BASH/C2/Arithmetic-Comparison/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:30, 12 December 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో,మనము
00:09 equal to (-eq) not equal to (-ne)
00:12 less than (-lt) less than equal to (-le)
00:15 greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
00:19 మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
00:23 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:26 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
00:30 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను.
00:34 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.
00:39 నా దగ్గర ఇప్పటికే arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
00:43 నన్నుదానికి మారనివ్వండి.
00:45 నేను ఆ ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను.
00:50 మీకు నచ్చిన editorలో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
00:56 మీకు ఇప్పటికే ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
01:00 ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
01:06 నేను code ను వివరిస్తాను.
01:08 ఇది shebang line .
01:10 మొదటగా, console పై Enter filename ముద్రితమవుతుంది,
01:15 read command, standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.
01:20 ఈ command, backticks మధ్యలో ఉంటుంది.
01:24 Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
01:27 మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును.
01:32 cat కమాండ్, ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
01:37 wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
01:43 - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది.
01:47 ఏం జరుగుతుందంటే-
01:49 మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది
01:53 ఇది, pipe చేయబడు లేదా
01:55 wc కమాండ్ కు పంపబడే input file
02:00 కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
02:05 output variable x లో నిల్వచేయబడుతుంది.
02:08 ఇది if స్టేట్మెంట్.
02:10 - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా లేదా అని తనిఖీ చేస్తుంది.
02:16 ఒకవేళ ఈ condition True అయితే, మనం File has zero words అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:22 fi అనేది,మొదటి if కండిషన్ యొక్క ముగింపు.
02:26 ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.
02:28 - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా? కాదా? అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
02:35 ఒకవేళ ఈ condition True అయితే, File has so-and-so words అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:40 $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది.
02:43 ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.
02:46 మీ program ఫైల్ ను Save చేయండి.
02:48 మన ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:51 terminal ను తెరవండి.
02:53 మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం.
02:57 touch list.txt అని టైప్ చేయండి.
03:01 ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం.
03:04 echo డబల్ కోట్స్ లో How are youడబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి.
03:13 ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
03:16 chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
03:21 ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
03:26 Enter filename: అని ప్రదర్శింపబడుతుంది.
03:28 list.txt అని టైప్ చేయండి.
03:31 అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శింపబడుతుంది.
03:36 ఇప్పుడు మరికొన్ని operators గురించి తెలుసుకుందాం.
03:40 నేను వేరొక ఫైల్ కు మారుతాను.
03:43 ఇది example2.sh
03:46 దయచేసి మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, దానికి example2.sh అని పేరు ఇవ్వండి.
03:52 ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి.
03:58 నేను codeను వివరిస్తాను.
04:00 ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య
04:04 ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,
04:07 ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది.
04:11 ఇక్కడ మన shebang line ఉంది
04:14 read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
04:19 ఇక్కడ, - (hyphen) c కమాండ్ byte లెక్కను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:24 if statement లో, -(hyphen) lt కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:31 ఒకవేళ ఈ condition True అయితే, మనం No characters present in the file అని ముద్రిస్తాము.
04:37 fi, if condition ను ముగిస్తుంది.
04:40 తరువాత if statement ఒక నెస్టెడ్ if statementను ని కలిగి ఉంటుంది.
04:45 మొదటగా, - (hyphen) gt కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:51 ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
04:56 ఈ if statement లో మల్టిపుల్ షరతులు ఉన్నాయి.
05:01 ఇక్కడ ఈ if లో -(hyphen) ge కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
05:09 - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
05:17 ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది,
05:21 Number of characters ranges between 1 and 100 అని ముద్రిస్తుంది:
05:25 దయచేసి గమనించండి మొత్తం if condition ను సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి ఉండాలి.
05:33 ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము.
05:39 fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.
05:43 తరువాత if statement విశ్లేషించబడుతుంది.
05:47 - (hyphen) gt కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
05:53 కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred అని ముద్రిస్తాము.
06:00 fi అనేది if కండిషన్ యొక్క ముగింపు.
06:04 ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
06:07 ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
06:10 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
06:13 chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh
06:22 list.txt అని టైప్ చేయండి.
06:25 list.txt has more than one character గా ఔట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:31 Number of characters ranges between one and hundred .
06:36 ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
06:40 అప్పుడు ఏ if statement అమలవుతుందో గమనించండి.
06:46 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.
06:49 ట్యుటోరియల్ సారాంశం
06:51 ఈ ట్యుటోరియల్ లో మనము, equal to, not equal to, less than , less than equal to, greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.
07:03 ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
07:09 Hint: - (hyphen) ne .
07:12 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:15 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
07:18 ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:23 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
07:25 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:28 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:43 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:51 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:56 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:06 నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india