Moodle-Learning-Management-System/C2/Admin-dashboard/Telugu
Time | Narration |
00:01 | Moodle లో Admin’s dashboard అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము
అడ్మిన్ యొక్క డాష్బోర్డ్ పై వివిధ బ్లాక్స్ నిర్వాహకుని ప్రొఫైల్ పేజీ మరియు ప్రాధాన్యతలను ఎలా సవరించాలో నేర్చుకుంటాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04
Apache, MariaDB మరియు XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:46 | .మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:50 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది. |
00:59 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకుల సిస్టం లో Moodle 3.3 ఇన్స్టాల్ చేసి ఉండాలి.
లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
01:13 | బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle siteని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి. |
01:21 | మీరు ఒక ఖాళీ పేజీని హెడర్ లతో మాత్రమే చూస్తారు . ఎందుకంటే మన సంస్థాపన కోసం ఏ front page పేజీ ని సెట్ చేయలేదు. |
01:33 | విండో యొక్క కుడి ఎగువ మూలా లో ఉన్న Log in లింక్ క్లిక్ చేయండి. |
01:39 | మీరు 'Moodle' ' ను ఇన్స్టాల్ చేసినపుడు ఇచ్చిన మీ admin username మరియు 'పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ చేయండి. |
01:47 | నేను యూసర్ నేమ్ ని admin గా మరియు పాస్వర్డ్ ని Spokentutorial1@ గా ప్రవేశ పెడతాను. ఆపై Log in ని క్లిక్ చేయండి. |
01:59 | ఇప్పుడు చూసే ఈ పేజీ ని dashboard(డాష్ బోర్డు) అని పిలుస్తాము. |
02:04 | మన dashboard రెండు కాలమ్ లు గా విభజించబడిందని ఇక్కడ మనము చూడవచ్చు. |
02:08 | ఎడమ వైపు ఉన్న విస్తృతమయినది, ప్రధాన కంటెంట్ కాలమ్. |
02:13 | కుడి వైపున ఉన్నది Blocks column |
02:17 | బ్లాక్స్ ఈ కాలమ్స్ లోని అంశాలు, ఏవైతే ఒక నిర్దిష్ట ప్రయోజనం లేదా సమాచారాన్ని అందిస్తాయి. |
02:25 | బ్లాక్స్ Moodle యొక్క అన్ని పేజీ ల పై కనిపిస్తాయి
మీరు మీ కోర్సు యొక్క క్లిష్టమైన భాగాలకు సత్వరమార్గాలుగా భావించవచ్చు. |
02:35 | .ఉదాహరణకు ప్రైవేట్ ఫైల్స్, ఆన్లైన్ ఉసెర్స్, కోర్సు ఓవెర్వ్యూ మొదలైనవి నా డాష్బోర్డ్ లోని బ్లాక్స్. |
02:46 | ఇక్కడ ఏ కార్యకలాపాలు లేదా కోర్సులు లేవని గమనించండి. |
02:50 | ఎందుకంటే మేము ఎటువంటి కోర్సును సృష్టించలేదు కాబట్టి . |
02:56 | మీరు అన్ని కోర్సుల జాబితాను - ఒక వేళ ఒక యూసర్ (అనగా ఉపాధ్యాయుడు లేదా విద్యార్ధి లేదా నిర్వాహకుడు) చేరినా లేదా కోర్సులలో పాత్రను కేటాయించినబడితే చూడవచ్చు. |
03:08 | Online Users block, Admin User ఏదైతే ఇది మన ప్రస్తుత లాగిన్ గా ఉంది దానిని చూపిస్తుంది. |
03:17 | ఈ బ్లాక్ లో ఎప్పుడైనా ఏ సమయంలో అయినా లాగిన్ చేసిన అందరు యూజర్స్ లను చూపిస్తుంది. |
03:23 | Moodle లో ప్రతి బ్లాక్కు ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. Moodle లో ఏదైనా పేజీ యొక్క ఏదైన కాలమ్ కు బ్లాక్స్ ని జోడించగలము. |
03:34 | ఇప్పుడు పేజీ యొక్క header గూర్చి తెలుసుకుందాం. |
03:38 | పేజీ యొక్క ఎగువ ఎడుమ మూలా లో Navigation Drawer లేదా Navigation menu ని చూడండి.
ఈ మెనూ Calendar మరియు Administration లింక్ లను యాక్సిస్ చేయుటకు సహాయం చేస్తుంది. ఇది ఒక toggle మెనూ |
03:55 | అనగా అది క్లిక్ చేసినప్పుడు దాని స్టేటస్ ఓపెన్ నుండి క్లోజ్ కు మరియు క్లోజ్ నుండి ఓపెన్ కు మారుతుందని అర్థం. |
04:04 | తర్వాత మన వద్ద లోగో కొరకు ప్లేస్ హోల్డర్ ఉంది. |
04:08 | డిఫాల్ట్ గా ఇది దాని short site name. దాని పై క్లిక్ చేస్తే ఏ పేజీ నుండి అయినా మన డాష్ బోర్డు కి వెళ్ళగలం. |
04:18 | ఎగువ కుడి వైపున, notifications మరియు messages కోసం శీఘ్ర ఆక్సెస్ చిహ్నాలు ఉన్నాయి. |
04:26 | దాని ప్రక్కన user menu అనే డ్రాప్ డౌన్ మెనూ ఉంది. దానిని quick access user menu అనే కూడా అనవచ్చు. |
04:35 | ఈ ట్యుటోరియల్లో క్లుప్తంగా ప్రొఫైల్ ' మరియు Preferences పేజీ గురించి చర్చించాం. |
04:41 | ఎడమవైపు ఉన్నదాని లగే, ఈ అన్ని menu items కూడా టోగుల్ మెనూల వాలే పని చేస్తాయి. |
04:48 | తరవాత Profile లింక్ పై క్లిక్ చేయండి. |
04:52 | Moodle లోని ప్రతి యూసర్ కి ఒక profile page ఉంటుంది. |
04:57 | యూజర్స్ వారి ప్రొఫైల్ సమాచారాన్ని సవరించుటకు మరియు ఫోరమ్ లేదా 'బ్లాగ్ పోస్ట్స్ ని చూచుటకు, |
05:07 | ఏవైనా reportsకి, వారికి యాక్సెస్ ఉందా చెక్ చేయుటకు, వారి యాక్సెస్ లాగ్స్ ను చూచుటకు మరియు చివరిసారి లాగిన్ చేయడానికి ఉపయోగించిన IP చిరునామా కోసం లింక్స్ ఉన్నాయి. |
05:18 | ఇప్పుడు Edit Profile లింక్ పై క్లిక్ చేయండి. Edit Profile page తెరుచుకుంటుంది. |
05:26 | ఈ పేజీ 5 విభాగాలుగా విభజించబడింది:
General User Picture Additional Names Interests Optional |
05:39 | జనరల్ సెక్షన్ అప్రమేయంగా విస్తరించబడుతుంది. |
05:43 | ఏదైనా సెక్షన్ పేరు మీద క్లిక్ చేస్తే అది విస్తరిస్తుంది లేదా కూలిపోతుంది. |
05:49 | కుడివైపున ఉన్న Expandఅనే లింకు అన్ని విభాగాలను విస్తరిస్తుంది. |
05:55 | ఇక్కడ అన్ని ఫీల్డ్ లను సవరించవచ్చు . |
05:59 | City / Town చేర్చు దాం. నేను 'Mumbai టైపు చేస్తాను. |
06:04 | Select a country డ్రాప్ డౌన్లో 'India' 'ఎంపిక చేయబడింది మరియు 'timezone Asia/Kolkata' గా సెట్ చేయబడిందని నిర్దహరించుకోండి. |
06:13 | ఈ ప్రొఫైల్ పేజీ లో నిర్వాహకులు మాత్రమే పాస్ వర్డ్ మార్చగలరు. |
06:18 | నేను Optional సెక్షన్ లో కొన్ని ఫీల్డ్ లను జోడిస్తాను. |
06:22 | నేను ఇన్స్టిట్యూషన్ ఫీల్డ్ లో ఐఐటి బాంబే ను ప్రవేశిస్తాను. అలాగే, డిపార్ట్మెంట్ ఫీల్డ్ లో 'మ్యాథమెటిక్స్ మరియు ఫోన్ నంబర్ ఫీల్డ్ లో చెల్లుబాటు అయ్యే ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తాను. |
06:36 | పేజీని సేవ్ చెయ్యడానికి అప్డేట్ ప్రొఫైల్ బటన్పై క్లిక్ చేయండి. |
06:42 | ఇప్పుడు ఎగువ కుడి వైపు ఉన్న quick access user menu పై మళ్ళి క్లిక్ చేయండి.
ఆపై 'Preferences లింక్ క్లిక్ చేయండి. |
06:51 | Preferences పేజీ యూసర్ లకు వివిధ సెట్టింగులను సవరించడానికి త్వరిత యాక్సిస్ ఇస్తుంది. |
06:59 | ఒక admin account కోసం Preferences పేజీ విభాగాలు 4 విభజించబడింది.
User account, Roles, Blogs, మరియు 'Badges |
07:12 |
User Account section యూసర్ లకు Edit Profile మరియు Change Passwordకు అనుమతిస్తుంది. |
07:19 | అది 'Language, Forum, Calendar, Message, Notification, మొదలైన వాటికి preferences సెట్ చేస్తుంది. |
07:30 | Calendar preferences' పై క్లిక్ చేయండి. |
07:34 | మనము 24 గంటల ఫార్మాట్లో సమయం ని చూపించడానికి క్యాలెండర్ ని సెట్ చేస్తాము. |
07:40 | ఇంకా, మేము Upcoming events look-ahead 2 వారాలకు సెట్ చేస్తాము. |
07:46 | క్యాలెండర్లో తదుపరి 2 వారాలలో జరిగే అన్ని ఈవెంట్లకు మనము నోటిఫికేషన్లను చూస్తాము. |
07:55 | అన్ని ఫీల్డ్ లకు పక్కన ఉన్నhelp ఐకాన్ ని హైలైట్ చెయ్యాలనుకుంటున్నాను. |
08:00 | దీనిపై క్లిక్ చేస్తే, ఈ ఫీల్డ్ గురించి వివరణ ఇచ్చే ఒక చిన్న help box తెరవబడుతుంది. |
08:08 | ఏదై న ఒక ఫీల్డ్ గురించి సందేహాస్పదంగా ఉన్నప్పుడు, దాని ప్రాముఖ్యత ను అర్థం చేసుకోవడానికి help చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
08:16 | మిగితా అన్ని ఎంపికలు అలాగే ఉండనివండి . Save Changes బటన్పై క్లిక్ చేయండి. |
08:23 | ఈ సిరీస్లో ఆ లక్షణాలను తర్వాత చర్చించినప్పుడు మిగిలిన preferencesగురించి తెలుసుకుందాం. |
08:30 | .ఇక్కడ చూపిన సమాచారాన్ని గమనించండి. |
08:33 | ఇది breadcrumb navigation. ఇది 'Moodle site యొక్క సోపానక్రమం లోపల మనం ఏ పేజీలో ఉన్నామో అని సూచించే దృశ్య సహాయకం. |
08:45 | ఇది ఒకే క్లిక్ తో ఉన్నత-స్థాయి పేజీకి తిరిగి వెళ్లడానికి మనకు సహాయపడుతుంది. |
08:51 | డాష్బోర్డ్ కు వెళ్ళడానికి breadcrumbs లోని డాష్బోర్డ్ లింకుపై క్లిక్ చేయండి. |
08:57 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
09:03 | ఈ ట్యుటోరియల్ లో మనము
అడ్మిన్ యొక్క డాష్బోర్డ్ పై వివిధ బ్లాక్స్ నిర్వాహకుని ప్రొఫైల్ పేజీ మరియు ప్రాధాన్యతలను ఎలా సవరించాలో నేర్చుకున్నాము. |
09:16 | మీ కోసం ఒక చిన్న అసైన్మెంట్
Message Preferences పై క్లిక్ చేయండి. 'Moodle' లోని యూసర్ లు వ్యక్తిగత సందేశాలను ఒకరికొకరు పంపవచ్చు. |
09:27 | నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా, నా సందేశాలు ఇమెయిల్గా పంపిణీ చేయబడడం నాకు ఇష్టం లేదు
|
09:33 | ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ హెల్ప్ బాక్స్ ని చూడండి మరియు సెట్టింగులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. |
09:40 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:48 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
09:57 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
10:01 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:15 | ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి. మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
10:24 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |