Koha-Library-Management-System/C3/Import-MARC-to-Koha/Telugu
Time | Narration |
00:01 | Import MARC file into Koha అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము కోహ లో MARC ఫైల్ ని దిగుమతి చేయడం మరియు OPAC లో దిగుమతి చేసిన డేటాను శోధించుట నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు |
00:28 | కోహా వర్షన్ 16.05 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ ఉపయోగిస్తున్నాను. |
00:36 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర వెబ్ బ్రౌసర్ ని అయిన ఉపయోగించవచ్చు. |
00:41 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:47 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
మరియు మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:58 | లేక పొతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి. |
01:05 | కోహ లోకి రికార్డు ల దిగుమతి రెండు దశల్లో జరుగుతుంది:
Stage MARC records for import మరియు 'Manage staged records. |
01:18 | మొదట మన సూపర్ లైబ్రేరియన్ యాక్సిస్ తో లాగిన్ అవ్వుదాం. |
01:24 | హోమ్ పేజీ పై Toolsని క్లిక్ చేయండి. |
01:28 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Catalog సెక్షన్ కింద Stage MARC records for import పై క్లిక్ చేయండి' |
01:40 | Stage MARC records for import అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
01:46 | Stage records into the reservoir సెక్షన్ కు వెళ్ళండి. |
01:51 | ఇక్కడ Select the file to stage ప్రక్కన Browse... క్లిక్ చేయండి. |
01:58 | File Upload విండో తెరుచుకుంటుంది. ఆపై Downloads ఫోల్డర్ కు వెళ్ళండి. |
02:06 | ఇక్కడ TestData.mrc అనే ఫైల్ ని గుర్తించండి. |
02:12 | మునుపటి ట్యుటోరియల్లో ఒకదానిలో మనము TestData.mrc ఫైల్ ను సృష్టించాము. |
02:20 | TestData.mrc ని ఎంచుకోండి ఒక వేళ అది ఎంచుకోబడకపోతే.
పేజీ దిగువన Open బటన్ ని క్లిక్ చేయండి. |
02:32 | అదే పేజీలో, మీరు 'TestData.mrc' ఫైల్ పేరుతో, 'బ్రౌజ్' tab'ప్రక్కన చూస్తారు. |
02:43 | పేజీ దిగువన ఉన్న Upload file బటన్ ని క్లిక్ చేయండి. |
02:49 | మీరు గోధుమ రంగులో ఉన్న 'Upload progress barని చూస్తారు. |
02:55 | అప్ లోడ్ 100% వరకు అయిన తర్వాత, కొన్ని వివరాలను పూరించుటకు మనము ప్రాంప్ట్ చేయబడుతున్నాము. |
03:03 | Comments about this file ని మొదట నింపండి. |
03:09 | ఇది KOHA లో అప్లోడ్ చేసిన ఫైల్ను గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది. |
03:14 | నేను Book Data అని ఎంటర్ చేస్తాను. |
03:18 | తరువాతది Record type. ఇక్కడ Koha డిఫాల్ట్ గా Bibliographicని ఎంచుకుంటుంది. |
03:26 | అదేవిధంగా, క్యారెక్టర్ ఎన్కోడింగ్ కోసం, కోహ అప్రమేయంగా UTF-8 (Default)ని ఎంచుకుంటుంది. |
03:35 | next Look for existing records in catalog? సెక్షన్ కి రండి. |
03:41 | ఈ సెక్షన్ క్రింది Record matching rule కు వెళ్ళండి.
కొహ డిఫాల్ట్ గా Do not look for matching records ని ఎంచుకుంటుంది. |
03:51 | మీరు ప్రస్తుతం ఉన్న రికార్డులను సరిపోలాలనుకుంటే, డ్రాప్ డౌన్ నుండి మరొక ఎంపిక అనగా ISBN / ISSN numberని ఎంచుకోండి . |
04:04 | ఇప్పుడు మనం Action if matching record found కు వచ్చాము. |
04:09 | కొహ డిఫాల్ట్ గా Replace existing record with incoming recordని ఎంచుకుంటుంది. |
04:16 | .తర్వాత Action if no match is found వస్తుంది. కొహ డిఫాల్ట్ గా 'Add incoming record' ని ఎంచుకుంటుంది. |
04:25 | తరువాత, మనము Check for embedded item record data? విభాగానికి వస్తాము.
ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి Yes మరియు No. |
04:37 | Koha డిఫాల్ట్ గా Yes ఎంచుకుంటుంది. |
04:41 | How to process items కోసం Koha డిఫాల్ట్ గా Always add items ఎంచుకుంటుంది. |
04:48 | ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. మీరు ఈ ఎంపికలలో నుండి మీ ప్రాధాన్యత ప్రకారం ఏదని అయిన ఎంచుకోవచ్చు. |
04:56 | Stage for import button at the bottom of the pageని క్లిక్ చేయండి.
మీరు నీలిరంగు రంగు బార్లో Job progress ను చూస్తారు. |
05:06 | పురోగతి 100% వరకు పూర్తి అయినప్పుడు, కొత్త పేజీ Stage MARC records for import అనే శీర్షికతో తెరుచుకుంటుంది. |
05:17 | మనము మన ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాను, విజయవంతంగా దిగుమతి చేశామని గమనించండి. |
05:25 | దాని లో ఈ క్రింది వివరాలు ఉన్నాయి. |
05:28 | మీరు మీ .mrc డేటా ప్రకారం, మీ కోహ ఇంటర్ఫేస్ లో వేరొక విలువను చూస్తారని గమనించండి. |
05:36 | అదే పేజీలో, శీర్షిక పైన, మీరు రెండు ఎంపికలు చూస్తారు:
Stage MARC records మరియు Manage staged records. |
05:48 | నేను ఇప్పటికే ఎక్సెల్ ఫైల్ 'TestData ను దిగుమతి చేశాను గనక Stage MARC recordsని క్లిక్ చేయనని గమనించండి. |
06:00 | మీరు ఏదైన ఇతర ఫైల్ను దిగుమతి చేయాలనుకుంటే Stage MARC records పై క్లిక్ చేసి, ముందు పేర్కొన్న దశలను అనుసరించండి. |
06:11 | తరువాత, మనము KOHACatalogలో రికార్డుల దిగుమతిని నిర్వహించాలి. '
కాబట్టి, Manage staged recordsని క్లిక్ చేయండి. |
06:22 | ఒక కొత్త విండో Manage staged MARC records › Batch 6తెరుచుకుంటుంది. |
06:30 | ఈ పేజీ పై, కోహ ఇక్కడ చూపిన విలువలతో ఈ క్రింది ఫీల్డ్ లను నింపుతుంది. |
06:37 | మరియు ఈ క్రింది ఫీల్డ్ ల కోసం కోహా అప్రమేయంగా, ఈ ఎంట్రీలను డ్రాప్ డౌన్ నుండి ఎంచుకోండి. |
06:45 | కానీ, మీరు మీ అవసరానికి అనుగుణంగా సంబంధిత డ్రాప్-డౌన్స్ నుండి ఈ ఎంట్రీలను మార్చవచ్చు. |
06:52 | తర్వాత Apply different matching rulesఅనే బటన్ క్లిక్ చేయండి. |
06:57 | డేటాబేస్లో రికార్డుల యొక్క నకిలీని నివారించడానికి మీరు ఈ బటన్ పై క్లిక్ చేయవచ్చు.
నేను ఈ బటన్ను దాటవేసి ముందుకు వెళ్తాను.
|
07:09 | ఇప్పుడు, Add new bibliographic records into this frameworkని గుర్తించండి.
మరియు నేను డ్రాప్ డౌన్ నుండి, BOOKS ఎంచుకుంటాను. |
07:20 | మళ్ళీ, మీరు మీ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. |
07:25 | నేను Import this batch into the catalog అనే ట్యాబు ని క్లిక్ చేస్తాను. |
07:32 | అయినప్పటికీ, క్లిక్ చేయడానికి ముందు Citation విభాగం |
07:37 | దయచేసి ప్రత్యేక సంఖ్యలను గమనించండి.
మీరు Excel నుండి దిగుమతి చేసిన వివరాలతో వేరే సంఖ్యను చూస్తారని గమనించండి.' |
07:48 | మనము Import this batch into the catalog అనే బటన్ ను క్లిక్ చేద్దాం. |
07:55 | ఆలా చేయడం వలన 'Job progress bar కనిపిస్తుంది. |
08:00 | పురోగతి 100% వరకు పూర్తి అయినప్పుడు, ఒక కొత్త పేజీ |
08:06 | Manage staged MARC records › Batch 6అనే శీర్షిక మరియు ముందుగా ఎంటర్ చేసిన క్రింది వివరాలతో తెరుచుకుంటుంది. |
08:16 | మీ import ని అన్డు చేయడం సాధ్యమే. దిగుమతి చేయబడిన డేటాలో తప్పును కనుగొంటే, మీరు పొరపాటున సరిదిద్దడానికి క్రింది విధంగా చేయాలి |
08:27 | సెక్షన్ యొక్క దిగువున Undo import into catalog ట్యాబు ని క్లిక్ చేయండి. |
08:34 | నేను ఇక్కడ క్లిక్ చేయను. |
08:37 | తరువాతది Completed import of records. |
08:42 | ఇక్కడ మీరు records added, updated మరియు మొదలైన వాటి వివరాలను చూస్తారు. |
08:49 | తర్వాత మీరు దిగుమతి చేసిన వివరాలతో Citation విభాగాన్ని చూస్తారు. |
08:56 | దిగుమతి పూర్తయిన తర్వాత, కొత్త రికార్డు కు లింకు కనిపిస్తుంది. |
09:02 | ఇది దిగుమతి చేయబడిన ప్రతి Citationయొక్క కుడి వైపున కనిపిస్తుంది. |
09:08 | ఇప్పుడు, Catalog లో టైటిల్స్ చేర్చ బడ్డాయ లేదా అనేది నిర్ధారించుకుందాం. |
09:15 | అలా చేయటానికి, అదే పేజీ ఎగువన, Search the catalogని కనుగొనండి |
09:22 | ఇప్పుడు రికార్డ్స్ కొహ లోనికి సరిగ్గా ఇంపోర్ట్ అయ్యాయని నిర్ధారించేందుకు నేను ఒక చిన్న పరీక్ష చేస్తాను. |
09:29 | కాబట్టి, నేను Citation విభాగంలో దిగుమతి చేసుకున్న రికార్డు నుండి టైటిల్స్లో ఒక దానిని టైప్ చేస్తాను. |
09:37 | ఫీల్డ్ యొక్క కుడి వైపు ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి. |
09:43 | ఒక కొత్త పేజీ Inorganic chemistry Housecroft, Catherine E తెరుచుకుంటుంది |
09:50 | కోహ శోధించిన శీర్షిక ఫలితం చూపిస్తుంది, ఇది రికార్డులు సరిగా దిగుమతి అయ్యాయని రుజువు చేస్తుంది. |
09:58 | దీనితో మనము MARC ని కోహాలో దిగుమతి చేశాం. |
10:04 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో మనము KOHA లోకి MARC ఫైల్ ని దిగుమతి చేయడం మరియు దిగుమతి చేసిన డేటాను OPAC లో శోధించడం నేర్చుకున్నాము |
10:17 | అసైన్మెంట్
మునుపటి ట్యుటోరియల్లో మార్చబడిన MARC యొక్క 10 రికార్డులను ఉపయోగించండి. మరియు వాటిని కోహ లోనికి దిగుమతి చేయండి. |
10:29 | సూచన: Conversion of Excel data to Marc 21 format ట్యుటోరియల్ ను చూడండి. |
10:37 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
10:45 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
10:56 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
10:59 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
11:10 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |