Git/C2/Tagging-in-Git/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:24, 6 November 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Tagging in GIT పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో, మనము Tagging మరియు వివిధTagging విధానాల గురించి నేర్చుకుందాము.
00:12 ఈ ట్యుటోరియల్ కోసం నేను

Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.

00:28 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:41 ఇప్పుడు మనం tagging గురించి నేర్చుకుందాము.
00:44 Commit దశని ముఖ్యమైనదిగా మార్క్ చేయడానికి Tagging వాడుతారు.
00:49 భవిష్యత్ సూచనలు కోసం bookmark లాగా మనము ఒక commit ని tag చేయవచ్చు.
00:54 సాధారణంగా,ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0.
01:02 ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag
01:09 మొదటగా , నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను.
01:15 మనం ముందే సృష్టించిన mywebpage అను Git repository లోనికి వెళ్దాం.
01:21 terminal కు వెళ్ళి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
01:30 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.
01:34 మీరు వేరే ఏ ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు.
01:39 Git log ను తనిఖీ చేయడాకి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
01:48 ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి. అవి Added colors,Added history.html మరియు initial commit
01:59 ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit Added colors లో క్రియేట్ చేస్తాను.
02:05 ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో ,డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది.
02:12 Git space tag space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
02:20 ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు.
02:29 git space tag అని టైప్ చేసి , Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు
02:35 ఇప్పుడు మన repository లో ఒకేఒక tag ఉంది.
02:39 ఇప్పుడు ,మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము.
02:44 ముందుగా , నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను.
02:52 gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము.
03:04 తర్వాత ఫైల్ ని save చేసి close చేయండి.
03:07 ఈ పాయింట్ వద్ద మన పనిని commit చేద్దాం.
03:11 git space commit space hyphen a m space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html అని type చేసి enter నొక్కండి
03:25 ఈ ప్రత్యేక దశ ప్రాజెక్ట్ కి ఇది చాల ముఖ్యమైనదిగా అనుకుందాం.
03:31 కాబట్టి మనం ఈ commit పాయింట్ కు ఒక tag క్రీయేట్ చేయాలి.
03:35 ఇక్కడ మనం annotated tag ను క్రియేట్ చేద్దాము.
03:39 git space tag space hyphen a space v1.2 space hyphen m space డబుల్ కోట్స్ లోపల My version 1.2 అని టైప్ చేసి enter నొక్కండి.
03:55 -m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు.
04:01 ఇక్కడ, tag message optional
04:05 ట్యాగ్ జాబితాను చూడడానికి,git space tag అని type చేసి, Enter నొక్కండి. ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి
04:14 ఇక్కడ, v1.1 lightweight tag మరియు v1.2 annotated tag.
04:21 మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా చెప్పగలము.?
04:24 మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు .
04:31 git space show space v1.1 టైపు చేసి Enter నొక్కండి.
04:38 ఇక్కడ, మనము lightweight tag v1.1 కి సంబంధించి పూర్తి వివరాలు చూడవచ్చు.
04:44 ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది
04:50 తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి.
05:03 ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు,commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు,tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు
05:17 మీరు సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.
05:23 మన old commits లో ని టాగ్ కు ఎలా చిహ్నం ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం.
05:29 ముందుగా, మనము git space log space hyphen hyphen oneline ను టైపు చేసి Enter నొక్కి Git log ను తనిఖీ చేద్దాము.
05:39 ఇప్పుడు, ఉదాహరణకు మనం రెండవ commit Added history.html లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము.
05:47 git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. తరువాత Added history.html యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి,hyphen m space డబుల్ కోట్స్ లోపల My Version 1.0 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి .
06:09 ఇప్పుడు మనము క్రియేట్ చేసిన tag ను git space tag అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా చూడవచ్చు.
06:19 మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు .
06:24 తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము
06:29 git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate అని టైప్ చేసి Enter నొక్కండి.
06:40 మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు
06:44 ఇప్పుడు మనము అవసరం లేని tag ను డిలీట్ చేయడం గురించి నేర్చుకుందాము.
06:49 tag v1.1 delete చేయాలనుకుంటే
06:53 git space tag space hyphen d space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
07:02 ఇది Deleted tag 'v1.1' మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది.
07:08 Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకేసారి చెక్ చేద్దాం.
07:14 git space tag అని టైప్ చేసి Enter నొక్కండి.
07:19 ఇప్పుడు, మనము tag v1.1 ను చూడలేము ఎందుకంటే ఇది విజయవంతంగా తొలగించబడింది.
07:25 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:29 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము.
07:38 ఒక అసైన్మెంట్ గా lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి
07:47 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:56 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:08 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
08:20 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india