LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Design-View/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:09, 29 November 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | ఈ ట్యుటోరియల్లో మనము |
00:06 | డిజైన్ వ్యూ ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట, |
00:10 | క్వరీ డిజైన్ విండో కు టేబుల్స్ ను జోడించుట, |
00:13 | ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ను ఏర్పాటు చేయుట, క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట నేర్చుకుంటాము. |
00:23 | దీనికి, మనకు తెలిసిన మన లైబ్రరీ డేటాబేస్ ను ఉదాహరణ గా తీసుకుందాం. |
00:29 | ఈ లైబ్రరీ డేటాబేస్లో, మనము పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము. |
00:37 | మనము సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి ఒక table కూడా ఉన్నది |
00:45 | ఇప్పుడు సభ్యులకు జారీ చేయబడిన అన్ని పుస్తకాలను జాబితాga చేయడానికి, ఒక కొత్త query ను క్రియేట్ చేస్తాము. |
00:54 | వేరొక విధంగా చెప్పాలంటే,, సభ్యులకు జారీ చేయబడిన పుస్తకాల చరిత్రను సృష్టిద్దాం. |
01:03 | లైబ్రరీ డేటాబేస్ ను తెరుద్దాం. |
01:07 | ఎడమ ప్యానెల్లో Queries చిహ్నంపై క్లిక్ చేద్దాం. |
01:13 | కుడివైపున ప్యానెల్లో, ‘Create Query in Design view’ పై క్లిక్ చేస్తాము. మనము ఇప్పుడు కొత్త విండోని చూస్తాము, ఇది Query Design విండో అని కూడా పిలువబడుతుంది. |
01:28 | మనము ఎగువన Add Table or Query ను కలిగిన , ఒక చిన్న పాప్-అప్ విండో కూడా చూస్తాము, |
01:39 | ఇక్కడ క్వరీ కు డేటా యొక్క మూలాన్ని నిర్వచిస్తాము. |
01:46 | సభ్యులకు జారీ చేసిన పుస్తకాల యొక్క history ను రూపొందించడానికి,మన క్వరీ కు మూడు టేబుల్స్ అవసరం. |
01:57 | జాబితాలో ఉన్న బుక్స్ పట్టికపై క్లిక్ చేసి, పాప్-అప్ విండో కు కుడివైపున ఉన్న ADD బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మనము దీన్ని చేస్తాము. |
02:11 | అదేవిధంగా BooksIssued , Members టేబుళ్ళను కూడా జత చేస్తాము. |
02:19 | query design window యొక్క background లో ఈ మూడు టేబుల్స్ కనపడుట మనము ఇప్పుడు చూస్తున్నాము. |
02:26 | ఇప్పుడు పాపప్ విండో ను మూసివేద్దాం. |
02:31 | ఇది Query design window ను ముందుకు తెస్తుంది. |
02:39 | మూడు టేబుల్స్ విండోలో ఎగువ సగ భాగంలో ఉన్నాయి అని గమనించండి. |
02:46 | ఇక్కడ, ఈ టేబుల్స్ మధ్య కొంత ఖాళీని ఇవ్వండి. |
02:53 | మెంబర్స్ టేబుల్ పై క్లిక్ చేసి, డ్రాగ్ చేసి, కుడి వైపున దూరంగా డ్రాప్ చేద్దాం. |
03:01 | ఆపై BooksIssued టేబుల్ పై క్లిక్ చేసి, డ్రాగ్ చేసి, సెంటర్ లో డ్రాప్ చేయండి. |
03:11 | ఇప్పుడు ఈ పట్టికలను కలుపుతున్న లైన్స్ ను చూద్దాం. ఇవి ఇంతకు ముందు మనము స్థాపించిన relationships . |
03:23 | relationship వివరాలను చూడడానికి లైన్స్ పై డబల్-క్లిక్ చేయవచ్చు. |
03:30 | ఇప్పుడు, Query design విండోలో క్రింది సగంను చూద్దాము. |
03:37 | ఈ ప్రాంతంలో అనేక వరుసలలో సెల్స్ ఉన్నాయి. క్వరీ ను రూపొందిస్తున్నప్పుడు, మనము వీటిని పూర్తి చేస్తాము. |
03:48 | ముందుగా, మనము ఫీల్డ్ కాలమ్ ను తనిఖీ చేస్తాము. |
03:53 | ఫలితాల సెట్లో ప్రదర్శించే, ఫీల్డ్-లను పేర్కొనడానికి ఇది మనకు అవసరం. |
04:01 | దీనిని చేయుటకు, మనము ముందుగా , విండోలో పై సగ భాగం లో ఉన్న Books పట్టికలోని Title ఫీల్డ్ పై డబుల్-క్లిక్ చేస్తాము. |
04:12 | తరువాత Members పట్టికలో Name ఫీల్డ్ పై, |
04:17 | ఆపై, BooksIssued పట్టిక నుండి "Issue Date" ఫీల్డ్ పై , |
04:24 | తరువాత Return date,the actual return date మరియు చివరగా checked in ఫీల్డ్ లపై డబల్ క్లిక్ చేస్తాము. |
04:34 | విండో క్రింది సగ భాగంలో మొదటి వరుసలో ఉన్న ఈ ఫీల్డ్ లను గమనించండి. |
04:44 | మూడవ వరుసలో సంబంధిత టేబుల్ పేర్లు కూడా ఉన్నాయి. |
04:50 | తరువాత, రెండవ వరుసలో అలియాస్ ను చూస్తాము. |
04:57 | ఇక్కడ మనము ఎంచుకున్న ఫీల్డ్ లకు వివరణాత్మక పేర్లను నమోదు చేయగలము. |
05:04 | కాబట్టి, చిత్రంలో చూపిన విధంగా మారుపేరులను టైప్ చేద్దాము. |
05:11 | మనము మారుపేరు లను ఇచ్చాము. |
05:15 | తరువాత, Sort వరుసను చూద్దాము. |
05:21 | ఇక్కడ, మనం result set యొక్క క్రమాన్ని పేర్కొనవచ్చు. |
05:26 | మనకు జారీ చేసిన పుస్తకాల history అవసరం కనుక, దానిని కాలక్రమానుసారం ఉంచుతాము. |
05:34 | దీని అర్థం - మనం result set ను ఇష్యూ డేట్ యొక్క ఆరోహణ క్రమమం లో ఉంచుతాము. |
05:43 | దీని కోసం, మనం Issuedate ఫీల్డ్ కింద Sort వరుసలో ఖాళీ సెల్ లో క్లిక్ చేస్తాము. |
05:56 | సరే, మనము తదుపరి వరుస - Visible లోకి వెళతాం. |
06:02 | ఇక్కడ, మనం ఎంచుకున్న ఫీల్డ్ల యొక్క దృశ్యమానతను, వాటిని చెక్ చేయడం లేదా అన్ -చెక్ చేయడం ద్వారా సెట్ చేయవచ్చు. |
06:11 | అప్రమేయంగా, అవి అన్ని చెక్ చేయబడి ఉంటాయని గమనించండి. |
06:17 | తరువాత, మనము ఫంక్షన్ వరుసకు వెళతాము. సంక్లిష్ట క్వరీలను సృష్టించేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని దాట వేద్దాం. |
06:27 | ఆపై మనము క్రైటీరియన్ వరుసకు వెళతాము. |
06:32 | ఇక్కడ result set ను ఒక సరళమైన లేదా క్లిష్టమైన ప్రమాణాలకు పరిమితం చేయవచ్చు. |
06:40 | ఉదాహరణకు, మనము సభ్యులకు జారీ చేయబడి, తిరిగి రాని పుస్తకాలకు ఒక query వ్రాయవచ్చు. |
06:49 | అంటే దానర్థం - చెక్-ఇన్ చేయనివారికి మాత్రమే. |
06:54 | కాబట్టి, CheckedIn ఫీల్డ్ లో ఈ వరుసలో ఖాళీ సెల్ పై క్లిక్ చేసి, Equals Zero అని టైప్ చేద్దాం. |
07:06 | అంతే. మనము ఈ queryను ఇప్పుడు run చేద్దాము. |
07:10 | మనము కీబోర్డ్ సత్వరమార్గం F5 ను ఉపయోగించవచ్చు లేదా విండో ఎగువ భాగంలో ఉన్న Edit మెనుపై క్లిక్ చేసి, దిగువna Run Query పై క్లిక్ చేయండి. |
07:27 | విండో ఎగువ భాగంలో కొంత డేటాను చూశారా? |
07:32 | ఇవి మీ query యొక్క ఫలితాలు. |
07:36 | సభ్యులకు జారీ చేసిన పుస్తకాల చరిత్ర ఇష్యూ డేట్ యొక్క క్రమములో ఉండుట చూడవచ్చు. అంతే కాకుండా పుస్తకాలలో ఏదీ కూడా చెక్-ఇన్ చేయబడలేదని గమనించండి. |
07:51 | ఇప్పుడు మనం క్వరీ డిజైన్ ఏరియా దిగువకు వెళ్ళవచ్చు మరియు మనకు కావలసిన విధంగా మార్చవచ్చు |
08:00 | ఉదాహరణకు, Checked In ప్రమాణంను తొలగించండి. |
08:07 | ఇప్పుడు, F5 నొక్కడం ద్వారా query ను మళ్ళీ run చేయండి. |
08:15 | ఈసారి మనము query నుండి తిరిగి వచ్చిన డేటా యొక్క పొడవైన జాబితాను చూస్తాము. |
08:23 | తరువాత, Control, S నొక్కడం ద్వారా query ను సేవ్ చేద్దాము. ఇది ఒక చిన్న పాపప్ విండోను తెరుస్తుంది. |
08:34 | ఇక్కడ మన queryకు వివరణాత్మక పేరు ఇవ్వండి. |
08:38 | History of Books Issued to Members అని టైప్ చేద్దాం. |
08:46 | తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి మరియు ఈ విండోను మూసివేయండి. |
08:52 | ఈ save చేయబడిన queryను ప్రధాన బేస్ విండోలో query name పై డబుల్-క్లిక్ చేసి, తెరవగలము. |
09:01 | కాబట్టి, అక్కడ, మనము Design View ను ఉపయోగించి విజయవంతంగా query ను సృష్టించాము. |
09:09 | అసైన్-మెంట్ గా |
09:12 | సభ్యులు నిషా శర్మకి జారీ చేసిన పుస్తకాల జాబితాను రూపొందించండి. ఈ జాబితాను ఇష్యూ డేట్ యొక్క కాలక్రమానుసారంగా ఉంచండి. |
09:24 | ఇంతటితో మనం Creating queries in Design View , in LibreOffice Base ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
09:31 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
09:33 | డిజైన్ వ్యూ ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట, క్వరీ డిజైన్ విండో కు టేబుల్స్ జోడించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట |
09:41 | అలియాస్ ను ఏర్పాటు చేయుట, క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట, ఫీల్డ్స్ యొక్క దృశ్యమానతను ఏర్పాటు చేయుట |
09:49 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
10:10 | దీనిని అనువదించినది స్వామి ధన్యవాదములు. |