BASH/C2/Array-Operations-in-BASH/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం మరియు వాటికి విలువలను కేటాయించడం. |
00:12 | డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం. |
00:15 | array పొడవు మరియు దాని nth elementను కనుగొనడం. |
00:20 | array ను ముద్రించడం నేర్చుకుంటాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:27 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి. |
00:33 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:37 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:41 | GNU BASH వర్షన్ 4.1.10 లను ఉపయోగిస్తున్నాను. |
00:45 | GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి. |
00:50 | మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం. |
00:55 | array అనేది బహుళ values తో కూడిన ఒక variable. |
01:01 | విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు చెంది ఉండవచ్చు. |
01:04 | array size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. |
01:08 | Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు. |
01:12 | Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది. |
01:16 | ఇప్పుడు మనం arrayను డిక్లేర్ చేయడం మరియు దానికి value ను కేటాయించడం ఎలానో చూద్దాం. |
01:21 | array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్- |
01:24 | declare hyphen a arrayname. |
01:28 | declare కీవర్డ్ ను arrayను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం. |
01:31 | ఇది Bash లో అంతర్నిర్మిత command. |
01:35 | array కు విలువను కేటాయించుటకు సింటాక్స్ - |
01:38 | Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value. |
01:46 | ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం. |
01:51 | Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు. |
01:56 | Elements ను space ద్వారా వేరుచేయాలి. |
02:00 | ప్రతి element parentheses లోపల ఉండాలి. |
02:03 | declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్. |
02:19 | మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం. |
02:21 | Ctrl + Alt మరియు T కీ లను కలిపి ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి. |
02:28 | ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి. |
02:36 | మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి. |
02:41 | ఇక్కడ చూపించిన విధంగా codeను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి. |
02:47 | ఈ లైన్ Linux అను పేరుగల array ను- Debian, Redhat, Ubuntu మరియు Fedora వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది. |
02:57 | ఇక్కడ హైఫన్ a అనేది flag. |
03:00 | ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది. |
03:05 | తిరిగి మన slides కు మారండి. |
03:07 | array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు. |
03:12 | డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ At (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్. |
03:22 | nth element యొక్క పొడవు ను ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు. |
03:28 | డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్. |
03:37 | ఇక్కడ n అనేది పొడవు కనుగొనవలసిన element యొక్క సంఖ్య. |
03:42 | array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు. |
03:48 | డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" గుర్తు (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్. |
03:57 | ఇప్పుడు తిరిగి మన text editor కు రండి. |
04:00 | ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది. |
04:06 | హైఫన్ e, బాక్ స్లాష్ escape యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది. |
04:11 | మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము. |
04:18 | తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది. |
04:23 | ఈ లైన్ array Linux యొక్క 3 rd ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది. |
04:28 | array యొక్క index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి. |
04:34 | చివరగా, ఈ లైన్ 3 rd ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది. |
04:40 | ఇప్పుడు Terminal కు మారండి. |
04:42 | మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. Enter నొక్కండి. |
04:56 | dot slash array.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:01 | output ప్రదర్శింపబడుతుంది. |
05:04 | array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు. |
05:10 | array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu మరియు Fedora. |
05:18 | array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu. |
05:22 | మనం ఉహించునట్లుగా మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు. |
05:29 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
05:32 | సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి. |
05:35 | ఈ ట్యుటోరియల్ లో, మనం |
05:40 | array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం. |
05:43 | డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం. |
05:46 | array పొడవు మరియు దాని nth ఎలిమెంట్ ను కనుగొనటం. |
05:51 | మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం. |
05:53 | ఒక అసైన్మెంటుగా- |
05:55 | names అనే array ను పొడవు 7 తో డిక్లేర్ చేయండి. |
06:00 | మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి. |
06:02 | అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి. |
06:04 | 5th ఎలిమెంట్ ని ముద్రించండి. |
06:06 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:10 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:13 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:18 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, |
06:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
06:24 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:27 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:35 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
06:47 | మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
06:52 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
06:58 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
07:02 | మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |