Moodle-Learning-Management-System/C2/Getting-Ready-for-Moodle-Installation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:09, 8 March 2019 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Getting ready for Moodle installation అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనము Moodle ని ఇన్స్టాల్ చేయడానికి కనీస అవసరాల గురించి నేర్చుకుంటాము. |
00:14 | లోకల్ హోస్ట్ మరియు డేటాబేస్ సెట్ అప్ కొరకు ప్యాకేజీలను చెక్ చేయటం కూడ నేర్చుకుంటాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 |
00:30 | Apache, MariaDB మరియు PHP ఏదైతే XAMPP 5.6.30 ద్వారా పొందినది మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:42 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:46 | మీ సిస్టమ్ లో Moodle 3.3 వ్యవస్థాపించడానికి, మీకు మద్దతు ఇచ్చే మెషిన్ లో ఈ క్రిందివి ఉండాలి: |
00:52 | Apache 2.x (లేదా అధిక సంస్కరణ)
MariaDB 5.5.30 (లేదా ఏదైనా ఒక అధిక సంస్కరణ) మరియు PHP 5.4.4 +(లేదా అధిక సంస్కరణ) |
01:08 | ఒక వేళా మీ సిస్టం లో పైన పేర్కొన్న వాటి కన్నా పాత సంస్కరణలను ఉంటే, ముందుకు సాగడానికి వాటిని మొదట అన్ఇన్స్టాల్ చేయండి. |
01:16 | MariaDB అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓపెన్ సోర్స్ డేటాబేస్. |
01:21 | ఇది MySQL డేటాబేస్కు ఒక ప్రత్యామ్నాయం. |
01:26 | వెబ్ సర్వర్ పంపిణీలు మీకు Apache, MariaDB మరియు PHP ఒక ప్యాకేజీ లో ఇస్తారు. |
01:34 | మీరు వీటిని విడి విడిగా ఇన్స్టాల్ చేయవచ్చు.
లేదా XAMPP , 'WAMP' లేదా LAMPP వంటి వెబ్ సర్వర్ పంపిణీని వాడి కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. |
01:44 | నేను ఇప్పటికే నా మెషిన్ లో XAMPP ను ఇన్స్టాల్ చేశాను. |
01:49 | మొదట, మనము మెషిన్ లో XAMPP రన్ అవుతుందో లేదో తనిఖీ చేయాలి. |
01:54 | వెబ్ బ్రౌజర్లో, http colon double slash 127 dot 0 dot 0 dot 1 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
02:08 | ఇది Unable to connect ఒక సందేశాన్ని చూపుతుంది. |
02:12 | .అంటే XAMPP సేవ రన్ అవుత లేదని దాని అర్థం |
02:16 | కాబట్టి, మనము XAMPP సర్వీస్ ని ప్రారంభించాలి. |
02:20 | Ctrl + Alt + T కీలను కలిపి నొక్కడం ద్వారా టర్మినల్ ని తెరిద్దాం. |
02:26 | sudo space slash opt slash lampp slash lampp space start ని టైపు చేసి XAMPP ని ప్రారంభిద్దాం. |
02:38 | ప్రాంప్ట్ చేయబడినప్పుడు అడ్మిస్ట్రేటివ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి, Enter నొక్కండి. |
02:44 | ఒక వేళ మీకు ఈ క్రింది సందేశం, అనగా
Starting XAMPP for Linux …. XAMPP: Starting Apache...ok. XAMPP: Starting MySQL...ok. XAMPP: Starting ProFTPD...ok. వస్తే |
02:59 | మీ సిస్టమ్లో XAMPP వ్యవస్థాపించబడింది మరియు మీరు సేవను ప్రారంభించారు అని దీని అర్ధం. |
03:05 | దయచేసి గమనించండి XAMPP 5.6.30, MySQLకు బదులుగా MariaDBని ఉపయోగిస్తుంది. |
03:13 | రెండింటికీ ఆదేశాలు మరియు ఉపకరణాలు ఒకే విధంగా ఉంటాయి. |
03:17 | బ్రౌజర్కు తిరిగి వెళ్ళి, పేజీ ని రిఫ్రెష్ చేద్దాము. |
03:21 | ఇప్పుడు మనము 'XAMPP' స్క్రీన్ ని చూడవచ్చు. |
03:25 | మీరు Command not found అనే సందేశాన్ని టెర్మినల్ పై చూడవచ్చు. |
03:30 | అంటే మీ మెషీన్లో XAMPP ఇన్స్టాల్ చేయబడలేదు అని అర్ధం |
03:34 | అలా అయితే, ఈ వెబ్సైట్ లోని PHP and MySQL Series లోని XAMPP ఇన్స్టాలేషన్ ట్యుటోరియల్ ను చూడండి. |
03:42 | పై ట్యుటోరియల్లో పేర్కొన్న సూచనలను అనుసరించి XAMPP యొక్క తాజా వర్షన్ను ఇన్స్టాల్ చేయండి. |
03:49 | టర్మినల్ కు తిరిగి వెళ్దాం |
03:52 | ఇప్పుడు XAMPP service ను ప్రారంభించడానికి పైన చూపిన దశలను అనుసరించండి. |
03:57 | ఇప్పుడు మన సిస్టమ్ పై PHP యొక్క సంస్కరణను తనిఖీ చేద్దాం. |
04:02 | టర్మినల్ పై sudo space slash opt slash lampp slash bin slash php space hyphen v అని టైప్ చేయండి మరియు ఎంటర్ ని నొక్కండి. |
04:17 | ఒక వేళా ప్రాంప్ట్ చేయబడితే అడ్మిస్ట్రేటివ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి Enterని నొక్కండి. |
04:23 | నా PHP యొక్క వర్షన్ 5.6.30. |
04:29 | ఈ సందేశం PHP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందని సూచిస్తుంది. |
04:34 | మీకు 5.4.4 కంటే తక్కువ సంస్కరణ కనిపిస్తే /వస్తే, XAMPP యొక్క తాజా సంస్కరణను ఇన్స్టాల్ చేయాలి. |
04:42 | మన సిస్టంలో MariaDB యొక్క వర్షన్ను తనిఖీ చేద్దాం. |
04:48 | టర్మినల్ పై sudo space slash opt slash lampp slash bin slash mysql space hyphen v అని టైప్ చేయండి మరియు ఎంటర్ ని నొక్కండి. |
05:03 | ఒక వేళా ప్రాంప్ట్ చేయబడితే అడ్మిస్ట్రేటివ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి Enterని నొక్కండి. |
05:08 | నా MariaDB యొక్క వర్షన్ 10.1.21. |
05:14 | మీకు 5.5.30 కంటే తక్కువ సంస్కరణ కనిపిస్తే /వస్తే, XAMPP యొక్క తాజా సంస్కరణను ఇన్స్టాల్ చేయాలి. |
05:23 | దయచేసి గమనించండి, PHP మరియు డేటాబేస్ సంస్కరణలను తనిఖీ చెయ్యడానికి, మీ సిస్టం లో XAMPP రన్ అవ్వాలి. |
05:29 | కమాండ్ ప్రాంప్ట్ ఇప్పుడు మారిపోయిందని గమనించండి. |
05:34 | backslash q ని టైపు చేసి, MariaDB నుండి నిష్క్రమించడానికి ఎంటర్ నొక్కండి. |
05:40 | ఇక్కడ చూపిన విధంగా ఇతర ఎర్రర్ లు కూడా మీకు రావచ్చు. |
05:44 | An apache daemon is already running అనే సందేశం కనిపించవచ్చు. |
05:50 | అంటే ప్రారంభ స్క్రిప్ట్ XAMPP-Apache ను ప్రారంభించలేదని దీని అర్థం |
05:55 | ఇది మరో Apache instance ఇప్పటికే అమలు అవుతుందని సూచిస్తుంది. |
06:01 | మీరు XAMPPను సరిగ్గా ప్రారంభించడానికి, మొదట ఈ daemonను ఆపాలి. |
06:06 | Apacheని ఆపడానికి ఈ కామాండ్,
sudo /etc/init.d/apache2 space stop |
06:19 | MySQL daemon failed to start అని చెప్పే ఒక సందేశాన్ని మీరు చూడవచ్చు. |
06:25 | అంటే ప్రారంభ స్క్రిప్ట్ MySQL ను ప్రారంభించలేదని దీని అర్థం |
06:30 | ఇది మరో database instance ఇప్పటికే అమలు అవుతుందని సూచిస్తుంది. |
06:36 | మీరు XAMPPను సరిగ్గా ప్రారంభించడానికి, మొదట ఈ daemonను ఆపాలి. |
06:41 | ఈ కమాండ్, sudo space /etc/init.d/mysql space stop MySQLని ఆపుతుంది. |
06:54 | అన్ని ఎర్రర్ లను పరిష్కరించండి మరియు XAMPP ను విజయవంతంగా అమలు చేయండి. |
06:59 | తరువాత మీ వెబ్ బ్రౌజర్ కు మరి, పేజీని రిఫ్రెష్ చేయండి. |
07:03 | భాష ఎంపిక కోసం ప్రాంప్ట్ చేయబడితే, ఇంగ్లీష్ ను ఎంచుకోండి. |
07:08 | ఇప్పుడు మనము ఒక యూజర్ను జోడించి, Moodle కోసం ఒక డేటాబేస్ ని సృష్టించాలి. |
07:14 | . దీనిని మనము phpmyadmin లో చేద్దాము, ఎందుకంటే అది MariaDB కోసం ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, |
07:21 | మరియు అది XAMPP సంస్థాపనతో పాటు వస్తుంది. |
07:25 | బ్రౌజర్కు తిరిగి వెళ్దాం. |
07:28 | XAMPP పేజీ పై, ఎగువన ఉన్న మెనూ నుండి phpMyadmin ని క్లిక్ చేయండి. |
07:34 | ఎగువ మెనులో ఉన్న User Accounts పై క్లిక్ చేసి, ఆపై 'Add User Accountని క్లిక్ చేయండి. |
07:42 | తీర్చుకునే కొత్త విండో లో మీకు నచ్చిన యూసర్ నేమ్ ఎంటర్ చేయండి. |
07:48 | నేను నా యూసర్ నేమ్ ని moodle hyphen st గా టైపు చేస్తునాను. |
07:53 | హోస్ట్ డ్రాప్-డౌన్ జాబితా నుండి, Local ఎంచుకోండి. |
07:57 | పాస్ వర్డ్ టెక్ట్స్ బాక్స్ లో మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. |
08:02 | నేను పాస్వర్డ్ ని moodle hyphen st గా టైప్ చేస్తాను. |
08:07 | Re-type టెక్స్ట్ బోస్ అదే పాస్వర్డ్ ని టైపు చేయండి. |
08:12 | Authentication Plugin ఎంపికను ఎలాగా ఉందో అలాగే ఉంచండి. |
08:17 | దయచేసి ఇప్పుడు Generate Password ప్రాంప్ట్ పై క్లిక్ చేయవద్దు. |
08:22 | Database for user account క్రింద మనము, |
08:26 | Create database with same name and grant all privileges ఎంపికను చూడవచ్చు. |
08:31 | మనము ఆ ఎంపికను తనిఖీ చేసి, ఈ పేజీ యొక్క దిగువ కుడి వైపు ఉన్న Go బటన్ను క్లిక్ చేద్దాము . |
08:38 | మనము విండో ఎగువన You have added a new user అనే సందేశాన్ని చూడవచ్చు. |
08:44 | moodle-st అనే పేరుతో ఒక కొత్త డేటాబేస్ మరియు moodle-st అనే పేరు తో ఒక యూసర్ సృష్టించబడ్డాయని అని అర్థం . |
08:54 | యూసర్ నేమ్ , పాస్ వర్డ్ మరియు 'డేటాబేస్ పేర్ల ను వ్రాసి పెట్టుకోండి. |
08:59 | Moodle సంస్థాపనను పూర్తి చేయటానికి వీటి అవసరం తరువాత ఉంటుంది. |
09:04 | దయచేసి గమనించండి: డేటాబేస్ ' పేరు మరియు యూసర్ నేమ్ ఒకే ల ఉండనవసరం లేదు . |
09:10 | భిన్నమైన పేర్లను కలిగి ఉండటానికి, డేటాబేస్ ను మొదట సృష్టించి ఆపై డేటాబేస్ కోసం ఒక యూసర్ ని సృష్టించండి. |
09:18 | ఇంకా, నామకరణ కన్వెన్షన్ ప్రకారం, యూసర్ నేమ్ మధ్య ఖాళీలు ఉండకూడదు. |
09:25 | ఇప్పుడు మన వద్ద XAMPP రన్ అవుతుంది మరియు మన డేటాబేస్ సిద్ధంగా ఉంది. |
09:29 | ఇప్పుడు మనము 'Moodle ని ఇన్స్టాల్ చేయుట కు సిద్ధంగా ఉన్నాము. |
09:32 | తదుపరి ట్యుటోరియల్ లో మనము Moodle యొక్క సంస్థాపనను కొనసాగించుతాము. |
09:37 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:41 | సారాంశం చూద్దాం. |
09:43 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: |
09:45 | Moodle వ్యవస్థాపించడం కోసం కనీస అవసరాల గురించి. |
09:49 | కనీస అవసరాల కోసం ఎలా తనిఖీ చేయాలి
ఎలా ఒక డేటాబేస్ని సెట్ అప్ చేయాలి మరియు ఎలా ఒక యూజర్ ని జోడించాలి. |
09:57 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
10:03 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
10:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
10:11 | మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
10:15 | మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా? |
10:18 | దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
10:27 | మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం మరియు ఆ క్షణంని ఎంచుకోండి. |
10:30 | మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు. |
10:36 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్ ఉంది. |
10:41 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
10:46 | ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. |
10:48 | తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
10:54 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
11:01 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
11:06 | ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి. |
11:10 |
మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |