Firefox/C3/Popups/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:21, 28 May 2018 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Setting Pop-up and Image options పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి Pop-up మరియు image preferences ఏర్పాటు చేయుట.
00:13 టూల్ బార్ను కస్టమైజ్ చేయుట.
00:15 పాప్ అప్ విండోలు లేదా పాప్ అప్ లు, మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండోస్.
00:21 వాటి పరిమాణం మారుతూ ఉంటుంది కానీ, అవి సాధారణంగా మొత్తం స్క్రీన్ ఆక్రమించవు.
00:27 కొన్ని పాప్ అప్స్ ప్రస్తుత ఫైరుఫాక్సు విండో పైన తెరుచుకుంటాయి. అయితే, మరి కొన్ని ఫైర్ఫాక్స్ విండో క్రింద కనిపిస్తాయి(పాప్ అండర్స్).
00:37 పాప్ అప్స్ చాలా చిరాకు కలిగిస్తాయి అందుకే, వాటిని డిసేబుల్ చేయాలనిపిస్తుంది.
00:42 ఈ ట్యుటోరియల్ లో మనము "ఉబుంటు 10.04" ను 'ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0' ను ఉపయోగిస్తున్నాము.
00:50 ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం.
00:53 URL బార్లో www dot pop up test dot com అని టైప్ చేయండి.
01:01 ఎంటర్ కీని నొక్కండి.
01:03 ఈ సైట్ ఒక పాప్ అప్ అంటే ఏమిటో చూపిస్తుంది.
01:07 Multi-PopUp Test అనే లింక్ పై క్లిక్ చేయండి.
01:12 మీరు ఆరు పాప్ అప్ లను చూస్తారు.
01:20 Back ఫై క్లిక్ చేయండి.
01:22 ఇంకా రెండు పాప్ అప్ లు కనిపిస్తాయి. ఎంత చిరాకుగా ఉన్నాయో చూసారా?
01:28 ఫైర్ ఫాక్స్ "పాప్-అప్స్" మరియు "పాప్-అండర్స్" రెండిటిని నియంత్రించడానికి అనుమతిస్తుంది. దాని కొరకు "ఎడిట్" పై క్లిక్ చేసి ఆపై "ప్రిఫరెన్సెస్" పై క్లిక్ చేయండి.
01:37 "విండోస్" ఉపయోగించేవాళ్ళు దయచేసి "టూల్స్" పై క్లిక్ చేసి ఆపై "ఆప్షన్స్" క్లిక్ చేయండి.
01:43 ప్రీఫరెన్సెస్ విండో లో Content టాబ్ పై క్లిక్ చేయండి.
01:48 "బ్లాక్ పాప్ అప్ విండోస్" ఎంపిక ఇప్పటికే డిఫాల్ట్ గా ఆన్ చేసి వున్నది.
01:53 లేకపోతే, దానిని మీరు check చేయాలి.
01:56 కాబట్టి, Firefox లో పాప్-అప్స్ కనిపించకుండా నివారించేందుకు, వాటిని ఎనేబుల్ చెయ్యటం గురించి ఆందోళన చెందకండి.
02:02 ఇప్పుడు మీరు "క్లోజ్" బటన్ పై క్లిక్ చేసి ఫైర్ఫాక్స్ "ప్రిఫరెన్సెస్" విండో close చెయ్యవచ్చును.
02:09 మీరు exceptions కూడా ఎంచుకోవచ్చు.
02:12 Exceptions, మీకు ఆమోదయోగ్యమైన పాప్ అప్స్ కలిగి ఉన్న సైట్స్.
02:17 "ఎడిట్" పై క్లిక్ చేసి, ఆపై "ప్రిఫరెన్సెస్" పై క్లిక్ చేయండి.
02:20 "విండోస్" ఉపయోగించేవాళ్ళు దయచేసి "టూల్స్" పై క్లిక్ చేసి ఆపై "ఆప్షన్స్" పై క్లిక్ చెయ్యండి.
02:26 exceptions add చేయుటకు Block pop-up windows ఫీల్డ్ పక్కన ఉన్న Exceptions బటన్ పై క్లిక్ చేయండి.
02:34 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
02:37 Address of websites ఫీల్డ్ లో www dot google dot com అని టైప్ చేయండి.
02:44 Allow బటన్ పై క్లిక్ చేయండి.
02:46 'క్లోజ్' బటన్ పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి.
02:50 మరలా 'క్లోజ్' బటన్ పై క్లిక్ చేసి "ప్రిఫరెన్సెస్" డైలాగ్ బాక్స్ close చేయండి.
02:55 ఇప్పుడు పాప్-అప్స్ 'గూగుల్ డాట్ కామ్' నుండి తప్ప మిగితా అన్ని సైట్ల నుండి తిరస్కరించబడతాయి.
03:01 ఇప్పుడు URL బార్ లో "www.popuptest.com" అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
03:09 Multi-PopUp Test లింక్ పై క్లిక్ చేయండి.
03:12 ఏ ఒక్క పాప్-అప్ కనిపించదు.
03:15 మీ పాప్ అప్ బ్లాకర్ సమర్థవంతంగా పని చేసినది.
03:20 Images డౌన్లోడ్ కోరకు సమయం మరియు bandwidth పడుతుంది.
03:24 Images డౌన్లోడ్ ఆపివేయాలంటె మొజిల్లా ఫైర్ఫాక్స్ లో ఒక ఎంపిక ఉంది.
03:30 Edit ఫై క్లిక్ చేసి, ఆపై Preferences పై క్లిక్ చేయండి.
03:33 "విండోస్" ఉపయోగించేవాళ్ళు దయచేసి "టూల్స్" పై క్లిక్ చేసి ఆపై "ఆప్షన్స్" పై క్లిక్ చేయండి.
03:39 ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో Content tab ఎంచుకోండి.
03:44 Load images automatically చెక్ బాక్స్ ని డిసేబుల్ చేయండి.
03:49 Close బటన్ పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి.
03:53 ఇప్పుడు, సెర్చ్ బార్ లో Flowers అని టైప్ చేసి Enter ప్రెస్ చేయండి.
04:00 గూగుల్ 'హోమ్ పేజీ' నుండి Images పై క్లిక్ చేయండి.
04:04 మొదట కనిపించే ఇమేజ్ లింక్ పై క్లిక్ చేయండి.
04:08 image డౌన్ లోడ్ అవ్వటం లేదని చూడవచ్చు.
04:12 టూల్ బార్స్ ని Customize చేయుటకు మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇంకా రెండు ఆప్షన్లను అందిస్తుంది.
04:18 ఏదైనా ఒక టూల్బార్ దాచాలని అనుకుందాం. ఉదాహరణకు, మెనూ బార్.
04:23 మెనూ బార్ యొక్క ఒక ఖాళీ విభాగం పై రైట్ క్లిక్ చేయండి.
04:27 దానిని అన్ చెక్ చేయండి అంతే!
04:30 మెనూ బార్ ను మళ్ళీ చూచుటకు టూల్బార్ యొక్క ఒక ఖాళీ విభాగం పై రైట్ క్లిక్ చేయండి.
04:36 ఇప్పుడు మెనూ బార్ ఎంపిక ను check చేయండి.
04:40 టూల్ బార్ లను customize చేయుటకు ఫైర్ఫాక్స్ అధునాతన ఎంపికలను అందిస్తుంది. వాటిలో కొన్నిటిని చూద్దాం.
04:46 ఒకే క్లిక్ తో వెబ్ పేజీని ప్రింట్ చేయుటకు టూల్ బార్ పైన iconను Add చేద్దాం.
04:54 టూల్బార్ యొక్క ఒక ఖాళీ విభాగంపై రైట్ క్లిక్ చెయ్యండి.
04:58 Customize పై క్లిక్ చేయండి.
05:00 Customize Toolbar డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:04 డైలాగ్ బాక్స్ లోపల ప్రింట్ Icon చూడండి.
05:09 టూల్బార్ పై కి ప్రింట్ Icon Drag చేయండి.
05:12 Done పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ని close చేయండి.
05:17 టూల్ బార్ లో 'ప్రింట్' Icon పై క్లిక్ చేయండి.
05:21 'ప్రింట్' డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
05:25 ఇప్పుడు మనం ప్రింట్ చెయ్యం
05:28 కాబట్టి, Cancel బటన్ పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి
05:32 మీరు కూడా టూల్బార్లు add చేయవచ్చును లేదా remove చేయవచ్చును.
05:35 అలా చేయుటకు టూల్ బార్ పై రైట్ క్లిక్ చేసి Customizeను ఎంచుకోండి.
05:40 Add New Toolbar పై క్లిక్ చేయండి.
05:44 క్రొత్త టూల్ బార్కు పేరును ఎంటర్ చేయండి. దీనికి Sample Toolbar అని పేరు పెడదాం.
05:50 OK బటన్ పై క్లిక్ చేయండి.
05:53 ఇప్పుడు Sample Toolbar లోనికి డౌన్లోడ్స్ ఐకాన్ ను డ్రాగ్ చేయండి.
06:01 బ్రౌజర్ లో కొత్త టూల్ బార్ ని గమనించండి.
06:04 టూల్ బారును తొలగించడానికి Restore Default Set బటన్ పై క్లిక్ చేయండి.
06:10 కంటెంట్ ఏరియా పెంచుకోవడానికి, ఐకాన్స్ యొక్క పరిమాణం తగ్గిస్తాం.
06:16 Use Small icons క్ బాక్స్ ను check చేయండి.
06:22 Done పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ close చేయండి.
06:27 ఐకాన్స్ యొక్క పరిమాణం తగ్గిందని చూడవచ్చు.
06:32 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:36 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, Pop-up మరియు image preferences ఎలా సెట్ చేయాలి.
06:41 టూల్ బార్ని ఎలా కస్టమైజ్ చేయాలి.
06:43 ఇక్కడ మీకు ఒక assignment.
06:46 ఒక కొత్త "మొజిల్లా ఫైర్ఫాక్స్ విండో" తెరవండి, www.yahoo.com తప్ప అన్ని పాప్-అప్స్ ను నిరోదించండి. "బుక్ మార్క్" టూల్ బార్ ను insert చేయండి.
06:59 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి.
07:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
07:05 మీకు మంచి Bandwidth లేకపోతే Download చేసుకొని చూడవచ్చు.
07:10 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:15 ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.
07:18 మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు.
07:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ "టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు" లో ఒక భాగం.
07:29 దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు లభిస్తుంది
07:38 ఈ మిషన్ గురించి మరింత సమాచారం spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉంటుంది.
07:48 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india