Java/C2/Strings/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:20, 17 November 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 జావా లోని స్ట్రింగ్స్ అనే అంశం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి,
00:08 స్ట్రింగ్స్ ని సృష్టించడం, స్ట్రింగ్స్ ను జోడించడం మరియు లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ మధ్య మార్పిడి వంటి స్ట్రింగ్ ప్రాథమిక ప్రక్రియలు.
00:18 ఈ టుటోరియల్ కొరకు, ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.
00:26 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి, మీకు జావాలోని డాటాటైప్ల పై అవగాహన ఉండాలి.
00:32 లేకపోతే తత్ సంభంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి.
00:40 జావా లో స్ట్రింగ్స్ అనేది క్యారెక్టర్ ల వరుస క్రమం.
00:44 స్ట్రింగ్స్ ని ప్రారంభించే ముందు, క్యారెక్టర్ డాటాటైప్ గురించి తెలుసుకుందాం.
00:50 ఇప్పుడు ఎక్లిప్స్ కు మారుదాం.
00:55 ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కు అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం.
01:00 ఇక్కడ మనం StringDemo అనే క్లాస్ ని సృష్టించి, మెయిన్ మెథడ్ ను జతచేశాం.
01:07 మెయిన్ మెథడ్ లో, char star ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో asterisk అని టైప్ చేయండి.
01:19 ఈ స్టేట్మెంట్ star అనే పేరుగల వేరియబుల్ char మాదిరిగా ఉండేది సృష్టిస్తుంది.
01:25 అది ఒక క్యారెక్టర్ ని మాత్రమే నిల్వ చేయగలదు.
01:28 కొన్ని క్యారెక్టర్లు గల ఒక పదాన్ని ముద్రిద్దాం.
01:33 char లైన్ ని తీసివేసి టైప్ చేయండి.
01:36 char c1 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'c';
01:43 char c2 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'a ';
01:49 char c3 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'r ';
01:55 మనం car అనే పదం చేయడానికి కావలసిన క్యారెక్టర్లను సృష్టించాం.
01:59 పదాన్ని ముద్రించడానికి వాటిని ఉపయోగిద్దాం.
02:02 టైప్ చేయండి,
02:04 సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్(c1)
02:12 సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్(c2)
02:22 సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్(c3).
02:31 నేను అన్నీ క్యారెక్టర్లు ఒకే వరుసలో ప్రదర్శించడానికి, println కు బదులుగా print వాడుతున్నాను.
02:39 ఫైల్ ని సేవ్ చేసి, రన్ చేయండి.
02:43 ఔట్పుట్, మనం అనుకున్నదే.
02:46 కానీ ఈ పద్ధతి కేవలం పాదాలను ముద్రిస్తుంది, వాటిని సృష్టించదు.
02:50 ఒక పదాన్ని సృష్టించడానికి, మనం స్ట్రింగ్ డాటాటైప్ ను ఉపయోగిద్దాం.
02:54 ఇప్పుడు దాన్ని చేసి చూద్దాం.
02:57 మెయిన్ మెథడ్ లోపల ఉన్నదంతా తొలగించి,
03:03 String greet ఈక్వల్ టూ Hello Learner; అని టైప్ చేయండి.
03:16 String పదం లో S అనేది అప్పర్ కేస్ లో ఉండాలి.
03:19 ఇంకా మనం సింగిల్ కోట్స్ కి బదులుగా డబుల్ కోట్స్ డీలిమీటర్స్ గా ఉపయోగిస్తున్నాం.
03:25 ఈ స్టేట్మెంట్ greet అనే పేరుగల String వేరియబుల్ ను సృష్టిస్తుంది.
03:31 ఇప్పుడు సందేశాన్ని ముద్రిదాం.
03:33 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println గ్రీట్.
03:44 ఫైల్ సేవ్ చేసి రన్ చేయండి.
03:51 సందేశం వేరియబుల్ లో నిల్వచేయబడి ముద్రించబడ్డడం మనం చూడవచ్చు.
03:57 జావా లో స్ట్రింగ్స్ ని కూడా జోడించవచ్చు.
04:00 అది ఎలాగో చూద్దాం.
04:04 నేను సందేశం లో Learner ను తొలగిస్తున్నాను.
04:08 మనం పేరుని వేరే వేరియబుల్ లో నిల్వ చేద్దాం.
04:14 String name ఈక్వల్ టూ Java.
04:22 ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ను జోడించి సందేశం తయారు చేద్దాం.
04:28 String msg ఈక్వల్ టూ greet plus name;
04:42 ప్రింట్ స్టేట్మెంట్ లోని greet ను message గా మార్చి, ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి.
04:56 ఔట్పుట్ గ్రీటింగ్ మరియు పేరు ను ప్రదర్శించడం చూడవచ్చు.
05:00 కానీ వాటి మధ్య ఖాళీ లేదు.
05:02 అందుకని, మనం space అనే క్యారెక్టర్ ను సృష్టిద్దాం.
05:08 char SPACE ఈక్వల్ టూ సింగల్ కోట్స్ లో 'space';
05:17 వేరియబుల్ పేరు స్పష్టంగా ఉండేందుకు, నేను అన్ని లెటర్స్ అప్పర్ కేస్ లోనే వాడాను.
05:23 మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.
05:26 ఇప్పుడు సందేశానికి SPACE ని జోడిద్దాం.
05:29 greet plus SPACE plus name;
05:36 ఫైల్ ను సేవ్ చేసి, రన్ చేయండి.
05:40 ఔట్పుట్ స్పష్టంగా మరియు మనం అనుకున్న విధంగా ఉండును.
05:45 ఇప్పుడు కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ చూద్దాం.
05:50 నేను Hello పదంలోని కొన్ని క్యారెక్టర్ లను మరియు Java లోని వాటిని కూడా అప్పర్ కేస్ లోకి మారుస్తున్నాను.
06:05 తరచుగా, వినియోగదారులు ఇచ్చే ఇన్పుట్ లో విలువలు రెండు రకలూ కలిసి ఉంటాయి,
06:11 ఫైల్ ని రన్ చేసి, ఔట్పుట్ చూద్దాం.
06:18 ఔట్పుట్ స్పష్టంగా లేదని చూడవచ్చు.
06:22 స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగించి ఔట్పుట్ ని స్పష్టంగా చేద్దాం.
06:27 greet equal to greet.toLowerCase(); అని టైప్ చేయండి.
06:41 ఈ స్టేట్మెంట్ స్ట్రింగ్ greet లోని ప్రతీ క్యారెక్టర్ ని లోవర్ కేస్ లోకి మారుస్తుంది.
06:47 name ఈక్వల్ టూ name.toUpperCase();
06:58 ఈ స్టేట్మెంట్ స్ట్రింగ్ name లోని ప్రతీ క్యారెక్టర్ ని అప్పర్ కేస్ లోకి మారుస్తుంది.
07:03 ఫైల్ ని సేవ్ చేసి రన్ చేయండి.
07:08 స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగంతో ఔట్పుట్ స్పష్టంగా ఉండడం మనం చూడవచ్చు.
07:13 ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని సృష్టించి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయవచ్చు.
07:18 స్ట్రింగ్ మెథడ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి.
07:19 మనం వాటిని ఇంకా సంక్లిష్ట అంశాలను గురించి చర్చించి నప్పుడు చూద్దాం.
07:26 దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము.
07:29 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
07:31 స్ట్రింగ్స్ ని సృష్టించడం మరియు జతచేయడం.
07:33 స్ట్రింగ్ ఆపరేషన్ లైన లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ కు మార్పిడి.
07:39 ఈ టుటోరియల్ సంబంధించిన, ఒక అసైన్మెంట్
07:41 concat method గురించి చదివి, స్ట్రింగ్స్ జోడించడం మరియు concat మెథడ్ ల మధ్య తేడాలు కనుగొనుము.
07:50 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట గురించి, మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
07:55 ఇది Spoken Tutorial ప్రాజెక్టు సారాంశం.
07:58 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:03 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్,
08:05 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
08:07 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:17 స్పోకన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
08:21 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:28 దీని పై మరింత సమాచారం ఈ క్రింది లింక్ లో ఉంది.
08:33 ఈ రచనకు సహాయపడినవారు శ్రీ హర్ష ఏ.యెన్ మరియు మాధురి గణపతి, ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya