LibreOffice-Suite-Base/C4/Design-Refine-Database-Design-and-Normalization-Rules/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 00:25, 20 February 2018 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:02 | LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం |
00:06 | ఇది మునుపటి ట్యుటోరియల్ Database Design కు కొనసాగింపు. |
00:11 | ఇక్కడ మనం క్రింది అంశాలను నేర్చుకుందాం |
00:15 | database design ను మెరుగుపర్చడం, |
00:18 | normalization నియమాలను అమలు చేయడం |
00:21 | డేటాబేస్ డిజైన్ ను పరీక్షించండం. |
00:25 | క్రితం ట్యుటోరియల్ నందు మనం primary keys మరియు foreign keys ను ఉపయోగించి table relationships ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. |
00:34 | ఇప్పుడు database design పద్దతిని అనుకరిద్దాం |
00:38 | ముందు మన డేటాబేస్ డిజైన్ ను మెరుగుపర్చుదాం. |
00:42 | ఇప్పుడు మనం ప్రాధమిక నిర్మాణం ను కలిగి ఉన్నాము. మనం దానినుండి, టేబుల్స్ ను సృష్టించి, మరియు నమూనా డేటా ను నింపగలము. |
00:50 | నమూనా queries, form మరియు report తయారు చేసి, మునుపటి ప్రశ్నలకి సమాధానం లభించిందో లేదో చూద్దాం |
00:59 | మనం అనవసరమైన నకిలీలను తనిఖీ చేసి డిజైన్ ను మార్చడం ద్వారా వాటిని తొలగించవచ్చు. |
01:06 | మనం మర్చిపోయిన column ను కలపవచ్చు |
01:10 | మనం Business rules ను Libraryడాటాబేస్ కు చేర్చడం ద్వారా Database Integrity ను అమలు చేయవచ్చు |
01:19 | ఉదాహరణకు Books పట్టికలో Price column డేటా టైప్ numeric గా ఉండాలి. |
01:24 | మరొక నియమం ఏమిటంటే, Return Date పుస్తకం జారీచేసిన తేదీ నుండి ఒకనెల తరువాత ఉండాలి |
01:32 | లేదా ఒక నిర్దిష్ట చర్య సంభవించినప్పుడు, తదుపరి చర్యలు ప్రేరేపించబడాలి. |
01:39 | కాబట్టి, ఒక పుస్తకం రిటర్న్ తేదీ దాటి ఉంటే, మనం సభ్యునికి ఒక ఇమెయిల్ రిమైండర్ ను పంపడానికి డేటాబేస్‌లో చర్యలను ఏర్పాటు చేయాలి. |
01:50 | కాబట్టి మనం పునఃరూపకల్పన చేస్తున్నప్పుడు కొత్త పట్టికలను, columns, నియమాలు లేదా పరిమితులను జోడించవచ్చు. |
01:58 | Data Integrity ను కోల్పోకుండా ఉండటానికి మనం మునుపటి దశలన్నిటికి వెళ్ళాలి. |
02:07 | తరువాత normalization rules ను అమలు చేయవచ్చు. |
02:13 | ఇవి మన పట్టికలు |
02:17 | సరిగ్గా నిర్మించబడ్డావో, లేదో మరియు మనం మునుపు చూసిన ఏదైనా మార్పులకు సంబంధిచిన anomalies ఉన్నవో, లేదో |
02:20 | అని పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. |
02:25 | ఈ విధంగా normal forms ను database design కి వర్తీకరించే విధానాన్నీ normalization అంటారు |
02:33 | ట్యూటోరియాల్ ల్లో మొదటి మూడు Normal forms ను గమనిద్దాం |
02:38 | First Normal Form లేదా 1NF అన్ని columnల విలువ atomic గా ఉండాలని సూచిస్తుంది |
02:51 | ఉదాహరణకి Books పట్టికలోని Price వరుసలో ప్రతి సెల్ ఒకేవిలువను కలిగి ఉండాలి |
02:59 | అంటే ఆ వరుస కేవలం పుస్తకం యొక్క ధర మాత్రమే కలిగి ఉండాలి |
03:07 | అలాగే Authors పట్టికలోని ప్రతి First Name రచయిత మొదటిపేరును మాత్రమే కలిగి ఉండాలి |
03:16 | First Normal form నిలువు వరుసల పునరావృత సమూహాలు లేవని సూచిస్తుంది |
03:23 | ఉదాహరణకి ప్రచురణకర్త మూడు పుస్తకాలు ప్రచురించాడనుకుందాం |
03:29 | మరియు Publishers పట్టిక క్రింది వరుసలు కలిగి ఉంటుంది |
03:34 | Publisher Id, Publisher, Book1, Author 1, Book 2, Author 2, Book 3, Author 3. |
03:47 | Book and Author మూడుసార్లు పునరావృత్తం అయ్యిందని గమనించాలి |
03:52 | అలాంటివి మనం గమనించినప్పుడు మన డిజైన్ ను మరొకసారి పరీక్షించుకోవాలి |
03:58 | ఒకవేళ ప్రచురణకర్త మరో పది పుస్తకాలను ప్రచురిస్తే మనము పట్టికకు మరొక 20 వరుసలు జతచేయాల్సి ఉంటుంది |
04:08 | కాబట్టి డేటాలో మార్పు చేసినప్పుడు పట్టిక డిజైన్ స్థిరంగా ఉండదని గమనించవచ్చు |
04:14 | అంతేకాకుండా, పుస్తకం లేదా రచయిత పై ఆధారపడి table ను శోధించి మరియు క్రమబద్ధీకరణ చేసినప్పుడు అది గజిబిజిగా మారుతుంది. |
04:23 | కాబట్టి మనం ఈ పొరపాట్లను సరిచేయుటకు, పట్టికను రెండు లేదా మూడు భాగాలుగా విభజించవచ్చు. |
04:30 | మన ఉదాహరణలో పై పట్టికను Publishers, Books మరియు Authors గా విభజించవచ్చు |
04:41 | ఈ డిజైన్ పట్టికను First Normal Form కి తీసుకొస్తుంది |
04:47 | అంతేకాకుండా, ప్రచురణకర్తలు పుస్తకాలపై డేటా మార్చినప్పటికీ పట్టిక నిర్మాణాలు స్థిరంగా ఉంటాయి. |
04:56 | ఇప్పుడు Second Normal Formను ఇప్పుడు చూద్దాం. |
05:00 | ఒక టేబుల్ 1NF లో ఉంటూ, ప్రతి non-key column primary key పై మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటే |
05:07 | ఆ table, Second Normal Form or 2NF లో ఉందని చెప్పగలుగుతాం. |
05:14 | ఈ నియమం మన primary key లో ఒకటి కంటే ఎక్కువ columnలు ఉన్నప్పుడు వర్తిస్తుంది |
05:22 | ఉదాహరణకి BooksIssued అనే పట్టికను |
05:29 | BookId, MemberId, BookTitle మరియు IssueDate లను columnలుగా మరియు BookId and MemberId లను primary key గా తీసుకుందాం |
05:42 | BookTitle కాలమ్ ను గమనించండి |
05:45 | మనము Books పట్టికలోని BookTitle ను BookId ద్వారా పొందవచ్చు |
05:52 | వేరొక విధంగా చెప్పాలంటే BookTitle కాలమ్ BookId పై మాత్రమే ఆధారపడివుంటుంది Member ID పై కాదు |
06:00 | కాబట్టి ఇది పూర్తి primary key పై ఆధారపడదు |
06:06 | ఈ పట్టికను Second Normal Formకు మార్చడానికి మనం BookTitle ను తొలిగించాలి మరియు |
06:14 | పూర్తిగా primary key and columns లపై ఆధారపడిన కాలమ్స్ లను మాత్రమే ఉంచాలి. |
06:23 | IssueDate ఇక్కడ ఉంది, ఎందుకంటే అది రెండు primary key ఫీల్డ్స్ పై ఆధారపడివుంటుంది |
06:31 | Third Normal Form అంటే ఏమిటో చూద్దాం |
06:35 | ఒక పట్టిక 2NF లో ఉన్నపుడు మాత్రమే అది Third Normal Form అని చెప్పగలుగుతాం |
06:42 | మరియు అన్ని నాన్ -కీ కాలమ్స్ స్వతంత్రంగా ఉంటాయి |
06:48 | ఉదాహరణకి BooksIssued పట్టికను |
06:54 | BookIssueId (ప్రైమరీ కీ గా) BookTitle, Member, IssueDate and ReturnDate కాలమ్స్ తో తీసుకొందాం. |
07:03 | మరియు Library పాలసీగా Book Issue Date కి ఒక నెల తరువాత తిరిగి ఇచ్చు తేదీ ఉండాలి అనుకుందాం. |
07:11 | ఇప్పుడు Base, ఒక non-key అయిన IssueDate కాలమ్ ను ఉపయోగించి, Return Date ను లెక్కకట్టవచ్చు. |
07:19 | అంటే, ReturnDate కేవలం IssueDate పై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇంకా దీనిపై ఆధారపడదు. |
07:26 | ఒకవేళ Return Date లో వేరొక తేదీ చేర్చింనట్లయితే, అది లైబ్రరీ నియమాన్ని ఉల్లంగిస్తుంది |
07:37 | కాబట్టి పట్టికను Third Normal Form లో పెట్టడానికి మనం పట్టిక నుండి ReturnDate వరుసను తొలిగించాలి |
07:44 | కాబట్టి ఇప్పుడు మనం మొదటి మూడు నార్మల్ ఫార్మ్ లను ఎలా అమలు చేయాలో నేర్చుకున్నాం |
07:49 | సాధారణంగా మన డేటాబేస్ డిజైన్ 3NF వద్ద ఆగిపోతుంది. |
07:55 | Normal forms and database design పై మరింత సమాచారం కోసం తెరపైఉన్న వెబ్‌సైట్‌ను చూడండి. |
08:05 | చివరిగా మన డేటాబేస్ డిజైన్లను పరీక్షిద్దాం. |
08:12 | మనం డేటాబేస్ నిర్మాణం ను సృష్టించగలము. |
08:16 | ఇక్కడ మనం Tables, Relationships, Rules లేదా Constraints, Forms, Queries మరియు Reports లను తయారుచేద్దాం |
08:24 | మరియు మనం డాటాబేస్‌ను వాస్తవ డాటానుప్రయోగించి పరీక్షిద్దం |
08:29 | form ను ఉపయోగించి జోడింపులు, నవీకరణలు లేదా డేటాబేస్ తొలగించవచ్చు |
08:36 | Run రెపోర్ట్ ను ఉపయోగించి ఫలితాలు సరైనవో కావో మరియు ఖచితత్వమును తెలుసుకోవచ్చు |
08:42 | డేటాబేస్ ఉపయోగానికి సిద్దమైనతరువాత మనం నిర్వహణ వేగాన్ని పరీక్షించుకోవాలి |
08:50 | పట్టికలకు, Indexes ను జోడించడం ద్వారా డేటాను పొందే వేగాన్ని పెంచవచ్చు |
08:55 | మన డేటాబేస్‌ను సఫలవంతం చేయడానికి కాలానుగుణంగా డేటాబేస్ ను నిర్వహిoచాలి |
09:03 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది |
09:08 | Library database design కు Media అనే కొత్త entity జోడించండి. |
09:14 | Media లో ఆడియో లేదా వీడియో ను కలిగిన DVDs మరియు CDs ఉన్నవి |
09:21 | పుస్తకాల మాదిరిగానే DVDs మరియు CDs Library సభ్యులకిస్తారు |
09:28 | database design పద్దతిని అనుకరించండి |
09:31 | మొదటి మూడు Normal forms ను మీ డిజైన్ కు అనువర్తించండి. |
09:37 | ఇది మనకు Database Desin in LibreOffice Base లోని మూడోవ భాగంపై చివరకు తీసుకొస్తుంది |
09:45 | సారాంశంగా, మనం డాటాబేస్ డిజైన్ పై క్రింది అంశాలను నేర్చుకున్నాము. |
09:50 | డాటాబేస్‌ను రిఫైన్ చేయడం, |
09:52 | normalization నియమాలను వర్తించడం, |
09:55 | డేటాబేస్ డిజైన్ ను పరీక్షించండం, |
09:58 | Spoken Tutorial Talk to a Teacher ప్రాజెక్టుకు ఒక భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:10 | ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. |
10:15 | దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:20 | దీనిని అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు. |