Koha-Library-Management-System/C3/Copy-cataloging-using-Z39.50/Telugu
Time | Narration |
00:01 | Copy Cataloging using Z39.50 అను Spoken Tutorial కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో, మనం Z39.50 ను ఉపయోగించడం చేత catalog కు records ను ఎలా జోడించాలో నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux Operating System 16.04. |
00:28 | మరియు Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను. |
00:33 | మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నారని నిర్దారించుకోండి. |
00:38 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:45 | Cataloging standards, AACR2 మరియు MARC21 |
00:54 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:00 | మరియు, మీరు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి |
01:05 | మరిన్ని వివరాలకు, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. |
01:13 | Z39.50 అంటే ఏమిటి ? |
01:18 | Z39.50 అనేది రిమోట్ కంప్యూటర్ డేటాబేస్ల నుండి సమాచారాన్ని శోధించడం మరియు తిరిగి పొందడం కొరకు ఒక క్లయింట్-సర్వర్ ప్రోటోకాల్.
సంక్షిప్తంగా, ఇది కేటలాగింగ్ ని కాపీ చేయడానికి ఉపయోగించే సాధనం. |
01:37 | మనం ప్రారంభిద్దాం.
ముందు నన్ను కోహా ఇంటర్ఫేస్ కు మారి Superlibrarian, బెల్లాగా లాగిన్ అవ్వనివ్వండి. |
01:47 | Home page పై Koha administration ను క్లిక్ చేయండి. |
01:53 | ఈ పేజీ పై, దిగువభాగం వరకు స్క్రోల్ చేసి Additional parameters ను కనుగొనండి. |
01:59 | తరువాత, Z39.50/SRU సర్వర్ లపై క్లిక్ చేయండి. |
02:07 | కొత్త పేజీ Z39.50/SRU servers administration తెరుచుకుంటుంది. |
02:16 | ఇక్కడ రెండు టాబ్లు ఉన్నాయి - +New Z39.50 server మరియు +New SRU server. |
02:26 | New Z39.50 server ట్యాబు పై క్లిక్ చేయండి. |
02:32 | +New Z39.50 server అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
02:40 | గమనించండి target Z39.50 Server ను జోడించుటకు, మనకు target server వివరాలు తప్పక తెలిసుండాలి. |
02:51 | ఒకవేళ మీకు Z39.50 server యొక్క వివరాలు ఏమి తెలియకపోతే, ఈ URL లో Z39.50 సర్వర్లు యొక్క జాబితాను మీరు చూడవచ్చు. |
03:05 | IRSpy పేజీ తెరుచుకొని, మనల్ని కొన్ని వివరాలను నింపడానికి ప్రాంప్ట్ చేస్తుంది. |
03:12 | ప్రారంభిద్దాం. |
03:14 | (Anywhere) ఫీల్డ్ ను ఖాళీగా వదిలివేయండి. |
03:18 | నేమ్ కొరకు నేను Library of Congress ను టైప్ చేస్తాను. |
03:23 | ఇది ఎందుకంటే ఇది అతిపెద్ద లైబ్రరీల లో ఒకటి మరియు పెద్ద గ్రంథపట్టిక డేటాను కలిగి ఉంది. |
03:31 | తరువాత,Country కొరకు ఫీల్డ్ లో,డ్రాప్ డౌన్ నుండి United States ను ఎంచుకోండి. |
03:38 | Protocol కొరకు, డ్రాప్ డౌన్ నుండి ను Z39.50 ను ఎంచుకోండి. |
03:46 | మీ అవసరాలకు అనుగుణంగా మీరు మిగిలిన వివరాలను నింపవచ్చు. |
03:51 | తరువాత పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న search బటన్ పై క్లిక్ చేయండి |
03:57 | శోధన ఫలితాలతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
04:01 | Title, Host Connection Reliability, Host, Port మరియు DB, వంటి వివిధ శీర్షికల కింద 9 లైబ్రరీస్ యొక్క ఒక జాబితా ప్రదర్శించబడుతుంది. |
04:16 | ఈ వివరాలు కోహా లోని new Z39.50 server పై వివరాలను నింపడానికి ఉపయోగించబడతాయి. |
04:26 | గమనించండి మీరు పదికంటే ఎక్కువ ఉన్న భిన్నమైన లైబ్రరీల యొక్క జాబితాను చూడవచ్చు. |
04:32 | గుర్తుంచుకోండి, target Z39.50 server'ను జోడించడానికి ముందు ,Host Connection Reliability ను నిర్దారించుకోండి. |
04:43 | నేను Title : Library of Congress పై క్లిక్ చేస్తాను. |
04:48 | ఒక కొత్త పేజీ Library of Congress అనే శీర్షికతో తెరుచుకుంటుంది. |
04:54 | ఈ పేజీని తెరిచి ఉంచండి, ఈ పేజీలోని వివరాలు కాసేపటి తర్వాత మనకు అవసరం ఉంటాయి. |
05:01 | ఇప్పుడు, మనం ఈ ట్యుటోరియల్ లో ఇంతకుమునుపు తెరిచిన New Z39.50 server పేజీకి తిరిగి వెళ్దాం. |
05:12 | మరియు ఈ పేజీపై అవసరమగు వివరాలను నింపడం ప్రారంభించండి. |
05:17 | మనము తెరిచి ఉంచిన Library of Congress పేజీలో వివరాలు ఉన్నాయి. |
05:23 | కాబట్టి ప్రారంభిద్దాం. |
05:25 | New Z39.50 server పేజీపై, Server name కొరకు, Library of Congress అని టైప్ చేయండి. |
05:34 | ఈ వివరం Library of Congress పేజీలో name సెక్షన్ నుండి వచ్చింది. |
05:41 | 'Library of Congressపేజీ నుండి నేను గుర్తించిన మరికొన్ని ఇతర వివరాలను New Z39.50 serve పేజీపై నింపాను. |
05:54 | మీరు వీడియోను పాజ్ చేసి మీ అవసరాలకు తగినట్లు వివరాలను నింపవచ్చు. |
06:01 | ఎరుపురంగులో ఉన్న ఫీల్డ్స్ తప్పనిసరి అని గమనించండి. |
06:06 | తరువాత, మనం Preselected (searched by default) చెక్ బాక్స్ ను చూస్తాము. |
06:12 | మీరు ఈ ప్రత్యేక లైబ్రరీ యొక్క డేటాబేస్ డిఫాల్ట్ గా ఎల్లప్పుడూ శోధించాలని కోరుకుంటే దీన్ని క్లిక్ చేయండి.
నేను దీనిని తనిఖీ చేయకుండా వదిలివేస్తాను |
06:23 | ఇప్పుడు మనం Rank (display order) కొరకు ఫీల్డ్ కి వస్తాము.
ఒకవేళ మీరు ఈ లైబ్రరీని లైబ్రరీస్ యొక్క జాబితాలో అగ్రస్థానంలో ఉంచాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ 1 ఎంటర్ చెయ్యండి. |
06:37 | గమనించండి ఒకవేళ మీరు బహుళ z39.50 targets జోడించాలి అనుకుంటే వాటిని రాంక్ ఆధారంగా అమర్చండి. |
06:47 | Syntax'కొరకు నేను డ్రాప్ డౌన్ నుండి MARC21/USMARC ను ఎంచుకుంటాను.
మీరు మీ అవసరానికి తగినట్టు ఏదయినా Syntax'ను ఎంచుకోవచ్చు. |
07:00 | Encodingకొరకు కొహ అప్రమేయంగా utf8ను ఎంచుకుంటుంది
నేను దీనిని ఎలా ఉన్నది ఆలా వదిలి వేస్తాను. |
07:08 | కానీ మీరు మీ అవసరానికి తగినట్టు వేరే విలువ ఏదయినా ఎంచుకోవచ్చు. |
07:14 | తరువాతది Time out (0 its like not set). |
07:20 | ఇక్కడ, ఫలితాలు కనిపించడానికి మీరు వేచి ఉండాలనుకునే సెకన్లు సంఖ్యను టైప్ చేయండి.
నేను 240 ఎంటర్ చేస్తాను. |
07:32 | Record typeకొరకు కొహ అప్రమేయంగా Bibliographic ను స్వీయ ఎంపిక చేస్తుంది.
ఆలా చేస్తే, ప్రతి రికార్డు ఒక Bibliographic వివరాన్ని కలిగిఉంటుంది. |
07:44 | అన్ని వివరాలు ఇందులో నింపిన తరువాత, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save button పై క్లిక్ చేయండి. |
07:51 | Z39.50/SRU servers administration పేజీ మళ్ళి తెరుచుకుంటుంది. |
08:00 | మనము వివిధ శీర్షికల కింద జోడించిన వివరాలను ఈ పేజీపై చూడవచ్చు. |
08:06 | ఇప్పుడు,ee లైబ్రరీ నుండి రికార్డ్స్ ను శోధించడానికి, Koha homepageకి వెళ్ళండి
మరియు Catalogingపై క్లిక్ చేయండి |
08:16 | రెండు ఎంపికలతో ఒక పేజీ తెరుచుకుంటుంది.
+New record మరియు New from Z39.50/SRU. |
08:29 | New from Z39.50/SRU కు వెళ్ళి డ్రాప్ డౌన్ నుండి BOOKS ను ఎంచుకోండి. |
08:40 | ఒక కొత్త విండో Z39.50/SRU search తెరుచుకుంటుంది. |
08:48 | పేజియొక్క కుడిభాగం వద్ద ఉన్న Search targets ఫీల్డ్ ను కనుగొనండి |
08:54 | ఇక్కడ, మనం ఈ ట్యుటోరియల్ లో ఇంతకు మునుపు జోడించిన Z39.50 target అంటే LIBRARY OF CONGRESS ను చూడవచ్చు. |
09:07 | ఇప్పుడు LIBRARY OF CONGRESS కు పక్కన ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
09:14 | అదే పేజియొక్క ఎడమ భాగంపై వివిధ ఫీల్డ్ లతో Z39.50/SRU search ఉంది. |
09:25 | ఈ ఫీల్డ్స్ పరిధిలో, Titleను కనుగొని Clinical Microbiology అని టైప్ చేయండి. |
09:33 | మీరు కావాలనుకుంటే మిగిలిన ఫీల్డ్స్ ను నింపవచ్చు.
నేను వాటిని ఖాళీగా వదిలివేస్తాను. |
09:40 | ఇప్పుడు, పేజియొక్క దిగువ భాగం వద్ద ఉన్న Search బటన్ పై క్లిక్ చేయండి. |
09:46 | అయితే క్లిక్ చేసే ముందు, దయచేసి మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడ్డారని నిర్ధారించుకోండి. |
09:52 | వేరొక కొత్త పేజీ Results' తెరుచుకుంటుంది. ఈ శీర్షిక:
Server, Title, Author, Date, Edition, ISBN, LCCN, MARC మరియు Card. తో వివరాలను చూపిస్తుంది. |
10:11 | ఇప్పుడు, పేజియొక్క కుడిభాగానికి వెళ్ళి Import ఫీల్డ్ ను కనుగొనండి. |
10:18 | Title: Clinical Microbiology ఫీల్డ్ కొరకు నేను Import పై క్లిక్ చేస్తాను. |
10:25 | మీరు మీ అవసరానికి తగినట్టు వేరే ఏదయినా Title కొరకు Importఫై క్లిక్ చేయవచ్చు. |
10:32 | Importను క్లిక్ చేసినపుడు, Add MARC record పేరుతోఉన్న ఒక కొత్త విండో తెరుచుకుంటుంది. |
10:39 | Library of Congress డేటాబేస్ నుంచి దిగుమతి అయిన tags లో కొన్నింటిని ఇక్కడ మీరు చూస్తారు. |
10:47 | కానీ, సంబంధిత tags కొరకు ఖాళీ ఫీల్డ్ లను, మీ అవసరానికి తగినట్టు నింపవల్సి ఉంటుంది. |
10:55 | గుర్తుచేసుకోండి, మునుపటి ట్యుటోరియల్ లో మనం ఈ పేజీ యొక్క వివరాలను నింపాము. |
11:02 | వీడియో ను పాజ్ చేసి వివరాలను నింపండి. |
11:06 | అన్నివివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క eguvaభాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి. |
11:13 | ఒక కొత్త పేజీ Items for Clinical microbiology by Ross, Philip W తెరుచుకుంటుంది. |
11:22 | ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add item ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
11:28 | Items for Clinical microbiology by Ross, Philip W పేజీ తెరుచుకుంటుంది. |
11:36 | దీనితో, మనం Library of Congress నుండి Clinical microbiology పుస్తకం యొక్క వివరాలను కొహ లోనికి విజయవంతంగా దిగుమతి చేసాము. |
11:48 | సారాంశం చూద్దాం, |
11:50 | ఈ ట్యుటోరియల్ లో మనం Z39.50 ను ఉపయోగించడం చేత Catalog లో రికార్డ్స్ ను ఎలా జోడించాలో నేర్చుకున్నాము |
12:00 | అసైన్మెంట్-
Z39.50 ను ఉపయోగించి, Catalog లో ఒక సీరియల్ యొక్క రికార్డ్స్ ను జోడించండి. |
12:10 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
12:28 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
12:32 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
.ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:45 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |