Koha-Library-Management-System/C2/Set-Currency/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:01, 18 February 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 సెట్ కరెన్సీ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, కోహ లో కరెన్సీ ని ఎలా ఏర్పాటు లో నేర్చుకుందాము.
00:13 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను,

ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం 16.04 మరియు

కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.

00:26 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీరు గ్రంథాలయ శాస్త్రం గురించి తెలుసి ఉండాలి.
00:33 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.

మరియు, మీకు కోహాలో అడ్మిన్ యాక్సెస్ ఉండాలి.

00:42 మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ను చూడండి.
00:49 సూపర్లైబ్రిరియన్ యూసర్ నేమ్ బెల్లా మరియు తన పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి.
00:58 ఆపై కోహ అడ్మినిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
01:03 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
01:06 అక్విజిషన్ పారామీటర్స్ విభాగం క్రింద, Currencies and exchange ratesపై క్లిక్ చేయండి.
01:15 ఈ డేటా స్వయంచాలకంగా నవీకరించబడదని గమనించండి.
01:20 అందువలన, డేటాను నవీకరించడం ముఖ్యం. ఇది సరైన అకౌంటింగ్ వివరాలను ఉంచడానికి సహాయపడుతుంది.
01:30 ఇప్పుడు, ప్లస్ న్యూ కరెన్సీపై క్లిక్ చేయండి.
01:35 తెరుచుకున్న కొత్త పేజీలో తప్పనిసరైన వివరాలను పూరించండి, అనగా, కరెన్సీ, రేటు మరియు సింబల్.
01:47 నా లైబ్రరీ భారతదేశంలో ఉన్నందున, నేను కరెన్సీ కోసం రూపాయిని ప్రవేశ పెడతాను.

రేట్ కొరకు 1 మరియు రూపీ (₹) గుర్తు.

02:00 తరువాత, ISO కోడ్ INR గా ప్రవేశ పెట్టండి.
02:05 కరెన్సీని సక్రియం చేయడానికి, చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. Last updated కరెన్సీ సెటప్ తేదీని చూపుతుంది.
02:14 పేజీ దిగువన ఉన్న Submit బటన్పై క్లిక్ చేయండి.
02:20 తీర్చుకున్న కొత్త పేజీ లోని కరెన్సీ ట్యాబు క్రింద రూపాయి యొక్క వివరాలు కనిపిస్తాయి.
02:27 అవసరమైతే, దానినే సవరించవచ్చు.
02:32 అసైన్మెంట్ కోసం,

మీ అవసరానికి అనుగుణంగా ఏ కరెన్సీని అయినా సెట్ చేసుకోండి, కానీ దానిని 'సక్రియం' చేయవద్దు.

02:41 కోహ ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్దాం.
02:45 అదే పేజీలో, Column visibility టాబ్ పై క్లిక్ చేయండి.
02:50 ఎంపికల నుండి, ISO కోడ్ పై క్లిక్ చేయండి.
02:55 రూపాయి కోసం ISO కాలమ్ టేబుల్లో కనిపిస్తుంది.
03:00 స్టేజింగ్ టూల్స్ ద్వారా MARC ఫైల్స్ ను దిగుమతి చేసుకున్నప్పుడు ప్రవేశ పెట్టిన ISO కోడ్ ఉపయోగించబడుతుందని గుర్తుంచుకోండి.
03:09 Tool ప్రస్తుత క్రియాశీల కరెన్సీ యొక్క ధరని కనుగొని, ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది.
03:16 కరెన్సీని సవరించడానికి, ఆ ప్రత్యేక కరెన్సీ యొక్క Edit ఎంపిక పై క్లిక్ చేయండి. నేను కరెన్సీ USD కోసం Edit పై క్లిక్ చేస్తాను.
03:29 Modify currency పేజీ తెరవబడుతుంది.
03:32 మీరు రేట్ మరియు గుర్తు యొక్క విలువను మార్చవచ్చు. నేను దానిని అలాగే విడిచిపెడతాను.
03:40 యాక్టివ్ ఫీల్డ్ కోసం చెక్ బాక్స్లో, నేను క్లిక్ చేయలేదని గమనించండి.
03:46 ఒక క్రియాశీల కరెన్సీ లైబ్రరీలో ఉపయోగపడే ప్రధాన కరెన్సీ.
03:51 నా గ్రంథాలయం భారతదేశం లో ఉన్నందున, రూపాయి క్రియాశీల కరెన్సీగా ఉపయోగించబడుతుంది.
03:57 తరువాత, పేజీ యొక్క దిగువ భాగంలోని Submit పై క్లిక్ చేయండి.
04:02 Currencies and exchange rates పేజీ మళ్ళి తెరుచుకుంటుంది.
04:08 ఇప్పుడు మీ కోహా సూపర్లైబ్రియన్ ఖాతా నుండి లాగ్ అవుట్ అవ్వండి.
04:13 మొదట, కుడి ఎగువ మూలలో వెళ్ళి, స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీపై క్లిక్ చేయండి.
04:21 ఆపై డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి.
04:26 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
04:30 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము కరెన్సీ ని ఎలా సెట్ చేయాలో నేర్చుకున్నాము.
04:36 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
04:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

04:54 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో కూడిన పోస్ట్ చేయండి.
04:58 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
05:05 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
05:10 ఈ ట్యుటోరియల్ ని అనువదించి మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig