Koha-Library-Management-System/C2/OPAC/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | How to use OPAC అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ఐటమ్ ని Search ఉపయోగించి ఎలా వెతకాలి |
00:13 | మరియు ఒక ఐటమ్ ని Advance Search ఉపయోగించి ఎలా వెతకాలో నేర్చుకుంటాము. |
00:18 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:32 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి. |
00:38 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:44 | మరియు మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:49 | లేక పొతే దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి. |
00:56 | ముందుగా, మైక్రోబయోలజీ పై నేను మరో 2 పుస్తకాలను చేర్చాను. |
01:02 | ఒకటి Powar and Daginawala రచయితగా మరియు మరొకటి Heritage రచయితగా. |
01:12 | ఇప్పుడు నా లైబ్రరీలో మొత్తం 3 పుస్తకాలు ఉన్నాయి. |
01:17 | మునుపటి ట్యుటోరియల్ లో వివరించిన విధంగా ముందుకు సాగే ముందు, మీ లైబ్రరీలో, మీ ఎంపిక యొక్క మరో 2 పుస్తకాలను చేర్చండి. |
01:27 | మీ వెబ్ బ్రౌజర్ ని తెరిచి 127.0.1.1/8000 అని టైప్ చేయండి. |
01:39 | ఈ URL సంస్థాపన సమయంలో ఇవ్వబడిన పోర్ట్ నంబర్ మరియు డొమైన్ పేరు మీద ఆధారపడి ఉంటుంది. |
01:47 | మీరు పేర్కొన్న దాని ప్రకారం దయచేసి టైప్ చేయండి.
ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
01:54 | Welcome to Spoken Tutorial Library అనే హోమ్ పేజీ తెరుచుకుంటుంది. |
02:00 | ఎగువ ఎడుమ వైపు ఉన్న Library catalog డ్రాప్ డౌన్ నుండి మనం క్రింది ఎంపికల ద్వారా శోధించవచ్చు: |
02:09 | Title, Author, Subject, ISBN, Series మరియు Call number. |
02:22 | ఇక్కడ కుడి వైపు ఉన్న ఫీల్డ్ లో Microbiology అని టైపు చేసి, ఫిల్డ్ యొక్క కుడి వైపు ఉన్న Goని క్లిక్ చేస్తాను. |
02:33 | మైక్రోబయోలజీ, అనే పదాన్నికలిగి ఉన్న అన్ని లైబ్రరీ ఐటమ్స్, ఫలితాల ను జాబితా గా కనిపిస్తాయి. |
02:40 | సెర్చ్ వర్డ్ తో జాబితా చేయబడిన ఐటమ్స్, యూసర్ ఎంపిక ప్రకారం మరింత క్రమబద్ధీకరించబడ్డాయి. |
02:47 | ఆలా చేయుటకు, జాబితా యొక్క కుడి వైపుకు వెళ్ళి Relevance క్లిక్ చేయండి. |
02:54 | డ్రాప్ -డౌన్ నుండి నేను Author (A-Z)ని ఎంచుకుంటాను. |
03:00 | మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏ ఇతర సంబంధిత ఎంపికను అయిన ఎంచుకోవచ్చు. |
03:06 | Author (A-Z)ని ఎంచుకున్న తరువాత, రచయితల జాబితా అక్షర క్రమంలో కనిపిస్తుంది. |
03:14 | జాబితా చేయబడిన శీర్షిక క్రింద చూడండి. ఇక్కడ, మనము అన్ని లైబ్రరీలలో, ఆ ప్రత్యేక ఐటమ్ యొక్క లభ్యతను చూడవచ్చు. |
03:26 | అయితే మన శోధన ని మరిన్ని మంచి ఫలితాలు కోసం ఎలా మెరుగు పర్చాలి? |
03:31 | ఆలా చేయుటకు ఎడుమ వైపు ఉన్న Refine Your Search ట్యాబు ని క్లిక్ చేయండి. |
03:39 | తరువాత Availability, Authors, Item Types మరియు Topics వంటి విభాగాల క్రింద వివిధ ట్యాబ్లకు వెళ్ళండి. |
03:52 | ఇప్పుడు, సాధారణ శోధనతో అవసరమైన మెటీరియల్ కనుగొనబడకపోతే ఏమి చేయాలో చూద్దాం. |
04:01 | Search Catalog పేజీ పై, Advanced Search లింక్ పై క్లిక్ చేయండి. |
04:07 | Search for అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
04:13 | బహుళ డ్రాప్-డౌన్ ఎంపికలను ఉపయోగించడం ద్వారా, మనకు అవసరమైన మెటీరియల్ కోసం శోధనను మెరుగుపరచవచ్చు. |
04:21 | ఎడమవైపు ఉన్న మొదటి డ్రాప్ డౌన్ నుండి, సరైన ఎంపికను ఎంచుకోండి, అనగా
Keyword, Subject, Title, Author, Publisher, Publisher Location, ISBN మరియు Barcode. |
04:40 | నేను Subject ఎంచుకుంటాను. మరియు కుడి వైపు ఫీల్డ్ లో, ఎడమ వైపు డ్రాప్ డౌన్ నుండి ఎంచుకున్న ఎంపికను టైప్ చేయండి. |
04:51 | Microbiology అని టైపు చేస్తాను. |
04:55 | రెండవ డ్రాప్ డౌన్ ఎంపిక ని ఉపయోగించి, Authorని Patelగా ఎంచుకుంటాను. |
05:03 | మూడవ డ్రాప్ డౌన్ ఎంపిక ని ఉపయోగించి, Publisherని Pearson గా ఎంచుకుంటాను. |
05:11 | అదే పేజీ పై, Item Type విభాగం క్రింద ఇతర ఎంపికలు |
05:18 | Book, Reference మరియు Serial లను గమనించండి. |
05:23 | ఆ తర్వాత Publication date range, Language మరియు Sorting ఎంపికలు ఉన్నాయి. |
05:34 | నేను Item Type విభాగం క్రింద Books రేడియో బటన్ ని క్లిక్ చేస్తాను. |
05:41 | Publication date range ని ఖాళీగా వదిలివేస్తాను. |
05:46 | భాష కోసం డ్రాప్ డౌన్ నుండి English ఎంచుకోండి. |
05:52 | Sorting విభాగం క్రింద Sort by కోసం Author (A-Z) ని ఎంచుకుంటాను. |
06:00 | అన్ని వివరాలు నింపిన తర్వాత పేజీ దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి. |
06:07 | ఈ పేజీలో అన్ని ఐటమ్ ల జాబితా ఈ విధంగా ఉండాలి.
Subject గా Microbiology |
06:16 | Author గా Patel Arvind H. |
06:20 | Publisher గా Pearson |
06:23 | ఇప్పుడు Advanced Search పేజీ కి వెళ్ళి, Search for విభాగం దిగువున ఉన్న More Options బటన్ క్లిక్ చేయండి. |
06:36 | ఆలా చేయడం వలన Advanced search పేజీ యొక్క layout మరిచబడుతుంది. |
06:42 | మరో సారి మొదటి డ్రాప్ డౌన్ లో Subject ని ఎంచుకుంటాను. |
06:48 | ఆపై Microbiology టైపు చేస్తాను. |
06:52 | ఇప్పుడు రెండవ వరుసలో ఎంపికలను చూద్దాం |
06:56 | మొదటి డ్రాప్ డౌన్ లో and అనే ఎంపిక ను అలాగే ఉంచుతాను. |
07:03 | కుడి వైపు ఉన్న డ్రాప్ డౌన్ లో నుండి Author ని ఎంచుకుంటాను. |
07:08 | దానికి కుడి వైపున నేను Patel అని టైపు చేస్తాను. |
07:13 | తదుపరి మూడవ వరుస ఎంపికలకు రండి.
మొదటి డ్రాప్ డౌన్ లో or అనే ఎంపిక ని ఎంచుకుంటాను. |
07:22 | కుడి వైపు ఉన్న డ్రాప్ డౌన్ లో నుండి Author ని ఎంచుకుంటాను. |
07:28 | దానికి కుడి వైపున నేను Heritage అని టైపు చేస్తాను. |
07:33 | అవసరమైతే, Item type లేదా మిగిలిన ఎంపికల క్రింద search ఎంపికల ద్వారా మీరు మీ శోధన ను మరింత విస్తరించవచ్చు. |
07:45 | అన్ని వివరాలు నింపిన తర్వాత అదే విభాగం దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి. |
07:52 | ఈ విధంగా మనము OPAC ఉపయోగించి లైబ్రరీలో ఐటమ్ లను శోధించవచ్చు. |
07:58 | ఈ ట్యుటోరియల్ తో, మీరు ఒక గ్రంథాలయ ఐటమ్ కోసం ఒక యూసర్ సులభంగా ఎలా శోధించాలో నేర్చుకున్నారు. |
08:05 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:08 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో మనము, ఒక ఐటమ్ ని Search ఉపయోగించి ఎలా వెతకాలి, |
08:17 | మరియు ఒక ఐటమ్ ని 'Advance Search ఉపయోగించి ఎలా వెతకాలో నేర్చుకున్నాము. |
08:22 | ఒక అసైన్మెంట్ గా -
Biology ని కీవర్డ్ గా వాడి, OPAC లో జర్నల్స్ యొక్క జాబితా కోసం వెదకండి. |
08:30 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
08:37 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
08:47 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
08:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:03 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |