Moodle-Learning-Management-System/C2/Getting-Ready-for-Moodle-Installation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 00:00, 9 March 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 Getting ready for Moodle installation అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనము Moodle ని ఇన్స్టాల్ చేయడానికి కనీస అవసరాల గురించి నేర్చుకుంటాము.
00:14 లోకల్ హోస్ట్ మరియు డేటాబేస్ సెట్ అప్ కొరకు ప్యాకేజీలను చెక్ చేయటం కూడ నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04
00:30 Apache, MariaDB మరియు PHP ఏదైతే XAMPP 5.6.30 ద్వారా పొందినది మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
00:42 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:46 మీ సిస్టమ్ లో Moodle 3.3 వ్యవస్థాపించడానికి, మీకు మద్దతు ఇచ్చే మెషిన్ లో ఈ క్రిందివి ఉండాలి:
00:52 Apache 2.x (లేదా అధిక సంస్కరణ)

MariaDB 5.5.30 (లేదా ఏదైనా ఒక అధిక సంస్కరణ) మరియు PHP 5.4.4 +(లేదా అధిక సంస్కరణ)

01:08 ఒక వేళా మీ సిస్టం లో పైన పేర్కొన్న వాటి కన్నా పాత సంస్కరణలను ఉంటే, ముందుకు సాగడానికి వాటిని మొదట అన్ఇన్స్టాల్ చేయండి.
01:16 MariaDB అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓపెన్ సోర్స్ డేటాబేస్.
01:21 ఇది MySQL డేటాబేస్కు ఒక ప్రత్యామ్నాయం.
01:26 వెబ్ సర్వర్ పంపిణీలు మీకు Apache, MariaDB మరియు PHP ఒక ప్యాకేజీ లో ఇస్తారు.
01:34 మీరు వీటిని విడి విడిగా ఇన్స్టాల్ చేయవచ్చు.

లేదా XAMPP, WAMP లేదా LAMPP వంటి వెబ్ సర్వర్ పంపిణీని వాడి కూడా ఇన్స్టాల్ చేయవచ్చు.

01:44 నేను ఇప్పటికే నా మెషిన్ లో XAMPP ను ఇన్స్టాల్ చేశాను.
01:49 మొదట, మనము మెషిన్ లో XAMPP రన్ అవుతుందో లేదో తనిఖీ చేయాలి.
01:54 వెబ్ బ్రౌజర్లో, http colon double slash 127 dot 0 dot 0 dot 1 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి.
02:08 ఇది Unable to connect ఒక సందేశాన్ని చూపుతుంది.
02:12 అంటే XAMPP సర్వీస్ రన్ అవుత లేదని దాని అర్థం
02:16 కాబట్టి, మనము XAMPP సర్వీస్ ని ప్రారంభించాలి.
02:20 Ctrl + Alt + T కీలను కలిపి నొక్కడం ద్వారా టర్మినల్ ని తెరిద్దాం.
02:26 sudo space slash opt slash lampp slash lampp space start ని టైపు చేసి XAMPP ని ప్రారంభిద్దాం.
02:38 ప్రాంప్ట్ చేయబడినప్పుడు అడ్మిస్ట్రేటివ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి, Enter నొక్కండి.
02:44 ఒక వేళ మీకు ఈ క్రింది సందేశం, అనగా

Starting XAMPP for Linux ….

XAMPP: Starting Apache...ok.

XAMPP: Starting MySQL...ok.

XAMPP: Starting ProFTPD...ok. వస్తే

02:59 మీ సిస్టమ్లో XAMPP వ్యవస్థాపించబడింది మరియు మీరు సేవను ప్రారంభించారు అని దీని అర్ధం.
03:05 దయచేసి గమనించండి XAMPP 5.6.30, MySQLకు బదులుగా MariaDBని ఉపయోగిస్తుంది.
03:13 రెండింటికీ ఆదేశాలు మరియు ఉపకరణాలు ఒకే విధంగా ఉంటాయి.
03:17 బ్రౌజర్కు తిరిగి వెళ్ళి, పేజీ ని రిఫ్రెష్ చేద్దాము.
03:21 ఇప్పుడు మనము XAMPP స్క్రీన్ ని చూడవచ్చు.
03:25 మీరు Command not found అనే సందేశాన్ని టెర్మినల్ పై చూడవచ్చు.
03:30 అంటే మీ మెషీన్లో XAMPP ఇన్స్టాల్ చేయబడలేదు అని అర్ధం
03:34 అలా అయితే, ఈ వెబ్సైట్ లోని PHP and MySQL Series లోని XAMPP ఇన్స్టాలేషన్ ట్యుటోరియల్ ను చూడండి.
03:42 పైన పేర్కొన్న సూచనలను అనుసరించి XAMPP యొక్క తాజా వర్షన్ను ఇన్స్టాల్ చేయండి.
03:49 టర్మినల్ కు తిరిగి వెళ్దాం.
03:52 ఇప్పుడు XAMPP service ను ప్రారంభించడానికి పైన చూపిన దశలను అనుసరించండి.
03:57 ఇప్పుడు మన సిస్టమ్ పై PHP యొక్క సంస్కరణను తనిఖీ చేద్దాం.
04:02 టర్మినల్ పై sudo space slash opt slash lampp slash bin slash php space hyphen v అని టైప్ చేయండి మరియు ఎంటర్ ని నొక్కండి.
04:17 ఒక వేళా ప్రాంప్ట్ చేయబడితే అడ్మిస్ట్రేటివ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి Enterని నొక్కండి.
04:23 నా PHP యొక్క వర్షన్ 5.6.30.
04:29 ఈ సందేశం PHP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందని సూచిస్తుంది.
04:34 మీకు 5.4.4 కంటే తక్కువ సంస్కరణ కనిపిస్తే, XAMPP యొక్క తాజా సంస్కరణను ఇన్స్టాల్ చేయాలి.
04:42 మన సిస్టంలో MariaDB యొక్క వర్షన్ను తనిఖీ చేద్దాం.
04:48 టర్మినల్ పై sudo space slash opt slash lampp slash bin slash mysql space hyphen v అని టైప్ చేయండి మరియు ఎంటర్ ని నొక్కండి.
05:03 ఒక వేళా ప్రాంప్ట్ చేయబడితే, అడ్మిస్ట్రేటివ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి Enterని నొక్కండి.
05:08 నా MariaDB యొక్క వర్షన్ 10.1.21.
05:14 మీకు 5.5.30 కంటే తక్కువ సంస్కరణ కనిపిస్తే, XAMPP యొక్క తాజా సంస్కరణను ఇన్స్టాల్ చేయాలి.
05:23 దయచేసి గమనించండి, PHP మరియు డేటాబేస్ సంస్కరణలను తనిఖీ చెయ్యడానికి, మీ సిస్టం లో XAMPP రన్ అవ్వాలి.
05:29 కమాండ్ ప్రాంప్ట్ ఇప్పుడు మారిపోయిందని గమనించండి.
05:34 backslash q ని టైపు చేసి, MariaDB నుండి నిష్క్రమించడానికి ఎంటర్ నొక్కండి.
05:40 ఇక్కడ చూపిన విధంగా ఇతర ఎర్రర్ లు కూడా మీకు రావచ్చు.
05:44 An apache daemon is already running అనే సందేశం కనిపించవచ్చు.
05:50 అంటే ప్రారంభ స్క్రిప్ట్ XAMPP-Apache ను ప్రారంభించలేదని దీని అర్థం
05:55 ఇది మరో Apache instance ఇప్పటికే అమలు అవుతుందని సూచిస్తుంది.
06:01 మీరు XAMPPను సరిగ్గా ప్రారంభించడానికి, మొదట ఈ daemonను ఆపాలి.
06:06 Apacheని ఆపడానికి ఈ కామాండ్,

sudo /etc/init.d/apache2 space stop.

06:19 MySQL daemon failed to start అని చెప్పే ఒక సందేశాన్ని మీరు చూడవచ్చు.
06:25 అంటే ప్రారంభ స్క్రిప్ట్ MySQL ను ప్రారంభించలేదని దీని అర్థం
06:30 ఇది మరో database instance ఇప్పటికే అమలు అవుతుందని సూచిస్తుంది.
06:36 మీరు XAMPPను సరిగ్గా ప్రారంభించడానికి, మొదట ఈ daemonను ఆపాలి.
06:41 ఈ కమాండ్, sudo space /etc/init.d/mysql space stop MySQLని ఆపుతుంది.
06:54 అన్ని ఎర్రర్ లను పరిష్కరించండి మరియు XAMPP ను విజయవంతంగా అమలు చేయండి.
06:59 తరువాత మీ వెబ్ బ్రౌజర్ కు మరి, పేజీని రిఫ్రెష్ చేయండి.
07:03 భాష ఎంపిక కోసం ప్రాంప్ట్ చేయబడితే, ఇంగ్లీష్ ను ఎంచుకోండి.
07:08 ఇప్పుడు మనము ఒక యూజర్ను జోడించి, Moodle కోసం ఒక డేటాబేస్ ని సృష్టించాలి.
07:14 దీనిని మనము phpmyadmin లో చేద్దాము, ఎందుకంటే అది MariaDB కోసం ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్,
07:21 మరియు అది XAMPP సంస్థాపనతో పాటు వస్తుంది.
07:25 బ్రౌజర్కు తిరిగి వెళ్దాం.
07:28 XAMPP పేజీ పై, ఎగువన ఉన్న మెనూ నుండి phpMyadmin ని క్లిక్ చేయండి.
07:34 ఎగువ మెనులో ఉన్న User Accounts పై క్లిక్ చేసి, Add User Accountని క్లిక్ చేయండి.
07:42 తీర్చుకునే కొత్త విండో లో మీకు నచ్చిన యూసర్ నేమ్ ఎంటర్ చేయండి.
07:48 నేను నా యూసర్ నేమ్ ని moodle hyphen st గా టైపు చేస్తునాను.
07:53 హోస్ట్ డ్రాప్-డౌన్ జాబితా నుండి, Local ఎంచుకోండి.
07:57 పాస్ వర్డ్ టెక్ట్స్ బాక్స్ లో మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
08:02 నేను పాస్వర్డ్ ని moodle hyphen st గా టైప్ చేస్తాను.
08:07 Re-type టెక్స్ట్ బోస్ అదే పాస్వర్డ్ ని టైపు చేయండి.
08:12 Authentication Plugin ఎంపికను ఎలాగా ఉందో అలాగే ఉంచండి.
08:17 దయచేసి ఇప్పుడు Generate Password ప్రాంప్ట్ పై క్లిక్ చేయవద్దు.
08:22 Database for user account క్రింద మనము,
08:26 Create database with same name and grant all privileges ఎంపికను చూడవచ్చు.
08:31 మనము ఆ ఎంపికను తనిఖీ చేసి, ఈ పేజీ యొక్క దిగువ కుడి వైపు ఉన్న Go బటన్ను క్లిక్ చేద్దాము.
08:38 మనము విండో ఎగువన You have added a new user అనే సందేశాన్ని చూడవచ్చు.
08:44 moodle-st అనే పేరుతో ఒక కొత్త డేటాబేస్ మరియు moodle-st అనే పేరు తో ఒక యూసర్ సృష్టించబడ్డాయని అని అర్థం.
08:54 యూసర్ నేమ్, పాస్ వర్డ్ మరియు డేటాబేస్ పేర్లను వ్రాసి పెట్టుకోండి.
08:59 Moodle సంస్థాపనను పూర్తి చేయటానికి వీటి అవసరం తరువాత ఉంటుంది.
09:04 దయచేసి గమనించండి: డేటాబేస్ పేరు మరియు యూసర్ నేమ్ ఒకే ల ఉండనవసరం లేదు.
09:10 భిన్నమైన పేర్లను కలిగి ఉండటానికి, డేటాబేస్ ను మొదట సృష్టించి ఆపై డేటాబేస్ కోసం ఒక యూసర్ ని సృష్టించండి.
09:18 ఇంకా, నామకరణ కన్వెన్షన్ ప్రకారం, యూసర్ నేమ్ మధ్య ఖాళీలు ఉండకూడదు.
09:25 ఇప్పుడు మన వద్ద XAMPP రన్ అవుతుంది మరియు మన డేటాబేస్ సిద్ధంగా ఉంది.
09:29 ఇప్పుడు మనము Moodleని ఇన్స్టాల్ చేయుట కు సిద్ధంగా ఉన్నాము.
09:32 తదుపరి ట్యుటోరియల్ లో మనము Moodle యొక్క సంస్థాపనను కొనసాగించుతాము.
09:37 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:41 సారాంశం చూద్దాం.
09:43 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి:
09:45 Moodle వ్యవస్థాపించడం కోసం కనీస అవసరాల గురించి.
09:49 కనీస అవసరాల కోసం ఎలా తనిఖీ చేయాలి

ఎలా ఒక డేటాబేస్ని సెట్ అప్ చేయాలి మరియు ఎలా ఒక యూజర్ ని జోడించాలి.

09:57 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
10:03 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
10:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
10:11 మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
10:15 మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా?
10:18 దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
10:27 మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం మరియు ఆ క్షణంని ఎంచుకోండి.
10:30 మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు.
10:36 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్ ఉంది.
10:41 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
10:46 ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.
10:48 తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
10:54 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
11:01 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
11:06 ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి.
11:10 మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya