41 మనము teacher’s dashboard లో ఉన్నాము.
01:44 ఎడమవైపున ఉన్న navigation menu లో, My Courses దిగువన ఉన్న Calculus ను గుర్తించండి.
01:51 దయచేసి గమనించండి. మీరుటీచర్ గా లేదా విద్యార్థి గా నమోదు చేసిన అన్ని కోర్సులు ఇక్కడ జాబితా చేయబడతాయి.
01:59 Calculus course పై క్లిక్ చేయండి.
02:02 మేము ముందు ట్యుటోరియల్లో కోర్సు టాపిక్స్ మరియు సారాంశాలను నవీకరించాము.
02:09 ఒకవేళ మీరు అలా చేయకపోతే, దయచేసి ముందు ట్యుటోరియల్స్ యొక్క అసైన్మెంట్ లను చూడండి.
02:16 మనము ఇప్పుడు కొన్ని ఉపయోగకరమైన కోర్సు సెట్టింగుల గురించి నేర్చుకుంటాము.
02:21 section యొక్క కుడి ఎగువభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేయండి.
02:26 అన్ని sections ను విస్తరించడానికి, కుడివైపున ఉన్న Edit Settings పై క్లిక్ చేసి తరువాత Expand All పై క్లిక్ చేయండి.
02:36 ఇక్కడ కనిపించే సెట్టింగులు, ఈ కోర్సు సృష్టించబడినప్పుడు, అడ్మినిస్ట్రేటర్ ద్వారా నిర్వచించబడ్డాయి.
02:44 General section లో మనము Course full name ను కలిగిఉన్నాము.

కోర్సు పేజీ యొక్క ఎగువభాగం వద్ద ప్రదర్శించబడే పేరు ఇదే.

02:54 Course short name అనేది course navigation లో మరియు కోర్స్ కు సంబందించిన ఇమెయిల్స్ లో ప్రదర్శించబడే పేరు.
03:03 Course category అనేది ఇప్పటికే అడ్మిన్ చేత సెట్ చేయబడింది.
03:08 మన అవసరాలకు అనుగుణంగా మనం కోర్సు start date, కోర్సు end date మరియు కోర్సు ID నంబర్ ను మార్చవచ్చు.
03:21 Description section కింద, Course Summary టెక్స్ట్ బాక్స్ ను చూడండి.

నేను ఇప్పటికే ఉన్న కంటెంట్ ను తొలగిస్తాను మరియు కిందివాటిని టైప్ చేస్తాను.

03:31 నా విద్యార్థులు దీనిని నా కోర్సు యొక్క మొదటి పేజీలో చూస్తారు.
03:37 తరువాత Course summary files అనే ఫీల్డ్ వస్తుంది.

ఈ ఫైళ్లు, కోర్సు summaryతో పాటు విద్యార్థులకు ప్రదర్శించబడే ఫైళ్లు.

03:47 అప్రమేయంగా, Course summary ఫైల్స్ గా jpg, gif మరియు png ఫైల్ రకాలు మాత్రమే అనుమతించబడతాయి.
03:56 ఫైల్ ను అప్లోడ్ చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి: బాక్స్ లోని ఫైల్ ను డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం.
04:03 ఎడమ ఎగువ భాగం వద్ద ఉన్నUpload లేదా Add ఐకాన్ పై క్లిక్ చేయడం.

downward arrow పై క్లిక్ చేయడం.

04:11 ఒకవేళ మీరు Upload లేదా Add ఐకాన్ పై లేదా downward arrow పై క్లిక్ చేస్తే, File picker డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:21 ఎడమవైపు మెనూ లో ఉన్న Upload a file ఎంపికపై క్లిక్ చేయండి.
04:26 Browse లేదా Choose File బటన్ పై క్లిక్ చేయండి.

తరువాత మీ కంప్యూటర్ నుండి కావలసిన ఫైల్ను ఎంచుకోండి.

04:34 నా సిస్టమ్ నుండి నేను calculus.jpgను ఎంచుకుంటాను.
04:40 మీరు Save as ఫీల్డ్ లో టైప్ చేయడం ద్వారా దానికి వేరొక పేరును ఇవ్వవచ్చు.
04:46 సంబంధిత విభాగాలలో author మరియు లైసెన్స్ వివరాలను పేర్కొనండి.

చివరగా, దిగువ భాగం వద్ద ఉన్న Upload this file బటన్ పై క్లిక్ చేయండి.

04:58 ఈ విధంగా మనం Course summary ఫైల్స్ ను అప్లోడ్ చేయగలము.
05:02 తరువాత Course format వస్తుంది. కోర్స్ ఫార్మాట్ అనేది విద్యార్థుల కొరకు వనరులు మరియు కార్యకలాపాలు అనేవి ఏవిధంగా నిర్వహించబడతాయో సూచిస్తుంది.
05:12 ఫార్మాట్ డ్రాప్డౌన్లో 4 ఎంపికలు ఉన్నాయి -

అవి Single Activity Format, Social Format,Topics Format మరియు Weekly Format

05:26 మా అడ్మిన్ Topics format ను ఎంచుకున్నారు.

మనం దానిని ఉన్నది ఉన్నట్లుగా ఉంచుదాం.

05:33 తరువాతి సెట్టింగ్ అనేది Hidden sections కొరకు.

ఇవి ప్రాథమికంగా ఒక కోర్సు లో విద్యార్థుల నుండి దాచిపెట్టిఉంచిన టాపిక్స్.

05:44 ఇది ఉపాధ్యాయుడు ఇంకా పూర్తి చేయని ఒక నిర్దిష్ట అంశం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.

ఈ అమర్పు Hidden sections ను విద్యార్థులకు ఎలా ప్రదర్శించాలో నిర్ణయిస్తుంది.

05:57 ఈ ఎంపికను ఎంచుకోవడం వలన విద్యార్థులకు కంటెంట్ ను కొలాప్స్డ్ రూపంలో (ఫార్మ్ )ప్రదర్శిస్తారు.
06:04 ఈ ఎంపికను ఎంచుకోవడం వలన విద్యార్థుల నుండి కంటెంట్ ను దాస్తుంది.
06:09 ఇప్పటి కొరకు మనము దానిని అప్రమేయంగా ఉంచుదాం.
06:13 తరువాతి డ్రాప్-డౌన్ అనేది Course Layout. దానిపై క్లిక్ చేయండి.
06:19 ఈ ఎంపికను ఎంచుకోవడం ద్వారా మనము ఒక పేజీలో అన్ని సెక్షన్స్ ను చూపించడాన్ని ఎంచుకోవచ్చు.
06:25 ఇక్కడ మరొక ఎంపిక Show one section per page.

ఇది sections యొక్క సంఖ్య ఆధారంగా కోర్స్ ను అనేక పేజీలపై విభజిస్తుంది.

06:37 ఇప్పటి కొరకు మనం Show all sections in one pageని అలాగే ఉంచుదాం.
06:43 తరువాతది Appearance సెక్షన్.
06:46 Show gradebook to students ఎంపికను గుర్తించండి.

కోర్సు లో చాలా కార్యకలాపాలు, టీచర్స్ కు గ్రేడ్స్ ను ఇవ్వడానికి అనుమతినిస్తాయి.

06:57 ఈ ఎంపిక, ఒక విద్యార్థి ఆ గ్రేడ్స్ ను చూడ గలడో లేదో అనేది నిర్ణయిస్తుంది.

ఈ ఎంపిక అప్రమేయంగా Yes కు సెట్ చేయబడుతుంది. మనము దానిని అలాగే ఉంచుదాం.

07:10 ఒకవేళ డిఫాల్ట్ గా ఇప్పటికే ఎంపిక చేయబడకపోతే, మనం Show activity reports ను Yes గా మార్చుదాం.
07:18 ఇది ఒక విద్యార్థి అతని / ఆమె యొక్క ప్రొఫైల్ పేజీ నుండి అతని / ఆమె కార్యకలాపాల నివేదికలను చూడగలరని నిర్ధారిస్తుంది.
07:27 మనము ఈ కోర్సు కొరకు అప్లోడ్ చేయగల ఫైళ్ళ యొక్క గరిష్ఠ పరిమాణాన్ని సెట్ చేయవచ్చు.
07:34 అదనపు విషయాలు, అసైన్మెంట్లు మొదలైనవాటి కొరకు ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు.
07:41 మాఅడ్మిన్ దీన్ని 128MB కు సెట్ చేసారు, ఇది గరిష్ట ఫైలు పరిమాణం.

మనము పరిమాణాన్ని అలాగే ఉంచుదాము.

07:52 మనము మిగిలిన అన్ని ఇతర సెట్టింగ్స్ ను వాటి అప్రమేయ విలువల వద్ద అలాగే ఉంచుతాం.
07:58 క్రిందికి స్క్రోల్ చేసి, Save and display బటన్ పై క్లిక్ చేయండి.

మనము కోర్స్ పేజీకి మళ్ళించబడుతాము.

08:06 టాపిక్ నేమ్స్ పైన గల Announcements లింక్ ను గుర్తించండి.
08:11 ఇది విద్యార్థులకు తప్పనిసరి సమాచారం, తాజా వార్తలు, అంనౌన్సమెంట్స్ మొదలైన వాటి గురించి తెలుపుతుంది.
08:20 పేజి యొక్క ఎగువ కుడిభాగం వద్ద ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి, ఆ తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి.
08:28 గమనిక: మీరు కోర్స్ కు ఏవైనా మార్పుల చేయడానికి, editing ను on చేయాల్సిన అవసరం అవుతుంది.
08:35 ఇపుడు, అంనౌన్సమెంట్స్ యొక్క కుడి వైపున, Edit పై క్లిక్ చేసి తరువాత Edit Settings పై క్లిక్ చేయండి.
08:44 మరియు Description లో నేను ఈ క్రింది టెక్స్ట్ ను టైప్ చేస్తాను.

Please check the announcements regularly.

08:52 Display description on course page ను తనిఖీ చేయండి. ఇది లింక్ క్రింద ఉన్న వివరణని ప్రదర్శిస్తుంది.
09:01 మిగిలిన అన్ని సెట్టింగులను ఎలా ఉన్నవాటిని అలా వదిలివేయండి .
09:05 స్క్రోల్ చేసి Save and return to course బటన్ పై క్లిక్ చేయండి.

మనము Courseపేజీకి తిరిగి వస్తాము.

09:15 మరిన్నిఅంనౌన్సమెంట్స్ లను జోడించడానికి Announcements శీర్షికపై క్లిక్ చేయండి.
09:21 ఇప్పుడు Add a new topic బటన్ పై క్లిక్ చేయండి. Subject ను Minimum requirements గా టైప్ చేయండి
09:31 మెసేజ్ ను This course requires you to submit a minimum of 3 assignments and attempt 5 quizzes to pass గా టైప్ చేయండి.
09:43 Discussion subscription చెక్ బాక్స్ తనిఖీ చేయబడిందని మరియు అది సవరించలేనిది అని గమనించండి.

ఇది ఎందుకంటే కోర్సులో నమోదు చేసుకున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా దానిని సబ్స్క్రయిబ్ చేసుకోవాలి.

09:59 తరువాతది Attachments. ఇక్కడ మీరు సంబంధిత ఫైళ్ళను డ్రాగ్ చేసి డ్రాప్ చెయ్యవచ్చు లేదా అప్లోడ్ చేయవచ్చు.
10:08 ఒకవేళ మీరు ప్రకటనలను forum యొక్క ఎగువభాగం వద్ద చూపించాలనుకుంటే, Pinned చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.

నేను దానిని టిక్ చేస్తాను.

10:18 అదే విధంగా తరువాత చెక్ బాక్స్ నూ టిక్ చేయండి.

ఇది ఈ forum కు సబ్స్క్రయిబ్ అయిఉన్న ప్రతిఒక్కరికి వెంటనే ఒక notification ను పంపుతుంది.

10:29 తరువాతి సెక్షన్ Display period ను విస్తరించండి.

ఒకవేళ ఈ forum post ఒక తేదీ పరిధి కొరకు తప్పనిసరిగా కనిపించటానికి ఇక్కడ ఈ సెటింగ్స్ నిర్ణయిస్తాయి.

10:41 అప్రమేయంగా, ఇవి డిసేబుల్ చెయ్యబడ్డాయి. అంటే పోస్ట్స్ ఎల్లప్పుడూ కనిపిస్తాయని దీని అర్థం.

మనము డిఫాల్ట్ సెట్టింగులను అలాగే ఉంచుతాము.

10:52 స్క్రోల్ చేసి Post to forumబటన్ పై క్లిక్ చేయండి
10:57 ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. పోస్ట్స్ కు ఏవయినా మార్పులు చేయటానికి Post authors కు 30 నిమిషాల సమయం ఉంటుంది.
11:08 నన్నుbreadcrumb లోని Calculus లింక్ పై క్లిక్ చేయనివ్వండి.
11:13 ఇప్పుడు ఈ సెక్షన్ కు వివరణాత్మక సిలబస్ తో ఒక పేజీని నన్ను చేర్చనివ్వండి.
11:19 General section యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.

Resources యొక్క జాబితా నుండి, Page ను ఎంచుకోండి.

11:32 మీరు దీనిని ఎంపిక చేసుకున్నప్పుడు ఈ కార్యాచరణ యొక్క వివరణను చదవండి.
11:39 తరువాత దిగువ భాగం వద్ద ఉన్నAdd బటన్ పై క్లిక్ చేయండి.

మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడతాము.

11:47 Name ఫీల్డ్ లో, Detailed syllabusను టైప్ చేయండి.
11:52 నేను Description టెక్స్ట్ బాక్స్ ను ఖాళీగా వదిలివేస్తాను ఎందుకంటే ఈ శీర్షిక అనేది స్వీయ-వివరణాత్మకమైనది.
11:59 Page Content టెక్స్ట్ బాక్స్ లో నేను ఈ కాలిక్యులస్ కోర్సు యొక్క వివరణాత్మక సిలబస్ ను ఎంటర్ చేస్తాను.
12:07 ఈ కంటెంట్, ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్ లో అందుబాటులో ఉంది.

మీరు దీనిని డౌన్లోడ్ చేసుకుని మీరు అభ్యాసం చేస్తున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు.

12:18 స్క్రోల్ చేసి Save and return to courseబటన్ పై క్లిక్ చేయండి.

మనము courseపేజీకి మళ్ళి తిరిగివస్తాము.

12:27 ఇపుడు మనం మన అకౌంట్ నుండి logout చేద్దాము.ఆలా చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న user icon పై క్లిక్ చేయండి.

ఇప్పుడు Log outఎంపికను ఎంచుకోండి.

12:39 ఈ పేజీ ఒక విద్యార్థిని ఎలా కనిపిస్తుందో నన్ను మీకు చూపించనివ్వండి.
12:45 నా వద్ద విద్యార్థిని Priya Sinha ID ఉంది.

ఈ విద్యార్థిని కూడా Calculus కోర్సులో admin చేత నమోదుచేయబడిఉంది.

12:55 నేను విద్యార్థిని Priya Sinha గా లాగిన్ అయి ఉన్నాను. ఇపుడు నేను ఎడమవైపున ఉన్నCalculus పై క్లిక్ చేస్తాను.
13:04 ఈ పేజీని ఒక విద్యార్థి ఇలా చూస్తుంది

ఈ పేజీ యొక్క ఎగువ కుడిభాగం వద్ద gear icon లేదని గమనించండి.

13:14 ఇది ఎందుకంటే విద్యార్థులు కోర్సు యొక్క ఏ భాగాన్ని సవరించలేరు కనుక.
13:20 ఇప్పుడు మనం student id నుండి లాగౌట్ చేస్తాము.
13:24 దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.

సారాంశం చూద్దాం.

13:30 ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో కోర్సు నిర్వహణ,

కార్యకలాపాలు మరియు ఒక కోర్స్ లో వనరుల గురించి నేర్చుకున్నాము.

13:40 ఇక్కడ మీకొరకు ఒక చిన్న అసైన్మెంట్.

కోర్స్ ఫలితం వనరును వివరించే ఒక కొత్త పేజీని జోడించండి.వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్కAssignment లింకును చూడండి.

13:53 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

14:02 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

14:13 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
14:17 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
14:31 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya