Linux-AWK/C2/Basics-of-awk/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Awk కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | మనము ఈ ట్యుటోరియల్ లో awk command గురించి నేర్చుకుంటాము. |
00:09 | మనము దీనిని కొన్ని ఉదాహరణలు ఉపయోగించి చేస్తాము. |
00:12 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GNU బాష్ V 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
00:23 | ఈ ట్యుటోరియల్ ను సాదన చేయుటకు GNU బాష్ వర్షన్ 4 లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది అని గమనించండి. |
00:29 | Awk యొక్క పరిచయంతో ప్రారంభింద్దాం. |
00:33 | Awk కమాండ్ చాలా శక్తివంతమైన టెక్స్ట్ మానిప్యులేషన్ సాధనం. |
00:38 | దీనికి ఆ పేరు రచయితలు అహో, వీన్బెర్గర్ మరియు కెర్నిఘన్ నుండి వచ్చినది. |
00:44 | ఇది అనేక విధులు చేయగలదు. |
00:46 | ఇది రికార్డు యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది. |
00:51 | కాబట్టి, రికార్డు యొక్క వ్యక్తిగత క్షేత్ర ములను సులభంగా యాక్సెస్ చేయగలదు మరియు సవరించగలదు. |
00:56 | మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
00:59 | ప్రదర్శన కోసం, మనము awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము. |
01:04 | Awkdemo.txt ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము. |
01:09 | ఇప్పుడు టెర్మినల్ విండోను Ctrl + Alt మరియు T కీలను మీ కీబోర్డు నుండి ఏకకాలంలో లో నొక్కడం ద్వారా తెరవండి. |
01:17 | Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం. |
01:22 | awk space (సింగిల్ కోట్స్ లోపల) (front slash) /Pass (front slash) / (కర్లీ బ్రాకెట్ తెరచి ) {print (కర్లీ బ్రాకెట్ మూసి )} (కోట్స్ తరువాత ) space awkdemo.txt అని టైప్ చేయండి. |
01:38 | ఎంటర్ నొక్కండి. |
01:40 | ఇక్కడ Pass అనేది ఎంపికకు ప్రమాణం. |
01:44 | Awkdemo ఫైల్ నుండి Pass ను కలిగిఉండే అన్ని పంక్తులు ముద్రించబడతాయి. |
01:49 | ఇక్కడ ముద్రణ ఒక చర్య. |
01:52 | మనం Awk లో Regular Expressions కూడా ఉపయోగించవచ్చు. |
01:56 | మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే, |
02:01 | awk space /M (స్క్వేర్ బ్రాకెట్ తెరచి) [ ei ](స్క్వేర్ బ్రాకెట్ మూసి) *ra */కర్లీ బ్రాకెట్ తెరచి{print} కర్లీ బ్రాకెట్ మూసి space awkdemo.txt అని టైప్ చేసి, |
02:27 | ఎంటర్ నొక్కండి. |
02:29 | * sign మునుపటి క్యారెక్టర్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలను ఇస్తుంది. |
02:33 | అందువల్ల i, e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి. |
02:40 | ఉదాహరణకు |
02:42 | Mira, M I R A తో, |
02:45 | Meera M double E R A తో |
02:47 | మరియు Meeraa, M double E R double A తో, |
02:52 | awk కమాండ్ extended regular expressions (ERE) కు మద్దతును ఇస్తుంది. |
02:58 | దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు. |
03:03 | ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
03:05 | electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్ తెరచి)/ {print}' (కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి, |
03:23 | ఎంటర్ నొక్కండి. |
03:26 | ఇప్పుడు civil మరియు electrical లను కలిగిన ఎంట్రీలను పొందాము. |
03:31 | తిరిగి మన స్లైడ్స్ కు వెళ్దాం. |
03:34 | Parameters: ఒక రేఖ యొక్క వ్యక్తిగత ఖాళీలను గుర్తించడానికి, Awk ఒక ప్రత్యేకమైన పారామితులను కలిగి ఉంది. |
03:41 | $ 1 (Dollar 1) మొదటి ఫీల్డ్ ను సూచిస్తుంది. |
03:45 | అదేవిధంగా మనము $2, $3 మరియు మొదలైనవాటిని కలిగి ఉన్నాము. |
03:53 | $0 మొత్తం వరుసను సూచిస్తుంది. |
03:56 | మనము టెర్మినల్ కు తిరిగి వద్దాం. |
03:59 | Awkdemo.txt ఫైలులో ప్రతి పదం PIPE ద్వారా వేరు చేయబడిందని గమనించండి. |
04:05 | ఈ సందర్భంలో పైప్ ను డీలిమిటర్ అని అంటారు. |
04:09 | డీలిమిటర్ పరస్పరం పదాలను వేరు చేస్తుంది. |
04:13 | డీలిమిటర్ ఒక white space కూడా కావచ్చు. |
04:16 | డీలిమిటర్ ను పేర్కొనడానికి, మనం capital F flag తరువాత డీలిమిటర్ ఇవ్వాలి. |
04:24 | అదెలాగో చూద్దాం. awk space minus capital F space డబల్ కోట్స్ లోపల PIPE space సింగిల్ కోట్ లోపల front-slash civil PIPE electrical front-slash కర్లీ బ్రాకెట్ తెరచి print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి, |
04:51 | ఎంటర్ ను నొక్కండి. |
04:53 | మనము $0 ఉపయోగించాము కాబట్టి ఇది మొత్తం లైన్ ను ముద్రిస్తుంది. |
04:58 | names మరియు stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు. |
05:04 | మనము కేవలం రెండు ఫీల్డ్‌లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనుకుందాం. |
05:08 | పైన కమాండ్ లో మనము $0 ను $2 మరియు $3 లతో భర్తీ చేస్తాము. |
05:15 | ఎంటర్ ను నొక్కండి. |
05:18 | కేవలం రెండుక్షేత్రాలు మాత్రమే చూపబడ్డాయి. |
05:21 | ఇది సరైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, డిస్ప్లే అంతా అస్తవ్యస్తంగా ఉండును. |
05:26 | C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్‌పుట్ ను మనము అందించవచ్చు. |
05:32 | మనము ఒక అంతర్నిర్మిత వేరియబుల్ NR ను ఉపయోగించి సీరియల్ నంబర్ ను కూడా అందించవచ్చు. |
05:40 | మనము తర్వాత అంతర్నిర్మిత వేరియబుల్స్ గురించి మరింత నేర్చుకుంటాము. |
05:44 | ఇప్పుడు awk space minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe) డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్ తెరచి printf (డబల్ కోట్స్ లోపల) percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n, డబల్ కోట్స్ తరువాత NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేయండి. |
06:33 | ఎంటర్ నొక్కి, తేడా ను గమనించవచ్చు. |
06:37 | ఇక్కడ, NR రికార్డుల సంఖ్యను సూచిస్తుంది. |
06:41 | రికార్డులు పూర్ణాంకాలు, అందువల్ల మనము %d అని వ్రాశాం. |
06:45 | Name మరియు Stream లు స్ట్రింగ్స్. కాబట్టి మనము %s ఉపయోగించాము. |
06:50 | ఇక్కడ 25s Name ఫీల్డ్ కోసం 25 ఖాళీలు రిజర్వ్ చేస్తుంది. |
06:55 | ఇక్కడ 15s Stream ఫీల్డ్ కోసం, 15 ఖాళీలను రిజర్వ్ చేస్తుంది. |
07:01 | మైనస్ గుర్తు, ను అవుట్‌పుట్ ను ఎడమవైపున నిర్దేశించడానికి ఉపయోగిస్తారు. |
07:05 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:08 | తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం. |
07:10 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
07:16 | awk తో రెగ్యులర్ ఎక్సప్రెషన్స్, ఒక నిర్దిష్ట స్ట్రీమ్ కోసం ఎంట్రీలను జాబితా చేయడం, |
07:21 | రెండవ మరియు మూడవ ఫీల్డ్స్ లతో మాత్రమే జాబితా తయారు చేయడం, |
07:24 | ఫార్మాట్ చేయబడిన అవుట్‌పుట్ ను ప్రదర్శించడం. |
07:28 | అసైన్మెంట్ గా Ankit Saraf యొక్క roll no, stream మరియు marks లను ప్రదర్శించండి. |
07:34 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. |
07:37 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:40 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:48 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
07:52 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
07:58 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
08:01 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:07 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
08:12 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. |