PERL/C2/Comments-in-Perl/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 21:58, 23 December 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | Comments in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
00:08 | Perl లో కామెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
00:10 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను |
00:18 | అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2. |
00:23 | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:27 | మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు |
00:31 | మీకు పెర్ల్ లో కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ మరియు వేరియబుల్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. |
00:37 | ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:43 | Perl లో కొంత కోడ్ ను కామెంట్ గా రెండు మార్గాలలో చేయవచ్చు: |
00:47 | Single Line , Multi-Line . |
00:49 | ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా |
00:55 | కొంత కోడ్ యొక్క కార్యాచరణను వివరించడానికి, ఒక లైన్ టెక్స్ట్ ను జోడించడానికి ఉపయోగించబడుతుంది. |
01:01 | ఈ రకమైన కామెంట్ # (hash) గుర్తుతో మొదలవుతుంది. |
01:05 | ఇక్కడ ఒక డెమో ఉంది . మనము టెక్స్ట్ ఎడిటర్ లో క్రొత్త ఫైల్ ను తెరుద్దాం. |
01:11 | Terminal ను తెరచి, gedit comments dot pl space & టైప్ చేయండి |
01:19 | మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం terminal లో ప్రాంప్ట్ ను ఫ్రీ చేయడానికి అంపెర్సన్డ్ ను ఉపయోగిస్తాము. ఇప్పుడు Enter ను నొక్కండి. |
01:27 | ఇప్పుడు క్రింది కమాండ్ లను టైప్ చేయండి. |
01:29 | hash Declaring count variable Enter నొక్కండి. |
01:37 | dollar count space equal to space 1 semicolon Enter నొక్కండి. |
01:45 | print space double quotes Count is dollar count slash n double quotes complete semicolon space hash Prints Count is 1 |
02:03 | Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, మరియు Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి. |
02:08 | Terminal కు, మారి perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:18 | ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని చెప్తుంది. |
02:21 | ఇప్పుడు perl comments dot pl టైప్ చేసి, Enter నొక్కండి. |
02:28 | ఇది మనకు క్రింది అవుట్ పుట్ Count is 1 ను చూపిస్తుంది. |
02:33 | మనం తిరిగి gedit కు మారుదాం. |
02:36 | gedit లో, మొదటి లైన్ కు వెళ్ళి, Enter నొక్కండి. |
02:40 | మొదటి లైన్ కు వెళ్ళి, క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
02:44 | Hash exclamation mark slash u s r slash bin slash perl |
02:52 | Perl లో ఈ లైన్ ను shebang line గా పిలుస్తారు. Perl ప్రోగ్రాం లో ఇది మొదటి లైన్. |
02:59 | ఇది Perl Interpreter ను ఎక్కడ వెతకాలో చెప్తుంది. |
03:03 | గమనిక: ఈ లైన్ హాష్ గుర్తుతో మొదలైనప్పటికీ, Perl దీనిని ఒక సింగిల్ లైన్ కామెంట్ గా పరిగణించదు. |
03:11 | ఇప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్ లను చూద్దాం. |
03:13 | Multi Line: ఈ రకమైన కామెంట్ లు |
03:17 | యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము. |
03:25 | ఈ రకమైన కామెంట్ లు equal to head గుర్తుతో మొదలయి, equal to cut తో ముగుస్తాయి. |
03:33 | తిరిగి geditకు మారి, క్రింది దానిని comments dot pl ఫైల్ లో టైప్ చేద్దాం. |
03:39 | ఫైల్ చివరిలో, equal to head టైప్ చేసి, Enter నొక్కండి. |
03:45 | print space double quote count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి. |
03:59 | equal to cut |
04:01 | ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి మరియు స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి. |
04:05 | Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:13 | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు. |
04:15 | కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl |
04:21 | ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను చూపుతుంది. Count is 1 . |
04:27 | ఇది “count variable is used for counting purpose” అనే వాక్యాన్ని ప్రింట్ చేయదు. |
04:32 | ఎందుకంటే మనం ఆ భాగాన్ని equal to head మరియు equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం. |
04:40 | మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు |
04:48 | ఇవి Perl లో ఉపయోగించే ప్రత్యేక కీ వర్డ్ లు కాదు. |
04:52 | = (equal to sign) ముందు కానీ మరియు head , cut , begin లేదా end వర్డ్ తరువాత కానీ ఎటువంటి స్పేస్ (లు) ఉండకూడదు. |
05:02 | మళ్ళీ ఒకసారి Terminal ను తెరవండి. |
05:05 | gedit commentsExample dot pl space & అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:15 | క్రింది కమాండ్ లను స్క్రీన్ పై చూపించిన విధంగా టైప్ చేయండి. |
05:19 | ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి,నేను వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను. |
05:28 | తరువాత నేను ఇక్కడ కొంత కోడ్ ను కామెంట్ చేస్తాను. |
05:32 | ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను సంకలనం చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను. |
05:39 | తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను |
05:44 | ఫైల్ ను సేవ్ చేయండి మరియు Perl స్క్రిప్ట్ ను Terminal పై ఎగ్జిక్యూట్ చేయండి. |
05:49 | టెర్మినల్ పై perl hyphen c commentsExample dot pl అని టైప్ చేసి Enter నొక్కండి |
05:57 | ఇక్కడ ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు. |
05:59 | కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి |
06:01 | perl commentsExample dot pl టైప్ చేసి, Enter నొక్కండి. |
06:07 | ఇది క్రింది అవుట్ పుట్ ను చూపిస్తుంది. Addition is 30 . |
06:12 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేర్చుతుంది. |
06:16 | ఇక్కడ మనము Perl లో కామెంట్ లను జోడించడం నేర్చుకున్నాం. |
06:19 | ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు పెర్ల్ లో స్క్రిప్ట్ ను రాయండి. |
06:23 | single line comment & multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి. |
06:30 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
06:34 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది. |
06:37 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు. |
06:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
06:44 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
06:48 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
06:51 | మర్రిన్ని వివరాల కోసం contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
06:58 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:03 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. |
07:11 | ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
07:15 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను స్వామి మీకు ధన్యవాదాలు. |