BASH/C2/Introduction-to-BASH-Shell-Scripting/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ప్రియమైన మిత్రులారా, స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇంట్రడక్షన్ టు బాష్ షెల్ స్క్రిప్టింగ్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది, |
00:10 | వివిధ రకాల షెల్స్ గురించి, |
00:13 | ఒక బాష్ షెల్ స్క్రిప్టు రాయడం, |
00:16 | దానిని ఎగ్జిక్యూట్ (అమలు) చేయడం. |
00:18 | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు Linux ఆపరేటింగ్ సిస్టమ్ తో పరిచయం ఉండాలి. |
00:25 | లేకపోతే, అప్పుడు సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి ఇక్కడ చూపించిన మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది, |
00:35 | ఉబుంటు లైనక్స్ 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
00:39 | GNU bash వెర్షన్ 4.1.10. |
00:43 | GNU బాష్ వెర్షన్ 4 లేదా అంతకంటే కంటే ఎక్కువ వెర్షన్ సాధన కోసం సిఫార్సు చేయబడింది అని గమనించండి. |
00:50 | పరిచయం తో మొదలు పెడదాం. |
00:53 | బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం. |
00:56 | బాష్ షెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే ఒక కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. |
01:02 | ఈ కమాండ్స్ ను ప్రామాణిక ఇన్పుట్ పరికరం నుండి గ్రహిస్తాం (స్వీకరిస్తాం). |
01:07 | ఇన్పుట్ పరికరం అనేది, |
01:09 | మీ కీబోర్డ్ |
01:11 | లేదా ఒక సాధారణ టెక్స్ట్ ఫైల్ కావచ్చు. |
01:14 | బాష్ షెల్ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. |
01:16. | మీ కీబోర్డ్ లో ఒకేసారి Ctrl + Alt + T కీలు నొక్కడం ద్వారా టెర్మినల్ విండోను తెరవండి. |
01:24 | ఇది Gnome టెర్మినల్ ను తెరుస్తుంది |
01:27 | మనం ఏ టైప్ షెల్ ఉపయోగిస్తున్నామో తనిఖీ చెయ్యడానికి, echo space dollar sign SHELL అని capital లలో టైపు చెయ్యండి. |
01:38 | ఎంటర్ కీ ని నొక్కండి. |
01:40 | slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీ తదుపరి లైన్లో చూస్తారు. |
01:47 | ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది. |
01:51 | అందుబాటులో ఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. |
01:56 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. బౌర్న్ షెల్. |
02:00 | ఇది స్టీఫెన్ బోర్న్ చే వ్రాయబడిన అసలు యూనిక్స్ షెల్. |
02:06 | దీనియందు ప్రస్తుతం మోడర్న్ షెల్స్ అందిస్తున్న సౌలభ్యత లోపించింది. |
02:11 | C షెల్ - ఇది బోర్న్ షెల్ లో లేని ఫీచర్లను అందిస్తుంది. |
02:16 | K షెల్ - ఇది డేవిడ్ కార్న్ చే సృష్టించబడింది. |
02:20 | ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులో ఉంటుంది. |
02:27 | బాష్ షెల్- |
02:30 | బాష్ షెల్ GNU ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. |
02:32 | ఇది B షెల్ భాష పై ఆధారపడి ఉంటుంది. |
02:35 | ఇది C మరియు K షెల్స్ యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. |
02:40 | TC షెల్ - ఇది FreeBSD మరియు దాని సంతతికి, డిఫాల్ట్ షెల్ గా ఉంటుంది. |
02:46 | Z షెల్- |
02:49 | ఇది సౌలభ్యతకు డిజైన్ చేయబడినది. |
02:52 | ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఉంది. |
02:58 | ఇప్పుడు మనం బాష్ షెల్ స్క్రిప్టు అంటే ఏమిటో చూద్దాం. |
03:02 | బాష్ షెల్ స్క్రిప్టు బాష్ వరుస కమాండ్స్ ని సాదా టెక్స్ట్ ఫైల్ లో కలిగి ఉంటుంది. |
03:08 | ఇది కమాండ్స్ ని టైపు చేసే బదులు టెక్స్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయమని షెల్ కు చెబుతుంది. |
03:15 | మనం ఒక సాధారణ బాష్ స్క్రిప్ట్ వ్రాయడం ఎలాగో చూద్దాం. |
03:20 | టెర్మినల్ మీద హలో వరల్డ్ అని ముద్రించే ఎకో కమాండ్ ని మనం పరీక్షించుదాం. |
03:25 | టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి. |
03:29 | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Hello world అని టైపు చెయ్యండి మరియు |
03:35 | ఎంటర్ ను నొక్కండి. |
03:37 | ఇది Hello World అని టెర్మినల్ మీద ముద్రిస్తుంది. |
03:40 | కమాండ్, అంచనా వేసినట్లుగా పనిచేస్తుంది. |
03:43 | మనం ఇప్పుడు, ఒక ఫైల్ లో ఈ కమాండ్ ఎలా ఉపయోగిస్తే ఏమిటి? |
03:47 | కేవలం కమాండ్ ని ఫైల్ లో ఉంచి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి. |
03:52 | నేను ఈ ప్రయోజనం కోసం, gedit అనే టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగిస్తున్నాను. |
03:57 | మీరు మీ ఇష్టమైన టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగించుకోవచ్చు. |
04:00 | నేను డెస్క్టాప్ మీద ఫైల్ create చేద్దాం అనుకుంటున్నాను. |
04:03 | కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి. |
04:07 | ఎంటర్ కీ ను నొక్కండి. |
04:09 | ఇప్పుడు gedit space hello underscore world dot sh space & (ఏంపర్సెండ్ సైన్) అని టైపు చెయ్యండి. |
04:20 | gedit అనునది ఒక టెక్స్ట్ ఎడిటర్. Hello underscore world dot sh ఫైలు పేరు మరియు |
04:27 | ప్రామ్ట్ ని ఫ్రీ చెయ్యడానికి మనం & (ఏంపర్సెండ్) ను ఉపయోగిస్తాం. |
04:32 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. మనం gedit ని ఉపయోగించి hello_world.sh అనే కొత్త ఫైల్ ను తెరిచాం. |
04:40 | ఇప్పుడు hash exclamation mark front slash bin front slash bash అని టైపు చెయ్యండి. |
04:47 | ఇది ప్రతి బాష్ స్క్రిప్ట్ యొక్క మొదటి లైన్. |
04:51 | దీనిని shebang లేదా బ్యాంగ్ లైన్ అని పిలుస్తారు. |
04:55 | ఎంటర్ కీ ను నొక్కండి. |
04:57 | ఇప్పుడు, hash space My first Bash script |
05:00 | అని టైప్ చేయుట ద్వారా ఫైల్ కు ఒక కామెంట్ ని జోడిద్దాం. |
05:06 | హాష్ తర్వాత ఏ లైన్ ను అయినా కామెంట్ గా పరిగణిస్తామని గుర్తుంచుకోండి. |
05:11 | కామెంట్స్ బాష్ ఇంటర్ప్రెటర్ చేత ఇగ్నోర్ చెయ్యబడతాయి (విస్మరించబడతాయి). |
05:15 | మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం ఉపయోగించిన కమాండ్ ని జోడిద్దాం. |
05:19 | ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి మరియు డబుల్ కోట్స్ లోపల echo space Hello world అని టైపు చెయ్యండి. |
05:27 | ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని (capital లలో) టైపు చెయ్యండి. |
05:34 | ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space backtick date backtick అని టైపు చెయ్యండి. |
05:41 | బ్యాక్టిక్ సింబల్ టిల్డ్ క్యారెక్టర్ కలిగి ఉన్న కీ మీద ఊంటుంది. |
05:47 | ఇప్పుడు, ఫైలు సేవ్ చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి. |
05:50 | ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం. |
05:55 | మొదట, మనం ఫైల్ ని ఎక్జిక్యూటబుల్ చేసుకోవాలి. |
05:58 | దీని కొసం chmod స్పేస్ plus x స్పేస్ hello underscore world dot sh అని టైపు చేసి, |
06:09 | ఎంటర్ కీ ని నొక్కండి. |
06:12 | ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి. |
06:14 | dot slash hello underscore world dot sh |
06:19 | ఎంటర్ కీ ను నొక్కండి. |
06:22 | టెర్మినల్ మీద Hello World అని డిస్ప్లే అవ్వడం మీరు చూడగలరు. |
06:27 | షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది). అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు |
06:32 | రోజు, నెల, సమయం, సమయం జోన్ మరియు సంవత్సరం ప్రదర్శించబడతాయి. |
06:38 | అవుట్ పుట్ సిస్టంను బట్టి మారుతూ ఉంటుంది. |
06:43 | తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం. |
06:46 | ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకున్నది. |
06:48 | వివిధ రకాల షెల్స్. |
06:50 | బాష్ షెల్, బాష్ షెల్ స్క్రిప్టు. |
06:52 | ఒక సాధారణ షెల్ స్క్రిప్టు వ్రాయడం మరియు ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ (అమలు) చెయ్యడం. |
06:57 | అసైన్మెంట్ గా Welcome to Bash learning అనే మెసేజ్ ని డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. |
07:03 | మరియు ప్రత్యేక (వేరే) వరుసలో *************** (ఆస్టరిస్క్లు) డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. |
07:06 | ఈ లింక్ వద్ద అందుబటు లో ఉన్న వీడియో ను చూడండి. |
07:10 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:13 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు |
07:17 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
07:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను నిర్వహిస్తుంది. |
07:22 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
07:26 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి. |
07:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ తో ఆ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:39 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. |
07:45 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము దిగువ చూపిన లింకు లో అందుబాటులో ఉంది. |
07:51 | ఈ స్క్రిప్ట్ FOSSEE మరియు స్పోకెన్-ట్యుటోరియల్ టీమ్స్ చే అందించబడింది. |
07:56 | ఈ ట్యుటోరియల్ ను అనువదించినది హరికృష్ణ. మరి నేను ఉదయ లక్ష్మి. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |