Java/C2/Introduction-to-Array/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:47, 23 November 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 ఇంట్రడక్షన్ టు ఆర్రేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మీరు ఆర్రేస్ ను ఎలా సృష్టించాలి మరియు అర్రేస్ లోని అంశాలను ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు.
00:14 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11. 10,JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:25 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటా టైప్స్ మరియు ఫర్ లూప్ యొక్క అవగాహన ఉండాలి.
00:32 లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు చూపిన మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:38 ఆర్రేస్ అనేది ఒక డేటా యొక్క సేకరణ
00:40 ఉదాహరణకి, మార్కుల జాబితా,పేర్ల జాబితా,ఉష్ణోగ్రతల జాబితా,వర్షపాతం జాబితా.
00:47 ప్రతి అంశం దాని స్థానం ఆధారంగా ఒక సూచీని (ఇండెక్స్) కలిగి ఉంటుంది.
00:52 మొదటి అంశం యొక్క సూచిక 0.
00:55 రెండవ అంశం యొక్క సూచిక 1 తర్వాతివి ఆపై క్రమంగా వచ్చే సంఖ్యలు.
00:59 ఇప్పుడు ఈ డేటాను ఎలా నిల్వ చేయాలో చూద్దాం.
01:03 కనుక ఎక్లిప్స్ కు మారండి.
01:06 ఆర్రేస్ డెమో అనే పేరుగల ఒక క్లాస్ ఇప్పటికే సృష్టించబడింది.
01:11 మెయిన్ మెథడ్ లో మనం రైన్ ఫాల్ డాటా ని చేర్చుదాం.
01:16 కనుక,మెయిన్ మెథడ్ లో మెథడ్ లో,
01:18 int రైన్ ఫాల్ ఓపెన్ మరియు క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ లోపల 25, 31, 29, 13, 27, 35, 12 ఇంకా చివరలో సెమీకోలోన్ అని టైపు చేయండి.
01:53 వేరియబుల్ పేరు రైన్ ఫాల్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ వేయడం గుర్తుంచుకోండి.
01:58 ఇది రైన్ ఫాల్ ని పూ ర్ణాంకాలు యొక్క ఒక ఆర్రే అని ప్రకటిస్తుంది.
02:03 బ్రేసెస్ అనేవి ఆర్రే లోని అంశాలను వివరించడానికి ఉపయోగిస్తారు.
02:09 ఇప్పుడు డేటా ను యాక్సెస్ చేద్దాం.
02:12 కనుక, తర్వాతి వరుసలో
02:14 System dot out dot println rainfall అని టైప్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో2 ని టైప్ చేయండి.'.
02:28 మనం సూచిక సంఖ్య 2 లో గల అంశాన్ని ముద్రిస్తున్నాం.
02:32 మరోలా చెప్పాలంటే, ఆర్రే లోని మూడవ అంశం 29.
02:38 ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
02:43 మనం చూస్తున్నట్లుగా,మూడవ అంశం యొక్క అవుట్ పుట్ అనేది 29.
02:49 ఇప్పుడు, 2 స్థానంలో 0 ని టైప్ చేద్దాం.
02:56 ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
03:00 మనం చూస్తున్నట్లుగా, మొదటి విలువ అవుట్ పుట్ అనేది 25.
03:07 ఇప్పుడు, మనము మొదటి ఐటెమ్ యొక్క విలువను మార్చుదాం.
03:13 కనుక, rainfall[0] = 11; అని టైప్ చేయండి.
03:27 ఇప్పుడు, దాని విలువను చూద్దాం.కనుక, ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
03:34 మనం చూస్తున్నట్లుగా, విలువ 11 కు మార్చబడింది.
03:40 ఇప్పుడు, ఒకవేళ మనకి ఆర్రే పరిమాణం మాత్రమే తెలుసు కానీ దాని విలువ తెలియదనుకోండి.
03:45 అలాంటి ఆర్రే ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.
03:49 మెయిన్ ఫంక్షన్ లో ఉన్నవన్నీ తొలగించి
03:57 int square[] = new int[10]; టైప్ చేయండి
04:19 ఈ స్టేట్మెంట్ 10 అంశాలు కలిగిన పూర్ణంకాల యొక్క ఒక ఆర్రే ని సృష్టిస్తుంది.ఈ ఆర్రే యొక్క పేరు స్క్వేర్స్.
04:30 ఇప్పుడు, దీనికి కొన్ని విలువలని చేర్చుదాం.
04:33 కనుక,
04:35 squares[0] = 1;
04:43 తర్వాతి వరుసలో, squares[1] = 4;
04:53 తర్వాతి వరుసలో, squares[2] = 9;
05:04 squares[3] = 16;అని టైప్ చేయండి.
05:15 కనుక, మనం మొదటి 4 సంఖ్యల యొక్క వర్గాలను ప్రవేశపెట్టాం.
05:20 ఇప్పుడు అర్రే యొక్క ఇతర అంశాల గురించి ఏమి ఉంది. అవి ఏమి కలిగి ఉన్నాయో చూద్దాం.
05:26 కనుక, మనం ఆర్రే లోని 6 వ విలువ ను ముద్రిస్తాము.
05:30 System S capital .out.println(squares[5]); అని టైప్ చేయండి.
05:56 సేవ్ చేసి ప్రోగ్రాం రన్ చేయండి.మనం ఔట్పుట్ లో సున్నా రావడం చూస్తాం.
06:05 ఇది ఎందుకంటే, మనం పూర్ణాంకాల యొక్క ఆర్రే ని సృష్టించినపుడు, అన్ని విలువలు 0 తో ప్రారంభం అవుతాయి.
06:11 ఇదేవిధంగా, ఫ్లోట్స్ యొక్క ఆర్రే లో కూడా అన్నీ విలువలు 0.0 తో ప్రారంభం అవుతాయి.
06:18 మనము ప్రతి విలువను అర్రే లో టైప్ చేస్తే అది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. అందుకు బదులుగా,మనం ఫర్ లూప్ ను ఉపయోగిద్దాం.
06:28 కనుక,int n, x ;for(x = 4; x < 10; x = x + 1){n = x + 1; మరియుsquares[x] = n * n;}} అని టైప్ చేయండి.
07:25 కనుక, మనం 4 నుండి 9 వరకు సంఖ్యలను పునరావృతం గావించాలి మరియు అర్రే లో సంబంధిత అంశాన్ని సెట్ చేయాలి.
07:36 ఇప్పుడు ,ఔట్పుట్ ని చూద్దాం.
07:38 మనం చూస్తున్నట్లుగా, మనం ఆర్రే లోని 6 వ అంశం యొక్క విలువ ముద్రిస్తున్నాం. కనుక,సేవ్ చేసి రన్ చేయండి.
07:52 6వ అంశం అది 6 యొక్క వర్గం 36 అని మనం చూస్తాం.
07:57 నిజానికిఇప్పుడు మనం అన్ని విలువలని for loop లో అమర్చవచ్చు.
08:03 మానవీయంగా మనం అమర్చిన విలువల యొక్క వరుసలని తొలగించి 4 ను 0 కి మార్చండి.
08:14 ఈ విధంగా, 0 నుండి 9 సూచికల వరకు ఉన్న అంశాలని వాటికి సంభందించిన వర్గాలతో అమర్చవచ్చు.
08:21 ఇప్పుడు, మనం 3 వ అంశం యొక్క విలువని చూద్దాం.
08:25 కనుక,5 ను 2 కు మార్చండి.
08:30 సేవ్ చేసి రన్ చేయండి.
08:35 మనం చూస్తున్నట్టుగా 3 వ అంశం విలువ loop లో అమర్చబడింది.దాని విలువ 9.
08:42 ఈ విధంగా ఆర్రేస్ ని సృస్టించి మరియు వాటిని ఉపయోగించవచ్చు.
08:50 ఇప్పుడు ఈ టుటోరియల్ చివరకు వచ్చాం.
08:53 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
08:55 ఆర్రే ని ప్రకటించడం మరియు ప్రారంభించడం
08:58 దాని లోని అంశాలని పొందడం.
09:01 ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్:
09:04 ఇచ్చిన పూర్ణంక ఆర్రే లో,దాని లోని అంశాల మొత్తాన్ని కనుగొనడం.
09:10 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం,
09:13 ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
09:19 ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:26 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
09:34 మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
09:40 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
09:44 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
09:50 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
09:57 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india