LibreOffice-Suite-Base/C2/Modify-a-Report/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:05, 28 November 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనము
00:09 ఒక రిపోర్ట్ ను, లేఅవుట్ ను అనుకూలపరచడం ద్వారా సవరించడం మరియు నివేదిక ను ఆకర్షణీయంగా తయారు చేయుట నేర్చుకుంటాము.
00:16 దీనికై, మనకు బాగా తెలిసిన లైబ్రరీ డేటాబేస్ గురించి చూద్దాం.
00:23 ఇంతకు ముందు ఈ ట్యుటోరియల్ లో మనం report ను తయారుచేయుట నేర్చుకున్నాము.
00:28 అదేవిధంగా Books Issued to Members: Report History అనే టైటిల్ గల ఒక రిపోర్ట్ ను నిర్మిచాము. ఇప్పుడు దానిని మార్చే విధానం ను నేర్చుకొందాం.
00:40 ఈ లైబ్రరీ డేటాబేస్ లో
00:42 లెఫ్ట్ ప్యానెల్ పై Reports పై క్లిక్ చేయండి.
00:47 కుడి ప్యానెల్ పై, రిపోర్ట్స్ లిస్టులో Books Issued to Members: Report History అనే టైటిల్ తో గల రిపోర్ట్ ను చూడవచ్చు.
00:57 రిపోర్ట్ ను మార్చుటకు దానిపై, రైట్ క్లిక్ చేసి, Edit పై క్లిక్ చేయండి.
01:08 ఇప్పుడు Report Builder అనే ఒక క్రొత్త విండో ను చూస్తాము.
01:14 ఈ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉన్నది.
01:19 Page యొక్క ఎగువ మరియు , దిగువ Page Header మరియు Footer సెక్షన్ లు,
01:26 తరువాత హెడర్ సెక్షన్ మరియు
01:29 Detail సెక్షన్.
01:34 మనం ఒక record header మరియు ఒక footer section ను కూడా జోడించవచ్చు.
01:40 మెయిన్ స్క్రీన్ పై, తెలుపు ప్రదేశం లో రైట్ క్లిక్ చేసి,, Insert Report Header/Footer పై క్లిక్ చేయండి.
01:51 స్క్రీన్ పై ఎడమ వైపున ఆరంజ్ ఏరియాస్ పై double-clickin చేసి, వీటిని కుదించవచ్చు లేదా విస్తరించవచ్చు.
02:00 కొనసాగే ముందు, ఇక్కడ Report design విండో యొక్క స్క్రీన్ షార్ట్ ని చూడండి.
02:06 రిపోర్ట్ ను ఈ విధంగా మార్చుతాం.
02:11 మము కొన్ని టెక్స్ట్ లేబుల్స్, ఫాంట్స్ , ఫార్మాటింగ్ లను మరియు వివిధ విభాగాల మధ్య అంతరాన్ని సర్దుబాటు చేస్తాము.
02:20 అలాగే, ఇప్పుడు కొన్ని రిపోర్ట్ హెడర్ మరియు ఫ్యూటర్ లను ఎంచుకోవాలి.
02:27 ఇది చేయుటకు, పైన గల మెనూ బార్ కు క్రిందన ఉండే Report Controls టూల్బార్ లో ,
02:31 గల Label Field ఐకాన్ పై క్లిక్ చేయాలి.
02:40 క్రిందన చూపు విధంగా దీనిని Report Header ఏరియా పై డ్రా చేసి,
02:48 Label పై డబల్ క్లిక్ చేసి, దాని ప్రాపర్టీస్ పొందండి.
02:55 ఇక్కడ Label కు ఎదురుగా,
03:00 Books Issued to Members: Report History అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
03:07 ఫాంట్ స్టైల్ ను కూడా మార్చుదాం. Arial Black , Bold మరియు Size 12 గా ఎంచుకొని,
03:17 OK పై క్లిక్ చేయండి.
03:21 స్క్రీన్ పై చూపిన విధంగా, రిపోర్ట్ ఫూటర్ కు వేరొక లేబుల్ ను జోడించుదాం.
03:31 ఉదాహరణకు Report Prepared by Assistant Librarian అని టైప్ చేయండి.
03:42 ఆపై, ఫాంట్ స్టైల్ ను Arial, Bold Italic కు మరియు Size 8 కు మార్చాలి.
03:51 ఇప్పుడు పై సోఫానాలను, Page Footer ఏరియా కు కూడా తిరిగి చేయాలి.
03:59 ఈసారి, మనం లేబుల్ కు ఎదురుగా Nehru Library, New Delhi అని టైప్ చేసి,
04:09 ఆపై font style ను Arial, Bold Italic కు మరియు Size 8 కు మార్చాలి.
04:20 ఇప్పుడు స్పేస్ ను సరిచేయండి.
04:24 ముందుగా Page Header ను తగ్గించి, Page Header మరియు Report Header మధ్య గల గ్రే రంగు లైన్ పై డబల్ క్లిక్ చేసి,
04:37 ఆపై,డ్రాగ్ మరియు డ్రాప్ చేసి, దానిని పైకి తీసుకొని వెళ్ళాలి.
04:47 తరువాత, report header మరియు header ల మధ్య గల గ్రే లైన్ పై,
04:52 double-click చేసి, Report header area ను తగ్గించండి.
05:01 Report footer మరియు Page footer ల మధ్య స్పేస్ ను ఇవే సోఫానాలను ఉపయోగించి, తగ్గించాలి.
05:13 తరువాత, హెడర్ లేబుల్స్ ను సెంటర్ చేయండి.
05:18 ఇది మనం Book Title పై క్లిక్ చేసి, మొత్తం లేబుల్స్ ను సెలెక్ట్ చేయుట ద్వారా చేయవచ్చు.
05:26 ఆపై, Shift కీ ను నొక్కి ఉంచి,, మనం మిగిలిన లేబుల్స్ పై ఈ విధంగా క్లిక్ చేయుట ద్వారా చేస్తాం.
05:35 ఇప్పుడు, సెంటర్ చేయుటకు, అప్-అర్రో కీను క్లిక్ చేయండి.
05:41 ఇప్పుడు header కు లైట్ బ్లూ కలర్ నేపధ్యం ఇవ్వండి.
05:47 దీనిని, చేయుటకు, Properties కు వెళ్ళి, Background transparent ను NO కు మార్చండి.
05:55 ఆపై, Background colour లిస్ట్ నుండి Blue 8 ను సెలెక్ట్ చేసుకొనండి.
06:03 ఇదేవిధంగా Detail సెక్షన్ పై కూడా చేయాలి.
06:09 దీనికై, Detail మరియు Report footer sections ల మధ్య ఖాళీ ను పెంచండి.
06:20 ఆపై , ఫీల్డ్స్ ను సెంటర్ చేయండి.
06:24 మనం Detail సెక్షన్ నుండి, లైట్ గ్రే బాక్గ్రౌండ్ ను ఎంచుకొనాలి.
06:32 తరువాత, Checked In ఫీల్డ్ యొక్క డేటా formatting ను మార్చండి.
06:39 అది, 1 లేదా 0 లను కలిగిఉండుట వల్ల, True or False న డిస్ప్లే చేస్తుంది.
06:47 మనం దీనిని frindlier ఎంపికలు Yes లేదా No లు చూపుటకు మార్చాలి.
06:53 ఆపై Detail సెక్షన్ లో కుడి వైపున గల CheckedIn పై డబల్ క్లిక్ చేయాలి.
07:01 ఇప్పుడు ముందుగా కుడి వైపున గల properties లో, Data ట్యాబ్ పై క్లిక్ చేసి,
07:08 Data ఫీల్డ్స్ ప్రక్కనగల CheckedIn అనే బటన్ పై క్లిక్ చేయాలి.
07:15 ఇది క్రొత్త pop-up విండో Function wizard ను ఓపెన్ చేస్తుంది.
07:20 ఇక్కడ , క్రింది భాగాన, కుడి వైపున గల Formula టెక్స్ట్ బాక్స్ ను ఖాళీ చేద్దాం.
07:27 ఆపై Category డ్రాప్ డౌన్ పై క్లిక్, చేసి, IF పై డబల్ క్లిక్ చేయండి.
07:35 ఇప్పుడు కుడి వైపున , మనం క్రొత్త కంట్రోల్స్ చూడగలము.
07:40 కుడి వైపున మొదటి టెక్స్ట్ బాక్స్ ప్రక్కన గల Select ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:49 CheckIn పై డబల్ క్లిక్ చేసి,
07:53 ఆపై, రెండవ టెక్స్ట్ బాక్స్ లోపల, కోట్స్ లోపల , Yes అని టైప్ చేయండి.
08:01 తరువాత మూడవ టెక్స్ట్ బాక్స్ లో No అని టైప్ చేయండి.
08:12 ఇప్పుడు Properties విభాగం లో General ట్యాబ్ కు వెళ్ళి,
08:18 క్రింద భాగాన గల Formatting ఎదురుగా గల బటన్ పై క్లిక్ చేస్తాము.
08:24 ఇక్కడ Category లిస్ట్ లో టెక్స్ట్ పై క్లిక్ చేసి,
08:28 ఆపై OK బటన్ పై క్లిక్ చేస్తాము.
08:32 ఇప్పుడు రిపోర్ట్ ను save చేస్తాము.
08:36 మార్చిన రిపోర్ట్ ను run చేద్దాం.
08:41 పైన గల Edit మెనూపై క్లిక్ చేసి, ఆపై Execute Report పై క్లిక్ చేయండి.
08:50 ఇక్కడ Books issued to the Library members పై ఒక మంచి రిపోర్ట్ హిస్టరీ కలదు.
08:57 spacing, headers, footers, fonts లను,
09:01 Yes లేదా No అని చెప్పే, CheckedIn ఫీల్డ్ ను గమనించండి.
09:06 చేసిన మార్పులతో మన రిపోర్ట్ ను పొందాము.
09:11 ఇంతటితో Modifying a Report in LibreOffice Base ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:17 సమగ్రంగా మనం నేర్చుకున్నది.
09:20 రిపోర్ట్ ను మార్చుట, లేఔట్ ను కస్టమైజ్ చేయుట, మరియు రిపోర్ట్ ను ఆకర్షణీయం గా చేయుట.
09:26 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:48 ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india