Koha-Library-Management-System/C3/Installation-of-MarcEditor/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:54, 27 February 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 Windows పై Installation of MarcEditor అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనము ఒక 64-bit Windows మెషిన్ పై MarcEditor ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను:

Windows 10 Pro Operating System మరియు Firefox వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.

00:27 లైబ్రరీ సిబ్బందికి ఈ ట్యుటోరియల్ చాలా అనుకూలంగా ఉంటుంది.
00:32 ముందుకు వెళ్ళడానికి డానికి ముందు, మీ మెషిన్ పై కిందివి ఉన్నాయని నిర్దారించుకోండి -

Windows 10, 8 లేదా 7,

00:43 ఏదయినా వెబ్ బ్రౌజర్. ఉదాహరణకు: Internet Explorer, Firefox లేదా Google Chrome.
00:51 మీ ప్రస్తుత లైబ్రరీలో, మీరు Excel spreadsheet లో లైబ్రరీ రికార్డులను కలిగి ఉండవచ్చు.
00:58 మరియు, ఇప్పుడు మీ లైబ్రరీ Koha Library Management System కు తరలించబడుతుంది.
01:05 కనుక, అన్ని రికార్డ్స్ Excel' నుండి MARC ఫార్మాట్ కు మార్చవలసిన అవసరం ఉంది.
01:12 ఇది తెలుసుకోవడం ముఖ్యం:

Excel spreadsheet లోని రికార్డు లు మొదట MARC ఫార్మట్ లోనికి మార్చబడతాయి ఆపై Koha లోనికి దిగుమతి చేయబడతాయి.

01:26 ఇది ఎందుకంటే Excel format లోని డేటాను నేరుగా దిగుమతి చేసుకునే సదుపాయం కోహ లో లేదు.
01:35 ప్రారంభిద్దాం.
01:37 Excel data ను MARC ఫైల్ లోనికి అంటే (dot) mrc ఫార్మాట్ లోకి మార్చడానికి MarcEdit software ను ఉపయోగిస్తాము.
01:48 ఈ software ను ఇన్స్టాల్ చేయడానికి, బ్రౌజర్ కి వెళ్ళి ఈ URL ను టైప్ చేయండి.
01:55 Downloads అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
02:00 Current Development కింద, MarcEdit 7.0.x/MacOS 3.0.x కు వెళ్ళి Windows 64-bit download ను కనుగొనండి.
02:17 ఏమైనా, ఒకవేళ మీరు 32-bit మెషిన్ ను కలిగిఉంటే, అప్పుడు మీరు Windows 32-bit download లింక్ పై క్లిక్ చేయాల్సిఉంటుంది.
02:26 .మీ మెషిన్ 32-bit లేదా 64 -bit అని తనిఖీ చేయటానికి, మెషిన్ యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి
02:35 Start ఐకాన్ పై క్లిక్ చేయండి.
02:38 స్క్రోల్ చేసి Settings పై క్లిక్ చేయండి.
02:43 ఈ ఐకాన్స్ నుండి,System- Display, notifications, apps, power పై క్లిక్ చేయండి.
02:51 ఇది ఎడమభాగం పై కొన్ని ఎంపికలతో మరొక విండో ని తెరుస్తుంది.
02:56 About ట్యాబు ను కనుగొని దానిపై క్లిక్ చేయండి.
03:00 అదే పేజీపై, కుడిభాగం వైపు,PC సెక్షన్ కింద System type ను కనుగొనండి.
03:08 మీ మెషిన్ యొక్క operating system వివరాలు కనిపిస్తాయి.
03:13 నా మెషిన్ కొరకు, ఇది 64-bit operating system, x64-based processor అని చూపిస్తుంది.
03:21 వివరాలను చదివిన తరువాత, window ను మూసివేయండి.
03:25 ఆలా చేయడానికి, ఎగువ కుడి మూలకు వెళ్ళి cross mark పై క్లిక్ చేయండి.
03:31 మనం తిరిగి మళ్ళీ అదే పేజీ Downloads కు వస్తాము.
03:36 నా మెషిన్ 64-bit గా ఉంది కనుక, నేను 64-bit download పై క్లిక్ చేస్తాను.
03:42 64 -bit డౌన్ లోడ్ శీర్షికతో మరో కొత్త విండో రెండు విభాగాలతో తెరుచుకుంటుంది -

Non-Administrator మరియు Administrator.

03:53 తరువాత, నేను Administrator సెక్షన్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Download MarcEdit 7 లింక్ పై క్లిక్ చేస్తాను.
04:02 ఇది ఎందుకంటే, నా లైబ్రరీ యొక్క Koha administrator ని నేనే కనుక.
04:09 ఒక డైలాగ్- బాక్స్ MacrEdit_Setup64Admin.msi కనిపిస్తుంది.
04:16 ఇక్కడ మనం రెండు ఎంపికలను చూస్తాము -

Save File మరియు Cancel.

04:22 దిగువభాగం వద్ద ఉన్న Save File పై క్లిక్ చేయండి
04:26 ఆలా చేసిన తరువాత, మీ మెషిన్ యొక్క Downloads ఫోల్డర్ కు వెళ్ళండి.
04:31 ఇక్కడ, మీరు సేవ్ చేయబడిఉన్న MacrEdit_Setup64Admin.msi ఫైల్ ను చూడవచ్చు.
04:40 ఇప్పుడు, సేవ్ చేయబడిఉన్న ఫైల్ పై రైట్- క్లిక్ చేసి కనిపించే కింది ఎంపికల నుండి Install పై క్లిక్ చేయండి.
04:48 User Account Control డైలాగ్ - బాక్స్ లో 'Yes పై క్లిక్ చేయండి.
04:56 Welcome to the MarcEdit 7 Setup Wizard అనే పేరుతో మరొక విండో కనిపిస్తుంది.
05:04 పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
05:08 License Agreement అనే శీర్షికతో మరొక విండో తెరుచుకుంటుంది.
05:14 License Agreement ను జాగ్రత్తగా చదవండి.
05:18 మరియు రెండు ఎంపికలు I do not agree ఇంకా I agree ల నుండి, I agree రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
05:28 తరువాత, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
05:33 Select Installation Folder అనే పేరుతో ఒక కొత్త విండో తెరుచుకుంటుంది.
05:39 ఇది ఇన్స్టాల్ చేయబడిన సాఫ్ట్వేర్ ను ఎక్కడ సేవ్ చేయాలో ఆ ఫోల్డర్ యొక్క పాత్ ని చూపిస్తుంది.
05:45 ప్రత్యామ్నాయంగా, మీరు ఈ సాఫ్ట్వేర్ ను మీకు నచ్చిన వేరే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఫోల్డర్ ఫీల్డ్ లో కావలసిన పాత్ ని టైప్ చేయడం ద్వారా చేయవచ్చు.

05:56 మీరు Browse ట్యాబు పై క్లిక్ చేసి అవసరమైన పాత్ ను ఎంచుకోవచ్చు.
06:03 ఏమైనా, నేను ఫోల్డర్ ఫీల్డ్ లో, ఫోల్డర్ పాత్ ని ఎలా ఉన్నది అలా వదిలివేస్తాను.
06:09 ఇప్పుడు ,పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
06:14 Confirm Installation అనే మరొక కొత్త విండో తెరుచుకుంటుంది.
06:19 ఇప్పుడు ,అదే విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
06:25 Installing MarcEdit 7 విండో తెరుచుకుంటుంది.
06:30 దీని తరువాత, మనము

Installation Complete. MarcEdit 7 has been successfully installed అనే విజయ సందేశం విండోను చూస్తాము.

06:42 విండో నుండి నిష్క్రమించడానికి Close బటన్ పై క్లిక్ చేయండి.
06:47 MarcEdit 7.0.250 By Terry Reese అనే శీర్షికతో ఒక విండో తెరుచుకుంటుంది.
06:56 ఇప్పుడు తెరిచి ఉన్న అన్ని విండో లను మినిమైజ్ చేయండి.
07:01 Desktop పైన సృష్టించబడిన ఒక shortcut ను మీరు చూస్తారు.
07:06 దీనితో, మనం Desktop యొక్క 64-bit Windows మెషిన్ పై MarcEditorను విజయవంతంగా ఇన్స్టాల్ చేసాము.
07:14 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

07:22 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

07:32 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
07:36 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

07:48 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya