Jmol-Application/C2/Introduction-to-Jmol-Application/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం, Introduction to Jmol Application అను ట్యుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో నేను, |
00:11 | Jmol అప్లికేషన్, విండో మరియు కొన్ని ప్రాథమిక కార్యకలాపాల(ఆపరేషన్స్)గూర్చి క్లుప్తంగా వివరిస్తాను. |
00:16 | మనం, |
00:18 | Menu bar, Tool bar మరియు Jmol panel గూర్చి, |
00:22 | Jmol పానెల్ యొక్క పరిమాణాన్ని ఎలా మార్చడం, |
00:25 | సాధారణ సేంద్రీయ అణువుల నమూనాలను సృష్టించడం, |
00:28 | Methyl గ్రూప్ తో హైడ్రోజన్ ప్రతిక్షేపం చేసి, అణువులను నిర్మించడం నేర్చుకుంటాం. |
00:34 | అలాగే మనం, |
00:36 | ఒక స్థిరమైన ఆకృతి పొందడానికి శక్తిని కనిష్టం చేయటం |
00:41 | చిత్రాన్ని .mol ఫైల్ గా Save చేయడం కూడా నేర్చుకుంటాం. |
00:45 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు, |
00:49 | హై స్కూల్(ఉన్నత పాఠశాల)కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం)మరియు బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ(ప్రాథమిక సేంద్రీయ రసాయన శాస్త్రం)ల గూర్చి అవగాహన ఉండాలి. |
00:53 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
00:56 | Ubuntu ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04 |
01:00 | Jmol వర్షన్ 12.2.2 మరియు |
01:03 | Java వర్షన్ 7 ఉపయోగిస్తున్నాను. |
01:06 | దయచేసి గమనించండి- Jmol అప్లికేషన్ సజావుగా అమలు చేయడం కొరకు, మీ సిస్టమ్ లో జావా స్థాపించబడి ఉండాలి. |
01:14 | Jmol Application గూర్చి వివరణ- |
01:17 | ఇది, ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ Molecular Viewer. |
01:21 | ఇది రసాయన నిర్మాణాల యొక్క 3 డైమెన్షనల్ నమూనాలను రూపొందించడానికి మరియు వీక్షించడానికి ఉపయోగపడుతుంది. |
01:27 | proteins మరియు macromolecules యొక్క ద్వితీయ నిర్మాణాలను వీక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. |
01:33 | డౌన్లోడ్ మరియు సంస్థాపన(ఇన్స్టాలేషన్)గురించిన సమాచారం- |
01:37 | Ubuntu OS కొరకు, Ubuntu Software Center ను ఉపయోగించి Jmol యొక్క సంస్థాపన జరుగుతుంది. |
01:45 | దయచేసి, మా వెబ్సైట్ www.spoken-tutorial.org లోని Linux సిరీస్ లో దీనిపై ఉన్న ట్యుటోరియల్ ను అనుసరించండి. |
01:56 | విండోస్, మాక్ OS మరియు ఆండ్రాయిడ్ పరికరాల్లో స్థాపించడం కొరకు, www.jmol.sourceforge.net ను దయచేసి సందర్శించండి. |
02:08 | (ఇన్స్టాల్)స్థాపించడం కోసం వెబ్ పేజీలో ఇచ్చిన సూచనలను అనుసరించండి. |
02:13 | Ubuntu Software Center ను ఉపయోగించి, నేను నా సిస్టమ్ లో Jmol అప్లికేషన్ ను ఇప్పటికే (ఇన్స్టాల్)స్థాపించియున్నాను. |
02:20 | Jmol Application ను తెరవడానికి Dash home పై క్లిక్ చేయండి. |
02:24 | సెర్చ్ బాక్స్ లో Jmol అని టైప్ చేయండి. |
02:27 | Jmol ఐకాన్ తెర(స్క్రీన్)పై కనిపిస్తుంది. |
02:30 | Jmol అప్లికేషన్ విండోను తెరవడానికి Jmol ఐకాన్ పై క్లిక్ చేయండి. |
02:35 | Jmol Application విండో, పైభాగంలో Menu bar ను కలిగిఉంది. |
02:40 | Menu bar కిందన, Tool bar ఉంది. |
02:43 | ఇక్కడ Jmol panel గా సూచించబడే Display area ఉంది. |
02:48 | మెనూ బార్ లో File, Edit, Display మొదలైనటువంటి వివిధరకాల ఎంపికలు ఉన్నాయి. |
02:56 | వీటిలో ప్రతి ఒక్క దానికి వివిధ రకాల ఉప-ఎంపికలను కూడా ఉన్నాయి. |
03:00 | Tools మెనూ, ఇతర ఎంపికలే కాకుండా, అణువుల మధ్య దూరాన్ని కొలవడానికి కావాల్సిన టూల్స్ ను కూడా కలిగిఉంది. |
03:07 | మనం తదుపరి ట్యుటోరియల్స్ లో ఈ ఎంపికల గురించి నేర్చుకుంటాము. |
03:12 | Help మెనూ, Jmol అప్లికేషన్ గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని కలిగి ఉంది. |
03:18 | ఇది డాక్యుమెంటేషన్ ను కలిగియున్న ఒక User Guide ను కూడా కలిగి ఉంది. |
03:23 | Tool bar అనేక మెనూ icon లను కలిగి ఉంది. |
03:27 | మెనూ ఐకాన్లు కొన్ని ఫంక్షన్ లను త్వరగా అమలు చేస్తాయి. ఉదాహరణకు Open, Save, Export, Print మొదలైనవి. |
03:37 | ఇక్కడ, త్రిప్పడం, అణువుల సమితిని ఎంచుకోవడం, దూరాన్ని కొలవడం మొదలైనవి చేయటానికి ఐకాన్స్ యొక్క సమితి ఉంది. |
03:47 | modelkit ఐకాన్ ను, మొలిక్యూలర్(అణుసంబంధమైన)model లను సృష్టించడానికి మరియు edit చేయడానికి ఉపయోగిస్తారు. |
03:53 | Jmol panel ను మన అవసరాలకు అనుగుణంగా పునఃపరిమాణం చేయవచ్చు. |
03:58 | కర్సర్ ను, విండో యొక్క ఏదయినా మూలకు, అనగా అది ఒక(యారొ ఇండికేటర్)బాణం సూచిక గా మారే వరకు తీసుకువెళ్ళండి. |
04:04 | ఇప్పుడు, వికర్ణంగా పైకి లేదా క్రిందికి లాగడం ద్వారా విండో పరిమాణాన్ని మార్చండి. |
04:10 | panel యొక్క పరిమాణాన్ని మార్పుచేయడానికి Menu bar లోని Display మెనూ ని కూడా ఉపయోగించవచ్చు. |
04:16 | Display మెనూ పై క్లిక్ చేసి, Resize ఎంపికను ఎంచుకోండి. |
04:20 | ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, అక్కడ వెడల్పు మరియు ఎత్తు( డైమెన్షన్స్) పరిమాణాలను పిక్సల్స్ లో నిర్దేశించవచ్చు. |
04:27 | 800 బై 600 pixels పరిమాణాలతో గల విండో నాకు అవసరం. |
04:32 | కనుక, నేను 800 space 600 అని టైప్ చేసి OK బటన్ పై క్లిక్ చేస్తాను. |
04:41 | ఇప్పుడు Jmol panel, 800 by 600 pixels కు పునఃపరిమాణం చేయబడింది. |
04:47 | ఇప్పుడు కొన్ని సాధారణ సేంద్రీయ అణువుల యొక్క నమూనాలను రూపొందించడానికి ముందుకు వెళ్దాం. |
04:53 | Modelkit శక్తి కనిష్టీకరణతో నమూనాలను నిర్మించి, సవరించడానికి అనుమతిస్తుంది. |
05:00 | tool bar లోని modelkit ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:04 | Methane యొక్క నమూనా పానెల్ పై కనిపిస్తుంది. |
05:07 | Jmol panel యొక్క ఎగువ ఎడమ మూలలో ఒక మెను కనిపిస్తుంది. |
05:12 | ఈ మెనూ యొక్క ఫీచర్స్(లక్షణాలు), అణువులను సులభంగా జోడించడం, తొలగించడం, లాగటం, |
05:19 | functional groups ను జోడించడం, |
05:21 | (బాండ్స్)బంధాలను Delete, add మరియు rotate చేయడం, |
05:25 | add hydrogens, minimize మరియు save files మొదలైనవి చేయటానికి సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి. |
05:30 | మెనూ లో ఒక నిర్దిష్ట లక్షణాన్ని(ఫీచర్)ఉపయోగించడానికి, అందించబడిన చెక్-బాక్స్ పై క్లిక్ చేయండి. |
05:35 | Modelkit ఫంక్షన్ మనకు Methyl group తో hydrogen అణువును ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపణం చేయడానికి అనుమతిస్తుంది. |
05:41 | మీరు ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపణం చేయాలనుకుంటున్న hydrogen అణువు దగ్గరకు కర్సర్ ను తీసుకురండి. |
05:46 | ఆ hydrogen అణువుపై ఒక ఎరుపు రంగు రింగ్ కనిపిస్తుంది. |
05:50 | ఆ అణువు పై క్లిక్ చేయండి. |
05:52 | ఒక Methyl గ్రూప్(సమూహం)జోడించబడింది అని మీరు గమనిస్తారు. |
05:56 | Methane మొలిక్యూల్ ఇప్పుడు Ethane గా మార్చబడింది. |
06:00 | మునుపటి అదేశాన్ని(స్టెప్)పునరావృతం చేయండి. |
06:03 | Propane యొక్క నమూనాను పొందటానికి hydrogen అణువుపై క్లిక్ చేయండి. |
06:07 | ఈ మొలిక్యూల్ పై Energy minimization చేస్తే, మనకు అత్యంత స్థిరమైన ఆకృతి వస్తుంది. |
06:13 | Energy minimization చేయడానికి, |
06:15 | Modelkit menu లోని ఎంపికలను స్క్రోల్ చేయండి. |
06:19 | minimize ఎంపిక పై క్లిక్ చేయండి. |
06:22 | ఇప్పుడు మన వద్ద Propane మొలిక్యూల్ యొక్క అత్యంత స్థిరమైన ఆకృతి నమూనాను ఉంది. |
06:28 | ఈ నిర్మాణాన్ని .mol ఫైల్ గా(సేవ్ )భద్రపరచడానికి, Modelkit menu ను తెరవండి. |
06:33 | menu ని స్క్రోల్ చేసి, save file ఎంపికపై క్లిక్ చేయండి. |
06:37 | ఒక Save డైలాగ్ -బాక్స్ స్క్రీన్ (తెర)పై కనిపిస్తుంది. |
06:41 | మీరు మీ ఫైల్ ను(సేవ్)భద్రపరచదలిచిన ఫోల్డర్ పై క్లిక్ చేయండి. |
06:45 | నా ఫైల్ ను భద్రపరచడానికి నేను Desktop ను(లొకేషన్)స్థానంగా ఎంచుకుంటున్నాను. |
06:50 | కనుక, Desktop ను ఎంచుకుని Open బటన్ పై క్లిక్ చేయండి. |
06:54 | File Name కి వెళ్ళి, టెక్స్ట్-బాక్స్ లో propane అని టైప్ చేయండి. |
06:59 | Files of Type పై క్లిక్ చేసి, MOL ఎంపికను ఎంచుకోండి. |
07:03 | ఇప్పుడు, dialog-box యొక్క కుడి దిగువన ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి. |
07:08 | Propane యొక్క 3D మోడల్(నమూనా)Desktop పైన .mol ఫైల్ గా భద్రపరచబడుతుంది. |
07:14 | Jmol నుండి, నిష్క్రమించడానికి, File మెనూ పై క్లిక్ చేసి, Exit ఎంపికను ఎంచుకోండి. |
07:21 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
07:25 | Jmol Application విండో గూర్చి. |
07:27 | Jmol panel ను పునపరిమాణం చేయటం. |
07:29 | Methane, Ethane మరియు Propane వంటి సాధారణ సేంద్రియ అణువుల యొక్క 3D models సృష్టించడానికి టూల్ బార్ లోని Modelkit ను ఉపయోగించడం. |
07:40 | methyl group తో hydrogen యొక్క ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపణం ద్వారా మొలిక్యూల్ నిర్మించడం. |
07:45 | స్థిరమైన ఆకృతిని పొందడానికి శక్తిని తగ్గించడం. |
07:48 | చిత్రాన్ని.mol ఫైల్ గా భద్రపరచడం. |
07:52 | Jmol Modelkit ఫంక్షన్ ని ఉపయోగించి,క్రింద ఇచ్చిన మొలిక్యూల్స్ యొక్క నమూనాలను తయారు చేయండి, |
07:58 | 2-4 Dimethyl Pentane మరియు 3-Ethyl, 5-Methyl Heptane. |
08:03 | స్థిరమైన ఆకృతిని పొందడానికి శక్తిని కనిష్టీకరించండి. |
08:07 | చిత్రాన్ని .mol ఫైల్ గా భద్రపరచండి. |
08:11 | టూల్ బార్ లోని rotate molecule ను ఉపయోగించి నమూనాను తిప్పండి. |
08:15 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
08:19 | కింది లింక్ లో అందుబాటులో గల వీడియో ను చుడండి. |
08:22 | ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్నిఇస్తుంది. |
08:26 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:36 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
08:40 | మరిన్ని వివరాలకు,దయచేసి వ్రాయండి. |
08:47 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ యొక్క ఒక భాగం. |
08:52 | దీనికి ICT,MHRD,ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్,గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారం అందిస్తుంది. |
08:59 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:04 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది,ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |