Blender/C2/Types-of-Windows-Outliner/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:56, 16 November 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్, Blender 2.59 లో Outliner window గురించి వివరిస్తుంది. |
00:16 | ఈ లిపి స్నేహ Deorukhkar మరియు Bhanu Prakash చే అందించబడి మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత మనము, |
00:33 | Outliner window గురించి, |
00:36 | Outliner window లో Eye, arrow మరియు camera icons గురించి మరియు |
00:43 | Outliner window లో display menu గురించి నేర్చుకుని ఉంటాము. |
00:49 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:54 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి. |
01:03 | Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా. |
01:09 | డిఫాల్ట్ గా, ఇది Blender Interface యొక్క ఎగువ కుడి మూలలో ఉంది. |
01:15 | అవుట్ లైనర్ విండో ను resize చేద్దాం. |
01:20 | దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, దాన్ని క్రిందికి లాగండి. |
01:26 | ఎడమఅంచున కూడా లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి. |
01:36 | ఇప్పుడు Outliner windowలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:41 | బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , ట్యుటోరియల్- |
01:47 | How to Change Window Types in Blender ను చూడండి. |
01:59 | View పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:03 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి - అవి |
02:06 | Show Restriction Columns , |
02:09 | Show Active , |
02:11 | Show or Hide One level , |
02:14 | Show Hierarchy , |
02:17 | Duplicate area into New window మరియు Toggle full screen. |
02:25 | Show Restriction Columns ఎంపికను డియాక్టివేట్ చేయండి. |
02:30 | ఇది outliner విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాచివేస్తుంది. |
02:42 | మళ్ళీ, View పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:46 | వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూచుటకు Show Restriction Columns ఎంపికను యాక్టివేట్ చేయండి. |
02:56 | Outliner windowలో Cube కు ఎడమ వైపున గల plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:03 | ఒక cascade జాబితా కనిపిస్తుంది. |
03:05 | ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది. |
03:11 | మనం వీటి వివరాలు తరువాత ట్యుటోరియల్ లో చర్చించుకుంటాం. |
03:16 | Eye మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా దాచవచ్చు. |
03:24 | ఉదాహరణకు, cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:29 | cube ఇకపై 3D view లో కనిపించదు. |
03:35 | మళ్ళీ cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:41 | ఇప్పుడు, క్యూబ్ ను 3D- వ్యూలో చూడవచ్చు. |
03:48 | Arrow మీ objectను 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది. |
03:56 | ఉదాహరణకు, cube యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:02 | 3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. ఇక క్యూబ్ ఎంచుకోబడదు. |
04:10 | మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:17 | 3D-view లో cube పై రైట్ క్లిక్ చేయండి. |
04:21 | క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది. |
04:28 | Camera మీ objectను రెండబుల్ లేదా నాన్-రెండరబుల్ చేయగలదు. |
04:34 | క్యూబ్ యొక్క Cameraపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:38 | దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 ను నొక్కండి . |
04:46 | cube రెండర్లో కనిపించదు. |
04:51 | 3D-view కు తిరిగి వెళ్ళడానికి మీ కీబోర్డ్ పై Esc కీ నొక్కండి. |
04:56 | మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:03 | వ్యూను ప్రదర్శించడానికి f12ను నొక్కండి. |
05:09 | ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు. |
05:15 | 3D-view కు తిరిగి వెళ్ళడానికి Esc నొక్కండి. |
05:21 | Outliner window లో Search bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:28 | ఒకవేళ మీ scene బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం scene లో ఒకేవిధమైన ఆబ్జెక్ట్ సమూహాలను లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. |
05:40 | Outliner window యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene, మీ Blender scene నందు గల అబ్జక్ట్స్ మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని మూలకాలను జాబితా గా చేస్తుంది. |
05:51 | All Scenes పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:55 | ఈ డ్రాప్-డౌన్ జాబితా ఒక display menu . |
05:59 | ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది. |
06:04 | Current Scene పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:08 | మీరు Outliner windowలో జాబితా చేయబడిన ప్రస్తుత scene లో ఉన్న అన్ని objectలను చూడవచ్చు. |
06:18 | ప్రదర్శన మెనుని తెరవడానికి Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:26 | Visible Layers పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:30 | active లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని objectలు Outliner window లో జాబితాగా చేయబడ్డాయి. |
06:38 | తరువాత ట్యుటోరియల్లో Layers గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం. |
06:44 | డిస్ప్లే మెనూను తెరవడానికి Visible Layersపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:52 | Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:55 | Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ objectను మాత్రమే జాబితా చేస్తుంది. |
07:04 | ప్రదర్శన మెనుని తెరవడానికి Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:09 | Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:12 | Outliner, 3D-view లో కేవలం, ఇటీవల ఎంచుకున్న objectను మాత్రమే జాబితాగా చేస్తుంది. |
07:22 | display menuను తెరవడానికి Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:28 | Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:31 | పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే వర్గానికి చెందిన అన్ని ఆబ్జక్టు లను Outliner window లో జాబితాగా చేస్తుంది. |
07:41 | ఉదాహరణకు, cube డిఫాల్ట్ గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది. |
07:47 | కాబట్టి Outliner, scene లో అన్ని mesh objectsను జాబితాగా చేస్తుంది. |
07:51 | ఈ సందర్భంలో, క్యూబ్ అనేది sceneలో ఒకే ఒక mesh object మాత్రమే. |
07:58 | mesh objects గురించి మరింత వివరంగా బ్లెండర్ యొక్క ఆధునిక ట్యుటోరియల్, Animation లో తెలుసుకుందాం. |
08:08 | display menu ను తెరవడానికి Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:14 | Groups, scene లోని అన్ని సమూహ objectలను జాబితాగా చేస్తుంది. |
08:20 | ఇక్కడ కొన్ని ఇతర ఎంపికలు ఉన్నాయి, ఇవి మనం తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేస్తాము. |
08:27 | కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం. |
08:32 | బహుళ objectలను కలిగి ఉన్న ఒక పెద్ద సీన్ తో పని చేస్తున్నప్పుడు, సీన్లో ఉన్న ప్రతి objectను ట్రాక్ చేయడానికి, Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. |
08:45 | ఇప్పుడు, కొత్త ఫైలును సృష్టించి, Outliner లో ఎంపిక చేయబడిన వాటిని జాబితా గా చేసి, క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి. |
08:58 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది. |
09:07 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది. |
09:12 | oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
09:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
09:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:34 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
09:38 | మరిన్ని వివరాల కోసం, దయచేసి- contact@spoken-tutorial.org కు వ్రాయండి |
09:45 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |