Koha-Library-Management-System/C2/How-to-create-a-library/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:14, 12 February 2019 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:01 | How to create a Library in Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము ఒక లైబ్రరీని మరియు ఒక గ్రూప్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux Operating System 16.04 మరియు |
00:24 | Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:35 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:41 | మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి. |
00:46 | మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. |
00:53 | మనం ప్రారంభిద్దాం. నేను ఇప్పటికే నా సిస్టమ్ లో కోహా ను ఇన్స్టాల్ చేసియున్నాను. |
00:59 | కోహా ఇంటర్ఫేస్ కు నన్ను మారనివ్వండి. |
01:03 | ఇన్స్టలేషన్ సమయంలో ఇవ్వబడిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఉపయోగించి కోహా లోనికి లాగిన్ అవ్వండి. |
01:10 | నా సిస్టమ్ పై, నేను కోహా అండర్ స్కోర్ లైబ్రరీ ను యూజర్ నేమ్ గా ఇచ్చాను. |
01:17 | ఇప్పుడు, conf.xml ఫైలు లో నుండి వ్రాసుకున్న పాస్ వర్డ్ ను టైప్ చెయ్యండి. |
01:25 | కోహా యొక్క మెయిన్ పేజీ తెరుచుకుంటుంది. |
01:27 | గమనిక, కోహా ను ఏర్పాటు చేస్తున్నప్పుడు, మనము కోహలో సృష్టించబోయే ప్రతీ బ్రాంచ్ లైబ్రరీ వివరాలను తప్పనిసరిగా చేర్చాలి. |
01:38 | ఈ డేటా కోహా యొక్క అనేక క్షేత్రాలలో తర్వాత ఉపయోగించబడుతుంది. |
01:43 | ఇప్పుడు, ఒక కొత్త లైబ్రరీని చేర్చుదాం. |
01:47 | కోహా ఇంటర్ఫేస్ కు తిరిగి మారుదాం. |
01:50 | హోమ్ కు వెళ్ళి Koha Administration పై క్లిక్ చేయండి. |
01:56 | Basic parameters సెక్షన్ ను గుర్తించండి. |
02:00 | Libraries and groupsపై క్లిక్ చేయండి. |
02:04 | ఒక కొత్త లైబ్రరీ ని చేర్చడానికి + New Library ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
02:10 | ఇప్పటికి మనం groups విభాగము ను వదిలివేస్తున్నాము. |
02:15 | ఈ పేజీలో, ఎరుపు రంగులో గుర్తించబడిఉన్న అన్నిఫీల్డ్ లు తప్పనిసరి అని గమనించండి. |
02:21 | నేను ఇక్కడ చేసినట్లుగా, మీ లైబ్రరీ కోసం ఫీల్డ్స్ లో లైబ్రరీ కోడ్ మరియు నేమ్ ని పూరించండి. |
02:29 | గమనించదగిన కొన్ని ముఖ్యమైన విషయాలు- లైబ్రరీ కోడ్ లో ఖాళీలు ఉండకూడదు. |
02:36 | మరియు, ఇది 10 కంటే తక్కువ అక్షరాల పొడవు ఉండాలి. |
02:40 | ఈ కోడ్ డేటాబేస్ లో ప్రత్యేక గుర్తింపుగా ఉపయోగించబడుతుంది. |
02:46 | తరువాతి విభాగం లో -మన లైబ్రరీ యొక్క సంప్రదింపు వివరాలు అనగా అడ్రస్, ఫోన్ నెంబర్ మొదలైనవి నింపవలసి ఉంటుంది. |
02:58 | ఇక్కడ చూపిన విధంగా నేను వివరాలను నింపాను. |
03:01 | ఒకవేళ ఇక్కడ జాబితా చేయబడిన ఏదైనా ఫీల్డ్ కోసం మీదగ్గర సమాచారం లేకపోతే, దానిని ఖాళీగా వదిలేయండి. |
03:08 | అదేవిధంగా, ఈ పేజీలో మీ లైబ్రరీ యొక్క వివరాలను నింపండి. |
03:13 | అడ్రస్ మరియు ఫోన్ వివరాలు, తర్వాత మీ లైబ్రరీ కోసం కస్టమ్ నోటీస్ లు చేయడానికి ఉపయోగించవచ్చు. |
03:20 | ఈ వివరాలను, సభ్యులు ఎప్పుడైనా లైబ్రరీని సంప్రదించాలనుకున్నప్పుడు కూడా ఉపయోగించబడవచ్చు. |
03:26 | మీరు చూస్తున్నట్లుగా ఈమెయిల్ ఐడి ఫీల్డ్ తప్పనిసరి కాదు. |
03:31 | అయినప్పటికీ, మీరు సృష్టించే లైబ్రరీ కోసం, ఒక మెయిల్ ఐడిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. |
03:38 | ఈ మెయిడ్ ఐడి ద్వారానే, సభ్యులకు నోటీసులు వెళ్తాయి మరియు వారి నుండి వస్తాయి. |
03:45 | Gmail id ఉంటే ఉత్తమం, ఎందుకంటే దానిని మెయిల్ పంపడం మరియు / లేదా మెయిల్ అందుకోవడం కోసం సులభంగా కన్ఫిగర్ చేయవచ్చు. |
03:54 | ఈమెయిడ్ ఐడి ఫీల్డ్ క్రింద, మనకు రిప్లై -టు మరియు రిటర్న్-పాత్ ఫీల్డ్స్ ఉన్నాయి. |
04:01 | రిప్లై -టు - ఒకవేళ మీరు అన్ని నోటీసుల రెప్లైలు ఇవ్వడానికి, మరొక డిఫాల్ట్ ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వాలి అనుకుంటే, దానిని ఇక్కడ చేర్చవచ్చు. |
04:11 | నేను రిప్లై -టు ఇ-మెయిల్ ఐడిని stilibreoffice@gmail.com గా జోడిస్తున్నాను. |
04:20 | ఒకవేళ దీన్ని ఖాళీగా వదిలేస్తే, అన్ని రిప్లైలు పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వెళ్తాయి. |
04:27 | ఇక రిటర్న్-పాత్- కు వస్తే, అన్ని బౌన్సు చేయబడిన సందేశాలు ఈ ఈమెయిల్ అడ్రెస్ కు వెళ్తాయి. |
04:34 | ఒకవేళ దీన్ని ఖాళీగా వదిలేస్తే, అన్ని బౌన్సు చేయబడిన సందేశాలు పైన ఇవ్వబడిన ఈమెయిల్ ఐడికి వెళ్తాయి. |
04:42 | కాబట్టి, ప్రాథమికంగా మూడు వేర్వేరు ఈమెయిల్ ఐడీలు, |
04:48 | ఈమెయిల్ ఐడీ |
04:50 | రిప్లై -టు మరియు |
04:52 | రిటర్న్-పాత్ ఉపయోగించబడతాయి. |
04:55 | ఏమైనప్పటికి, ఒకవేళ అప్రమేయంగా ఒకే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చివుంటే ,కోహా మూడు ఫీల్డ్స్ కొరకు దానినే ఉపయోగించుకుంటుంది. |
05:04 | నేను ఇక్కడ చేసినట్లుగా, ఈ ఫీల్డ్ లో మీ లైబ్రరీ యొక్క URL ని పేర్కొనండి. |
05:10 | URL ఫీల్డ్ ని నింపడంపై, ప్రత్యేక లైబ్రరీ యొక్క పేరు OPAC పై హోల్డింగ్స్ టేబుల్ లో లింక్ చేయబడుతుంది. |
05:18 | దీని తర్వాత, మనం OPAC info నింపవల్సిఉంటుంది. |
05:23 | ఇది మీరు మీ లైబ్రరీ గురించిన సమాచారాన్ని పెట్టాల్సిన ప్రదేశం. |
05:28 | నేను నా లైబ్రరీ గురించి కొంత సమాచారాన్ని ఇక్కడ నమోదు చేశాను. |
05:33 | మనం కర్సర్ ను హోల్డింగ్స్ టేబుల్ లో లైబ్రరీ నేమ్ పై కదిలించినప్పుడు, ఈ ఇన్ఫో OPAC లో కనిపిస్తుంది. |
05:41 | ఒకవేళ ఈ ఫీల్డ్ లో ఒక ప్రత్యేక బ్రాంచ్ లైబ్రరీ యొక్క URL ను పెట్టినట్లయితే, OPAC ఏ బ్రాంచ్ లైబ్రరీలో మనకు కావలిసిన పుస్తకం దొరుకుతుందో చెప్తుంది. |
05:52 | హైపర్-లింక్ అడ్రెస్ సమాచారాన్ని పొందడానికి, లింక్ పై మౌస్ ను కదపండి(హోవర్). |
05:58 | ఇది ఆ పుస్తకం ఎక్కడ నుండి జారీచేయబడిందో సంబంధిత బ్రాంచ్ లైబ్రరీ అడ్రెస్ ను ఇస్తుంది. |
06:05 | కోహా ఇంటర్ఫేస్ కు తిరిగి వెళ్దాం. |
06:09 | తరువాత మనం IP అడ్రస్ ను కలిగిఉన్నాము. |
06:12 | మీరు కోహ అడ్మిన్ యాక్సిస్ ను ఒక నిర్దిష్ట IP అడ్రెస్ కు పరిమితం చేయాలనుకుంటే, ఆ IP ని ఇక్కడ పేర్కొనవచ్చు. |
06:22 | లేకపోతే, మీరు దాన్ని ఖాళీగా వదిలివేయవచ్చు. |
06:25 | నేను దాన్ని ఖాళీగా వదిలివేస్తున్నాను. |
06:28 | చివరగా, మనం నోట్స్ ఫీల్డ్ ను కలిగిఉన్నాము. |
06:32 | ఇందులో మీరు భవిష్యతు రిఫరెన్స్ కొరకు ఏవైనా నోట్స్ ను నింపవచ్చు. |
06:37 | OPAC లో ఇవి ప్రదర్శించబడవు. |
06:40 | అన్ని వివరాలను నమోదుచేసిన తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. |
06:46 | లైబ్రరీస్ పేజీ పై కొత్తగా జోడించబడిన లైబ్రరీ పేరు కనిపిస్తుంది. |
06:51 | మన సందర్భంలో అది, స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ. |
06:55 | గ్రూప్ లైబ్రరీ ఎంపికను ఎప్పుడు ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. |
07:00 | ఒకవేళ మీరు ఒక కొత్త గ్రూప్ ను జోడించాలనుకుంటే + New Group ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
07:07 | ఉదాహరణకు మీరు కెమిస్ట్రీ లైబ్రరీ, ఫిజిక్స్ లైబ్రరీ మరియు బయాలజీ లైబ్రరీ వంటి కొన్ని బ్రాంచ్ లైబ్రరీస్ ని కలిగివున్నారు మరియు వాటిని గ్రూప్ చేయాలనుకుంటున్నారు. |
07:19 | అటువంటి సందర్భాలలో Group Library ఎంపికను ఉపయోగించండి. |
07:24 | ఈ గ్రూప్ కు సైన్స్ లైబ్రరీ అని పేరు పెట్టండి.ఇది మెయిన్ లైబ్రరీ కింద ఉంటుంది. |
07:31 | సారూప్యతలు మరియు / లేదా సారూప్య లక్షణాలు మొదలైన వాటి ఆధారంగా గ్రూపింగ్ చేయవచ్చు. |
07:40 | మీ ప్రస్తుత సెషన్ నుండి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ గా లాగ్ అవుట్ చేయండి. |
07:45 | ఆలా చేయడానికి, ఎగువ కుడి మూలకు వెళ్ళి No Library Set పై క్లిక్ చేయండి. |
07:52 | డ్రాప్ -డౌన్ మెనూ నుండి, లాగౌట్ పై క్లిక్ చేయండి. |
07:57 | ఇది మనల్ని ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. |
08:01 | సారాంశం చూద్దాం. |
08:03 | ఈ ట్యుటోరియల్ లో మనము ఒక లైబ్రరీని మరియు ఒక కొత్త గ్రూప్ ని ఎలా సృష్టించాలో నేర్చుకున్నాం. |
08:11 | అసైన్మెంట్ గా- ఒక కొత్త లైబ్రరీ మరియు ఒక కొత్త గ్రూప్ ను సృష్టించండి. |
08:17 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
08:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
08:35 | నిర్దిష్ట ప్రశ్నల కొరకు ఫోరమ్:మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా? |
08:42 | దయచేసి ఈ సైట్ ను సందర్శించండి, మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి. |
08:49 | మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. |
08:51 | మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు. |
08:55 | నిర్దిష్ట ప్రశ్నల కొరకు ఫోరమ్: |
08:58 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్. |
09:03 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
09:08 | ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. |
09:11 | తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
09:17 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
09:23 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:28 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.మాతో చేరినందుకు ధన్యవాదములు. |