Git/C2/The-git-checkout-command/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:49, 24 November 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 git checkout command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను Git repository కు ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
00:12 అలాగే Git repository నుండి ఫైల్ తొలగించడం,
00:16 తొలగించిన ఫైల్ ను restore చేయడం,
00:18 ఫైల్ కు చేసిన మార్పులను విస్మరించడం,
00:21 మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం నేర్చుకుందాం.
00:25 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04.
00:31 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:36 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
00:40 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:47 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:52 ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం.
00:58 terminal తెరవడానికి, Ctrl + Alt + T నొక్కండి.
01:02 మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోనికి వెళదాం.
01:09 cd space mywebpage టైప్ చేసి, Enter నొక్కండి.
01:14 ప్రదర్శించడానికి నేను html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.
01:19 మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్ని అయిన మీరు ఉపయోగించవచ్చు.
01:23 మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టిస్తాము.
01:27 కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి.
01:37 ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము &(ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
01:43 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
01:50 ఈ ఫైళ్ళను save చేద్దాము.
01:53 terminal లో, ముందుగా git space status అని టైప్ చేసి, Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
02:03 ఇది రెండు untracked files ను చూపిస్తుంది.
02:06 tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము.
02:10 git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి.
02:17 git add dot కమాండ్, staging area కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది.
02:23 అందువల్ల mystory.html మరియు mynovel.html అనే రెండు ఫైల్స్ staging area కు జోడించబడ్డాయి.
02:32 git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేస్తాం.
02:40 ఇప్పుడు, మనము Git repository యొక్క staging areaకి రెండు ఫైళ్లు జతచేయబడడం చూడవచ్చు.
02:47 మనం, mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము.
02:54 ఇప్పుడు, మన రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
03:00 ముందువలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
03:05 మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి.
03:08 git space status అని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enter నొక్కండి.
03:16 ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది.
03:26 దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు.
03:32 ఇప్పుడు మన పనిని commit చేద్దాము.
03:36 కాబట్టి, git space commit space hyphen a space hyphen m space డబల్ కోట్స్ లోపల Added two files అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:50 మనం మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కు జత చేయలేదని గమనించండి.
03:57 మనం మునుపటి ట్యుటోరియల్లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు.
04:03 ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flags ను ఉపయోగించాము.
04:10 ఈ flags ఎందుకు?
04:13 మన slides కు తిరిగి మారండి.
04:15 Hyphen a flag మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు జోడించడానికి ఉపయోగిస్తాము.
04:21 మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు.
04:30 command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము.
04:36 మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am అని కూడా ఉపయోగించవచ్చు.
04:42 తిరిగి Terminal కు వెళ్ళండి.
04:45 Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
04:52 మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు.
04:54 కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి.
04:58 అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి అని గమనించండి.
05:03 ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే, దాన్ని సులభంగా తీసివేయవచ్చు.
05:10 ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను.
05:16 git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:26 ఈ కమాండ్ staging area నుండి mypage.html ఫైల్ ను తొలగిస్తుంది.
05:32 git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు.
05:40 అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్ అని చెబుతుంది.
05:45 ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి,
05:49 rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:55 ఈ కమాండ్ mywebpage ఫోల్డర్ నుండి ఫైల్ ను పూర్తిగా తీసివేస్తుంది.
06:00 ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం.
06:06 కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:12 ఇది deleted: mypage.html అనే సందేశాన్ని చూపుతుంది.
06:16 ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు ls అని టైప్ చేసి Enter నొక్కండి.
06:21 ఇక్కడ, మనము ఇకపై mypage.html ను చూడలేము.
06:28 ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం.
06:32 commit, కొరకు git space commit space hyphen am space డబుల్ కోట్స్ లో Deleted mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:45 Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:51 exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q కీ ను నొక్కండి.
06:55 ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు.
06:59 ఇప్పుడు, mypage.html పొరపాటున తొలగించబడింది అని అనుకుందాం. ఇప్పుడు మనం దాన్ని పునరుద్దించాలంటే,
07:08 మనం ఏమి చేయవచ్చు? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు.
07:13 Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.
07:20 రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి
07:24 వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.
07:28 మొదటి ఐదు అంకెలు సరిపోతాయి.
07:31 కానీ మీరు కోరుకుంటే, ఐదు కంటే ఎక్కువ అంకెలను కూడా కాపీ చేయవచ్చు.
07:36 git space checkout space అని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి.
07:45 ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
07:51 Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
07:58 ఇప్పుడు, మీరు mypage.html ఫైల్ ను చూడవచ్చు.
08:02 ఇప్పుడు మన పనిని commit చేద్దాము.
08:05 మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి.
08:12 git space commit space hyphen am space Restored mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:22 ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు.
08:28 మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు.
08:33 ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము.
08:38 ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:50 మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము.
08:58 రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి.
09:03 తరువాత save చేసి ఫైల్స్ ను మూసివేయండి.
09:06 కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము.
09:11 అంటే మన పని యొక్క, మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం.
09:16 దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం.
09:19 ముందుగా, Git statusను తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి.
09:27 ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది.
09:30 ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి.
09:37 ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది.
09:41 git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి.
09:48 ఇది nothing to commit అని చెప్తుంది.
09:51 మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం.
09:57 gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
10:07 మన మార్పులు discarded అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి.
10:13 ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
10:20 ఇది commits యొక్క list ను చూపుతుంది.
10:23 మరికొన్ని చూడడానికి down arrow కీ ను నొక్కండి.
10:26 exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ను నొక్కండి.
10:30 commits list ను ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
10:42 ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు.
10:48 మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు?
10:53 ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి.
10:56 దీని అర్థం మన పనిలో నాలుగు మార్పులు ఉన్నాయి.
11:01 మనము Initial commit దశకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకొందాము.
11:05 కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి.
11:15 ఫైళ్ళ లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి.
11:19 మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది.
11:28 ఇప్పుడు git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి.
11:34 మనము మొదటి commit, అంటే, Initial commit మాత్రమే చూడగలము.
11:39 ప్రస్తుత రివిజన్ కు వెళ్ళడానికి git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
11:48 మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము.
11:53 మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం.
11:57 git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
12:03 ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము.
12:10 ఇదే పద్ధతి లో మనము ఏ stage లోకైనా వెళ్ళవచ్చు.
12:14 పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది.
12:18 git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి.
12:23 తరువాత Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి.
12:29 git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి.
12:35 ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది.
12:39 ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
12:43 ఇంతక ముందు చేసినట్లుగా, git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి.
12:51 మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము.
12:55 బదులుగా, Already on master అనే సందేశాన్ని చూస్తున్నాము.
12:58 దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్.
13:02 కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి.
13:11 కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
13:15 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
13:18 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్ ను ను Git repository కు జోడించండం.

13:27 Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం, తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించడం.
13:32 ఫైల్ లో మార్పులు చేయటం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం.
13:39 అస్సైన్మెంట్ గా, మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్ళి,
13:46 ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి.
13:49 మార్పులు Commit చేయండి.
13:52 మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి.
13:55 మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి.
14:02 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

14:11 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
14:18 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
14:22 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
14:29 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
14:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు స్వామి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india