Moodle-Learning-Management-System/C2/Installing-Moodle-on-Local-Server/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:33, 10 March 2019 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search


Time Narration
00:01 Installing Moodle on Local Server అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం ఎలా Moodleని Download మరియు ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాం.
00:15 Moodle ను ఇన్స్టాల్ చేయడానికి, మీరు వీటికి మద్దతు ఇచ్చే సిస్టం ను కలిగివుండాలి

Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్)

00:23 MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్) మరియు PHP 5.4.4(లేదా అంతకంటే ఎక్కువ వర్షన్)
00:36 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,

నేను ఉబుంటు లైనక్స్ OS 16.04

00:44 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP
00:53 Moodle 3.3 మరియు Firefox వెబ్ బ్రౌజర్ లను ఉపయోగిస్తున్నాను.
00:59 మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు.
01:03 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా అసమానతలకు కారణమవుతుంది కనుక.
01:11 మీరు ప్రారంభించడానికి ముందు మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
01:16 ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్స్ ను కూడా చుడండి.

మరియు ముందస్తు అవసరాలకు సంబందించినవి ఇంకా డేటాబేస్ సెటప్ అనేది సరిగ్గా ఉన్నాయని నిర్దారించుకోండి.

01:27 మనము నడుస్తున్న XAMPP ను మరియు username moodle-st తో డేటాబేస్ సెటప్ ను కలిగివుండాలి.
01:37 మొదట, నన్ను వెబ్ బ్రౌజరుకు వెళ్ళి, XAMPP ను ప్రారంబించనివ్వండి.
01:42 అడ్రస్ బార్ లో http colon double slash 127 dot 0 dot 0 dot 1 అని టైప్ చేసి ఆపై ఎంటర్ నొక్కండి.
01:56 స్క్రీన్ యొక్క కుడి ఎగువ భాగం వద్ద ఉన్న మెనులో PHPinfo పై క్లిక్ చేయండి
02:02 ఇప్పుడు Ctrl + F కీ లను నొక్కి DOCUMENT underscore ROOT కొరకు వెతకండి.
02:10 ఇది Apache Environment పట్టికలో కనుగొనబడుతుంది.
02:14 DOCUMENT underscore ROOT యొక్క విలువ slash opt slash lampp slash htdocs లేదా slash var slash www ఏదయినా ఉంటుంది.
02:30 నా మెషిన్ లో, ఇది slash opt slash lampp slash htdocs.
02:37 దయచేసి ఈ పాత్ ని రాసి పెట్టుకోండి. ఇక్కడ మనము Moodle ను ఇన్స్టాల్ చేయబోతున్నాము.
02:43 Moodle ను డౌన్లోడ్ చేయడం ప్రారంభిద్దాం.

Moodle యొక్క అధికారిక వెబ్ సైట్ అయిన Moodle.org కు వెళ్ళండి.

02:53 తెరుచుకున్న మెనూ నుండి Downloads పై క్లిక్ చేయండి.

ఆపై తాజా రిలీజ్ బటన్ MOODLE 3.3+ పై క్లిక్ చేయండి.

03:04 ఈ ట్యుటోరియల్ రికార్డింగ్ సమయంలో, Moodle 3.3 అనేది తాజా స్థిరమైన సంస్కరణ.

మీరు ప్రయత్నించినప్పుడు ఇది భిన్నంగా ఉండవచ్చు.

03:15 డౌన్లోడ్ జిప్ బటన్ పై క్లిక్ చేయండి. ఇది మన కంప్యూటరులో Moodle ను డౌన్ లోడ్ చేయడాన్ని ప్రారంభిస్తుంది.
03:22 నేను ఇప్పటికే ఈ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకున్నాను మరియు ఇది నా డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంది.

కనుక నేను ఈ దశను దాటవేస్తాను.

03:30 Ctrl + Alt + T కీ లను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టర్మినల్ ను తెరవండి.
03:36 టర్మినల్ పై, నేను Downloads కు డైరెక్టరీని మార్చుతాను.
03:40 ఆలా చేయడానికి, ఈ కమాండ్ cd space Downloads అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:48 మీ సిస్టం పై మీరు డౌన్లోడ్ చేసిన Moodle ను ఎక్కడ పెట్టారో ఆ పాత్ ను మీరు టైప్ చేయాలి.
03:53 ఒకసారి మీరు ఆ డైరెక్టరీలో ఉంటే, అక్కడ ఉన్న ఫైల్స్ జాబితా కొరకు ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:01 ఇక్కడ నా Moodle ఇన్స్టలేషన్ ఫైల్, moodle hyphen latest hyphen 33 dot zip అనే పేరుతో ఉంది.
04:11 డౌన్ లోడ్ చేసేటప్పుడు మీరు దాని పేరును మారిస్తే, అపుడు ఆ ఫైల్ని మీ ఫోల్డర్లో గుర్తించండి.
04:19 తరువాత, మనం ఈ జిప్ ఫైల్ యొక్క కంటెంట్ లను moodle ఫోల్డర్ లోనికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
04:26 కమాండ్ ప్రాంప్ట్ వద్ద sudo space unzip space moodle hyphen latest hyphen 33 dot zip space hyphen d space slash opt slash lampp slash htdocs slash అని టైప్ చేసి ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
04:51 Ctrl + L ని నొక్కడం ద్వారా టర్మినల్ ను శుభ్రం చేద్దాం.
04:56 ఇప్పుడు cd space slash opt slash lampp slash htdocs అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:06 ఈ డైరెక్టరీలోని ఫైళ్ళను జాబితా చేయడానికి, ls అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
05:12 moodle అనే పేరుతో ఒక కొత్త ఫోల్డర్ సృష్టించబడిందని మీరు చూడవచ్చు.
05:18 moodle ఫోల్డర్ యొక్క యజమాని మరియు గ్రూప్ సభ్యులకు, చదవడం, వ్రాయడం, మరియు అమలు చేయటానికి అనుమతులు ఇద్దాము.
05:27 కనుక, sudo space chmod space 777 space moodle slash అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:39 ఒకవేళ ప్రాంప్ట్ చేయబడితే administrative పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఎంటర్ నొక్కండి.
05:45 ఇప్పుడు బ్రౌజర్ కు మారి http colon double slash 127.0.0.1 slash moodle అని లేదా http colon double slash localhost slash moodle అని టైప్ చేయండి.
06:06 నేను ఇక్కడ నా localhost IP ను టైప్ చేశాను.
06:10 ఈ IP తప్పనిసరిగా ఏదయితే మెషిన్ పై moodle ఇన్స్టాల్ చేయబడివుందో ఆ మెషిన్ యొక్క IP అయిఉండాలి.

దయచేసి గమనించండి, moodle అనేది ఫోల్డర్ ఏదయితే మునుపు మనం దానిలోనికి ఎక్స్ట్రాక్ట్ చేసామో అది.

06:23 ఎంటర్ నొక్కండి మరియు మీరు Moodle ఇన్స్టాలేషన్ పేజీని చూస్తారు.
06:29 అప్రమేయంగా, మనము ఒకటవ నెంబర్ దశలో ఉన్నాము, అంటే కాన్ఫిగరేషన్.

దయచేసి గమనించండి: Moodleని పలు భాషల్లో ఇన్స్టాల్ చేయబడవచ్చు.

06:40 కానీ మనం ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం చేస్తాము.

కనుక, ఇక్కడ ఇంగ్లీష్ ను ఎంచుకోండి. లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ కింద Next బటన్ పై క్లిక్ చేయండి.

06:52 తరువాతది పాత్స్ పేజీ.
వెబ్ అడ్రస్, moodle డైరెక్టరీ మరియు డేటా డైరెక్టరీ లు నిర్వచించబడింది ఇక్కడే.
07:02 ఒకసారి Moodle ఇన్స్టాల్ చేయబడితే దానిని యాక్సెస్ చేయడానికి వెబ్ అడ్రస్ అనేది మనకొరకు URL.
07:08 ఇది అదే URL ఏదయితే మనము పైన ఎంటర్ చేశామో, ఇక్కడ చూపించబడుతుంది కూడా అది.
07:14 Moodle డైరెక్టరీ, Moodle కోడ్ అంతా అందుబాటులో వున్న ఫోల్డర్.
07:20 ఇక్కడ గమనించండి - వెబ్ అడ్రస్ మరియు Moodle డైరెక్టరీ రెండు ఫీల్డ్స్ ను ఎడిట్ చేయలేము.

ఇవి మన ద్వారా మార్చబడవు.

07:31 తరువాతది డేటా డైరెక్టరీ.

ఈ ఫోల్డర్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులచే అప్ లోడ్ చేయబడిన ఫైల్ కంటెంట్ అంతా నిల్వ చేయబడుతుంది.

07:42 ఫైల్స్ ను ఇక్కడ స్టోర్ చేయడానికి, ఈ ఫోల్డర్ కు చదవటానికి మరియు వ్రాయటానికి అనుమతి ఉండాలి.
07:50 ఏమైనా భద్రతా కారణాల దృష్ట్యా ఇది, వెబ్ పై నేరుగా యాక్సెస్ చేయడం కుదరదు.
07:57 కనుక, దీనిని ఇన్స్టాలేషన్ ఫోల్డర్ యొక్క బయట ఉంచాలి.
08:03 lampp ఫోల్డర్ లోపలి moodledata అనేది అప్రమేయ data directory, ఏదైతే ఇన్స్టాలర్(installer) సృష్టించడానికి ప్రయత్నిస్తుందో.
08:11 ఏమైనా,ఇక్కడ ఒక ఫోల్డర్ ను సృష్టించడానికి దీనికి అనుమతి లేదు.

కనుక, మనము ఈ ఫోల్డర్ ను మానవీయంగా సృష్టించి, అవసరమైన అనుమతులను ఇవ్వాలి.

08:23 టర్మినల్ విండో కి వెళ్ళండి.

ప్రాంప్ట్ వద్ద,sudo space mkdir space slash opt slash lampp slash moodledata అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

08:41 ఇప్పుడు, sudo space chmod space 777 space slash opt slash lampp slash moodledata అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:57 బ్రౌజర్ కు తిరిగి వెళ్ళి ఇపుడు Next బటన్ పై క్లిక్ చేయండి.
09:02 దీని తర్వాత database configuration పేజీ వస్తుంది.

డ్రాప్ డౌన్ నుండి MariaDB ను ఎంచుకొని Next బటన్ పై క్లిక్ చేయండి.

09:13 Database Host Name ను localhost గా ఎంటర్ చేయండి.
09:18 ఇప్పుడు, మనము డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

వీటిని మనము phpMyAdmin లో ఇంతకు ముందే సృష్టించాము.

09:30 database name గా moodle-st ను
09:36 తరువాత database username గా moodle-st ను
09:41 మరియు నా database password గా moodle-st ను ఎంటర్ చేస్తాను.
09:46 Table Prefix ను వదిలివేయండి మరియు ఇతర ఫీల్డ్స్ నూ ఎలా ఉన్నవాటిని ఆలా వదిలేసి Next పై క్లిక్ చేయండి.
09:54 మనము ఒక terms and conditions పేజీని చూడవచ్చు.
09:59 ఈ దశ మీరు లైసెన్స్ ఒప్పందం చదివి అందులో ఉన్న దానికి అంగీకరిస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉన్న దశ.

టెక్స్ట్ ను చదివి తరువాత Continue పై క్లిక్ చేయండి.

10:10 తరువాత మనం Server Checks పేజీని చూడవచ్చు.

Your server environment meets all minimum requirements అనే సందేశాన్ని చూడటానికి స్క్రోల్ చేయండి.

10:23 చూపిన విధంగా మీరు ఇతర ఎర్రర్ లను పొందవచ్చు:

పరిష్కారము కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Additional reading material లింక్ ను చూడండి.

10:33 Continue పై క్లిక్ చేయండి.
10:36 ఈ దశ మీ ఇంటర్నెట్ వేగం ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

ఒకవేళ మీరు పేజీని రిఫ్రెష్ చేస్తే Site is being upgraded, please retry later అనే ఒక ఎర్రర్ సందేశాన్ని మీరు పొందవచ్చు.

10:50 ఆ సందర్భంలో, దయచేసి కొంత సమయం తర్వాత రిఫ్రెష్ చేయండి.
10:54 ఇన్స్టాలేషన్ కొరకు కు విజయవంతమైన సందేశం వచ్చినప్పుడు Continue ను క్లిక్ చేయండి.
11:00 తరువాత పేజీ administrator configuration కొరకు.
11:05 Moodle Administrative పేజీ కొరకు మీరు కావాలనుకున్న యూజర్ నేమ్ ను ఎంటర్ చేయండి, నేను యూజర్ నేమ్ గా admin ను ఎంటర్ చేస్తాను.
11:15 ఇప్పుడు Moodle Administrator కొరకు ఒక పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.

పాస్ వర్డ్ అనేది ఇక్కడ చూపిన విధంగా ఈ నియమాలను తప్పక అనుసరించాలి.

11:26 పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడానికి, Click to enter text లింక్ పై క్లిక్ చేయండి.
11:32 నేను నా admin password గా Spokentutorial1 @ ను ఎంటర్ చేస్తాను పాస్ వర్డ్ ను బహిర్గతం చేయడానికి Unmask ఐకాన్ పై క్లిక్ చేయండి.
11:43 భవిష్యత్ ఉపయోగం కోసం మీరు సృష్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను రాసిపెట్టుకోండి.
11:49 Email address అనేది తప్పనిసరి ఫీల్డ్.

నేను ఇక్కడ priyankaspokentutorial@gmail.com ను ఎంటర్ చేస్తాను.

11:59 Select a country డ్రాప్ డౌన్ లో, India ను ఎంచుకోండి.

టైం జోన్ గా Asia/Kolkata ను ఎంచుకోండి.

12:08 మనము మిగిలిన ఫీల్డ్స్ యొక్క అప్రమేయ విలువలతో వాటిని అలాగే వదిలివేస్తాము.
12:13 స్క్రోల్ చేసి Update Profile బటన్ పై క్లిక్ చేయండి.
12:18 దయచేసి గమనించండి Moodle అనేది ఒక ఒక వనరును వినియోగించే సాఫ్ట్వేర్.

ప్రతి దశ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది.

12:27 దయచేసి తదుపరి పేజీ లోడ్ అవ్వడానికి వేచి ఉండండి మరియు పేజీని మూసివేయడం లేదా రిఫ్రెష్ చేయడం చేయకండి.
12:34 తరువాతి స్క్రీన్ Front page settings కొరకు.

ఎప్పుడైనా ప్రజలు moodle site ను సందర్శించినప్పుడు వారు చూసే పేజీ ఇది.

12:45 Full Site Name గా Digital India LMS ను ఎంటర్ చేయండి.
12:50 Short name for site గా Digital India LMS ను మళ్ళీ ఎంటర్ చేయండి.

moodle site యొక్క నావిగేషన్ బార్ లో కనిపించే పేరు ఇదే.

13:03 ఇప్పటికి Front Page Summary ని వదిలివేసి ఖాళీగా విడిచిపెడదాం.

టైం జోన్ ను Asia/Kolkata గా ఎంచుకోండి.

13:11 తరువాతి డ్రాప్ డౌన్ Self Registration.

ఒకవేళ Self Registration ఎనేబుల్ చేయబడితే, అప్పుడు కొత్త యూజర్స్ తమ సొంతంగా నమోదు చేసుకోవచ్చు.

13:23 డ్రాప్ డౌన్ నుండి Disable ను ఎంచుకోండి.

తరువాతది no-reply address టెక్స్ట్ బాక్స్.

13:31 ఈ ఫీల్డ్ లో డిఫాల్ట్ విలువ అనేది noreply @ localhost.

ఇది చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ఐడీ కాదు కాబట్టి, దీన్ని noreply@localhost.com కు మార్చండి.

13:46 ఎప్పుడైతే Moodle వద్ద చూపించటానికి ఎటువంటి ఇమెయిల్ ఐడీ లేకుంటే, ఈ ఇమెయిల్ ఐడి From address గా చూపబడుతుంది.
13:55 ఉదాహరణకు, ఒకవేళ నేను నా చిరునామాను ప్రైవేట్ గా ఉంచాలని సూచించినట్లయితే, నా తరపున పంపిన అన్ని మెయిళ్ళు ఈ ఇమెయిల్ ఐడిని కలిగి ఉంటాయి.

చివరగా, Save Changes బటన్ పై క్లిక్ చేయండి.

14:10 ఇప్పుడు మనము Moodle ను ఉపయోగించుటకు సిద్ధంగా వున్నాము.

మీరు ఇక్కడ కొత్త సైట్ యొక్క మొదటి పేజీని చూడవచ్చు.

14:17 దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము, సారాంశం చూద్దాం.
14:23 ఈ ట్యుటోరియల్ లో, మనం moodle.org నుండి Moodle ను డౌన్లోడ్ చేయడం మరియు లోకల్ సర్వర్ పై Moodle ను ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాము.
14:33 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

14:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

14:51 మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?

దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.

15:00 మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి.

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు.

05:10 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్.
15:15 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
15:21 ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.

తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.

15:31 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

15:45 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya