PERL/C2/Conditional-statements/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:48, 27 February 2018 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 PERL లో if and if-else conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:09 if స్టేట్మెంట్ మరియు
00:11 పెర్ల్ లో if-else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాము. నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:20 నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తున్నాను.
00:24 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:28 మీకు Perl లో వేరియబుల్ మరియు comments గురించి కొంత అవగాహన ఉండాలి.
00:33 Perl లో for, foreach, while మరియు do-while లూప్ ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:40 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:45 Perl క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది.
00:49 if, if-else
00:51 if-elsif-else మరియు
00:53 switch. ఈ ట్యుటోరియల్ లో మనం if మరియు if-else స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:59 Perl లో if స్టేట్మెంట్ ను
01:01 పేర్కొన్న కండిషన్ సంతృప్తిపడినప్పుడు కోడ్ యొక్క భాగాన్ని అమలు చేయడానికి ఉపయోగిస్తారు.
01:07 if కండిషనల్ స్టేట్మెంట్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
01:11 if space open bracket condition close bracket space open curly bracket అని టైప్ చేసి,
01:19 Enter మరియు కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్.
01:25 Enter మరియు close curly bracket.
01:29 if స్టేట్మెంట్ లోపల ఉన్న కోడ్ condition నిజమైనప్పుడు మాత్రమే అమలు అవుతుంది.
01:36 ఇప్పుడు, మనం if స్టేట్మెంట్ ను ఒక ఉదాహరణతో చూద్దాం.
01:40 టెర్మినల్ ను తెరవండి.
01:43 gedit conditionalBlocks dot pl space & (ampersand ) అని టైప్ చేసి,
01:49 Enter నొక్కండి.
01:52 ఇది conditionalBlocks.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:57 స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
02:02 ఇక్కడ మనకు వేరియబుల్ count యొక్క విలువను తనిఖీ చేస్తున్న కండిషన్ ను if లో ఉపయోగించాము.
02:09 ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది comparison ఆపరేటర్.
02:15 $count equal to equal to 5 అనే కండిషన్ వేరియబుల్ count విలువను తనిఖీ చేస్తుంది.
02:23 ఇది 5 కు సమానం అయినప్పుడు, if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలవుతుంది.
02:28 ఇప్పుడు, ఫైల్ save చేయడానికి ctrl+s నొక్కండి.
02:32 తరువాత టెర్మినల్ కు మారండి.
02:36 మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలోనే ఉన్నారని నిర్ధారించుకోండి.
02:41 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ని తనిఖీ చేయడానికి
02:46 perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి,
02:53 Enter నొక్కండి.
02:55 క్రింద లైన్ టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుంది:
02:59 conditionalBlocks.pl syntax OK .
03:04 ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన, మనము పెర్ల్ స్క్రిప్ట్ ను
03:10 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
03:14 Enter నొక్కి అమలు చేద్దాం:
03:16 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
03:19 I am inside if statement .
03:23 తిరిగి gedit కు మారండి.
03:26 ప్రత్యామ్నాయంగా, మనము పైన పేర్కొన్న if స్టేట్మెంట్ ను వ్రాయవచ్చు;
03:31 print space double quotes I am inside if statement backslash n close double quotes space if space open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon.
03:57 ఇప్పుడు , మనం if-else స్టేట్మెంట్ ను చూద్దాం.
04:01 ఈ స్టేట్మెంట్ యూజర్
04:06 కండిషన్ True అయినప్పుడు ఒక కోడ్ను మరియు
04:09 కండిషన్ False అయినప్పుడు మరొక కోడ్ను అమలు చేయాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది.
04:13 If-else యొక్క సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
04:17 if space open bracket condition close bracket space open curly bracket mariyu Enter నొక్కండి.
04:27 if కండీషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్
04:29 సెమికోలన్
04:32 Enter నొక్కండి.
04:34 close curly bracket space else space open curly bracket Enter
04:41 if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు కావలసిన కోడ్
04:43 సెమికోలన్
04:47 Enter నొక్కండి మరియు close curly bracket.
04:51 ఇప్పుడు, మళ్ళీ మనము gedit లో ఇప్పటికే సృష్టించిన conditionalBlocks.pl ఫైలుకు వెళ్దాం.
04:58 4 ను count వేరియబుల్ కు కేటాయించండి.తరువాత if బ్లాక్ చివరిలో space
05:07 else
05:09 space open curly bracket అని చేసి, Enter నొక్కండి
05:14 print space double quotes I am inside else statement backslash n double quotes complete semicolon.
05:30 Enter నొక్కండి మరియు close curly bracket.
05:34 ఇక్కడ $count వేరియబుల్ కు 4 కేటాయించబడింది.
05:38 count వేరియబుల్ విలువ 5 కు సరిపోలేదు కనుక,
05:43 if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడదు.
05:47 బదులుగా, else బ్లాక్ లోని కోడ్ అమలు చేయబడుతుంది.
05:52 ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
05:56 ఇప్పుడు టెర్మినల్ కు మారండి
05:59 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ తనిఖీ చేయుటకు perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి,
06:11 Enter నొక్కండి.
06:13 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
06:17 conditionalBlocks.pl syntax OK
06:20 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన మనం ఇప్పుడు Perl script ను
06:27 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి
06:33 Enter నొక్కి అమలు చేద్దాం.
06:35 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
06:39 I am inside else statement .
06:44 మనం సారాంశం చూద్దాం.
06:46 ఈ ట్యుటోరియల్ లో మనము:
06:49 పెర్ల్ లో if మరియు if-else కండిషనల్ స్టేట్మెంట్స్ ను
06:53 నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాం
06:55 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-
06:57 డిక్లేర్ చేయబడిన వేరియబుల్ విలువ perl అయినప్పుడు
07:01 “It is an open source language” ను
07:04 కానప్పుడు “It s a proprietary language” ను ముద్రించండి.
07:08 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:11 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం చేస్తుంది.
07:15 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:20 Spoken Tutorial ప్రాజెక్టు బృందం:
07:22 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:26 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
07:31 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
07:37 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
07:42 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
07:50 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:00 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:04 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను స్వామి.
08:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india