LibreOffice-Suite-Base/C4/Database-Maintenance/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:22, 19 February 2018 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం |
00:04 | ఈ ట్యూటోరియాల్లో మనం ఒక డేటాబేస్ ను నిర్వహించడo, నిర్మాణాన్ని సవరించడం మరియు డిఫాల్ట్ బ్యాకప్ తీసుకొనడం నేర్చుకుంటాము. |
00:19 | డేటాబేస్ ను నిర్వహించడం - |
00:21 | Base డేటాబేస్ జివిత కాలం మొత్తం మనం డాటాను సురక్షితం మరియు అప్డేట్ చేస్తుండాలి |
00:31 | దీనిలో భాగంగా, మనం data structure మరియు form ను ప్రస్తుతానికి అనుగుణంగా అప్డేట్ చేస్తుండాలి. |
00:41 | ఉదాహరణకి మనం పూర్వపు ట్యుటోరియల్ లో చేసిన Library డేటాబేస్ ను తీసుకుందాం |
00:48 | ఈ డేటాబేస్, మొదటగా books, members మరియు books issued వంటి tables ఉంటాయి. |
00:55 | మనం ఈ డేటాబేస్ పై మన ఉదాహరణలను, ప్రశ్నలను, రిపోర్టులు నిర్మించాము. |
01:03 | ఆ తరువాత library లో DVDs మరియు CDs ఉండేలా విస్తరిoపచేస్తాం. |
01:11 | కాబట్టి Library database ను, మార్చడం వల్ల మనం ఆ నిర్మాణాన్ని అప్డేట్ చేయవచ్చు |
01:16 | దీనికొరకు Media అనే మరొక పట్టికను జోడించాలి |
01:21 | మనం DVD and CD సమాచారాన్ని ఈ కొత్త Media పట్టికలో భద్రపరుస్తాం |
01:28 | ఈ విధంగా, అవసరమైనప్పుడు మార్పులు చేయడం వలన, డేటాబేస్ మరింత ఉపయోగకరంగా మరియు తాజాగా మారింది. |
01:39 | table లో మార్పు చేసినప్పుడు మనo formలలో మార్పులు చేయడం వలన ఉపయోగించడానికి మరింత సులభకరమవుతుంది |
01:47 | లేదా కొత్త పద్దతులను అవలంభించడం ద్వారా కొత్త పట్టికలను తయారుచేయవచ్చు |
01:54 | ఉదాహరణకి మన వద్ద పుస్తకాల డాటాను ఎంటర్ చేయడానికి form ఉన్నట్లయితే, అందులో DVDs మరియు CDల డేటా ఎంట్రి చేయవచ్చు |
02:08 | ఇక్కడ మనం books లేదా DVDs లేదా CDs అనేదాన్ని ఎంపిక చేయడం వల్ల ప్రచారణ రకాన్ని ఎన్నుకోవచ్చు |
02:19 | లేదా, కేవలం DVD మరియు CD మీడియా కోసం డేటా ఎంట్రీని అనుమతించడానికి మనం కొత్త బ్రాండ్స్ ను జోడించవచ్చు. |
02:28 | అలాగే డేటా స్ట్రక్చర్ మారినప్పుడు, మనం కొత్త ప్రశ్నలు మరియు రిపోర్టులు మార్చవలసి లేదా జోడించవలసి ఉంటుంది. |
02:39 | కొన్నిసార్లు మనం ఉన్న పట్టిక స్ట్రక్చర్ లోనే మార్పులు చేయవలసి ఉంటుంది |
02:45 | ఉదాహరణకి Members పట్టిక తీసుకున్నప్పుడు అది Library సభ్యులను చూపిస్తుంది |
02:53 | అది కేవలం సభ్యుల ఫోన్ నంలు మరియు పేర్లు మాత్రమే భద్రపరుస్తుంది |
02:58 | ఒకవేళ మనం వాళ్ళ చిరునామా పట్టణం గురించి సమాచారం భద్రపరచదలిచితే Members పట్టిక స్ట్రక్చర్ లో మార్పులు చేయవలసి ఉంటుంది |
03:09 | దీని కొరకు మనం SQL సింటాక్స్ |
03:15 | ALTER TABLE Members ADD Address TEXT, ADD City TEXT ను ఉపయోగిస్తాము. |
03:22 | ALTER TABLE పట్టిక ను మార్చి పట్టికకు మరొక రెండు కొత్త columnsను జోడిస్తుంది. |
03:30 | TEXT డాటాలో Address మరియు City కూడా ఉంటుంది |
03:36 | పట్టికను సృష్టించడం , మార్పులు చేపట్టడం ఎలానో తెలుసుకోవడం కొరకు hsqldb.org/ అను వెబ్సైట్ ను సందర్శించండి |
03:47 | తెరపై ఉన్న url చిరునామాను ఉపయోగించండి |
03:52 | ఇప్పుడు Base డాటాబేస్ ను ఉపయోగించడం లో reliable ఎలా ఉంచాలో చూద్దాం. |
03:59 | కొన్నిసార్లు Base కు తక్కువ రికార్డుల సమాచారాన్ని భద్రపరచడానికి చాలా ఎక్కువ మెమరీ కావలసుంటుంది |
04:08 | ఇది ఎందుకంటే, బేస్, డేటాబేస్ కు కేవలం, కొంత మెమరీ మాత్రమే అవసరం అవుతుందని అనుకుంటుంది. |
04:17 | అదేవిధంగా, మనం చూస్తున్న డేటా అంతా అదే వరుసలో భద్రపరచబడి ఉండదు |
04:26 | ఎందుకంటే మనం పట్టికకు డేటా ను వివిధ సమయాలలో జోడిస్తుంటాము కాబట్టి, అది ఒకే వరుసలో భద్రపరచబడదు |
04:36 | మనం గ్రంధాలయం లో పుస్తకాలకు క్యాటలాగ్ ఉపయోగించినట్లు, పట్టిక లోని డేటా కు index ను ఉపయోగిస్తాం. |
04:45 | క్యాటలాగ్ పుస్తకాల జాబితాను ఉంచడమే కాక వాటి ప్రదేశాన్ని కూడా భద్రపరుస్తుంది |
04:53 | అదేవిధముగా మనం పట్టికకు ఇండెక్స్ నిర్మించడం ద్వారా డేటాను సమర్ధవంతంగా కనుకొనవచ్చు. |
05:00 | కానీ అవి చాలా మెమరీ ఉపయోగించుకుంటాయి |
05:04 | కొన్నిసార్లు పట్టిక డాటాను తొలగించడం వల్ల డేటా పూర్తిగా తొలగింపబడదు. |
05:11 | అవి టేబుల్ ఇండెక్స్ నుండి విడదీయబడతాయి కానీ కొత్త డేటా చేర్చేంతవరకు ఆ మెమరీ ను అలాగే వినియోగించుకుంటుంది |
05:24 | అందువల్లనే మనం భద్రపరచిన డేటా కొoచెం ఐనప్పటికీ, డేటా చివరికి పెద్దదిగా కనిపిస్తుంది |
05:35 | Base డిఫ్రాగ్మెంటింగ్ అనే పునర్వ్యవస్థీకరించే ఒక మంచి మార్గాన్ని అందిస్తుంది. |
05:42 | దీనికొరకు డిఫ్రాగ్మెంటింగ్ కావలసిన డాటాబేస్ ను మనం ఓపెన్ చేయాలి. |
05:49 | LibreOffice Base విండో లోపల, మనం Tools మెను పై క్లిక్ చేసి, ఆపై SQL sub menu పై క్లిక్ చేయాలి |
06:01 | ఆ తరువాత SQLవిండోలో క్రింది ఆదేశాన్ని టైప్ చేయాలి |
06:07 | CHECKPOINT DEFRAG |
06:10 | ఈ SQL ఆదేశం డేటాబేస్‌లోని అనవసరమైన సమాచారాన్ని తొలగిస్తుంది |
06:19 | ఇది ముందు డాటాబేస్‌ను మూసేసి కొత్త డేటాను మొదలుపెడుతుంది |
06:27 | SQL విండో లో మనం వేరొక ఆదేశాన్ని కుడా ఉపయోగిస్తాం |
06:33 | SHUTDOWN COMPACT. |
06:36 | తేడా ఏమిటంటే, ఈ ఆదేశం డాటాబేస్ ను మలరా తెరవలేదు |
06:43 | డిఫ్రాగ్మెంటింగ్ మీద మరింత సమాచారం కొరకు hsqldb.org Chapter 11 ను సందర్శించండి |
06:54 | చివరిగా Backups గురించి మాట్లాడుకుందాం ఇవి డాటాబేస్ ను సురక్షితంగా ఉంచుతాయి. |
07:02 | మనం మన డాటాను |
07:06 | కంప్యూటర్ క్రాష్ అవడం, హార్డుడిస్క్ పగలడం వల్ల లేదా ఏవైనా Viral ఇన్ఫక్షన్ల వలన కోల్పోతాము. |
07:14 | లిబ్రేఆఫీస్కు డాటాబేస్ నష్టం ను తగ్గించుటకు, మంచి రికవరీ విజార్డ్ ఉంది |
07:20 | కానీ ఒక తెలివైన విషయం ఏమిటంటే, డేటాబేస్ యొక్క కాల క్రమానుగత బ్యాకప్ తీసుకొనడం. |
07:26 | బ్యాకప్ ను తీసుకోవడం చాల సులభం |
07:30 | మనం కేవలం డేటాబేస్ కాపీని తీసుకొని, |
07:34 | బాహ్య హార్డ్ డిస్క్‌లు, CD లు లేదా DVD లు, ఫ్లాష్ డ్రైవ్‌లు వంటివి హార్డుడిస్క్లోని ద్వితీయ మీడియాలో నిల్వ చేస్తాము. |
07:47 | కాబట్టి బ్యాకప్నుతీసుకోవడానికి Library databaseలో Library.odb ఫైల్ ఎక్కడుందో కనుక్కోవాలి |
07:57 | ఆపై, ఫైల్ ను కాపీ చేసి వేరే హార్డ్ డిస్క్ డ్రైవ్‌లో లేదా ఫ్లాష్ డ్రైవ్‌లో కాఫీ మరియు పేస్ట్ చేయాలి |
08:08 | ఈ కాఫీ మరియు పేస్ట్ డేటాబేస్ యొక్క డేటా నిర్మాణాలు, డేటా, |
08:17 | రూపాలు, ప్రశ్నలు మరియు నివేదికలు వంటి వాటి యొక్క పూర్తి బ్యాకప్ భాద్యతలు తీసుకుంటుంది |
08:24 | మనం బ్యాకప్‌లు ఎప్పుడు తీసుకోవాలి? |
08:28 | ఇది డేటా మరియు నిర్మాణంలోని మార్పుల మీద ఆధారపడి ఉంటుంది |
08:37 | అంటే - మనం డేటాను జోడించడం, మార్చడం లేదా తొలగించడం ఎంత తరచుగా చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది |
08:42 | అంతేకాకుండా మనం పట్టిక నిర్మాణంలు, పద్ధతులు, ప్రశ్నలు లేదా రెపోరేట్లను ఎంత తరచుగా చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది |
08:49 | కాబట్టి మనం డేటాబేస్ ఉపయోగించే తరచుదనం మీద ఆధారపడి, బ్యాక్ అప్‌లను రోజువారీ, లేదా వారమునకు షెడ్యూల్ చేస్తాము. |
08:58 | ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది |
09:00 | Members పట్టికకు రెండు కొత్త columns - Address and City ను జోడించాలి |
09:08 | ఈ రెండు columns ల డేటాటైప్ TEXT. |
09:13 | Members పట్టికను, Data Entry మోడ్ లో తెరిచి,address మరియు city లకు నమూనా డేటా ను ఎంటర్ చేయండి |
09:23 | తరువాత Library database ను డీఫ్రాగ్మెంట్ చేయండి. |
09:27 | చివరిగా లైబ్రరీ డాటాబేస్ బ్యాక్ అప్ ను తీసుకొని దాన్ని, అందుబాటులోఉన్న ఫ్లాష్ డ్రైవ్ లేదా హార్డుడిస్క్లో సేవ్ చేయండి. |
09:38 | ఇది మనలను Database Maintenance in LibreOffice Base ట్యుటోరియల్ చివరికు తీసుకొస్తుంది |
09:45 | దీనిని సంగ్రహించేందుకు, మనం |
09:48 | డాటాబేస్ ను నిర్వహించడం, |
09:50 | డేటాబేస్ నిర్మాణాన్ని సవరించడం, |
09:54 | డాటాబేస్‌ను డీఫ్రాగ్మెంట్ చేయడం, మరియు |
09:56 | బ్యాక్ అప్స్ ను తీసుకొనుట నేర్చుకోవాలి |
09:58 | Spoken Tutorial ప్రాజెక్టు Talk to a Teacher లోని ఒక భాగం |
10:03 | ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:10 | ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. |
10:15 | దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:20 | దీనిని అనువదించినది హరి. చేరినందుకు ధన్యవాదాలు |